For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పొడవు కాళ్ళ సుందరిని చూశారా ఎప్పుడైనా?

|

కాలిఫోర్నియాకు చెందిన ఒక కళాశాల విద్యార్థిని, పార్ట్ టైమ్ మోడల్గా కూడా వృత్తిని కొనసాగిస్తూ ఉంది. కానీ మోడల్ వృత్తిలో ఈమె, తన పొడవైన కాళ్ళతో నానా కష్టాలు పడుతూ ఉంది. అమెరికాలోనే అత్యంత పొడవైన కాళ్లు కలిగిన అమ్మాయిగా ఇటీవలే ఆమె హోలీ బ్రంట్ టైటిల్ సైతం గెలుచుకుంది. గత రికార్డును 0.9 ఇంచుల తేడాతో బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

పొడవుగా ఉండటం అనేది, తన వ్యక్తిగత లోపాలు మరియు వ్యక్తిగత ప్రయోజనాల క్రిందకు వస్తాయి. వాటిలో ఏవి ఎక్కువగా ఉన్నాయనేది కూడా తన వ్యక్తిగతమే అంటుంది చేస్ కెనడీ. క్రమంగా తాను ఒక సాధారణ జీవితం గడపడానికి కూడా, అనేక క్లిష్టమైన పరిస్థితులను, సర్దుబాట్లను ఎదుర్కొనవలసి వచ్చేది.

ఆమె దైనందిక జీవనం ఎలా సాగేదో తెలుసుకోడానికి ఈ వ్యాసం చదవండి.

బాల్యం నుండే హేళనలు :

బాల్యం నుండే హేళనలు :

చేజ్ కెనడీ బాల్యం నుండే అనేక హేళనలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆమె స్నేహితులందరూ ఆమెని 'జిరాఫీ' మరియు 'లెగ్స్' అనే మారుపేర్లతో పిలిచేవారు. కనీసం ఆమెతో డేట్ కోసం కూడా బాయ్ ఫ్రెండ్స్ వచ్చేవారు కాదు, కారణం ఆమె అసాధారణమైన ఎత్తు. నిజానికి అందరూ ఎత్తు పెరగాలని నానా కష్టాలు పడుతుంటారు., కానీ ఇలా ఎత్తు పెరగడం వల్ల ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదంటూ వాపోతుంది కెనడీ.

మునుపటి రికార్డ్ ఎవరి పేరుమీద ఉండేదంటే ?

మునుపటి రికార్డ్ ఎవరి పేరుమీద ఉండేదంటే ?

నివేదికల మూలాల ప్రకారం, పొడవైన కాళ్ళు కలిగిన వ్యక్తుల్లో, ప్రస్తుతానికి అమెరికాలో హోల్లీ బర్ట్ పేరు మీద రికార్డు ఉంది, వీరి కాళ్ళ పొడవు 49.5 అంగుళాలుగా ఉండగా, ఆమెను తన బాల్యంలో, తన స్కూల్ లో అందరూ “ డాడీ లాంగ్ లెగ్స్” అని పిలిచేవారని పేర్కొంది. అనగా పొడవు కాళ్ళన్నిటికీ డాడీ అని అర్ధం వచ్చేలా.

ఒక అమ్మాయిగా, ఆమె ఎల్లప్పుడూ కోరుకునేది ఏమిటంటే ...

ఒక అమ్మాయిగా, ఆమె ఎల్లప్పుడూ కోరుకునేది ఏమిటంటే ...

బాల్యంలో, ఆమె ఎల్లప్పుడూ అందరికన్నా చిన్నగా ఉండాలని భావించేది, ఆమె సహవిద్యార్థులు ఆమెను అత్యంత హీనంగా హింసించేవారు మరియు క్షోభకు గురిచేసేవారు. కానీ ఆమె పెరిగి పెద్దయ్యాక, అనేక చీత్కారాల నుండి పాఠాలను స్వీకరించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, తన ఎత్తునే తన అర్హతగా భావిస్తూ వచ్చింది.

