మరికొన్ని రోజుల్లో భూమి నాశనం కానుందా? చైనా తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ కూలనుందా?

Written By:
Subscribe to Boldsky

చైనా ఏది చేసిన హాట్ టాఫిక్ అవుతుంది. ఎందుకంటే చైనా చేసే పనులు అలా ఉంటాయి. ప్రతి దాంట్లో తమ స్థానాన్ని నిలుపుకునేందుకు, తమ ఆధిక్యాన్ని చాటేందుకు చైనా అన్ని రకాలుగా పోటీ పడుతూనే ఉంటుంది. అలా అందరికీ గట్టి పోటీ ఇవ్వాలనుకునే చైనా ఈ సారి భూప్రపంచానికి ముప్పు తెచ్చి పెట్టింది. మరికొన్ని రోజుల్లో భూమి నాశనం కానుందా? చైనా తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ కూలనుందా? అనే దానిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సైంటిస్ట్ లు తర్జనాభర్జనా పడుతున్నారు.

విలయం తప్పదా

విలయం తప్పదా

చైనాకు సంబంధించిన అంతరిక్ష కేంద్రం భూమిపై కూలిపోనుందా అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అలా జరిగితే భూమికి మహా వినాశనం తప్పుదు. చైనాకు సంబంధించిన స్పేస్‌స్టేషన్‌పై సైంటిస్టులు నియంత్రణ కోల్పోయారని వినికిడి. దీంతో చైనాకు సంబంధించిన అంతరిక్ష కేంద్రం భూ కక్ష్యలోకి ప్రవేశించి అక్కడ కూలనుందని.. దాంతో భూమిపై విలయం తప్పదని ఇప్పుడూ అంతటా చర్చ జరుగుతోంది. దీని అసలు కథ ఏమిటో ఒకసారి చూద్దాం.

చైనా తియాంగాంగ్‌-1

చైనా తియాంగాంగ్‌-1

అగ్రరాజ్యాలతో కసి అంతరిక్ష పరిశోధనల్లో చైనా పోటీపడుతూనే ఉంది. అలా పోటీ పడి ఇప్పుడు భూమికి పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చింది. అంతరిక్ష పరిశోధనల కోసం చైనా తియాంగాంగ్‌-1 పేరుతో అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మించుకుంది. ఇది సుమారు 19 వేల పౌండ్ల బరువుతో ఉంది.

నియంత్రణ కోల్పోయింది

నియంత్రణ కోల్పోయింది

చైనా తియాంగాంగ్‌-1 చాలా రోజుల క్రితమే శాస్త్రవేత్తల నియంత్రణ కోల్పోయింది. అప్పటినుంచి అది ఆకాశంలో అటు ఇటు పరిభ్రమిస్తూ ఉంది. ప్రస్తుతం ఇది భూకక్ష్యలోకి వచ్చి భూమివైపు తన ప్రయాణం సాగిస్తోంది. ఎప్పుడో అప్పుడు మాత్రం ఇది కూలడం ఖాయం అని సైంటిస్ట్ లు చెబుతున్నారు.

ఉత్తర-దక్షిణ ధృవాల మధ్యలో

ఉత్తర-దక్షిణ ధృవాల మధ్యలో

ఒకవేళ తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ కూలిపోతే మాత్రం

ఉత్తర-దక్షిణ ధృవాల మధ్యలోని 43 డిగ్రీల అక్షాంశాల మధ్య ఎక్కడైనా పడే అవకాశం ఉంది. జనవరి నుంచి - మార్చి మధ్యకాలంలో ఇది భూమి మీద పడే అవకాశం ఉంది.

ఈ నగరాలకు ముప్పు

ఈ నగరాలకు ముప్పు

ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, దేశ రాజధానులుగా పేరున్న ప్రధాన నగరాలపై తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ పడే అవకాశముంది. న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌, బీజింగ్‌, రోమ్‌, ఇస్తాంబుల్‌, టోక్యో నగరాలపై తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ కూలిపడే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉంది.

మనదేశ రాజధాని ఢిల్లీపై కూడా

మనదేశ రాజధాని ఢిల్లీపై కూడా

తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ భూమిపై పడితే మనదేశ రాజధాని ఢిల్లీ అడ్రస్ భూమిపై ఉండదు. దాదాపుగా భూమిపై ఉన్న జీవరాశి మొత్తం అంతరించిపోతుంది. మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ భవనాలు సైతం నేల మట్టం అయ్యే అవకాశం ఉంది. అయితే తియాంగాంగ్‌-1 వల్ల మనదేశానికి, బ్రిటన్‌లకు పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఏమవుతుందో వేచి చూడాలి.

