For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాఠశాలల్లో విద్యార్థినులతో నగ్న నృత్యాలు.. ఇదేమీ సంప్రదాయం?

దక్షిణాఫ్రికాలోని కేప్‌ ప్రొవిన్స్‌లో ఉన్న ఓ స్కూల్‌లో కొన్ని రోజుల క్రితం ఒక ఈవెంట్ నిర్వహించారు.'నగ్నంగా' నాట్యం చేశారు. చోయిర్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు. పాఠశాలల్లో నగ్న నృత్యాలు.

|

వేడుకలు, సంతోషకరమైన సందర్భాల్లో నలుగురితోకలిసి చిందేయడం సహజం. చిందేస్తే వచ్చే ఆనందమే వేరు. ఒక్కొక్కరు ఒక్కో సందర్భంలో డ్యాన్స్ వేస్తూ ఆనందిస్తుంటారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా దక్షిణాఫ్రికాకు సంబంధించిన కొన్ని నృత్య భంగిమలు బాగా ఫేమస్. శరీర భాగాల్లో అసహజంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు కూడా దక్షిణాఫ్రికాకు సంబంధించిన కొన్ని నృత్య భంగిమలు బాగా పని చేస్తాయి.

డ్యాన్స్ అవసరమే

డ్యాన్స్ అవసరమే

శరీర, మానసిక ఆరోగ్యానికి డ్యాన్స్ అవసరమే. దీన్ని ఎవరూ కాదనరు. అయితే సంప్రదాయ నృత్యం పేరిట ఓ స్కూల్‌ యాజమాన్యం చేసిన పని దక్షిణాఫ్రికాలో వివాదంగా మారింది. సోషల్ మీడియాలో అది వైరల్ అయిపోతుంది.

విద్యార్థినిలతో నగ్న నృత్యాలు

విద్యార్థినిలతో నగ్న నృత్యాలు

ఒక ఈవెంట్‌లో నిర్వాహకులు విద్యార్థినిలతో నగ్న నృత్యాలు చేయించారు. పైగా ఆ వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో మీడియాకు ఆ వీడియోలు చిక్కడంతో పలు మీడియాల్లో వాటిని టెలీక్యాస్ట్ చేశారు. ఈ ఘటనపై కొన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.

దక్షిణాఫ్రికాలోని కేప్‌ ప్రొవిన్స్‌ స్కూల్‌లో

దక్షిణాఫ్రికాలోని కేప్‌ ప్రొవిన్స్‌ స్కూల్‌లో

దక్షిణాఫ్రికాలోని కేప్‌ ప్రొవిన్స్‌లో ఉన్న ఓ స్కూల్‌లో కొన్ని రోజుల క్రితం ఒక ఈవెంట్ నిర్వహించారు. పాఠశాలలో కొందరు విద్యార్థినులు 'నగ్నంగా' నాట్యం చేశారు. చోయిర్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు.. సప్రదాయిక ఖోసా నృత్యంలో పాల్గొన్నారు. టాప్స్ తీసేసి నృత్యాలు చేశారు. డప్పుల చప్పుళ్లకు లయబద్ధంగా నగ్న దేహాన్ని ఆడించటం ఈ నృత్యం ప్రత్యేకత.

Image credit

ఇంకిసియో

ఇంకిసియో

ఇంకిసియో అని పిలిచే ఓ చిన్న గుడ్డముక్కను మాత్రమే ధరించిన ఖోసా అమ్మాయిలు డాన్స్ చేస్తూ అందరినీ ఈవెంట్ చూడడానికి వచ్చిన వారిని మైమరిపించారు. ఇదంతా జరిగి దాదాపు వారం రోజులు అవుతుంది. అయితే ఆ వీడియోలు మీడియాలో, సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. దీనిపై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులుసహా ప్రజలు భగ్గుమన్నారు.

మంత్రి చూసి షాక్ అయ్యారట

మంత్రి చూసి షాక్ అయ్యారట

మొత్తానికి ఈ ఉదంతంపై ఆ దేశ విద్యాశాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. ఇక వీడియోలుచూసిన ప్రాథమిక విద్యామంత్రి ఏంజీ మోట్షెగ్గా షాక్ అయ్యారట. ఇదేమిటి ఇలా నగ్నంగా స్కూళ్లలో డ్యాన్స్ లు వేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది మన సాంస్కృతిక విలువలకు వ్యతిరేకమైన అసభ్య వ్యవహారం అని అభిప్రాయపడ్డారు. అయినా పాఠశాలల్లో విద్యార్థినులతో నగ్న నృత్యాలేమిటి? ఇదేమీ సంప్రదాయం అని అన్నారు.

Image credit

గర్వపడుతున్నాం

గర్వపడుతున్నాం

అందుకు ఈవెంట్ నిర్వహకులు, నృత్యం చేసిన కొందరు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. నాట్యాన్ని, నగ్న ప్రదర్శన నృత్యాన్ని ప్రదర్శించినందుకు గర్వపడుతున్నానని ఈవెంట్ నిర్వాహకుడు చెప్పాడు.

