For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికన్ రాకుమారి - మేఘన్ మార్కెల్ : రాజ కుటుంబ సభ్యురాలిగా ఎదిగిన ఆసక్తికర వైనం.

అమెరికన్ రాకుమారి - మేఘన్ మార్కెల్ : రాజ కుటుంబ సభ్యురాలిగా ఎదిగిన ఆసక్తికర వైనం.

|

ముప్ఫై ఆరేళ్ళ మేఘన్ మార్కెల్ బ్రిటీష్ రాచకుటుంబంలో వారిని పెళ్లాడిన మొదటి ద్విజాతి వనితగా చరిత్ర సృష్టించింది (కనీసం-ఆధునిక చరిత్ర జ్ఞాపకాల వరకు). ఈమె బ్రిటీష్ రాకుమారుడు హ్యారిని వివాహం చేసుకుని రాకుమారిగా మారింది.

2016 నుండి మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తున్న ఈ జంట, మే 19వ తారీఖున వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా మీడియా ఈ వేడుకను ప్రసారం చేసింది.

అసలు ఎవరు ఈ మేఘన్ మార్కెల్? ఎక్కడి నుండి వచ్చింది? ఒక అమెరికన్ వనిత బ్రిటిష్ రాకుమారిగా ఎలా మారింది?

The American Princess: Meghan Markles Remarkable Path to Royalty

రాకుమారిగా మారేంతవరకు మేఘన్ మార్కెల్ ప్రయాణం ఏ విధంగా సాగిందో తెలియజెప్పే 12 వాస్తవాలు మీ కోసం!

1. ఆమె పూర్వీకులు బానిసలు:

1. ఆమె పూర్వీకులు బానిసలు:

హ్యారి పూర్వీకులు రాజ్యకాంక్షతో రగిలి యుద్ధాలు చేస్తే, మేఘన్ మార్కెల్ పూర్వీకులు జోన్స్బోరోలోని ఒక తోటలో బానిసలుగా మగ్గిపోయారు.

"ద టైమ్స్" మ్యాగజైన్ కధనం ప్రకారం, 1830లలో జోన్స్బోరోలో బానిసగా పనిచేసిన రిచర్డ్ రగ్లాండ్ ను మేఘన్ మార్కెల్ పూర్వీకులలో ఒకరిగా గుర్తించారు.

మేఘన్ తల్లి, డోరియా రగ్లాండ్ (నల్ల జాతి వనిత),ఇప్పటికీ అదే ఇంటిపేరును కొనసాగిస్తోంది.

డోరియా, మేఘన్ తండ్రి అయిన థామస్ మార్కెల్ నుండి, మేఘన్ కు ఆరేళ్ళ వయస్సు ఉన్నప్పుడు విడాకులు తీసుకుంది.

2. ఆమెకు బాల్యం నుండి హాలీవుడ్ తో పరిచయం ఉంది:

2. ఆమెకు బాల్యం నుండి హాలీవుడ్ తో పరిచయం ఉంది:

మేఘన్ తండ్రి థామస్ మార్కెల్ లాస్ ఏంజిల్స్ లోని సన్ సెట్ గోవర్ స్టూడియోలో , "మ్యారీడ్.... విత్ చిల్డ్రన్"అనే టీవీ సిరీస్ కు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేసేవారు.

మేఘన్ పుట్టడం మరియు పెరగడం అన్నీ లాస్ ఏంజిల్స్ లోజరిగాయి. ఆమె పూర్తి పేరు రేచల్ మేఘన్ మార్కెల్. ఆమె తండ్రి పేరుగాంచిన లైటింగ్ డైరెక్టర్ అవ్వటం మూలాన, ఆయన మేఘన్ ను స్కూల్ అయిపోయిన తరువాత సాయంత్రాలు సెట్టుకు తీసుకెళ్లేవారు. థామస్ మార్కెల్ పది సంవత్సరాల పాటు మ్యారీడ్.... విత్ చిల్డ్రన్ సెట్టులో పనిచేశారు. మేఘన్ చదివే కాథలిక్ స్కూల్ నుండి సాయంత్రమయ్యేసరికి తిన్నగా, తొంభైలలో ఈ ప్రసిద్ధి గాంచిన అశ్లీల షో సెట్టుకు వెళ్ళేది.

"ఎన్నోసార్లు మా నాన్నగారు, 'మేగ్, నువ్వు ఆ క్రాఫ్ట్ సర్వీస్ రూములోని వారికి సహాయం చెయ్యు' అని అనేవారు. ఇది కేవలం తన పదకొండేళ్ల చిన్నారి కళ్ళుకప్పడానికి మాత్రమే" అని మేఘన్ ఒకానొక సందర్భంలో ఎస్క్వైర్ కి తెలియజేసింది.

