For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సునంద పుష్కర్, శశిథరూర్ జీవితం ట్రాజెడీ.. లేటు వయస్సులో గాఢ ప్రేమ..అక్రమ సంబంధాల ఆరోపణలు,చివరకు మృతి

సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు తాజాగా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఢిల్లీ కోర్టులో 3వేల పేజీలతో చార్జీ షీట్ దాఖలు, సునంద పుష్కర్, శశిథరూర్, సునంద పుష్కర్ మృతి, శశిథరూర్.

|

సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు తాజాగా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఢిల్లీ కోర్టులో 3వేల పేజీలతో చార్జీ షీట్ దాఖలు చేశారు. ఈ చార్జీ షీట్‌లో సునంద మృతికి శశిథరూర్ పరోక్షంగా ప్రేరేపించారని పేర్కొన్నారు.

మరణ వాంగ్మూలంగా

మరణ వాంగ్మూలంగా

అంతేకాదు.. ఆమెకు సంబంధించిన మెయిల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియాలోని ఇతర అంశాలను ఆమె మరణ వాంగ్మూలంగా పరిగణిస్తూ చార్జీ షీట్‌లో కీలక అంశాలు పేర్కొన్నారు.

సునంద పుష్కర్ బొమాయ్ లో పుట్టింది

సునంద పుష్కర్ బొమాయ్ లో పుట్టింది

సునంద పుష్కర్ కాశ్మీర్ లోయలోని సోపోర్‌కు ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న బొమాయ్‌లో ఒక భూస్వామ్య, సైనికాధికారుల కుటుంబంలో జన్మించింది.

ఆర్మీ నుంచి రిటైర్డ్

ఆర్మీ నుంచి రిటైర్డ్

ఈమె తండ్రి లెఫ్టినెంట్ కర్నల్ పిఎన్ దాస్ 1983లో ఆర్మీ నుంచి రిటైరయ్యారు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఆమె తర్వాత కాలంలో ఉద్యోగరీత్యా దుబాయ్‌కి చేరుకున్నారు. అక్కడ టెకాం అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

సునంద పుష్కర్‌కు రెండు పెళ్లిళ్లు

సునంద పుష్కర్‌కు రెండు పెళ్లిళ్లు

శశిథరూర్‌ను వివాహం చేసుకోకముందు సునంద పుష్కర్‌కు రెండు పెళ్లిళ్లయ్యాయి. ఆమె మొదటి భర్త సంజయ్ రైనా అనే కాశ్మీరీ. ఆ వివాహం విఫలమవడంతో విడాకులు తీసుకుని కేరళకు చెందిన వ్యాపారవేత్త సుజిత్ మీనన్‌ని పెళ్లి చేసుకున్నారు. 1997లో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. సుజిత్‌తో సునందకు ఒక కుమారుడు ఉన్నాడు.

శశిథరూర్ లండన్‌లో జన్మించారు

శశిథరూర్ లండన్‌లో జన్మించారు

ఇక కేరళలోని పాలక్కాడ్‌లో థరూర్ల వంశానికి చెందిన శశిథరూర్ లండన్‌లో జన్మించారు. ఆయన మొదటి భార్య తిలోత్తమ పాత్రికేయురాలు. వారిద్దరికీ కవల పిల్లలు జన్మించారు. ఆ పిల్లల పేర్లు ఇషాన్, కనిష్క్.

క్రిస్టా గైల్స్ తో వివాహం

క్రిస్టా గైల్స్ తో వివాహం

తర్వాత శశిథరూర్ ఆమెకు విడాకులిచ్చి కెనడాకు చెందిన క్రిస్టా గైల్స్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన యూఎన్‌లో పని చేస్తున్నప్పుడు ఆమె పరిచయం. ఆ బంధం కూడా విఫలం కావడంతో సునందను మూడో వివాహం చేసుకున్నారు.

2010లో వివాహం

2010లో వివాహం

థరూర్‌, సునంద పుష్కర్‌ వివాహం 2010లో జరిగింది.

