శ్రీదేవి బాడీని ఎంబామింగ్ చేయబడింది: ఎంబామింగ్ అంటే ఎమిటి? ఎలా చేస్తారు? తెలుసా!

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

అందాల నటి శ్రీదేవి యొక్క ఆకస్మిక మరణంతో యావద్భారతదేశం దిగ్భ్రాంతికి లోనయ్యింది. కుటుంబ సభ్యులు తొలుత శ్రీదేవి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ప్రకటించినా కూడా తుదకు ఆమె బాత్ టబ్ లో మునిగి చనిపోయారని వెల్లడించారు. దుబాయి లో ఆమె మరణానికి దారి తీసిన పరిస్థితులపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఆమె భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేయడానికి ముందు కొన్ని న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేయాల్సి వచ్చింది. ఆమె మరణవార్తను ఆదివారం ఉదయం మూడు గంటలకు ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు భారతదేశంలో ఈ రోజు జరగనున్నట్టు సమాచారం. న్యాయపరమైన అనుమతులు లభించి ఎంబామింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు ఆమె భౌతిక కాయాన్ని దుబాయిలోని అల్-హుస్సేని శవాగారంలో భద్రపరుస్తారు.

అసలు ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా!

అసలు ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా!

త్వరిత గతిన అంత్యక్రియలను జరిపించలేని సందర్భాలలో, మృతదేహం కుళ్ళిపోకుండా కొన్నాళ్ళు ఉంచవలసిన పరిస్థితులలో ఎంబామింగ్ ప్రక్రియ చేపడతారు.దీని వలన మృతదేహాన్ని కొన్ని సంవత్సరాల పాటు చెడిపోకుండా భద్రపరచవచ్చు.ఈ ప్రక్రియ 1000 సంవత్సరాలకు పూర్వం నుండి మనుగడలో ఉంది. మృతి చెందిన అనంతరం మతపరమైన ఉత్తరక్రియలు నిర్వహించేటప్పుడు కడసారి చూసే రూపం ఆత్మీయంగా ఉండాలని బంధువులు ,స్నేహితులు కోరుకుంటారు. అప్పుడు ఎంబామింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు.

ఎంబామింగ్ ప్రక్రియ చేపట్టటానికి ముందు

ఎంబామింగ్ ప్రక్రియ చేపట్టటానికి ముందు

ఎంబామింగ్ ప్రక్రియ చేపట్టటానికి ముందు భౌతిక కాయాన్ని క్రిమిసంహారక ద్రావకాలతో శుభ్ర పరుస్తారు. మృతి చెందిన నాలుగు గంటల అనంతరం కండరాలు బిగదీసుకుంటాయి. వీటిని మర్దన చేయటం ద్వారా మ్రుదువుగా మారుస్తారు. అనంతరం ముఖంపై ఉండే రోమాలను తొలగిస్తారు.

ఎంబామింగ్ ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి.

ఎంబామింగ్ ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి.

ఎంబామింగ్ ప్రక్రియలో రెండు దశలు ఉంతాయి. మొదటి దశలో ముఖ కవళికలను తీర్చిదిద్దుతారు. రెండవ దశలో దమనుల ద్వారా రసాయనాలను శరీరంలోకి పంపుతారు. ఈ రసాయనాలనే ఎంబామింగ్ ఫ్లూయిడ్స్ అంటారు.

కనులను మూసి వాటికి తీరైన ఆకారాన్ని తీసుకురావడానికి

కనులను మూసి వాటికి తీరైన ఆకారాన్ని తీసుకురావడానికి

కనులను మూసి వాటికి తీరైన ఆకారాన్ని తీసుకురావడానికి మాంసపు రంగు జిగురు పదార్ధం లేదా కంటి ఆకారంలో ఉండే ప్లాస్టిక్ మూతలను ఉపయోగిస్తారు.

తదుపరి రెండు పెదవులను జిగురు సహాయంతో మూస్తారు.

తదుపరి రెండు పెదవులను జిగురు సహాయంతో మూస్తారు.

తదుపరి రెండు పెదవులను జిగురు సహాయంతో మూస్తారు. మృతుని దేహంలో ఉండే రక్తాన్ని సిరల ద్వారా తొలగించి, తిరిగి దమనుల ద్వారా ఎంబామింగ్ రసాయనాలతో నింపుతారు.

సాధారణంగా ఫార్మాల్డిహైడ్, మిథనాల్,ఇథనాల్,ఫీనాల్, గ్లుటరాల్డిహైడ్ మరియు నీటి మిశ్రమాన్ని

సాధారణంగా ఫార్మాల్డిహైడ్, మిథనాల్,ఇథనాల్,ఫీనాల్, గ్లుటరాల్డిహైడ్ మరియు నీటి మిశ్రమాన్ని

సాధారణంగా ఫార్మాల్డిహైడ్, మిథనాల్,ఇథనాల్,ఫీనాల్, గ్లుటరాల్డిహైడ్ మరియు నీటి మిశ్రమాన్ని ఎంబామింగ్ ఫ్లూయిడ్ గా వినియోగిస్తారు.సాంప్రదాయ అంత్యక్రియలకై తెరచి ఉండే శవపేటికలను వాడినప్పుడు కూడా ఎంబామింగ్ చేస్తారు.

శరీరకుహరాన్ని ఎంబామింగ్ ఫ్లూయిడ్ తో నింపటానికై నాభి వద్ద పదునైన శస్త్ర చికిత్స పరికరంతో గాటు పెడతారు

శరీరకుహరాన్ని ఎంబామింగ్ ఫ్లూయిడ్ తో నింపటానికై నాభి వద్ద పదునైన శస్త్ర చికిత్స పరికరంతో గాటు పెడతారు

శరీరకుహరాన్ని ఎంబామింగ్ ఫ్లూయిడ్ తో నింపటానికై నాభి వద్ద పదునైన శస్త్ర చికిత్స పరికరంతో గాటు పెడతారు . రక్తం మరియు ఇతర శరీర ద్రవాలను తొలగించి తదుపరి ఎంబామింగ్ రసాయనాలు నింపుతారు.నింపటం పూర్తి అయిన తరువాత ఆ గాటును జిగురు ద్వారా లేదా కుట్టు వేయటం ద్వారా మూస్తారు.

 శ్రీదేవి భౌతిక కాయాన్ని కూడా ఎంబామింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి అవసరమయ్యే న్యాయపరమైన అనుమతులు లభించేంతవరకు దుబాయిలోని అల్-హుస్సేని శవాగారంలో భద్రపరుస్తారు

శ్రీదేవి భౌతిక కాయాన్ని కూడా ఎంబామింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి అవసరమయ్యే న్యాయపరమైన అనుమతులు లభించేంతవరకు దుబాయిలోని అల్-హుస్సేని శవాగారంలో భద్రపరుస్తారు

ఇవే కాకుండా శరీరాన్ని శీతలీకరించటం ద్వారా కూడా కుళ్లిపోయే ప్రక్రియను మందగింపచేయవచ్చు. శ్రీదేవి భౌతిక కాయాన్ని కూడా ఎంబామింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి అవసరమయ్యే న్యాయపరమైన అనుమతులు లభించేంతవరకు దుబాయిలోని అల్-హుస్సేని శవాగారంలో భద్రపరిచి తీసుకొచ్చారు.

English summary

Sridevi's Body Embalmed: Why and How it’s Done

Before embalming begins, the person who has died is washed with a disinfectant solution and the body is massaged to relieve any rigor mortis, when muscles and joints can become stiff after death. The eyes and mouth are closed.
Story first published: Saturday, March 3, 2018, 18:30 [IST]