ఆమెని ఈ షోను చూడడానికి ఇంట్లోనివారు అనుమతించేవారు కాదు.

3. ఆమె తండ్రికి లాటరీ తగిలింది:

3. ఆమె తండ్రికి లాటరీ తగిలింది:

1990 లో మార్కెల్ తండ్రి అయిన థామస్ కు కాలిఫోర్నియా స్టేట్ లాటరీ తగిలింది. ఇందులో బహుమతిగా ఆయన $750,000 గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని ఆయన తన కుమార్తె ఇమాక్యులేట్ హార్ట్ కేథలిక్ స్కూల్ లో విద్యానభ్యసించడానికై వెచ్చించారు. ఈ ప్రతిష్టాత్మక విద్యాలయంలో చదివించడానికి సంవత్సరానికి $16000 ఖర్చు అవుతుంది.లాటరీ సొమ్ముతోనే మార్కెల్, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో విద్యను కూడా పూర్తి చేసింది.

4. పదకొండేళ్ల వయస్సులోనే ఆమె ఒక సబ్బు యొక్క వాణిజ్య ప్రకటనను మార్పించింది:

4. పదకొండేళ్ల వయస్సులోనే ఆమె ఒక సబ్బు యొక్క వాణిజ్య ప్రకటనను మార్పించింది:

1993లో, పదకొండేళ్ల వయస్సులో మేఘన్ మార్కెల్, ప్రోక్టర్ & గాంబుల్ వారు ఐవరి సబ్బు ప్రచారానికై ప్రసారం చేసిన వాణిజ్య ప్రకటనలో పురుషాధిక్య భావన ఎక్కువైందని గమనించింది.

మార్కెల్ లో స్త్రీవాద ధోరణి చిన్న వయసులోనే ప్రారంభమైంది. ఆమె మొట్టమొదటిసారిగా 1993లో టీవీలో నిక్ న్యూస్ ఛానెల్ లో ప్రోక్టర్ & గాంబుల్ వారి వాణిజ్య ప్రకటనను అడ్డుకున్న పదకొండేళ్ల చిన్నారిగా కనిపించింది. ఐవరి డిష్ సోప్ వారి ప్రకటన మహిళలను ఉద్దేశించి తయారు చేయబడింది.

కథకుడు, సింకు నిండా ఉన్న ఎంగిలి గిన్నెలను చూపిస్తూ అమెరికన్ " మహిళలు ఐవరి డిష్ సోప్ తో మహిళలు గిన్నెలపై జిడ్డు మరియు మరకలతో పోరాటం చేస్తున్నారు" అని వ్యాఖ్యానం చేయడం విన్న మార్కెల్ విస్మయానికి లోనైంది. మార్కెల్ ప్రోక్టర్ & గాంబుల్ వారితో పాటుగా హిల్లరీ క్లింటన్ మరియు తనకు తెలిసిన వారందరికీ దీనిని గురించి లేఖలు రాసింది.

తన ఆలోచన సఫలీకృతం అయ్యింది. ఆ వాణిజ్య ప్రకటనలో "మహిళలకు" బదులుగా "ప్రజలకు" అనే పదం చేర్చారు.

"మీరు చూసిన విషయం టీవీలో అయినా, ఇంకే మాధ్యమంలో అయినా, అది సరైనది కాదనిపిస్తే సరైన వ్యక్తులకు ఉత్తరాలు ద్వారా తెలియజేస్తే, మీరే ఆ మార్పుకు నాంది పలికింది వారవుతారు" అని పదకొండేళ్ల మార్కెల్ తెలియజేసింది.

ఇదేవిధంగా ఇంకో మహిళ 1989లో "మ్యారీడ్.... విత్ చిల్డ్రన్" కార్యక్రమాన్ని బహిష్కరించాలని ఉత్తరాల ద్వారా ప్రచారం చేసినప్పటికీ, అది మరీంత ప్రాచుర్యం పొందటం హాస్యాస్పదంగా మారింది.

(ఫోటో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్రిటన్ రాకుమారుడు హ్యారి మరియు మేఘన్ మార్కెల్ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి మార్చి8, 2018న సెంట్రల్ ఇంగ్లండ్ లోని బర్మింగ్ హమ్ కి విచ్చేసినప్పుడు.)