లేటు వయస్సులో వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. శశిథరూర్, సునంద పుష్కర్‌ల వివాహం వారి కుమారుల సమక్షంలోనే జరిగింది. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ లో వీరి పెళ్లి అప్పుడు వైభవంగా జరిగింది.

అందరినీ ఆనందపరిచింది

అందరినీ ఆనందపరిచింది

పెళ్లి సయమంలో కూడా వీరిపై చాలా కథనాలు వచ్చాయి. ఒకరినొకరు అమితంగా ప్రేమించుకున్న థరూర్, సునంద పుష్కర్‌ల వివాహం చేసుకోవడం అందరినీ ఆనందపరిచింది. 2010 ఆగస్టు 29వ తేదీన దుబాయ్‌లో సెప్టెంబరు మూడో తేదీన ఢిల్లీలో రిసెప్షన్లు కూడా ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మూడో పెళ్లి

మూడో పెళ్లి

థరూర్‌కు సునంద మూడో భార్య కాగా.. సునందకు శశి థరూర్‌ కూడా మూడో భర్తే కావడం గమనార్హం. వివాహమైన నాలుగేళ్లకే సునంద అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2014, జ‌న‌వ‌రి నెల‌లో శ‌శిథ‌రూర్ భార్య సునంద పుష్క‌ర్ (52) ఢిల్లీలోని లీలా ఫైవ్‌స్టార్‌ హోటల్‌లోని 345 నంబర్‌ గదిలో అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందారు.

మృత్యువును కోరింది

మృత్యువును కోరింది

సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడానికి వారం రోజుల ముందు ‘‘నాకు బతకాలనే కోరిక లేదు. మృత్యువును కోరుకుంటున్నారు'' అంటూ తన భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు మెయిల్ చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.

ఆల్ప్రాక్స్ మాత్రలు

ఆల్ప్రాక్స్ మాత్రలు

దాంతోపాటు.. విషం వంటి పదార్థం తీసుకోవడం వల్ల ఆమె చనిపోయారని, 27 ఆల్ప్రాక్స్ మాత్రలు ఆమె మృతదేహం వద్ద లభించాయని పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఎన్ని మాత్రలు వేసుకున్నారనేది మాత్రం తెలియదన్నారు.

శశిథరూర్‌ దూరం పెట్టడంతో

శశిథరూర్‌ దూరం పెట్టడంతో

చార్జ్‌షీట్‌ ప్రకారం.. శశిథరూర్‌ తనను దూరం పెట్టడంతో సునంద మానసిక వేదనకు గురై.. తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. దీంతో ఆమె ఎక్కువ మొత్తంలో ఆల్ప్రాక్స్ మెడిసిన్స్ వేసుకున్నారు. ఇవే ఆమె మృతికి కారణంగా పేర్కొన్నారు. సునంద, శశిథరూర్ నిత్యం ఘర్షణ పడేవారని, ఆమె శరిరీంపై గాయాలు కూడా ఉన్నాయని తెలిపారు.

ప్రమాదకరంగా మాత్రం లేవు

ప్రమాదకరంగా మాత్రం లేవు

అయితే ఆ గాయాలు అంత ప్రమాదకరంగా మాత్రం లేవని తెలిపారు. పాకిస్తానీ జర్నలిస్టుతో శశిథరూర్ అక్రమ సంబంధం నెరుపుతున్నారని సునంద అనుమానించేవారని, ఈ వివాదంపై ఇద్దరూ బాహాటంగా సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి దిగారని తెలిపారు. ఈ వివాదం జరిగిన రెండురోజులకే సునంద నిర్జీవమై హోటల్‌లో కనిపించారని పోలీసులు కోర్టుకు వివరించారు.

సునంద చనిపోవడానికి ముందురోజు

సునంద చనిపోవడానికి ముందురోజు

అంతేకాదు.. సునంద చనిపోవడానికి ముందురోజు కూడా శశిథరూర్‌కు ఫోన్‌ కాల్స్ చేశారని, అయితే శశిథరూర్ ఆమె కాల్స్‌ను తిరస్కరించారని, దీంతో ఆమె సోషల్ మీడియా ద్వారా థరూర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అలా కూడా శశిథరూర్ ఆమెను తిరస్కరించారని పోలీసులు తెలిపారు.

