For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మర్డర్స్ కు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతాలు, అక్కడ రోజూ చంపుకోవడాలే

రోజూ హత్యలకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని దేశాల్లో ఈ హత్యలశాతం మరీ ఎక్కువగా ఉంది. ఈ 25 దేశాల్లో ప్రపంచంలోనే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి.

|

రోజూ హత్యలకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని దేశాల్లో ఈ హత్యలశాతం మరీ ఎక్కువగా ఉంది. ఈ 25 దేశాల్లో ప్రపంచంలోనే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి.

25. పనామా, 17.2

25. పనామా, 17.2

ఉత్తర, దక్షిణ అమెరికాను కలిపే ప్రాంతంలో ఉంటే పనామాలో మర్డర్ రేట్స్ లో కాస్త ముందే ఉంది. ఇక్క హత్యల శాతం 17.2గా ఉంది. గతంలో పోల్చుకుంటే ఇక్కడ క్రమంగా హత్యలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ ఎక్కువగా గన్ వయోలెన్స్ ఉంటుంది.

Image Source (all photos)

24. బోట్స్వానా, 18.4

24. బోట్స్వానా, 18.4

దక్షిణ ఆఫ్రికాలో బోట్స్వానా ఉంది. పనామాతో పోల్చుకుంటే ఇక్కడ భిన్న వైఖరి ఉంది. అక్కడ ఏటకేటకు హత్యలు తగ్గుతుంటే ఇక్కడేమో పెరుగుతున్నాయి.

2009 లో ఇక్కడ మర్డర్ రేటు 14 ఉండగా 2012 కల్లా ఆ శాతం పెరిగింది. బ్యాట్స్వానాలో ప్రతి 100,000 మందిలో 2012లో 18.4 మంది హత్యకు గురయ్యారు. ఇక్కడ హత్యలతో పాటు ఎయిడ్స్ వంటి వ్యాధుల బారిన పడి కూడా జనాలు చనిపోతున్నారు.

23. ఈక్వెటోరియల్ గినియా, 19.3

23. ఈక్వెటోరియల్ గినియా, 19.3

ఈక్వెటోరియల్ గినియా అనేది ఈ ఆఫ్రికన్ దేశానికి సంబంధించిన ప్రాంతం. ఈక్వెటోరియల్ గినియా జనాభా 600,000 మంది. ఇక్కడ సామాన్య జనాలు నిత్యం హత్యలకు గురువుతూ ఉంటారు.

పోలీసు వ్యవస్థ అంత స్ట్రాంగ్ గా లేదు.

అలాగే ఇక్కడ సాయుధ మాదకద్రవ్య ముఠాలతో పాటు దోపిడీదారులు ఎక్కువగా ఉన్నారు. వీరి అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో అక్కడ హత్యలశాతం పెరిగిపోతుంది.

22. నైజీరియా, 20

22. నైజీరియా, 20

నైజీరియాలో 20 శాతం మర్డర్ రేట్ ఉంది. ఆఫ్రికాలోని నైజీరియాలో అత్యధికంగా 174 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్నారు. నైజీరియా క్రైమ్ కు కేరాఫ్ అడ్రస్ లా ఉంటుంది.

ప్రతి సంవత్సరం 20శాతం మంది నైజీరియన్లు హత్యకు గురవుతూనే ఉన్నారు. అత్యాచారం, గృహ హింస, బానిసత్వం కూడా దారుణంగా ఉంటాయి.

Most Read :భూమిపై ఇప్పటి వరకు పుట్టని మనుషులపై ఓ లుక్కేయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫొటోలుMost Read :భూమిపై ఇప్పటి వరకు పుట్టని మనుషులపై ఓ లుక్కేయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫొటోలు

21. డొమినికా, 21.1

21. డొమినికా, 21.1

డొమినికాలో దాదాపు 70,000 మంది జనాభా ఉంటారు. ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో డొమినికాఒకటి. ఇక్కడికి వచ్చే పర్యాటకులపై కూడా నిత్యం దాడులు జరుగుతూనే ఉంటాయి. పంటలను కోయడానికి ఉపయోగించే సామాగ్రిని ఎప్పుడూ చేత పట్టుకుని తిరిగే జనం ఇక్కడే చాలా మందే ఉంటారు.

