For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైటానిక్ షిప్ మునిగిపోతున్న చివరి క్షణాల్లో ప్రయాణికులు ఏం చేశారు, వారిని ఎవరు కాపాడారు, ఏం తిన్నారు

టైటానిక్ లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉండేవి. పెద్ద కేప్ లు కూడా ఉండేవి. ప్రయాణికులంతా ఎక్కువ సేపు అందులోనే గడిపేవారు. టైటానిక్ షిప్ లో ఉన్న వారంతా చివరి రోజు ఏమి తిన్నారు.

|

టైటానిక్... ఈ పేరు ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ నౌక ప్రమాదం చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే ఇంత దారుణంగా ఏ నౌకా ప్రమాదం జరగలేదు. 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ సముద్రంలో జరిగిన ఈ ప్రమాదాన్ని ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదు. ఏప్రిల్ 10, 1912 న సౌథాంప్టన్ (ఇంగ్లాడ్ ) నుంచి టైటానిక్ షిప్ న్యూయార్క్ కు బయల్దేరింది.

గజగజలాడే చలి

గజగజలాడే చలి

ఏప్రిల్ 14న సముద్రం ప్రశాంతంగా ఉంది. ఆ రోజు ఆదివారం. అయితే గజగజలాడే చలి. ఇక సముద్రంలో అక్కడక్కడ మంచు కొండలు కూడా ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని అటుగా వెళ్తున్న కొన్ని నౌకల వాళ్లు కూడా టైటానిక్ సిబ్బందికి చెప్పడానికి ప్రయత్నించారు.

Imagecredit

టైటానిక్ బాగా ఫేమస్

టైటానిక్ బాగా ఫేమస్

అప్పట్లో టైటానిక్ అంటే బాగా ఫేమస్. ఆ నౌక స్టార్ట్ అయితే ఎండ్ పాయింట్ వరకు ఎదురులేదు అన్నట్లుగా వెళ్లేది. ఆ రోజు వాతావారణంలో చాలా మార్పులు వచ్చాయి. అంతకు కొన్ని రోజుల ముందు నుంచే సముద్రంలో మంచు కొండలు ఏర్పడుతున్నాయి.. జాగ్రత్త అని టైటానిక్ కెప్టెన్ స్మిత్ కు సమాచారం వచ్చింది. అప్పట్లో వైర్ లెస్ సమాచారం నౌకల్లో ఉండేది.

సమాచారం ఇచ్చినా కూడా

సమాచారం ఇచ్చినా కూడా

టైటానిక్ ను నార్త్ వైపు నకు తిప్పమని కెప్టెన్ స్టాఫ్ ను ఆదేశించాడు. వాళ్లు అలాగే చేశారు. అయితే అదే రోజు మధ్యాహ్న సమయంలో అమెరికా అనే ఒక నౌకా సిబ్బంది టైటానిక్ సిబ్బందికి కొన్ని సూచనలు చేయాలనుకున్నారు. మీరు వెళ్లే దారిలో మంచు పర్వతాలు ఎదురవుతాయి జాగ్రత్త అని చెప్పాలనుకున్నారు. టైటానిక్ సిబ్బందికి కొందరు అమెరికా నౌక సిబ్బంది చెప్పారు. అలాగే మెసాబా అనే స్టీమర్ సిబ్బంది కూడా సూచనలచ్చింది. అయితే అవన్నీ కూడా టైటానిక్ స్పీడ్ ను అదుపులో పెట్టగలిగే బ్రిడ్జ్ రూమ్ కు చేరలేదు.

రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు

రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు

ఆ సూచనలు ఆ సిబ్బందికి చేరి ఉంటే ప్రమాదం సంభవించి ఉండేది కాదేమో. మొత్తానికి టైటానిక్ షిప్ ఒక పెద్ద మంచు కొండను రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఢీ కొట్టింది. దీంతో టైటానిక్ షిప్ ముక్కలు ముక్కలు అయిపోయింది. అప్పుడు మొత్తం రెండువేల రెండు వందల ఇరవై నాలుగువేల మంది టైటానిక్ లో ప్రయాణిస్తున్నారు. అందులో పదిహేను వందల మంది చనిపోయారు.

ప్రతి ఒక్కరికీ లైఫ్ జాకెట్స్

ప్రతి ఒక్కరికీ లైఫ్ జాకెట్స్

మిగతావారు ఎలా బతికారంటే టైటానిక్ షిప్ లో మొత్తం ఇరవై దాకా లైఫ్ బోట్లు ఉండేవి. ప్రతి ఒక్కరికీ లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. వాస్తవానికి మొత్తం పన్నెండు వందల మందిని ఈజీగా సేఫ్ కావొచ్చు. కానీ భయంతో, శరీరాన్ని మొత్తాన్ని కూడా గడ్డ కట్టించే నీటి వల్ల చాలా మంది చనిపోయారు.