తీవ్ర ఒత్తికి లోనై

తీవ్ర ఒత్తికి లోనై

ఈ మొత్తం వ్యవహారంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైన సునంద.. హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తమ చార్జి షీట్‌లో వెల్లడించారు.

ఎయిర్‌పోర్టులోనే ఇద్దరి మధ్య వివాదం

ఎయిర్‌పోర్టులోనే ఇద్దరి మధ్య వివాదం

ఆమె మరణానికి రెండు రోజుల ముందు శశిథరూర్, సునంద ఇద్దరూ విమానంలో తిరువనంపురం నుండి ఢిల్లీకి వచ్చారని, ఎయిర్‌పోర్టులోనే ఇద్దరి మధ్య వివాదం మొదలైందని పోలీసులు తెలిపారు. ఈ విషయాలన్నీ ఆమె తన సన్నిహితులకు తెలిపినట్లు సునంద కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుకు వివరించింది. సాక్షుల వాగ్మాలాలను వీడియో చిత్రీకరించామని తెలిపారు.

9 రోజుల ముందు ఈ మెయిల్‌

9 రోజుల ముందు ఈ మెయిల్‌

నాకు బతకాలన్న ఏ కోరికా లేదు.. నాకు జీవించాలన్న కోరిక లేదు.. చావు కోసం ఎదురు చూస్తున్నా అంటూ సునంద తన భర్త థరూర్‌కు తాను చనిపోయే వారం రోజుల ముందు సుదీర్ఘ మెయిల్‌ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

జనవరి 8న

జనవరి 8న

జనవరి 8న సునంద, థరూర్‌కు ఇ-మెయిల్‌ చేసిందని, ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌కు చెందిన సూట్‌లో ఆమె మరణించడానికి 9 రోజుల ముందు ఈ మెయిల్‌ చేసినట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు.

మెహర్‌ తరార్‌తో సంబంధాలు

మెహర్‌ తరార్‌తో సంబంధాలు

సునంద, థరూర్ దంపతులిద్దరూ తరచూ కొట్లాడుకునేవారని, ఆమె యాంటీ డిప్రెషన్‌ టాబ్లెట్లు కూడా వాడేదని తెలిపారు. సునంద పుష్క‌ర్ మ‌ర‌ణానికి ముందు ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టు మెహర్‌ తరార్‌తో తన భర్త శశిథరూర్‌కు సంబంధాలున్నాయంటూ వెల్లడించారు.

నిప్పులు పోశారంటూ

నిప్పులు పోశారంటూ

మెహర్‌ తరార్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ కూడా అని సునంద ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమె తన కాపురంలో నిప్పులు పోశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రహస్య సందేశాలు

రహస్య సందేశాలు

భర్త శశిథరూర్‌కు, మెహర్‌కు మధ్య కొన్నాళ్లుగా రహస్య సందేశాలు నడుస్తున్నాయని సునంద ఆరోపించారు. అయితే శశిథరూర్‌ వివాహేతర సంబంధాలున్నట్లు ఆరోపించడంపై అప్పట్లో పాకిస్థానీ జర్నలిస్టు మెహర్‌ తీవ్రంగా స్పందించారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆమె సునంద ఆరోపణలను తోసిపుచ్చారు.

24 గంటలు గడవక ముందే మృతి

24 గంటలు గడవక ముందే మృతి

సునంద వ్యాఖ్యలు మీడియాలో కలకలం సృష్టించడంతో శశిథరూర్‌, సునంద సయుక్తంగా ప్రకటన జారీ చేశారు. తమ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని, తమ ట్విట్టర్‌ ఖాతాలను ఎవరో హ్యాక్‌ చేశారంటూ మీడియాకు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే ప్రకటన జారీ చేసిన 24 గంటలు గడవక ముందే సునంద అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది.

English summary

sunanda pushkar shashi tharoor new age romance that ended in tragedy

sunanda pushkar shashi tharoor new age romance that ended in tragedy
Desktop Bottom Promotion