20. మెక్సికో, 21.5

20. మెక్సికో, 21.5

దాదాపుగా 2 మిలియన్ల చదరపు కిలోమీటర్ల (సుమారు 760,000 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంటుంది మెక్సికో. ఇది ఐరోపాలో ఐదో అతిపెద్ద దేశం. మెక్సికో మాదక ద్రవ్య అక్రమ రవాణాతో మరికొన్ని దందాలకు పేరుగాంచింది. ఇక్కడ కూడా తరచుగా హత్యలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థి ముఠాలను భయపెట్టేందుకు కొన్నిసార్లు ఇక్కడ చాలా క్రూరంగా హత్యలు చేస్తుంటారు.

19. సెయింట్ లూసియా, 21.6

19. సెయింట్ లూసియా, 21.6

సెయింట్ లూసియాలో దాదాపు 175,000 మంది జనాభా ఉంటుంది. లూసియా ఒక చిన్న కరేబియన్ దేశం. ప్రకృతి సౌందర్యాలకు నిలయం. అద్భుతమైన బీచ్ లు ఉంటాయి. అలాగే ఇక్కడ హత్యలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. 2007 తో పోల్చితే ఇప్పుడు ఇక్కడ హత్యల శాతం మరింత పెరిగింది. అప్పటితో పోల్చితే ఇక్కడ హత్యలశాతం ఇప్పుడు రెట్టింపు అయ్యింది.

18. డొమినికన్ రిపబ్లిక్, 22.1

18. డొమినికన్ రిపబ్లిక్, 22.1

ఇది రెండో అతిపెద్ద కరీబియన్ దేశం. డొమినికన్ రిపబ్లిక్ లో దాదాపు 10 మిలియన్ల మంది ఉంటారు. డొమినికన్ రిపబ్లిక్ యూరప్, యూఎస్ లాంటి దేశాలకు కొలంబియన్ డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ కూడా నిరంతరం హత్యలు జరుగుతుంటాయి. మాదక ద్రవ్యాల సరఫరాకు ఇది కేంద్రం.

Most Read :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలు,Most Read :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలు,

17. రువాండా, 23.1

17. రువాండా, 23.1

సెంట్రల్ , తూర్పు ఆఫ్రికాలో ఉండే రువాండాలో దారుణంగా మర్డర్స్ జరుగుతుంటాయి. హత్యలతో పాటు రేప్ లు, దోపిడీలు ఇక్కడ నిరంతరం జరుగుతుంటాయి. ఇది నేరాలకు కేరాఫ్ అడ్రస్.

16. బ్రెజిల్, 25.2

16. బ్రెజిల్, 25.2

బ్రెజిల్ లో దాదాపు 200 మిలియన్ల జనాభా ఉంటుంది. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ కూడా తరుచూ హత్యలు చోటుచేసుకుంటూ ఉంటాయి. 2012 లో దాదాపు 65,000 మంది ఈ దేశంలో హత్యకు గురయ్యారు. డ్రగ్స్, మద్యానికి సంబంధించిన విషయాల్లోనే ఈ హత్యలన్నీ జరిగాయి.

15. సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడీన్స్, 25.6

15. సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడీన్స్, 25.6

సుమారు 390 చదరపు కిలోమీటర్ల (150 చదరపు మైళ్ళు) లలో సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ ఉంటుంది. ఇది ఒక చిన్న కరేబియన్ దేశం. ఇక్కడ కూడా హత్యలు దారుణంగా జరుగుతుంటాయి. హత్యలతో పాటు అత్యాచారాలు, దోపిడీలు కూడా ఇక్కడ నిరంతరం జరుగుతుంటాయి.

14. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, 28.3

14. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, 28.3

సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్న డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సహజ వనరులకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది. అయితే ఇక్కడ రాజకీయ అస్థిరత, మౌలిక సదుపాయాల లేకపోవడం, అవినీతి వల్ల నిత్యం జనాలు హత్యలకు గురువుతుంటారు.

Most Read :చలితో అల్లాడిపోయే జనం ధనియాలను తీసుకుంటే ఏమైతుందో తెలుసా, ధనియాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు,కషాయం కూడాMost Read :చలితో అల్లాడిపోయే జనం ధనియాలను తీసుకుంటే ఏమైతుందో తెలుసా, ధనియాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు,కషాయం కూడా

13. ట్రినిడాడ్, టొబాగో, 28.3

13. ట్రినిడాడ్, టొబాగో, 28.3

కెనడా, అమెరికా తర్వాత బాగా ధనిదేశంగా ట్రినిడాడ్ టొబాగో పేరుగాంచింది. మంచి ఆదాయం కలిగిన దేశం ఇది. ఇది కూడ కరేబియన్ దేశం. అయితే ఇక్కడ కూడా ఎక్కువగా హత్యలు జరుగుతుంటాయి. ప్రతి 100,000 మందిలో 28 మంది ఇక్కడ హత్యకు గురవుతూనే ఉన్నారు.