5. ఆమె చిన్న వయసులోనే పనిచేయడం ఆరంభించింది:

5. ఆమె చిన్న వయసులోనే పనిచేయడం ఆరంభించింది:

పడమూడేళ్ల వయస్సులో మేఘన్, హంఫ్రే యోగర్ట్ అనే గొప్ప పేరున్న ఒక పెరుగు దుకాణంలో పని చేయడం మొదలుపెట్టింది.

ఆమెకు ఐస్ క్రీమ్ స్కూప్ చేయడానికి, వారాంతాలలో చెత్తను శుభ్రం చేయడానికిగాను గంటకు $4 ఇచ్చేవారు

అటు తరువాత ఆమె తనకెంతో ఇష్టమైన స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపట్టే పనిలో చేరింది. ఆ లక్షణం ఇప్పటికి ఆమెలో కొనసాగుతుంది.

6.ఆమె తరువాతి ఉద్యోగం ఆమె జీవితాన్నే మార్చేసింది:

6.ఆమె తరువాతి ఉద్యోగం ఆమె జీవితాన్నే మార్చేసింది:

మార్కెల్ తరువాతి ఉద్యోగంలో భాగంగా, స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపట్టడం ఆమె జీవితంలో మార్పు తెచ్చింది. అదంత తేలికైన విషయం కాదు. స్కిడ్ రో లోని సూప్ కిచన్స్ లో ఆహారాన్ని వడ్డించడం ఆమె పని.

"అప్పుడు నాకు పడమూడేళ్ల వయస్సు. మొదటి రోజు చాలా భయపడ్డాను. నేను చాలా చిన్నదాన్ని. పైగా అక్కడ పని చాలా కఠినంగా, శ్రమతో కూడుకుని ఉండేది. ఇక్కడ నాకు ఆనందం కలుగజేసే విషయం ఏమిటంటే, నేనొక గొప్ప స్వచ్చంద సమూహంతో కలిసి పనిచేయడమే! అక్కడ నా మార్గదర్శకులలో ఒకరైన శ్రీమతి మరియా పోలియా ' జీవితమంటే ఇతరులతో కలసి మనం పంచుకునేది, దాని కొరకు మనం కొన్ని భయాలను విడిచిపెట్టాలి' అని చెప్పడం నాకిప్పటికి గుర్తే! ఆ మాట నా మదిలో నిలిచిపోయింది" అని మార్కెల్ డైలీ మెయిల్ వద్ద ప్రస్తావించారు.

7. ఆమె థియేటర్ మరియు రాజనీతి శాస్త్రం అభ్యసించింది:

7. ఆమె థియేటర్ మరియు రాజనీతి శాస్త్రం అభ్యసించింది:

మార్కెల్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఉన్నత విద్యకు నమోదు చేసుకున్నప్పుడు, కప్ప కప్పా గామా సోషల్ క్లబ్లో థియేటర్ మరియు అంతర్జాతీయ సంబంధాలలో డబల్ మేజర్ చేసింది.

8.ఆమె యూరోప్ లో కొంత సమయం గడిపింది:

8.ఆమె యూరోప్ లో కొంత సమయం గడిపింది:

సెలవులు దొరికినప్పుడు ఆమె విలక్షణమైన బీచ్ పార్టీ జీవితశైలిని గురించి తెలుసుకోవడానికి ఫ్రాన్స్ మరియు ఇటలీ లో సమయం గడిపింది. ఇది ఆమె జీవితంలో గొప్ప మలుపు. యూరప్ లో గడిపేటప్పుడు ఆమె అంతర్జాతీయ సంబంధాలలో చెందిన డిగ్రీ అక్కరకు వచ్చింది.

9. దాదాపుగా ఆమె ఒక దౌత్యవేత్తగా వ్యవహరించారు:

9. దాదాపుగా ఆమె ఒక దౌత్యవేత్తగా వ్యవహరించారు:

కాలేజ్ చదువు పూర్తి చేసాక మార్కెల్, U.S. స్టేట్ డిపార్ట్మెంట్ లో ఆరు వారాల ఇంటర్న్షిప్ లో ఉత్తీర్ణత పొంది బ్యూనస్ ఎయిర్స్లో U.S. రాయబార కార్యాలయంలో జూనియర్ ప్రెస్ అధికారిగా పదవిని చేపట్టింది.

ఈ సమయంలో ఆమె, మూడు గంటల ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమయ్యారు. ఈ పరీక్ష అంత సులువైనదేమి కాదు. చాలా కఠినమైనది. కావాలంటే మీరు కూడా ప్రయత్నించి చూడవచ్చు.

