For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చెయ్యాల్సిందంతా చేసేసి, మేము చెయ్యలేదని బుకాయించే రాశిచక్రాలు ఉన్నాయని తెలుసా?

  |

  కొందరు మీరేతప్పూ చేయకపోయినా, తప్పంతా మీదే అయినట్లు వేలెత్తి చూపుతుంటారు. ఎన్నిసార్లు మీ జీవితoలో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు? వారి వారి వ్యక్తిగత లక్షణాల దృష్ట్యా, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులకు కేంద్రమవుతూ ఉంటారు.

  ఇబ్బందికరమైన రాశిచక్రాల లక్షణాలు:

  ఇక్కడ, ఈ వ్యాసంలో మేము ప్రతి రాశిచక్రం యొక్క ఇబ్బందికరమైన విలక్షణమైన వివరాలను తీసుకువస్తున్నాం మరియు అవి ఎన్నటికీ అంగీకరింపబడని లక్షణాలు. రాశిచక్రం అంటే కేవలo మంచే ఉండాలని నియమాలు లేవు, కొన్ని చెడు లక్షణాలు కూడా ఆయా సందర్భాలను బట్టి ప్రదర్శితమవుతూ ఉంటాయి. గమనించగలరు.

  మీ రాశిచక్రం చిహ్నం ప్రకారం మీ ఇబ్బందికరమైన లక్షణాన్ని తెలుసుకోండి.

  మేష రాశి: మార్చి21– ఏప్రిల్19

  మేష రాశి: మార్చి21– ఏప్రిల్19

  కొన్ని తీవ్రమైన పరిస్థితుల నేపధ్యంలో నోటికి అడ్డంగా పాదాలను పెట్టే సమర్ధులుగా ఈ మేషరాశి వారు ఉంటారు. మనసులో జనించే ఆలోచనలకు తగ్గట్లుగానే వీరు ముందుకు కదులుతారు కానీ, ఏ విషయంలోనూ ఇతరుల మాటను విందామన్న ఆలోచన చేయరు. ఈ ఆలోచనల కారణంగా తెలీకుండా అనేక తప్పిదాలకు కారణమవుతూ ఉంటారు. కానీ, తప్పులు తమవలనే జరిగాయి అని అంగీకరించడానికి మాత్రం అధిక సమయాన్ని తీసుకుంటూ ఉంటారు.

   మిధున రాశి: మే20- జూన్20

  మిధున రాశి: మే20- జూన్20

  ఎటువంటి పరిస్థితుల్లో అయినా సమస్యలను నివారించే ఆలోచనా క్రమంలోనే వీరి వ్యవహార శైలి ఉంటుంది. తద్వారా ఏవైనా కొన్ని విపత్కర పరిస్థితులకు లోనైనప్పుడు తప్పించుకునే క్రమంలో భాగంగా కానీ, లేదా పరిస్థితులు సద్దుమణిగే క్రమంలో భాగంగా చెవిలో హెడ్ ఫోన్లు పెట్టుకుని పక్కకు వెళ్ళడం, లేదా ఏదైనా ఇతర వ్యవహారాలకు మనసును, పరిస్థితులను మళ్ళించడం వంటి చర్యలు చేస్తుంటారు. ఉదాహరణకు ఎటువంటి పాటలూ ఆ మొబైల్ లో లేనప్పటికీ, కావాలని హెడ్ ఫోన్లు పెట్టుకుని పరిస్థితితో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుంటారు.

  వృషభ రాశి:ఏప్రిల్20 – మే20

  వృషభ రాశి:ఏప్రిల్20 – మే20

  సామాజిక వివక్షతకు కేంద్రబిందువులైన ఈ వృషభరాశి వారు తమ చుట్టూతా తెలియని వ్యక్తులు ఉన్నప్పుడు కాస్త ఇబ్బందికి లోనవుతూ ఉంటారు. కొత్తగా మనుషులను కలిసినా, ఏదైనా సమూహంలో ఉండవలసి వచ్చినా కాస్త ఇబ్బందికి గురవుతూ ఉంటారు. తద్వారా, తమ చరవాణితో సమయాన్ని వెచ్చించడం, సమూహం నుండి పక్కకు వెళ్ళే ప్రయత్నాలు చేయడం వంటివి చేస్తుంటారు. ఇటువంటి సమయాల్లో తెలీకుండానే కొన్ని తప్పులకు కేంద్రబిందువు అవుతుంటారు.

