స్టీఫెన్ హాకింగ్ మొదటి భార్యకు ఇంకొకరితో సంబంధం.. అందుకే నర్స్ ను చేసుకున్నాడు

Written By:
Subscribe to Boldsky

ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ క‌న్నుమూసిన విషయం ప్రపంచమంతా తెలిసిందే. చాలా ప‌రిశోధన‌ల‌తో ఆయన స‌త్తాచాటిన విషయం తెలుసు. ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ అమ్యోట్రొపికల్ లాటెరల్ స్కేర్లోసిస్(ఏఎల్ఎస్) అనే వ్యాధితో జీవితాంతం పోరాడాడు. చివరకు చనిపోయారు. దీన్నే మోటార్ న్యూరాన్ వ్యాధి అని కూడా అంటారు.

ఇంట్రెస్టింగ్

ఇంట్రెస్టింగ్

1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో జన్మించిన స్టీఫెన్ హాకింగ్ జీవితం మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎన్నో ఆటోపోట్లను ఎదుర్కొన్న మహానుభావుడు స్టీఫెన్ హాకింగ్. స్టీఫెన్ తండ్రి లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడిగా పని చేసేవాడు.

చదువులో ప్రతిభ చూపాడు

చదువులో ప్రతిభ చూపాడు

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ లో నెలకొన్న మాదకర పరిస్థితుల వల్ల స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు అతని తండ్రి. తర్వాత లండన్ లోని హైగేట్స్ ప్రాంతానికి వెళ్లారు. స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని అక్కడే ప్రారంభించాడు. మొత్తానికి స్టీఫెన్ చదువులో ప్రతిభ చూపి ఒక ఉన్నతస్థానానికి ఎదిగాడు.

స్టీఫెన్‌కు ఇద్దరు భార్యలు

స్టీఫెన్‌కు ఇద్దరు భార్యలు

ఇక స్టీఫెన్ హాకింగ్ వైవాహిక జీవితం చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. స్టీఫెన్‌కు ఇద్దరు భార్యలు. కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న రోజుల్లో జేన్ వైల్డ్‌తో అనే అమ్మాయితో స్టీఫెన్‌కు పరిచయం ఏర్పడింది.

జేన్ వైల్డ్‌

జేన్ వైల్డ్‌

స్టీఫెన్ హాకింగ్ సోదరి స్నేహితురాలు జేన్ వైల్డ్‌. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హాకింగ్‌కు జేన్‌ విల్డే తో పరిచయం ఏర్పడింది. తర్వాత స్టీఫెన్ హాకింగ్, జేన్ వైల్డ్‌ లు ప్రేమలో పడ్డారు. కేంబ్రిడ్జ్‌లో డ్యూయెట్స్ ఆడిపాడారు. ఇద్దరూ చాలా రోజులు ప్రేమలో మునిగితేలారు.

నరాల వ్యాధి రాకముందే

నరాల వ్యాధి రాకముందే

స్టీఫెన్ హాకింగ్ నరాల వ్యాధి రాకముందే వారి మధ్య ప్రేమ పుట్టింది. 1963లో స్టీఫెన్ హాకింగ్ ఆ వ్యాధి సోకినట్లు తేలింది. వ్యాధి గురించి తెలిశాక కూడా జానే పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకొన్నారు. 1965 జూలై 14న వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

జొనాథన్ హెల్యర్ జోన్స్

జొనాథన్ హెల్యర్ జోన్స్

స్టీఫెన్ హాకింగ్, జేన్ వైల్డ్‌ ల లైఫ్ హ్యాపీగా సాగుతున్న క్రమంలో 1977లో ఓ చర్చిలో జొనాథన్ హెల్యర్ జోన్స్ అనే అవయవ రీప్లేస్‌మెంట్ స్పెషలిస్ట్‌ను హాకింగ్ భార్య జేన్ కు పరిచయం అయ్యారు. జోన్స్ ఆమెకు దగ్గరయ్యాడు.

జేన్ వైల్డ్‌ ను ఏమీ అనలేదు

జేన్ వైల్డ్‌ ను ఏమీ అనలేదు

అలా జోన్స్ కు జేన్‌తో ఆ పరిచయం మరింత ముదిరి చాన్నాళ్ల పాటు అది అలాగే కొనసాగింది. అయితే హాకింగ్ ఈ విషయంలో ఏనాడు కూడా జేన్ వైల్డ్‌ ను ఏమీ అనలేదు.

నర్స్ రోజూ ఇంటికి వచ్చేది

నర్స్ రోజూ ఇంటికి వచ్చేది

స్టీఫెన్ హాకింగ్, జేన్ వైల్డ్‌లకు రాబర్ట్, లూసీ, తిమోతీ (ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె) జన్మించారు. ఈ క్రమంలో స్టీఫెన్ హాకింగ్‌కు చికిత్సనందించే ఒక నర్స్ రోజూ ఇంటికి వచ్చేది. ఆమె పేరు ఎలైన్‌ మాసన్‌.

నర్స్‌గా చాలా సేవలు

నర్స్‌గా చాలా సేవలు

స్టీఫెన్‌.. ఎలైన్‌ మాసన్‌ మధ్య ఏదో ఉందని అందరూ అనుకునేవారు. 1980లో స్టీఫెన్‌ అనారోగ్యంలో ఉన్న సమయంలో మాసన్‌ ఆయనకు నర్స్‌గా చాలా సేవలు అందించారు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది.

జేన్ వైల్డ్‌కు విడాకులు

జేన్ వైల్డ్‌కు విడాకులు

ఇక స్టీఫెన్ హాకింగ్, జేన్ వైల్డ్‌ భార్య ఎలాగో మరో వ్యక్తితో ప్రేమలో ఉంది. దాంతో స్టీఫెన్ హాకింగ్, జేన్ వైల్డ్‌కు విడాకులు ఇచ్చేశాడు. భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఆయనకు దూరమయ్యారు. హాకింగ్‌ తమకు దూరమవ్వడానికి ఎలైనే కారణమని అప్పట్లో ఆయన పిల్లలు ఆరోపించారు.

నర్స్ ను పెళ్లి చేసుకున్నాడు

నర్స్ ను పెళ్లి చేసుకున్నాడు

తర్వాత ఎలైన్‌ మాసన్‌ నర్స్ ను పెళ్లి చేసుకున్నాడు.

రెండో భార్య ఎలైన్‌ పెళ్లి చేసుకున్న తర్వాత ఎలైన్‌ హాకింగ్‌ను హింసించేదట. హాకింగ్ పై చెయ్యి కూడా చేసునేదట.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

ఈ విషయంపై తోటి నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఇది సంచలనమైంది. పోలీసులు కేసు ఫైల్ కూడా చేశారు. అయితే హాకింగ్‌ ఆ ఆరోపణల్ని ఖండించడంతో కేసును క్లోజ్‌ చేశారు.

కుమార్తె లూసీతో కలసి

కుమార్తె లూసీతో కలసి

అయితే స్టీఫెన్ హాకింగ్, ఎలైన్‌ వివాహబంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. 2006లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత హాకింగ్‌ తన పిల్లలకు దగ్గరయ్యారు. కుమార్తె లూసీతో కలసి సైన్స్‌కు సంబంధించి ఐదు పుస్తకాలు రాశారు.

Image CreditImage SourceImages took from

English summary

stephen hawking’s wife jane hawking and jonathan hellyer jones relationship

stephen hawking’s wife jane hawking and jonathan hellyer jones relationship
Story first published: Thursday, March 15, 2018, 12:59 [IST]