ఖోసా సంప్రదాయం

ఖోసా సంప్రదాయం

అలాగే ఒక ఉపాధ్యాయుడు కూడా దీనిపై వివరణ ఇచ్చారు.

"ఇది మా ఖోసా సంప్రదాయం. అలా నగ్నంగా మా విద్యార్థినులు నృత్యం చేయడాన్ని మేము గర్విస్తున్నాం అన్నారు. అయినా మా విద్యార్థినులు పూర్తిగా బట్టలు విప్పి ఏమీ డ్యాన్స్ చేయలేదు. మీరు దీన్ని నగ్న నృత్యం అని అవహేళన చేయకండి."

ఇంకిసియో అనే గుడ్డ ధరించారు

ఇంకిసియో అనే గుడ్డ ధరించారు

" అయినా మా విద్యార్థినులు ఇంకిసియో అనే గుడ్డ ధరించి డ్యాన్స్ చేశారు. అందుకు మేము గర్విస్తున్నాం. ఖోసా మహిళలు, అమ్మాయిల విషయంలో మేమంతా గర్వపడుతున్నాం." అంటూ ఆ స్కూల్ కు చెందిన ఒక ఉపాధ్యాయుడు చెప్పడం కాస్త గమనార్హం. వారేం పూర్తి నగ్నంగా దృశ్యాలు చేయలేదని, సంప్రదాయ నృత్యానికి అనుగుణంగా దుస్తులు ధరించారని స్కూల్‌ యాజమాన్యం చెబుతోంది.

రొమ్ములు, పిరుదులపై

రొమ్ములు, పిరుదులపై

కాగా వీడియో ఫుటేజిలో అమ్మాయిలు రొమ్ములు, పిరుదులపై ఎలాంటివి లేకుండా స్టేజిపై నాట్యం చేస్తున్న దృశ్యం క్లియర్ గా కనిపించడంతోనే అక్కడి ప్రజలు, ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

లైంగిక వేధింపులకు నిదర్శనం

లైంగిక వేధింపులకు నిదర్శనం

దీనిపై విద్యాశాఖ మంత్రి అంగీ మోట్షేగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపులకు నిదర్శనం అని ఆమె అన్నారు. దర్యాప్తునకు ఆదేశించిన ఆమె నివేదిక ఆధారంగా స్కూల్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు.

నగ్నంగా డాన్స్ చేయించకండి

నగ్నంగా డాన్స్ చేయించకండి

"మీ సంస్కృతి, వారసత్వాల పట్ల మీరు గర్వించడంలో ఏ మాత్రం తప్పు లేదు. కానీ ఆడపిల్లలతో ఇలా నగ్నంగా డాన్స్ చేయించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. అమ్మాయిల శరీరాల్ని ఇలా ప్రదర్శించడం అనుచితమన్న విషయం ఉపాధ్యాయులకు తెలిసి ఉండాలి" అంటూ మంత్రి మోట్షెగ్గా ఆగ్రహం వెలిబుచ్చారు.

సంస్కృతిల్లో భాగమే

సంస్కృతిల్లో భాగమే

కాగా అర్థనగ్న దృశ్యాలు దక్షిణాఫ్రికా చరిత్ర, సంస్కృతిల్లో భాగమే. రీడ్‌ నృత్యాల పేరిట టాప్‌ లెస్‌గా ఉన్న అమ్మాయిలు రాజ వంశస్థుల ముందు నృత్యాలు చేయటం ఓ ఆనవాయితీగా ఉండేది. కానీ, తర్వాత ఆ సంప్రదాయాలు కనుమరుగు అయిపోయాయి. ఈ మధ్య కొన్ని జాతుల ప్రజలు తిరిగి ఆచరణలో తెచ్చేందుకు పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.

నగ్న నృత్య ప్రదర్శన ఆందోళనకరణమే

నగ్న నృత్య ప్రదర్శన ఆందోళనకరణమే

అయితే దక్షిణాఫ్రికాలో ఖోసాలది రెండో అతి పెద్ద స్థానిక భాషా సమూహం. ఖోసాలు వారి సంప్రదాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తారు. కాగా దక్షిణాఫ్రికాలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో ఇలాంటి వాటిని ప్రొత్సహించలేమని, చట్టబద్ధం చేయటం కుదరదని ప్రభుత్వం తేల్చేసింది. ఆందోళనకారులకు కొన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతోంది. అయితే సంప్రదాయాల పేరిట ఇలా నగ్న నృత్య ప్రదర్శన చేయడం కాస్త ఆందోళనకరమైన విషయమే.

English summary

south africa outrage over naked school choir performance

south africa outrage over naked school choir performance
Story first published:Friday, June 1, 2018, 13:00 [IST]
Desktop Bottom Promotion