13 వయసులోనే 6'1 అడుగుల ఎత్తు !

13 వయసులోనే 6'1 అడుగుల ఎత్తు !

13 సంవత్సరాల వయసులోనే చేస్ కెనడీ, తన ఉన్నత పాఠశాలను ప్రారంభించినప్పుడు, 6.1అడుగుల ఎత్తుగా ఉంది. ఇది సగటు వయోజన మనిషి ఉండవలసిన ఎత్తుకన్నా పైన ఉంది. క్రమంగా పురుషులు ఆమెను ఒక టవర్ వలె భావించేవారు. క్రమంగా డేటింగ్ అంటేనే వెనకడుగు వేసేవారు.

డేటింగ్ ఎప్పటికీ కష్టతరమే ఆమెకు !

డేటింగ్ ఎప్పటికీ కష్టతరమే ఆమెకు !

ఆమె పొడవుగా ఉండటంతో, ఆమె ఎత్తు 6.1 అడుగు కన్నా తక్కువ ఎత్తు కలిగిన వారితో డేటింగ్ అనేది ఎప్పటికీ కష్టమే అయ్యేది. ప్రస్తుతం ఆమె 6.4 అడుగుల ఎత్తు కలిగిన జాన్సన్ అనే వ్యక్తితో డేటింగ్లో ఉందని తెలిపింది.

ఆఖరికి పని దొరకడం కూడా కష్టమే...

ఆఖరికి పని దొరకడం కూడా కష్టమే...

అమెరికాలో మోడలింగ్ ఏజెన్సీలు 5'11 అడుగులు లేదా గరిష్టంగా 6 అడుగుల ఎత్తు వరకే పరిమితిని కలిగి ఉన్నాయని ఆమె వెల్లడించింది. స్పష్టంగా, మోడల్ ఏజెన్సీలు ఆమెను ద్వారం వెలుపలే ఉంచేవి. అయినా తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఏమాత్రం దెబ్బతీయలేకపోయాయి అని అంటుంది కెనడీ.

ఇవేమీ ఆమె ఎదుగుదలను ఆపలేకపోయాయి !

ఇవేమీ ఆమె ఎదుగుదలను ఆపలేకపోయాయి !

అన్నిటికన్నా ముఖ్యం మనిషి తనను తాను ప్రేమించడం. ఆ విషయంలో మాత్రం కెనడీ ఎప్పటికీ గొప్ప వ్యక్తే అని చెప్పాలి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా తనంటేనే తనకు ఇష్టమని చెప్తుంది. ఈ ప్రపంచాన్ని, వ్యక్తులను, సంబంధాలను కలిగి ఉన్న వ్యక్తిగా అదృష్టాన్ని కలిగి ఉన్నందున, తనంటేనే తనకు మొదట అభిమానం. తర్వాతే ఎవరైనా. తన యుక్త వయసు నుండి అనేక హేళనలను ఎదుర్కొన్నా కూడా తన కాళ్ళే,తన బెస్ట్ అప్పియరెన్స్ అని చెప్తుంది కెనడీ. " నేను అమెరికాలోనే అత్యంత పొడవైన కాళ్ళు కలిగిన వ్యక్తిగా ఉన్నట్లు నా పేరన రికార్డ్ ఉంది ". ఆ పేరు రావడానికి కారణం నా కాళ్ళు, కావున నా కాళ్ళంటే నాకు ఇష్టం అంటుంది చేస్ కెనడీ.

ఈ పొడవు కాళ్ళ సుందరి, చేస్ కెనడీ తన కెరీర్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుందాం


English summary

She Claims To Have The Longest Legs In America

Chase Kennedy is a 22-year-old woman from San Luis Obispo, California. She claims that her legs are the longest in the world. She has emerged to be the current US record holder, beating Holly Burt whose legs measure an impressive 49.5 inches.
Story first published: Tuesday, September 4, 2018, 18:00 [IST]