12. ది బహామాస్, 29.8

12. ది బహామాస్, 29.8

ఇది మాజీ బ్రిటీష్ క్రౌన్ కాలనీ. బహామాస్ అట్లాంటిక్ మహాసముద్రంలో 700 కి పైగా ద్వీపాలను కలిగి ఉన్న ఒక ద్వీప దేశం. పర్యాటక రంగానికి పేరుగాంచింది ఆర్థికంగా బాగానే ఎదిగిన దేశం. 2013 లో ఇక్కడ 120 మంది హత్యకు గురయ్యారు. ఆ తర్వాత అది మరింత పెరిగింది.

11. కొలంబియా, 30.8

11. కొలంబియా, 30.8

దక్షిణ అమెరికా వాయువ్యంలో కొలంబియా ఉంది. ఇది కూడా డ్రగ్స్ ఉత్పత్తికి పేరుగాంచింది. ఇక్కడ అసమానత ఎక్కువగా ఉంది. స్పానిష్ సంతతికి చెందిన గొప్ప కుటుంబాలకు చెందిన వారు, పేద కొలంబియన్ల మధ్య నిత్యం గొడవలు ఏర్పడుతూనే ఉంటాయి.

అనేకమంది స్థానికులు హత్యలు, కిడ్నాపులు, దోపిడీలు, తీవ్రమైన దాడులు చేస్తూనే ఉంటారు.

10. దక్షిణ ఆఫ్రికా, 31

10. దక్షిణ ఆఫ్రికా, 31

దక్షిణాఫ్రికాను "ది రెయిన్బో నేషన్" అని కూడా అంటారు. ఇక్కడ దాదాపు 54 మిలియన్ల మందికి పైగా జనాలున్నారు. హత్యలు, దాడులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక నేరాలు ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటాయి.

స్థానిక పోలీసులు చెప్పిన గణాంకాల ప్రకారం దక్షిణాఫ్రికాలో దాదాపు 50 మంది ప్రజలు ప్రతిరోజు హత్యకు గురవుతున్నారు. అయితే హత్యల శాతం ఇక్కడ క్రమంగా తగ్గుతోంది.

Most Read :అక్కడ దురద ఉంటే ఇలా చేయండి, పచ్చ కర్పూరంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు, ఆ కోరికలు కూడా పెరుగుతాయిMost Read :అక్కడ దురద ఉంటే ఇలా చేయండి, పచ్చ కర్పూరంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు, ఆ కోరికలు కూడా పెరుగుతాయి

9. సెయింట్ కిట్స్, నెవిస్, 33.6

9. సెయింట్ కిట్స్, నెవిస్, 33.6

ఇది వెస్ట్ ఇండీస్ లో ఉంటుంది. ఈ చిన్న దేశంలో 50,000 మంది ప్రజలుంటారు. ఇక్కడ కూడా హత్యల శాతం ఎక్కువే. 100,000 మందికి సగటున 33.6 శాతం మంది హత్యకు గురవుతున్నారు. హత్యల్లో ఇది 9 వ స్థానంలో ఉంది.

8. స్వాజిలాండ్, 33.8

8. స్వాజిలాండ్, 33.8

దక్షిణాఫ్రికా చుట్టుపక్కల ఉండే స్వాజిలాండ్ లో 1 మిలియన్ జనాభా ఉంటుంది. ఇది కూడా ఆఫ్రికాలోని అతి చిన్న దేశాల్లో ఒకటి. ఇక్కడ హత్యలతో పాటు పేదరికం కూడా ఎక్కువే. ఎయిడ్స్, క్షయవ్యాధి వంటి వ్యాధుల వల్ల కూడా ఇక్కడ జనాలు చనిపోతూ ఉంంటారు. ఇక్కడి ప్రజల జీవిత కాంల కేవలం 50 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.