10. మొదట్లో నటన ఆమెకు కష్టమనిపించింది:

10. మొదట్లో నటన ఆమెకు కష్టమనిపించింది:

2003లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత మార్కెల్, తిరిగి తన నటనను వృత్తిగా చెప్పట్టడానికి తిరిగి లాస్ ఏంజిల్స్ చేరుకుంది. కానీ ఆమెకు ఆ మార్గం అంత సులభతరమవ్వలేదు.

ఆమె "డీల్ ఆర్ నో డీల్" అనే ఒక నాలుగు ఎపిసోడ్ల గేమ్ షోలో కేస్ హోల్డర్ గా చేయడంతో పాటుగా, 19 టీవీ షోలలో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఒకో ఎపిసోడ్ కు $800 వసూలు చేసేది. అవకాశాలు అప్పుడప్పుడు మాత్రమే పలకరిస్తుండటం వలన, ఆమె దైనందిన ఖర్చులకు గాను పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చెడుతుండేది.

(హ్యారి మరియు మేఘన్ మార్కెల్, గాయపడిన మరియు జబ్బు పడిన ప్రజా సేవకులు మరియు మహిళల సేవార్ధం, ఇన్విక్టస్ గేమ్స్ సిడ్నీ 2018 లో పాల్గొనే ముందు UK జట్టు చేస్తున్న సాధనను వీక్షించేందుకు, బాత్ విశ్వవిద్యాలయం, బాత్, ఇంగ్లాండ్ కు విచ్చేసినప్పుడు ఏప్రిల్ 6, 2018, (ఫోటో: ఫ్రాంక్ అగస్టీన్))

11.ఆమె తన కాలిగ్రఫీ నైపుణ్యాలను అమ్ముకుంది:

11.ఆమె తన కాలిగ్రఫీ నైపుణ్యాలను అమ్ముకుంది:

అందమైన చేతివ్రాత మార్కెల్ సొంతం.ఆమె తనలో ఆ ప్రతిభ ఉందని తాను బాలిక పాఠశాలలో చదువుతుండగా చేతివ్రాత తరగతులకు హాజరయ్యేటపుడు గుర్తించింది. కాలక్రమంలో అదే తనకి పోషణ చేకూర్చే నైపుణ్యంగా మారింది. టీవీ కార్యక్రమాలలో పాత్రలకై ప్రయత్నాలు కొనసాగిస్తూ, వెయిట్రెస్ గా పనిచేస్తున్న సమయంలో ఈ ప్రతిభతో ఆమె కొంత సొమ్ముచేసుకునేది.

ఆమె లాస్ ఏంజిల్స్ లో పేపర్ సోర్స్ అనే చిన్న వ్యాపార సంస్థలో పనిచేసేది. అక్కడ ఆమె కాలిగ్రఫీ నేర్పేదని సమాచారం.

ఆమె ఫ్రీలాన్స్ కాలిగ్రఫీ కూడా చేసేది. ఆ సమయంలో ఆమె రాబిన్ థికే వివాహ సందర్భంగా 2005 లో తయారు చేసిన ఆహ్వాన పత్రిక, ఆమెకుమంచి పేరు తెచ్చి పెట్టింది.

12. తరువాత ఆమె

12. తరువాత ఆమె "సూట్స్" లో ఒక పాత్ర పోషించింది:

మేఘన్ మార్కెల్ 2011 లో USA నెట్వర్క్ లో ప్రసారమైన "సూట్స్" అనే కార్యక్రమంలో రేచల్ అనే పాత్ర పోషించింది.

"సూట్స్" మార్కెల్ జీవితాన్ని మార్చేసిన ప్రదర్శన. 2011 లో ప్రసారమైన ఈ USA నెట్వర్క్ లీగల్ డ్రామా , విమర్శనాత్మకమైన మరియు మరియు వాణిజ్యపరమైన హిట్.

ఈ కార్యక్రమం ద్వారా ఆమె ఎంత మొత్తాన్ని అందుకుందో ఇదమిద్దంగా తెలియనప్పటికిని, ఒక్కో ఎపిసోడ్ కు $50,000 కి మించి వసూలు చేసి ఉండవచ్చునని నోనెట్ వర్త్ వారి అంచనా.

English summary

The American Princess: Meghan Markle's Remarkable Path to Royalty

From Ralph & Russo to Alexander McQueen, Meghan Markle's wedding gown speculations have been killing the internet. But she is not wearing any of those designers that we all thought she will sport at the most important day of her life. In fact, the 'Suits' actress is a vision in her pristine white custom wedding gown by Givenchy. Designed by Clare Waight Keller, her ivory silk attire is simply elegant and we can't stop looking at Meghan as she is walking down the aisle with Prince Charles, her now father-in-law.
Desktop Bottom Promotion