ఇది చాలా భారీ స్పేస్‌ స్టేషన్‌

ఇది చాలా భారీ స్పేస్‌ స్టేషన్‌

చైనా నిర్మించిన తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ 8.5 టన్నుల బరువు ఉంటుంది. 12 మీటర్ల పొడవు ఉంది. అంతరిక్షంలో ఉండే స్పేస్‌ స్టేషన్‌ లలో ఇది కూడా చాలా భారీదే. ఇది భూమి మీద పడితే దీని ప్రభావం చాలా ఉంటుంది.

చైనా చెబుతున్న మాటలివే

చైనా చెబుతున్న మాటలివే

తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ కూలిపోయి భూమి మీద పడే విషయంపై చైనా స్పందించిన తీరు దారుణంగా ఉంది. దీని వల్ల వచ్చే నష్టం పెద్దగా ఏం ఉండదంటూ చైనా కొట్టి పారేస్తుంది. తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ నాలుగున్నర సంవత్సరాలు పనిచేసింది.

అగ్నికి ఆహూతి

అగ్నికి ఆహూతి

మరో రెండున్నర ఏళ్లు అదనంగా విధులు నిర్వహించింది. ఇప్పటికే స్పేస్‌ స్టేషన్‌లోకి కీలక భాగాలన్ని అగ్నికి ఆహుతి అయ్యాయని చైనా అంటోంది. భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలోనే తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ మండిపోతుంది... ఎవరూ ఏమి భయపడకండి అంటూ చైనా చెబుతోంది. మరి ఏం జరుగుతోందో వేచి చూడాల్సిందే.

నాసా శాస్త్రవేత్తలు గతంలో తీసుకున్న నిర్ణయం

నాసా శాస్త్రవేత్తలు గతంలో తీసుకున్న నిర్ణయం

తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ లాంటి వాటికి చెక్ పెట్టేందుకు

నాసా శాస్త్రవేత్తలు గతంలో ఒక నిర్ణయం తీసుకున్నారు.

నానాటికీ పెరిగిపోతున్న అంతరిక్ష శిథిలాలు శాటిలైట్ల పనితీరుకు అడ్డుతగలవచ్చు. అవి భూమిపైకి దూసుకొస్తే.. మనకూ ప్రమాదకరమే. అందువల్ల నాసా శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆలోచనకు నాంది పలికారు. ఇలాంటి ఉపగ్రహ శకలాలన్నింటినీ తిరిగి భూమిపైకి తీసుకొచ్చి.. జీవరాశికి అత్యంత సుదూర ప్రాంతంలో వాటిని నాశనం చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

స్పేస్‌క్రాఫ్ట్ సెమెటరీ

స్పేస్‌క్రాఫ్ట్ సెమెటరీ

ఫసిపిక్ మహా సముద్రంలో 48° 52.6'' అక్షాంశం పరిధిలోని ప్రాంతం డెడ్ స్పేస్‌క్రాఫ్ట్స్‌ గ్రేవ్‌యార్డ్గా ఉపయోగించుకోడానికి అనువుగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. పాయింట్ నీమో, ఓసియానిక్ పోల్ ఆఫ్ ఇన్‌యాక్సెసబిలిటీ పేరుతో వ్యవహరించే ఈ స్పేస్‌క్రాఫ్ట్ సెమెటరీ.. భూమిపై ఏ ప్రదేశం నుంచైనా 1450 నాటికల్ మైళ్ల దూరంలో ఉంటుందని గుర్తించారు. మానవ మనుగడకు సుదూర ప్రాంతంలో ఉండటం ఈ స్పేస్‌క్రాఫ్ట్ సెమెటరీకి సంబంధించిన అత్యంత సానుకూల అంశం. ఒకరకంగా అంతరిక్షంలోని శాస్త్రవేత్తలకే ఈ ప్రాంతం అందుబాటులో ఉంటుందని చెప్పొచ్చు.

అప్పట్లో ఒక స్కై ల్యాబ్

అప్పట్లో ఒక స్కై ల్యాబ్

70వ దశకం చివరల్లో రష్యాకు చెందిన స్కైల్యాబ్ కూడా ఇలాగే ప్రమాదానికి గురై భూమిపైకి దూసుకొని వచ్చింది. భారత దేశంపై ఇది పడుతోందని అప్పట్లో వార్తలు రావడంతో అప్పట్లో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. చనిపోవడం ఖాయమని అందరూ భూములు అమ్ముకున్నారు.

హిందూ మహాసముద్రంలో

హిందూ మహాసముద్రంలో

విందులు, విలాసాల్లో తేలిపోయారు. కాని చివరకు అది హిందూ మహాసముద్రంలో పడింది. అలాగే ఈ చైనా స్పేస్ స్టేషన్ కూడా సముద్రంలో కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చైనా స్పేస్ ఇంజనీరింగ్ అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. చైనాకు సంబంధించిన తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ భూమి మీద పడకుండా ఉండాలని అందరం కోరుకుందాం.

English summary

space station falling earth heres where it could land ncna

space station falling earth heres where it could land ncna