For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీగౌతమిని బుజ్జి చంపించాడని తెలుసు,అంత్యక్రియలు అలా చేయించాడు, అక్క కళ్లముందే మరణించింది, చంపేశారు

మాది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం. మిడిల్ క్లాస్ ఫ్యామిలి. మా నాన్న నర్సింహస్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. శ్రీగౌతమి, గౌతమి, గౌతమి సోదరి పావని, గౌతమి మర్డర్ కేసు

|

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంగేటి శ్రీ గౌతమి యాక్సిడెంట్‌ కేసు గురించి ఇప్పుడు తెలుగు ప్రజలందరకీ తెలుసు. శ్రీగౌతమిని పక్కా పథకం ప్రకారం హత్యచేసినట్టుగా తేలిన విషయం తెలిసిందే. అయితే ఏడాదిన్నర క్రితం గౌతమి కేసును దర్యాప్తు చేసిన పోలీస్‌ అధికారులు అసలు విషయాల్ని కనుక్కోలేకపోయారు. తర్వాత సీఐడీ విచారణలో గౌతమిది హత్య అని తేలడంతో ఈ కేసును అప్పట్లో పక్కదారి పట్టించిన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది.

2017, జనవరి 18న నరసాపురం పట్టణానికి చెందిన గౌతమి దిగమర్రు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ప్రాణాలతో బయటపడిన గౌతమి సోదరి పావని, తల్లి అనంతలక్ష్మిలు తమ కుమార్తెది ప్రమాదం కాదని, హత్య అంటూ ఆరోపించారు. తర్వాత సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు ఖాతాలు,కాల్‌ డేటాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కిరాయి హంతకుల ఖాతాల్లో

కిరాయి హంతకుల ఖాతాల్లో

వీటి ఆధారంగా కేసును చేధించారు. విశాఖకు చెందిన కిరాయి హంతకుల ఖాతాల్లో నగదు పడటం, వాళ్ళ కాల్‌ డేటాను పరిశీలించిన సీఐడీ దీన్ని హత్యగా నిర్ధారించింది. మొదట ఈ కేసు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఇది ప్రమాదమేనని 15 రోజుల్లో కేసును మూసివేశారు. మొత్తానికి కేసును ఛేదించి బాధితులకు న్యాయం చేశారు సీఐడీ అధికారులు. ఈ కేసులో శ్రీగౌతమి భర్త టీడీపీ నేతల సజ్జా బుజ్జి, అతడి సోదరుడు బొల్లంపల్లి రాం ప్రసాద్, నరసాపురం జెడ్పీటీసీ బాలం ప్రతాప్, అతడి సోదరుడు బాలం ఆండ్రూలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మా అక్క గౌతమిది హత్య

మా అక్క గౌతమిది హత్య

మరి ఈ కేసు విషయంలో పోరాడిన గౌతమి సోదరి పావని తన బాధను ఇలా వ్యక్తం చేసింది. ఈ కేసును సీఐడీ తీసుకోకపోతే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి కాదు. మేము మా అక్క గౌతమిది హత్య అని ఆరోపిస్తుంటే అప్పటి అదనపు ఎస్పీ రత్న మమ్మల్ని భయపెట్టేది. తప్పుడు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించేది. అయినా మేము భయపడలేదు. న్యాయం కోసం నా తల్లి, నేను ఎంతో పోరాడాం. పోలీసులు నీరుగార్చినా సీఐడీ నిజాయితీగా నిలబడి న్యాయం చేసింది. అప్పట్లో కేసు పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించిన రత్నంపై చర్య తీసుకోవాలి.

కళ్లముందే మా అక్క మరణించింది

కళ్లముందే మా అక్క మరణించింది

కళ్లముందే మా అక్క మరణించింది. నన్ను ఆ విషయం బాగా కుంగదీసింది. అది హత్య అని నేను అందరికీ చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులు నా మాటలను కొట్టిపారేశారు. దాంతో న్యాయం కోసం ఒంటరిపోరాటం మొదలుపెట్టాను. ఎవరి సహకారం లేకపోయినా ఇందులో నిజాన్ని బయటకు తీసుకురావాలనిపించింది.

నలుగురు నిందితులు కటకటాల పాలయ్యే వరకూ

నలుగురు నిందితులు కటకటాల పాలయ్యే వరకూ

మా అక్క చావుకు కారకులైన నలుగురు నిందితులు కటకటాల పాలయ్యే వరకూ నేను ఎక్కడా నా పోరాటాన్ని ఆపలేదు. ఏడాదిన్నరగా పోరాటం చేశాను. నా కళ్లముందే ఆ ప్రమాదం జరిగింది. అక్కను పక్కా ప్లాన్ వేసి చంపారని నాకు తెలుసు. నాకు కొందరిమీద అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు అన్నీ వివరించాను. కానీ వారు అది ప్రమాదమనే చెప్పారు. కేసు మూసేశారు. మా అక్కను చంపారని నాకు తెలిసినా ఏం చెయ్యలేకపోతున్నానని తెలిసి నేను రోజూ ఏడ్చేదాన్ని. నాకు కంటిమీద కునుకు ఉండేది కాదు.

