TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
క్లాసు బోర్ కొట్టకుండా 10 ఆసక్తికర టిప్స్
కొన్ని క్లాస్‌రూమ్ పాఠాలు ఎమ బోర్. అయినా అటెండెన్స్ కోసం వెళ్లక తప్పదు.! ఇలాంటి బోరింగ్ క్లాసులు వినే కన్నా పెన్సిల్ తో పొడుచుకోవాలని అనిపిస్తుంది ఒక్కోసారి. గడియారం ముల్లు మరింత మెల్లగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడే రకరకాల ట్రిక్స్ పనికివస్తాయి. ఐతే నిజంగానే క్లాస్ శ్రద్ధగా వినాలనుకుంటే ఫోకస్ పెట్టడమో, నోట్స్ రాసుకోవడమో, టీచర్‌ను సందేహాలు అడగడమో చేయాలి.
క్లాస్ బోర్ కొట్టకుండా భరించాలంటే 10 టిప్స్ ఉన్నాయి. పరీక్షలు దగ్గర పడితే మాత్రం నోట్స్ సిద్ధం చేసుకోండి. లేదా ఎగ్జామ్స్‌లో తక్కువ మార్కులు వచ్చే ప్రమాదం ఉంది.
1. ఊత పదాలు
చాలా మంది టీచర్లు పాఠాలు చెబుతూ ఏదైనా ఒక ఊత పదం మాట్లాడటం అలవాటు. అది పదే పదే వారి నోటి వెంబడి వినిపిస్తుంది. అలాంటి పదాన్ని ఎన్ని సార్లు వాడుతున్నారో అనేదాన్ని లెక్కేస్తూ కూర్చుంటే క్లాసులో నిద్ర పట్టకుండా ఉంటుంది. దీంతో పాటు పాఠం కూడా కాస్త బోధపడుతుంది.
2. దాచిపెట్టుకొని ఫోను వాడటం
క్లాసులో సీక్రెట్‌గా ఫోన్ వాడటం వల్ల బోర్ కొట్టకుండా చేసుకోగలం. ఐతే క్లిష్టమైన గేమ్స్ ఆడటం వల్ల టీచర్‌కు సులభంగా దొరక్కుండా చూసుకోండి. ఫోన్‌లో బుక్ చదవడమో, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూనో గడిపేయండి. ఫోన్‌ను బుక్‌లో కనపడకుండా దాచుకొని జాగ్రత్తపడడం మంచిది.
3. వింటున్నట్టు నటించడం
క్లాసులో వింటున్నట్టు నటిస్తే చాలు సులభంగా బయటపడొచ్చు. టీచర్ కళ్లలోకి అప్పుడప్పుడు సిన్సియర్‌గా చూస్తూ ఉంటే చాలు. మీరు శ్రద్ధగా వింటున్నారని టీచర్ అనుకుంటారు. ఇది మీ నటనా నైపుణ్యాలను పెంచుతుంది!
4. సరైన స్థానంలో కూర్చోవడం
టీచర్ మిమ్మల్ని పిలవాలని కోరుకుంటే తప్ప మొదటి వరసలో కూర్చోవకపోవడమే మంచిది. సాధారణంగా మొదటి వరసలో ఉన్నవారి గురించి ఎక్కువగా ఊహిస్తారు. అలా అని పూర్తిగా వెనక వరసలో కూర్చున్నా ప్రమాదమే. వారిని టీచర్లు ఎక్కువగా గమనిస్తారు. అందుకే పూర్తిగా కుడి వైపున, లేదా ఎడమ వైపున మధ్య వరసల్లో కూర్చోవడం మంచిది.
5. సరదా స్నేహితుడి పక్కన
సరదాగా ఉండే స్నేహితుడి పక్కన క్లాసులో కూర్చుంటే లెక్చర్ బోర్ కొట్టదు. ఐతే మిత్రుడి జోక్స్ కు పగలబడి నవ్వకుండా జాగ్రత్తపడండి. లేకపోతే టీచర్ మిమ్మల్ని కనిపెట్టి మరోచోట కూర్చోమని చెప్పవచ్చు.
6. సాకులతో తప్పించుకోండి
ఎప్పుడైనా టీచర్ మిమ్మల్ని ప్రశ్న అడిగారనుకోండి. అది మీకు ఏమాత్రం తెలియదు. అప్పుడు ఏదో సాకుతో క్లాసు బయటకు వెళ్లే ప్రయత్నం చేయండి. రెస్ట్ రూమ్‌కు వెళతామనో, ఒంట్లో బాగోలేదని ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. ఇలాంటి సాకులు చెప్పేటప్పుడు కాస్తంత సృజనాత్మకతను వాడండి. అదే రిపీట్ కాకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
7. సృజనాత్మకతకు అవకాశం
గంట సేపు క్లాసు ఉంది అని లబోదిబోమనకుండా కామ్‌గా ఒక పక్కన కూర్చొని మీ సృజనాత్మకతకు పదును పెట్టండి. కొన్ని ఫన్నీ కార్టున్లు గీయోచ్చు, లేదా పాటలకు బాణీలు కట్టొచ్చు, క్యారికేచర్లు దింపొచ్చు.. ఇంకా ఏదైనా కథో, నవలో సైతం మొదలుపెట్టవచ్చు. మీకున్న సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు శ్రద్ధగా నోట్స్ తీసుకుంటారని టీచర్ భావిస్తారు.
8. పరిసరాలను గమనించండి
మీ ఒక్కరికే క్లాసు బోర్‌గా అనిపించదు కదా! మీ క్లాసులో చుట్టూ పరిసరాలను గమనించండి. మీ క్లాస్‌మేట్స్ పాఠాలు ఎలా వింటుందీ చూడండి. మీ క్రష్‌తో చూపులు కలపండి. మీ విరోధులను గుర్రుగా చూడండి. ఇవన్నీ కుదరకపోతే కిటికీ వంక చూస్తూ గాలిలో మేడలు కట్టేయండి!
9. నిద్రపోయే టెక్నిక్
బోరింగ్ క్లాసుల్లో కాస్తంత నిద్రపోవడం వల్ల రీఫ్రెష్ అయిపోవచ్చు. ఇందుకు కళ్లు బార్లా తెరుచుకొని నిద్రపోయే టెక్నిక్‌ను నేర్చుకోవాలి. ఇది భవిష్యత్‌లోనూ బోరింగ్ ఆఫీసు మీటింగుల్లో పనికొస్తుంది.
10. సంగీతం వినడం
ఇది చాలా ట్రిక్కీగా చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఫోన్స్ కనిపించకుండా జాగ్రత్తపడాలి. అబ్బాయిలు అయితే షర్ట్ లోపల నుంచి ఇయర్ ఫోన్స్ తగిలించుకోవాలి. అమ్మాయిలతే తమ జుట్టుతో ఇయర్ ఫోన్స్ కవర్ చేసుకోవచ్చు. జుట్టు రంగుకు మ్యాచ్ అయ్యేది వాడితే మేలు. మీరు పాటలు వింటూనే క్లాసు ఎంజాయ్ చేయొచ్చు. ఐతే శబ్దం మరీ గట్టిగా పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి.