' టి ' లేదా ' ఆర్ ' తో పేరు మొదలయ్యే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం లో ఉండే పది రహస్యాల గురించి మీకు తెలుసా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

టి మరియు ఆర్ తో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు తులరాశికి చెందిన వారై ఉంటారు. ఏ వ్యక్తులైతే ఈ రాశిలో జన్మించి ఉంటారో, వారు ఎంతో శాంతంగా ఉంటారు మరియు ఏకాంతంగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు. వేరే వారితో సాంగత్యం అతి ముఖ్యమని వీరు భావిస్తారు మరియు అత్యంత నమ్మకస్థులైన భాగస్వాములుగా వీరిని ఎంతో మంది గుర్తించడం జరిగింది. తులరాశి వారు ఎంతో ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు అందాన్ని, శాంతిని మరియు సామరస్యాన్ని అభినందిస్తారు.

Does Your Name Start With “T” or “R”? The Meaning Behind These Letters

అంతేకాకుండా ఈ రాశి వారు ఎంతో ప్రేమగా, అందంగా, సమతుల్యతతో దౌత్య సంబంధాలను నెరుపుతుంటారు. ఈ రాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క ఆసక్తికరమైన లక్షణాల గురించి ఇప్పడు తెలుసుకోబోతున్నాం...

సామజిక సాంఘిక అంశాల్లో ఎంతో చురుగ్గా పాలుపంచుకుంటారు:

సామజిక సాంఘిక అంశాల్లో ఎంతో చురుగ్గా పాలుపంచుకుంటారు:

ఏ వ్యక్తులైతే తులరాశికి చెందిన వారై ఉంటారో, వారు సామజిక సాంఘిక అంశాల్లో ఎంతో చురుగ్గా పాలుపంచుకుంటారు. ఈ కారణం చేతనే వీరు ఎంతో మంది స్నేహితులను కలిగి ఉంటారు. వీరు స్నేహితులను ఎక్కువగా చేసుకోవడానికి ఇష్టపడతారు మరియు వీరి స్నేహితులు కూడా వీరి సాంగత్యాన్ని ఇష్టపడతారు.

తులరాశి వారు ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు:

తులరాశి వారు ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు:

తులరాశి వారు ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు సహజంగానే ఎంతో ఆనందకరంగా ఉంటారు మరియు వీరు ఎక్కువ సరదాగా ఉండటానికి ఇష్టపడతారు.

తులారాశికి చెందిన వ్యక్తులు తాము ఉండే నివాస సముదాయాలను శుభ్రంగాను మరియు అందంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతారు:

తులారాశికి చెందిన వ్యక్తులు తాము ఉండే నివాస సముదాయాలను శుభ్రంగాను మరియు అందంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతారు:

ఈ వ్యక్తులు ఎంతో వివేకంతో వ్యవహరిస్తారు మరియు మెదడుని ఉపయోగించే పనులను చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు తాము ఉండే నివాస సముదాయాలను శుభ్రంగాను మరియు అందంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా వీరు ఎదుటివారికి కనపడే విషయంలో ఎంతో చేతనంగా వ్యవహరిస్తారు, అందుకు తగినట్లు నడుచుకుంటారు. సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు మరియు పిల్లలతో ఎక్కువ బంధాన్ని కలిగి ఉంటారు.

తులరాశి వారు అన్ని విషయాల్లో ఎంతో బాగా వ్యవహరిస్తారు:

తులరాశి వారు అన్ని విషయాల్లో ఎంతో బాగా వ్యవహరిస్తారు:

తులరాశి వారు అన్ని విషయాల్లో ఎంతో బాగా వ్యవహరిస్తారు. వీరు విధేయులుగా ఉంటారు మరియు పెద్దలకు గౌరవానిస్తారు. బయటకు వెళ్లడాని కంటే కూడా ఇంట్లోనే ఉండటానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఆటలు మరియు కళల పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

ఈ రాశి వారు నాజూకుగా, పొడవుగా మరియు తెల్లగా ఉంటారు:

ఈ రాశి వారు నాజూకుగా, పొడవుగా మరియు తెల్లగా ఉంటారు:

ఈ రాశి వారు నాజూకుగా, పొడవుగా మరియు తెల్లగా ఉండి ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు జీవితంలో పైకి ఎదగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతారు మరియు ఎంతో మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారని చాలా మంది నమ్ముతారు.

వీరికి ఎంతో తియ్యటి గాత్రం ఉంటుంది:

వీరికి ఎంతో తియ్యటి గాత్రం ఉంటుంది:

వీరికి ఎంతో తియ్యటి గాత్రం ఉంటుంది మరియు వీరిలో ఒక ఉత్తమమైన లక్షణం ఏమిటంటే, ప్రతి సందర్భంలోను వీరు నవ్వుతూ ఉంటారు. తులరాశి వారు సాహిత్యం లేదా పాండిత్యం తో ఎదో ఒక రకంగా సంబంధాన్ని కలిగి ఉంటారు.

ఈ రాశి వారు మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు:

ఈ రాశి వారు మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు:

తులారాశి వారు వివాహ జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. వాదనలను పూర్తిగా దూరం పెడతారు.

స్త్రీలు ఎవరైతే ఈ రాశిలో జన్మించారో వారు మంచి అమ్మలుగా వ్యవహరిస్తారని చాలా మంది నమ్ముతారు. వీరు వాళ్ళ పిల్లలకు ఎంతో మంచి విద్యని అందిస్తారు మరియు వారిలో ఎంతో ఆత్మస్థైర్యం నింపడంలో కీలక పాత్ర పోషిస్తారు.

సందర్భం ఏదైనా వీరు విశ్వాసాన్ని అస్సలు కోల్పోరు మరియు ఎదుటివారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి ఆసరాగా నిలవడంతో పాటు, వారిని ప్రోత్సహిస్తారు.

English summary

Does Your Name Start With “T” or “R”? The Meaning Behind These Letters

Find out other interesting characteristics of the people born under this sun sign and you would be lucky if your name starts with these special letters, especially if you are a Libran!
Story first published: Sunday, January 14, 2018, 16:00 [IST]