ధైర్యంగా పోరాడాలనుకున్నా

ధైర్యంగా పోరాడాలనుకున్నా

అలా అని ఊరికే కూర్చొకోడదనుకున్నా. పైగా మరో ఆడపిల్లకూ ఇటువంటి అన్యాయమే జరగొచ్చు. అందుకే ధైర్యంగా పోరాడాలనుకున్నా. ప్రతి సాక్ష్యాన్ని ధైర్యంగా సేకరించాను. తర్వాత పోలీసులు ఆ కేసును రీఓపెన్‌ చేశారు. హత్యకేసుగా నమోదు చేశారు. నిందితుల్ని అరెస్టు చేసి సబ్‌జైలుకు పంపించారు. ఆ నలుగురికీ న్యాయస్థానంలో శిక్షపడేవరకూ నేను ఈ పోరాటం ఆపను.

శ్రీగౌతమిఎంబీఏ చదివింది

శ్రీగౌతమిఎంబీఏ చదివింది

మాది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం. మిడిల్ క్లాస్ ఫ్యామిలి. మా నాన్న నర్సింహస్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. మా అమ్మ పేరు అనంతలక్ష్మి. మేమిద్దరమూ ఆడపిల్లలమే. మా నాన్న చనిపోయాక అమ్మే మమ్మల్ని పోషించేంది. అన్నీ ఆమె చూసుకునేది. మా అక్క శ్రీగౌతమిఎంబీఏ చదివింది. ఆమె అక్క లక్ష్యం సివిల్స్‌.

తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాం

తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాం

మా నాన్న అనారోగ్యంతో ఉన్నప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగోలేక నేను ఇంటర్‌తోనే చదువు ఆపేశా. మా అక్క మాత్రం ఎంబీఏ అయ్యాక చిన్న ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి ప్రిపేర్‌ అయ్యేది. 2017 జనవరి 18న జరిగిన సంఘటన నాకు ఇప్పటికీ గుర్తే. అక్కకు ఆరోగ్యం బాగలేకుంటే నేను అక్కను బండిపై తీసుకుని పాలకొల్లులోని ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ నుంచి తిరిగి బయలుదేరే సరికి రాత్రయ్యింది. దారిలో ఓ టాటా సఫారీ వాహనం మమ్మల్ని వెంబడించడం గమనించాం. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాం కానీ చివరకు అది మా బండిని ఢీకొట్టింది.

రక్తం కారుతూ ఉంది

రక్తం కారుతూ ఉంది

ఇద్దరం ఒక్కసారిగా కిందపడిపోయాం. నాకు బాగా గాయాలయ్యాయి. అంతా రక్తం కారుతూ ఉంది. బాధతో విలవిల్లాడుతున్నా. మా అక్క కోసం చుట్టూ చూశా కానీ ఎక్కడా కనిపించలేదు. తర్వాత స్పృహ కోల్పోయా.కదల్లేని పరిస్థితి. ఈలోగా 108 వాహనంలో ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నా పరిస్థితి దారుణంగా ఉంది. ఒళ్లంతా గాయాలు.అక్క కోసం ఆరా తీస్తే సర్జరీ చేస్తున్నారని చెప్పారు. డాక్లర్లు మరుసటి రోజు నన్ను డిశ్చార్జ్ చేశారు.

తట్టుకోలేక పోయాను

తట్టుకోలేక పోయాను

ఆసుపత్రి నుంచి మా బంధువులకు నన్ను తీసుకొచ్చారు. ఇంటికొచ్చేసరికి మా అమ్మ ఒక్కసారిగా నన్ను పట్టుకుని పెద్దగా ఏడ్చేసింది. మా అక్క చనిపోయిందని అర్థమైంది. తట్టుకోలేక పోయాను. అంత్యక్రియలు పూర్తయ్యాక ఆలోచించాను. అక్కడి ప్రమాదం కాదని, హత్యేనని నాకు తెలిసింది.

ఆ సమయంలో బుజ్జి చేసిన ప్రతి పనీ నాలో అనుమానాన్ని ఇంకా పెంచింది.

