ఆ ఎలుగుబంటి దమ్ము కొట్టేది.. బీర్లు తాగేది.. రెండో ప్రపంచ యుద్ధంలో దమ్ము చూపింది

Written By:
Subscribe to Boldsky

1942, ఏప్రిల్ 8న ఒక గొర్రెలు కాసుకునే అబ్బాయికి ఒక ఎలుగుబంటి పిల్ల దొరికింది. ఇరాన్‌లోని పోలిష్‌ ఆర్మీ క్యాంప్‌ ఆ పిల్లవాడు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఆ చిన్నపాటి ఎలుగుబంటితో గొర్రెలు కాసుకునే పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. దాన్ని పోలండ్‌ సైనికులు చూశారు.

ఎలా చెబితే అలా వింటుంది

ఎలా చెబితే అలా వింటుంది

ఆ ఎలుగుబంటి ఆ పిల్లాడు ఎలా చెబితే అలా వింటుంది. దాన్ని చూసిన సైనికులు ఆశ్చర్యపోయారు. ఎవరూ ఏం చెప్పినా చేసే గుణం దానికి పుట్టకతోనే వచ్చినట్లుంది.

కొంత డబ్బు ఇద్దామనుకున్నారు

కొంత డబ్బు ఇద్దామనుకున్నారు

ఆ పిల్లాడికి కొంత డబ్బు ఎలుగుబంటిని తాము తీసుకోవాలనుకున్నారు సైనికులు. అయితే ఆ పిల్లాడు మాత్రం సైనికుల దగ్గరున్న చాక్లెట్స్, ఆహారం, స్విస్‌ కత్తి ఇస్తేనే ఎలుగుబంటిని ఇస్తా అన్నాడు. దాంతో సైనికులు వాటిని ఇచ్చారు.

వాయ్‌టెక్‌ &వాజ్ టెక్ అని పేరు పెట్టారు

వాయ్‌టెక్‌ &వాజ్ టెక్ అని పేరు పెట్టారు

ఇక తరువాత సైనికులు ఎలుగుబంటిని జాగ్రత్తగా పెంచుకోవడం మొదలుపెట్టారు. మరి దాన్ని ఎలుగుబంటి అనకుండా ఏదైనా పేరుతో పిలవాలని నిర్ణయించుకున్నారు. దానికి వాయ్‌టెక్‌ (వాజ్ టెక్) అని పేరు పెట్టారు.

మంచి ఫ్రెండ్

మంచి ఫ్రెండ్

పోలండ్‌ సైనికులకు వాయ్ టెక్ కొద్ది రోజుల్లోనే మంచి ఫ్రెండ్ అయిపోయింది. సైనికుల ఏం చెబితే అది చేసది వాయ్ టెక్.

తాము తినే తిండినే వాయ్‌టెక్‌ పెట్టేవారు సైనికులు. మనుషులు తినే ఆహారాన్ని కూడా వాయ్‌టెక్‌ తినేది.

నేను దమ్ము కొడతా

నేను దమ్ము కొడతా

పోలండ్ సైనికులు చేసే ప్రతి పనిని వాయ్ టెక్ చేయడానికి ప్రయత్నించేది. సైనికులు అప్పడప్పుడు దమ్ము కొట్టేవారు. అప్పుడు వాయ్ టెక్ కూడా వాళ్ల పక్కకు చేరి నేనూ దమ్ము కొడతా అన్నట్లు చూసేది. ఒకసారి ఒక సైనికుడు తాను తాగుతున్న సిగరెట్ ఇచ్చాడు.

నాకు ఒక పెగ్ కావాలి

నాకు ఒక పెగ్ కావాలి

తనదైన స్టైల్లో సిగరెట్స్ తాగి సైనికులను అవాక్కు చేసేదివాయ్ టెక్. ఇక సైనికులు రెగ్యులర్ బీర్లు తాగేవారు. నాకు ఒక పెగ్గు పోస్తే నేను కూడా తాగుతూ అన్నట్లు సిట్టింగ్ లో వాళ్ల పక్కనే కూర్చొనేది వాయ్ టెక్.