7. లెసోతో, 38

7. లెసోతో, 38

లెసోతో ఒక చిన్న ఆఫ్రికన్ దేశం. ఇక్కడ కూడా హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ దేశ జనాభాలో దాదాపు సగం మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. దాంతో ఇక్కడ ఎక్కువగా హత్యలు జరుగుతుంటాయి. పట్టించుకునేవాళ్లు కూడా ఎవరూ ఉండరు.

6. జమైకా, 39.3

6. జమైకా, 39.3

జమైకాలో 11,000 చదరపు కిలోమీటర్ల (4,250 చదరపు మైళ్ళ) లో విస్తరించి ఉంది. డ్రగ్స్ సరఫరాకు ఇది కేరాఫ్ అడ్రస్ గా ఉంది. ఇక్కడ కూడా హత్యలు నిత్యం జరుగుతూ ఉంటాయి. దీని రాజధాని అయిన కింగ్స్టన్ వంటి పెద్ద నగరాల్లో చాలా మంది హత్యలకు గురవుతుంటారు.

5. గ్వాటెమాల, 39.9

5. గ్వాటెమాల, 39.9

గ్వాటెమాలలో దాదాపు 16 మిలియన్ల జనాభా ఉంటుంది. ఇక్కడ నెలకు సగటున 100కి పైగా హత్యలు జరుగుతుంటాయి. గ్వాటెమాల ప్రపంచంలో హత్యల్లో ఐదో స్థానంలో ఉంది.

4. ఎల్ సాల్వడార్, 41.2

4. ఎల్ సాల్వడార్, 41.2

ఇక్కడ దీర్ఘకాలికంగా సివిల్ యుద్ధం జరిగింది. 1979 - 1992 వరకు ఇలాంటి పరిస్థితే ఇక్కడ ఉంది. ఇక్కడ 6.3 మిలియన్ల మంది నివాసం ఉంటున్నారు. ఇక్కడ జరిగే హత్యల్లో ఎక్కువగా దాదాపు 60% వరకు భూభాగం కోసం జరిగే హత్యలే.

Most Read :వీర్యం బాగా చిక్కగా అవ్వాలంటే ఇలా చేయండి, నల్లతుమ్మ గింజలతో లెక్కలేనన్నీ ప్రయోజనాలుMost Read :వీర్యం బాగా చిక్కగా అవ్వాలంటే ఇలా చేయండి, నల్లతుమ్మ గింజలతో లెక్కలేనన్నీ ప్రయోజనాలు

3. బెలిజ్, 44.7

3. బెలిజ్, 44.7

ఇది 22,800 చదరపు కిలోమీటర్ల (8,800 చదరపు మైళ్ళు) లో ఉంది. ఇక్కడ 340,000 మందికి పైగా జనాభా ఉన్నారు. ప్రతి 100,000 మందిలో 45 మంది ఇక్కడ హత్యకు గురవుతూనే ఉన్నారు. బెలిజ్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి.

2. వెనిజులా, 53.7

2. వెనిజులా, 53.7

దక్షిణ అమెరికా ఉత్తర తీరాన ఉన్న వెనిజులా ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఎగుమతిదేశాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ కూడా నిత్యం హత్యలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం 100,000 మందిలో 50 మంది హత్యకు గురవుతున్నారు.

Most Read :రాత్రి ఉలువ చారు తాగి చూడండి, ఉలువలతో చాలా బెనిఫిట్స్, లెక్కలేనంత ఆరోగ్యంMost Read :రాత్రి ఉలువ చారు తాగి చూడండి, ఉలువలతో చాలా బెనిఫిట్స్, లెక్కలేనంత ఆరోగ్యం

1. హోండురాస్, 90.4

1. హోండురాస్, 90.4

ఐక్యరాజ్యసమితి , డ్రగ్స్ అండ్ క్రైమ్ ఆఫీస్ హొండూరాస్ ప్రకారం దాదాపు 8.25 మిలియన్ల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ హత్యలశాతం ప్రపంచంలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ100,000 మందికి 90.4 శాతం మంది హత్యకు గురువుతున్నారు.

ఈ 25 దేశాల్లో చాలా వరకు డ్రగ్స్ కోసమే హత్యలు జరుగుతున్నాయి. వీటిలో బీచ్ లుండే కొన్ని దేశాల్లో సెక్స్ కోసం హత్యలు చేస్తున్నారు. అందువల్ల ఎప్పుడైనా మీరు ఈ దేశాలకు వెళ్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి.

English summary

These 25 Countries Have The World's Highest Murder Rates

These 25 Countries Have The World's Highest Murder Rates
Desktop Bottom Promotion