బుజ్జితో పెళ్లయ్యింది

బుజ్జితో పెళ్లయ్యింది

అక్క చనిపోవడానికి కొన్ని రోజుల ముందే బుజ్జితో పెళ్లయ్యింది. కానీ బుజ్జి అక్కకు అవివాహితకు చేసినట్లుగా అంత్యక్రియలు దగ్గరుండి చేయించాడు. అక్క ఉద్యోగం చేస్తున్నప్పుడు బుజ్జి పరిచయమయ్యాడు. అప్పటికే బుజ్జికి పెళ్లయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు.

అక్క అన్నీ నమ్మి బుజ్జికి దగ్గరైంది

అక్క అన్నీ నమ్మి బుజ్జికి దగ్గరైంది

అయితే భార్యతో మంచి సంబంధాలు లేవనీ విడాకులు ఇవ్వాలనుకుంటున్నానీ మా అక్కతో చెప్పాడు. అక్కను నమ్మించాడు. ప్రేమించానన్నాడు. అక్క అన్నీ నమ్మి బుజ్జికి దగ్గరైంది. 2016లో అక్క, బుజ్జి రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు అక్క అసలు విషయం బయటపెట్టింది. కానీ బుజ్జి పెళ్లి విషయాన్ని అంతటా దాచిపెట్టాడు. మొదటి భార్యకు విడాకులు కూడా ఇవ్వలేదు.

ప్లాట్‌ తీసుకుని కాపురం పెడతాననీ చెప్పాడు

ప్లాట్‌ తీసుకుని కాపురం పెడతాననీ చెప్పాడు

అక్క ఒత్తిడితో అతను పాలకొల్లులో ఒక ప్లాట్‌ తీసుకుని కాపురం పెడతాననీ, కొన్నాళ్లు ఆగమని చెప్పాడు. మళ్లీమళీ అడిగితే రెండునెలల సమయం అడిగాడు. నెలలు గడిచినా ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడంతో అక్క ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దాంతో అతడు అక్కను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. నన్ను, అక్కను చంపేసి ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. అందుకే యాక్సిడెంట్‌ చేయించాడు.

పోలీసులకు చెప్పాను

పోలీసులకు చెప్పాను

ఇవన్నీ నేను పాలకొల్లు పోలీసులకు చెప్పాను. మా అమ్మ లిఖితపూర్వకంగాను రాసి ఇచ్చింది. కానీ పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదమని చెప్పి కేసు మూసేశారు. కానీ నేను మాత్రం నా పోరాటం ఆపలేదు. మా అక్క ఫోను డ్యామేజీ అయ్యింది. అయినా ఆ నంబరు నుంచి డేటా సేకరించే ప్రయత్నం చేశా. మా అక్క వాడిన ఫోనులో వాట్సాప్‌, ఇతర మేసేజ్‌ల ఆధారంగా మొత్తం వివరాలు తెలుసుకోగలిగాను.

ప్రింటు చేయించి

ప్రింటు చేయించి

ఫోనులో 6,500 పైగా వాట్సాప్‌ మెసేజ్‌లూ, 11,088 సాధారణ మేసేజ్‌లు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రింటు చేయించి ఓ పుస్తకంగా తయారు చేయించాను. అవన్నీ చూపించి మాది యాక్సిడెంట్‌ కాదని మాపై జరిగింది హత్యా ప్రయత్నమేనని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కలిసి వివరించాను.

ఆధారాల్నీ చూపించాను

ఆధారాల్నీ చూపించాను

నా ఫిర్యాదును రాజమండ్రి సీఐడీ విభాగానికి పంపించారు. నన్ను సీఐడీ సీఐ శేఖర్‌బాబు పిలిచి సంఘటనను పూర్తిగా వివరించమన్నారు. మొత్తం చెప్పడంతో పాటూ నా దగ్గరున్న ఆధారాల్నీ చూపించాను. తరువాత వారు ఎంక్వయిరీ చేసి అసలు నిజాలు రాబట్టగలిగారు. ఇప్పుడు బుజ్జి వాడితోపాటూ మిగిలిన ముగ్గుర్నీ అరెస్టు చేయించగలిగాను.

కోర్టులో కూడా మాకు న్యాయం జరుగుతుంది

కోర్టులో కూడా మాకు న్యాయం జరుగుతుంది

బుజ్జి డబ్బులు ఇస్తానని రాయబారాలు కూడా నడిపాడు. ఓ దశలో నిజంగా తను, అమ్మ ఆత్యహత్య చేసుకోవాలనుకున్నాం. కానీ అక్కకు జరిగిన ఘోరానికి న్యాయం జరగాలని కష్టాలు, అవమానాలు దిగమింగి ముందుకెళ్లాను. కోర్టులో కూడా మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. నిందితులను కఠినంగా శిక్షించాలి. మా అక్క మాదిరిగా ఎవరికీ జరగకూడదు.

English summary

sri gouthami murder case mystery reveals her sister pavani

sri gouthami murder case mystery reveals her sister pavani
Desktop Bottom Promotion