బీర్లు తాగేది

బీర్లు తాగేది

అలా వాయ్ టెక్ బీర్లు తాగడం కూడా మొదలుపెట్టింది. సైనికుల మాదిరిగానే ప్రతి పని వాయ్ టెక్ దాదాపుగా చేసేది.

సిగరెట్టు తాగడం, బీర్లుతాగడం, వారితో పాటే తినడం ఇలా రెగ్యులర్ గా వాళ్లు ఏం చేస్తే అది చేసేది వాయ్ టెక్.

యుద్ద ఖైదీలే

యుద్ద ఖైదీలే

ఇరాన్‌లోని పోలిష్‌ ఆర్మీ క్యాంప్‌ సైనికులుగా ఉన్నవారంతా యుద్ద ఖైదీలే. పోలండ్‌ను సోవియట్‌ యూనియన్‌ ఆక్రమించుకున్నప్పుడు వీరంతా పట్టుపడ్డారు. జర్మనీ సోవియట్‌ మీద దాడి చేసిన సమయంలో మళ్లీ వారందరినీ వదిలేశారు.

సరదాగా ఉండేది

సరదాగా ఉండేది

అలా ఆ క్యాంప్ లో గుండెనిండా బాధతో పని చేస్తున్నవారందరికీ వాయ్ టెక్ మంచి ఫ్రెండ్ గా మారింది. ప్రతి ఒక్కరితో వాయ్ టెక్ సరదాగా ఆడిపాడేది. వాయ్‌టెక్‌ తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసేవాళ్లు అందరూ. వాయ్ టెక్ తో బాక్సింగ్‌ కూడా చేసేవారు. చాలా సరదాగా గడిపేవారు.

వాయ్ టెక్ ను తీసుకెళ్లేవారు

వాయ్ టెక్ ను తీసుకెళ్లేవారు

సైనికులు వెళ్లిన ప్రతి చోటుకు వాయ్ టెక్ ను తీసుకెళ్లేవారు. వాయ్ టెక్ వల్ల ఎవరికీ ఏ ప్రమాదం రాకుండా ముందుగానే దానికి అన్నిరకాల ట్రైనింగ్ ఇచ్చారు సైనికులు.

చాలా పెద్దగా అయిపోయింది

చాలా పెద్దగా అయిపోయింది

మొత్తానికి వాయ్‌టెక్‌ చాలా పెద్దది అయిపోయింది. సైనికులు దాన్ని పెంపుడు జంతువులాగా చూసుకునేవారు. ఒకసారి పోలండ్ సైనికులంతా పోర్ట్‌ ఆఫ్‌ నేపల్స్‌కు బయలుదేరారు.

క్రూర జంతువు అన్నారు

క్రూర జంతువు అన్నారు

అయితే ఈజిప్టు పోర్టులో వాయ్ టెక్ ను తీసుకెళ్లడానికి వీల్లేదంటూ నిలిపేశారు. ఇలాంటి క్రూర జంతువులను వెంట తీసుకెళ్తే ప్రమాదం అన్నారు. వాయ్ టెక్ ను విడిచిపెట్టి పోవడానికి ఒక్క పోలండ్ సైనికుడు కూడా సిద్ధంగా లేడు.

సైనికుడిగా

సైనికుడిగా

ఎలాగైనా వాయ్ టెక్ ను తీసుకెళ్లాలని పోలండ్ సైనికులు భావించారు. ఆ సమయంలో పోలండ్‌ సైనికులు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాయ్‌టెక్‌ను సైనికుడిగా రిజిస్టర్‌ చేయాలనుకున్నారు. వెంటనే ర్యాంక్, సర్వీస్‌ నంబర్, పే బుక్‌ కూడా రూపొందించారు.

