ఈ రాశుల వారి చేతిలో డబ్బు ఎక్కువగా నిలబడుతుంది

Written By:
Subscribe to Boldsky

డబ్బు ఎవ్వరి వద్ద ఉంటే వారికి సమాజంలో ఎక్కువగా విలువ ఉంటుంది. అది లేకుంటే సమాజంలో గుర్తింపు అంతగా ఉండదు. వ్యక్తిత్వానికి కూడా విలువ ఇచ్చే జనాలు కూడా ఉన్నారనుకోండి. అయితే ఎక్కువ మంది మాత్రం డబ్బుకే విలువ ఇస్తూ ఉంటారు. మరి ఈ డబ్బు కొందరి దగ్గర ఎక్కువగా నిలబడుతూ ఉంటుంది. మరికొందరు దగ్గరేమో అస్సలు ఉండదు. ఆయా రాశులను డబ్బు ఏయే రాశులవారి వద్ద ఉంటుంది.. ఏయే రాశుల వారి ఉండదో మీరూ తెలుసుకోండి.

వృషభం (20 ఏప్రిల్ - 20 మే)

వృషభం (20 ఏప్రిల్ - 20 మే)

వృషభరాశి వారు ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అందుకే వీరి దగ్గరికి సంపద కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీరు ఏదైనా పని చేయాలనుకుంటే కచ్చితంగా దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. గమ్యాన్ని చేరే వరకు విశ్రమించరు. అందువల్ల వీరికి దగ్గరికి సంపద ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీరు ఎక్కువగా పొదుపు చేస్తుంటారు.

కర్కాటకరాశి (21 జూన్ - 22 జూలై)

కర్కాటకరాశి (21 జూన్ - 22 జూలై)

కర్కాటకరాశి వారు వారి వద్ద ఉన్న డబ్బును భద్రంగా ఉంచుకోగలరు. దాన్ని రొటేషన్ చేసి ఎక్కువ చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తారు.

వీరికి ఆర్థిక వ్యవహారాలపై మంచి అవగాహన ఉంటుంది. వీరు ఆర్థిక భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. వీరు వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేస్తూ ఉంటారు. అందువల్ల వీరి దగ్గర కూడా సంపద ఉంటుంది. ఆదాయానికి తగినంత సంపద వీరు ఎప్పుడూ కలిగి ఉంటారు.

సింహరాశి (23 జూలై - ఆగస్టు 22)

సింహరాశి (23 జూలై - ఆగస్టు 22)

సింహరాశి వారు కూడా ఆర్థికంగా ముందంజలో ఉంటారు. వీరు ఆర్థిక విషయాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. డబ్బు పరంగా ఎప్పుడు ఎలాంటి నష్టాలు రాకుండా ఉండేందుకు అన్ని రకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా డబ్బును పొదుపు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే ఎలాంటి వ్యయాలు చేయాలనే విషయాలపై వీరికి మంచి అవగాహన ఉంటుంది. వీరు చేసే వ్యాపారాల్లో కూడా నష్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి నష్టపోకుండా జాగ్రత్తపడతారు. అందువల్ల వీరు డబ్బు విషయంలో ఎప్పుడూ ముందజంలో ఉంటారు.

కన్యరాశి (23 ఆగస్టు - 22 సెప్టెంబరు)

కన్యరాశి (23 ఆగస్టు - 22 సెప్టెంబరు)

కన్యరాశి వారికి అన్ని రకాల ఆర్థిక పరిస్థితులపై మంచి అవగాహన ఉంటుంది. వీరు ఆర్ధిక లావాదేవీల విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడతారు. వీరు చాలా రకాల వ్యాపారాలపై కూడా అవగాహన కలిగి ఉంటారు. అందులో వచ్చే లాభానష్టాలపై అంచనా వేయగల శక్తి వీరికి ఉంటుంది. అందువల్ల వీరి దగ్గర డబ్బు ఎక్కువ కాలం నిలబడుతుంది.

వృశ్చికరాశి (23 అక్టోబర్ - 21 నవంబర్)

వృశ్చికరాశి (23 అక్టోబర్ - 21 నవంబర్)

వృశ్చికరాశి వారు ఆర్ధికవ్యవస్థపై ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా పొదుపు చేస్తూ ఉంటారు. వీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తారు. వీరు దాదాపుగా ఆర్థికంగా నష్టపోరు. వీరు సంపాదించుకున్న డబ్బు వేస్ట్ కాకుండా చూసుకుంటారు. దాంతో వీరి దగ్గర కూడా డబ్బు ఎక్కువగా నిలబడుతుంది.

తులరాశి

తులరాశి

వీరికి ఆర్థిక సమతుల్యం గురించి తెలుసు. అయితే వచ్చిన డబ్బును ఎక్కువగా ఖర్చుచేయడం వల్ల వీరి దగ్గర డబ్బు ఎక్కువగా నిలబడదు. అలాగే వీరికి డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు కూడా తెలిసి ఉంటాయి. కానీ డబ్బును పొదపు చేసే విషయంలో వీరు నిర్లక్ష్యం వహిస్తారు కాబట్టి వీరి వద్ద డబ్బు ఎక్కువకాలం నిలబడదు.

కుంభరాశి

కుంభరాశి

వీరు కూడా డబ్బు బాగానే సంపాదిస్తారు. కానీ దాన్ని మొత్తం షాపింగ్ లు, ఏవేవో కొనడాలకు ఉపయోగిస్తుంటారు. పొదుపు చేస్తారు కాన్నీ దాన్ని అంతా ఒకేసారి ఖర్చుపెడతారు. అందువల్ల కూడా వీరి చేతిలో చాలా సందర్భాల్లో డబ్బు ఉండదు.

మీనరాశి

మీనరాశి

వీరికి సంపాదన మార్గాలు అంతగా ఉండవు. అలాగే వచ్చిన సంపాదనను కూడా వీరు ఖర్చు పెట్టడానికే ఉపయోగిస్తుంటారు. వీరికి నచ్చిన వారికి బహుమతులు కొనివ్వడానికి ఉపయోగిస్తారు. అలాగే వీరు ఎవరికైనా అవసరం ఉందంటే వారికి వెంటనే డబ్బు ఇస్తారు. అయితే ఆ డబ్బు వీరికి తిరిగి రావాలంటే చాలా కష్టం.

ధనుస్సురాశి

ధనుస్సురాశి

ధనుస్సు రాశివారు డబ్బు కోసం వెంపర్లాడుతుంటారు. అయితే వీరి దగ్గర కూడా డబ్బు ఎక్కువకాలం నిలబడదు. వీళ్లు డబ్బులు చెట్లకు కాస్తాయనుకుంటారేమో వచ్చిన డబ్బును మొత్తాన్ని ఒకటే రోజు అయిపోగొడతారు. తర్వాత ఇబ్బందులుపడతారు.

English summary

the best zodiac signs for wealth

the best zodiac signs for wealth
Subscribe Newsletter