  కర్కాటక రాశి: జూన్21–జూలై22

  కర్కాటక రాశి: జూన్21–జూలై22

  వీరేదైనా పార్టీకి హాజరైతే, ఏదైనా పెంపుడు జంతువు వద్దకో, లేదా పాపాయి వద్దకు వెళ్లడమో చేస్తుంటారు. దీనికి కారణం వీరు తమ మానసిక బావాలకు దగ్గరగా ఉండేవారిని ఎంచుకుంటూ ఉంటారు. పసిపిల్లల మనస్తత్వాన్ని చూడవచ్చు. మరోపక్క వీరు తమకన్నా పెద్దవారితో కానీ, తెలియని వారితో కానీ మాట్లాడుటకు సుముఖత వ్యక్తం చేయరు.

  సింహ రాశి: జూలై23 – ఆగస్ట్23

  సింహ రాశి: జూలై23 – ఆగస్ట్23

  సింహరాశికి చెందిన వ్యక్తులు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి మాటలను వినడానికి ఇష్టపడతారు మరియు వారు అపరిచితుల శ్రద్ధను పూర్తిగా తమవైపు మరల్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఎవరైనా వీరి పట్ల ఆసక్తిని కనపరుస్తుంటే, వారిని ఆకర్షించే ప్రయత్నాలలో భాగంగా కొన్ని వ్యతిరేక స్వభావాలను ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ, ఏది ఏమైనా అందరికీ ఇష్టులై ఉంటారు.

  కన్యా రాశి: ఆగస్ట్24 – సెప్టెంబర్23

  కన్యా రాశి: ఆగస్ట్24 – సెప్టెంబర్23

  ఎవరైనా కొత్త వ్యక్తులకు వీరిని పరిచయం చేసినప్పుడు, వీరితో మాట్లాడుట ఏమో కానీ, సోషల్ మీడియా స్క్రోలింగ్ మీద ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. వారు ఎన్నటికీ పరిపూర్ణులుగా ఉండేలా ఆలోచనలు చేస్తుంటారు, ఆ క్రమంలో భాగంగా ఏ సంభాషణలో అయినా పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడే ప్రయత్నాలు ఎన్నటికీ చేయరు.

  తులా రాశి: సెప్టెంబర్24– అక్టోబర్23

  తులా రాశి: సెప్టెంబర్24– అక్టోబర్23

  ఈ తులారాశికి చెందిన వ్యక్తులు కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు, తమకు అర్ధo కాని పరిస్థితుల్లో, తిరిగి చెప్పమని అడగకుండా ఒక చిన్న చిరునవ్వుతో సమాధానం ఇస్తుంటారు. మరియు ఏదైనా విషయాన్ని లేదా తప్పును అంగీకరించవలసి వచ్చినా, నవ్వులతో లేదా తల ఊపడం వంటి సంజ్ఞల ద్వారా సమాధానాలు ఇస్తుంటారు. తద్వారా, కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.

  వృశ్చిక రాశి: అక్టోబర్24– నవంబర్22

  వృశ్చిక రాశి: అక్టోబర్24– నవంబర్22

  వృశ్చికరాశి వారు ఎక్కువగా ఆధిపత్య ధోరణిని, ముక్కుసూటి తనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, తద్వారా అనేక ఇబ్బందికర సమస్యలకు కేంద్రబిందువుగా ఉంటారు. కానీ అన్ని సమయాల్లో ఈ ఆలోచనా తీరు సరికాదన్న సత్యాన్ని వీళ్ళు గ్రహించవలసి ఉంటుంది. మరియు వీరు పట్ల తప్పు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా, తమ వైపే న్యాయముందని వాదించే భిన్న వ్యక్తిత్వం కలవారిగా ఉంటారు. ఒక్కోసారి చిన్న చిన్న అబద్దాలు కూడా చెప్తుంటారు, సమస్యను పరిష్కరించే క్రమంలో భాగంగా అబద్దాలు చెప్పడం వీరి దృష్టిలో తప్పు కాదు.