వాయ్‌టెక్‌కు శిక్షణ

వాయ్‌టెక్‌కు శిక్షణ

తర్వాత సైనికుల మాదిరిగానే వాయ్‌టెక్‌కు శిక్షణ ఇచ్చారు. పెద్దపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణులు ఉన్న బాక్సులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లే అంశాల్లో తర్పీదునిచ్చారు.

పోలండ్ సైనికుడిగా

పోలండ్ సైనికుడిగా

అలా వాయ్ టెక్ అనే ఎలుగుబంటి పోలండ్ సైనికుడిగా మారిపోయింది. ఇక యుద్ధం వస్తే యుద్దంలో కూడా పాల్గొనడానికి వాయ్ టెక్ సిద్ధం అయిపోయింది. 1944 మాంటే కసీనో యుద్ధంలో వాయ్‌టెక్‌ పాల్గొంది.

సైనికులకు సాయం చేసేది

సైనికులకు సాయం చేసేది

ఆ యుద్దంలో తన ప్రతిభ ఏమిటో చూపించాలనుకుంది వాజ్ టెక్ యుద్ధంలో పోలాండ్ సైనికులకు చాలా సహాయం చేసింది. పెద్దపెద్ద మందుగుండు సామగ్రి ఉన్న బాక్సులను సైనికులు అందించేది వాయ్‌టెక్‌.

బ్రిటన్‌ ఆశ్రయం

బ్రిటన్‌ ఆశ్రయం

ఇక ఆ యుద్ధం ముగిసిన తర్వాత పోలండ్‌ సైనికులు బ్రిటన్‌ ఆశ్రయం కోరారు. వాయ్‌టెక్‌ కూడా పోలండ్ సైనికుల వెంటే వెళ్లి పోయింది. స్కాట్లాండ్‌లో ఓ సెలబ్రిటీలా అయిపోయింది వాయ్ టెక్.

ఫుల్ ఎంజాయ్ చేసేది

ఫుల్ ఎంజాయ్ చేసేది

అలా వాజ్ టెక్ సైనికులందరితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసేది. తర్వాత వాజ్ టెక్‌ను ఎడిన్‌బర్గ్‌లోని జూకు పంపించారు. ఒక్కసారిగా తనని జూలో నిర్బంధించేసరికి గుండె పగినట్లు అయ్యింది వాయ్ టెక్. 1963లో జూలోనే వాయ్ టెక్ చనిపోయింది.

కాంస్య విగ్రహం ఏర్పాటు

కాంస్య విగ్రహం ఏర్పాటు

వాయ్‌టెక్‌ సేవలకు గుర్తింపుగా 22వ ఆర్టిలరీ కంపెనీ తమ లోగోను మార్చేసింది. క్షిపణులను మోస్తున్న వాయ్‌టెక్‌ బొమ్మను లోగోగా ఉపయోగిస్తుంది. సెంట్రల్ ఎడింబర్గ్ లో నవంబర్ 2015 లో వాజ్ టెక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇప్పుడు వాయ్‌టెక్‌ విగ్రహాలు ఏర్పాటు చేశారు.

పెంపుడు కుక్క మాదిరిగా..

పెంపుడు కుక్క మాదిరిగా..

వాయ్‌టెక్‌ అసలు క్రూర జంతువులా ఉండేది. విశ్వాసం చూపే పెంపుడు కుక్క మాదిరిగా సైనికులతో ఉండేది. అందుకే వాయ్ టెక్ ను సైనికులు అంత బాగా చూసుకున్నారు. 1944లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వాయ్ టెక్ పోలాండ్ సైనికులకు అందించిన సాయం మాత్రం ఇప్పటికీ వారు మరిచిపోలేరు. ఇక వాయ్ టెక్ పైన ఒక సినిమా కూడా వచ్చింది.

News Source, Image Source

English summary

the bear wojtek history who became a cigarette smoking beer drinking world war II hero

the bear wojtek history who became a cigarette smoking beer drinking world war II hero
Story first published: Tuesday, March 13, 2018, 16:20 [IST]