కర్పాథియా సిబ్బంది

కర్పాథియా సిబ్బంది

టైటానిక్ షిప్ మునిగినపోయిన తర్వాత ఆ విషయం మరుసటి రోజు వరకు ఎవరికీ తెలియదు. మరుసటి రోజు అంటే ఏప్రిల్ పదిహేను, 1912న అటువైపు గా ఆర్ ఎంఎస్‌ కర్పాథియా అనే షిప్ సిబ్బంది టైటానిక్ మునిగిపోయినట్లు గుర్తించారు. ఆ రోజు తెల్లవారుజామున వాళ్లు గమనించి లైఫ్ బోట్లు, జాకెట్స్ తో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న వారందరినీ రక్షించారు. తమ నౌకలోకి ఎక్కించుకుని గడ్డకు చేర్చారు.

జాక్, రోజ్‌ ల ప్రేమ ఒక్కటే హైలెట్

జాక్, రోజ్‌ ల ప్రేమ ఒక్కటే హైలెట్

వాస్తవానికి ప్రమాదానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న

కర్పాథియా షిప్ సిబ్బందికి టైటానిక్ మునిగిపోయిందని అని సమాచారం రాగానే ఆ సిబ్బంది ఎంతో ధైర్యంతో మంచు కొండల మధ్యనే అక్కడికి చేరుకుని ప్రాణాలతో ఉన్న ప్రయాణికులను రక్షించారు. మొత్తం ఏడు వందల ఐదు మందిన ఆ నౌక సిబ్బంది కాపాడింది. మనకు తెలిసిన టైటానిక్‌ లో జాక్, రోజ్‌ ల ప్రేమ ఒక్కటే హైలెట్ అవుతుంది కానీ అంతకు మంచి ఆ షిప్ లో చాలా జరిగాయి.

ఇంజన్ ఉంచడం వల్లే

ఇంజన్ ఉంచడం వల్లే

కేవలం మంచుకొండను ఢీ కొట్టడమే కాదు టైటానిక్ షిప్ అడుగు భాగంలో ఇంజన్ ఉంచడం వల్లే అది ప్రమాదానికి గురైందని కొందరు అంటారు. షిప్ నడిచేందుకు కొన్ని టన్నుల కొద్దీ బొగ్గును మండించడం వల్ల షిప్ అడుగుభాగం బాగా డ్యామేజీ అయి మంచుకొండను కొట్టగానే ముక్కలు అయిపోందని ఒక జర్నలిస్ట్ గతంలో చెప్పారు.

మెను బ్రౌచర్ వల్ల

మెను బ్రౌచర్ వల్ల

టైటానిక్ లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉండేవి. పెద్ద కేప్ లు కూడా ఉండేవి. ప్రయాణికులంతా ఎక్కువ సేపు అందులోనే గడిపేవారు. టైటానిక్ షిప్ లో ఉన్న వారంతా చివరి రోజు ఏమి తిన్నారు అనే విషయాలు ఆ రోజు షిప్ లో ముద్రించిన మెను బ్రౌచర్ వల్ల తెలుసుకోవొచ్చు. టైటానిక్ లో ఏ రోజు మెను ఆ రోజు ముద్రించి ఇచ్చేవారు.

అలాగే ఏప్రిల్ 14, 1912న టైటానిక్ షిప్ లో ప్రయాణికులందరికీ మెను బ్రౌచర్ ఇచ్చారు. వారంతా కూడా ఆ ఫుడ్ తిని ఉంటారు. అంతేకాదు వైన్, బీరు తీసుకునేందుకు ప్రత్యేకంగా రూమ్స్ షిప్ లో ఉండేవి.

బ్రేక్ ఫాస్ట్ కింద

థర్డ్ క్లాస్ ప్రయాణికుల కోసం బ్రేక్ ఫాస్ట్ కింద ఆ రోజు ఓట్ మీల్, పాలు, స్మోక్ డ్ హెర్రింగ్స్, ఆలు చిప్స్, బాయిల్డ్ ఎగ్స్, ఫ్రెష్ బ్రెడ్, బట్టర్ టీ, కాఫీ అరెంజ్ చేశారు. ఇక డిన్నర్ లో భాగంగా రైస్, సూప్, బ్రెష్ బ్రెడ్, బిస్కట్స్, రోస్ట్ బీఫ్, బ్రౌన్ గ్రేవీ, స్వీట్ కార్న్, బాయిల్డ్ పొటాటోస్, స్వీట్ సాస్ పండ్లు, టీ, కోల్డ్ మీట్, పికిల్స్, ఫ్రెష్ బ్రెడ్, బట్టర్, స్టీవ్ డ్ ఫిగ్స్, రైస్, టీ ఉంచారు. ఇక సప్పర్ టైమ్ లో బిస్కట్స్, చీజ్ ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు.

ఎక్కువగా నాన్ వెజ్ ఐటెమ్స్

ఇక మరో మెను కూడా కొందరు ప్రత్యేకమైన ప్రయాణికుల కోసం తయారు చేశారు అందులో ఎక్కువగా నాన్ వెజ్ ఐటెమ్స్ ఉన్నాయి. చికెన్, ఎగ్స్, మాంసం సంబంధించిన వాటి పదార్థలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే పలు రకాల పండ్లు, ప్రోటీన్స్, పోషకపదార్థాలు మెనులో ఉంచారు. పాపం... ఇలా రకరకాల ఆహారపదార్థాలు తిని హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో షిప్ లో గడుపుతున్న వారందరినీ మృత్యువు అలా కబలించేసింది.

English summary

the last dinner on the titanic

the last dinner on the titanic
Desktop Bottom Promotion