  ధనుస్సు రాశి:నవంబర్23-డిసెంబరు22

  ధనుస్సు రాశి:నవంబర్23-డిసెంబరు22

  ధనుస్సు వ్యక్తులు ఒక సమయoతో సంబంధంలేని హాస్యచతురతను ప్రదర్శిస్తుంటారు. తద్వారా అనేక ఇబ్బందికర సమస్యలకు కారణభూతమవుతుంటారు. వారి హాస్యం తప్పు కాదు, కాని భావవ్యక్తీకరణకు కూడా ఒక సమయం ఉంటుందన్న విషయాన్ని వీరు గ్రహించాలి.

  మకర రాశి:డిసెంబర్23–జనవరి20

  మకర రాశి:డిసెంబర్23–జనవరి20

  మకర రాశికి చెందిన వ్యక్తులు, ప్రతి విషయం నందు తమదే పైచేయి కావాలన్న ఆలోచనను కలిగి ఉంటారు. వీరి పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే, అస్సలు సహించలేరు. తద్వారా వారి పట్ల వీరు తీసుకునే నిర్ణయాలు, అనేక సమస్యలకు తావిస్తుంది. హింసాత్మక, ప్రతీకార స్వభావాలను ప్రదర్శిస్తుంటారు. కానీ విపత్కర సమయాల్లోనే వీరు ఇలాంటి నిర్ణయాలకు పూనుకుంటూ ఉంటారు. ఎటువంటి నిర్ణయాలైనా ఒకరికి చెప్పి తీసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండరు. మరియు ఏ సమస్య అయినా నేరుగా పోరాడే తత్వాన్నే కలిగి ఉంటారు కానీ, వేరొకరిని తమకు కవచంగా ఉంచుకొనుటకు ఇష్టపడరు.

  కుంభ రాశి: జనవరి21–ఫిబ్రవరి18

  కుంభ రాశి: జనవరి21–ఫిబ్రవరి18

  కుంభ రాశికి చెందిన వ్యక్తులు వారి స్వంత విలక్షణమైన హాస్య చతురత కలిగి ఉంటారు. మరియు ఎవరైనా వారిపట్ల జోకులు వేయడం హేళన చేయడం వంటివి చేస్తుంటే పెద్దగా పట్టించుకోరు కూడా. సమూహంలోని ఇతరులు విషయాలు అర్థం కావడంలేదని చెప్పినా కూడా, వీరి మాటల ప్రవానికి అడ్డుకట్ట పడదు. తద్వారా కొన్ని గందరగోళ సమస్యలకు దారితీస్తాయి. మరియు నలుగురిని భాధించే విషయంగా ఉంటుంది.

  మీన రాశి: ఫిబ్రవరి19–మార్చి20

  మీన రాశి: ఫిబ్రవరి19–మార్చి20

  మీనరాశికి చెందిన వ్యక్తులు చాలా అజాగ్రత్తగా ఉంటారు. అదే సమయంలో ఎల్లప్పుడూ ఏవిషయంలో అయినా రెండు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. సమస్యలను బట్టి తప్పుకోవడం, లేదా ఎదుర్కొనడం చేస్తుంటారు. తమ కారణంగా ఎంత పెద్ద తప్పు జరిగినా ఇతరులవైపుకే వారి వేలు ఉంటుంది కానీ, తమ వలన అని మాత్రం ఎన్నటికీ అంగీకరించరు.

  English summary

  Each Zodiac Sign Has Socially Awkward Traits Which They Deny

  Most of us think that we are capable of handling any kind of a social situation possible and that too with ease. In fact, there are times when we face plain awkward situations. The stars reveal the most socially awkward trait that makes us are famous for, but at the same time, we will never agree that we have it.
  Story first published: Saturday, May 19, 2018, 16:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more