For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2018 జూన్ 11 నుంచి జూన్ 17 వరకు రాశి ఫలాలు

|

2018 జూన్ 11 నుంచి జూన్ 17 వరకు రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభంలో రవి, బుధుడు ఉన్నారు. తులరాశిలలో వక్రి బృహస్పతి, ధనస్సురాశి వక్రి శని ఉన్నారు. మకరంలో కుజ, కేతువులుంటారు. ఇక కర్కాటకంలో శుక్ర రాహువులు ఉంటారు. మేష, వృషభ, మిధున, కర్కాటకంలో చంద్రుడు ఉంటారు.

మేషం

మేషం

మేషరాశి వారు వారు అనుకున్న పని సాధనకుశ్రమిస్తారు. వీరికి ఫ్రెండ్స్ ప్రోత్సాహం ఉంటుంది. మేషరాశి వారు సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. అయితే వీరికి కొన్ని పనులు విషయంలో సమస్యలు ఎదురవుతాయి. వీరు లక్ష్యానికి చేరువలో ఉన్నారు. అయితే మీ ప్రయత్నాల్లో లోపం లేకుండా చేసుకోండి. మీకుండే ఆర్థిక సమస్యలు తొలుగుతాయి.

మీరు ఏ విషయంలోనూ అలసత్వం ప్రదర్శించకూడదు. మీకు ఖర్చులు విపరీతంగా ఉండొచ్చు. ఇక మీకు సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. మీ భార్య సాయంతో మీకు ఒక సమస్య సానుకూలమవుతుంది. మీ బిజినెస్ లో లాభాలు వస్తాయి. మీకు ప్రయాణాలు కలిసి వస్తాయి.

వృషభం

వృషభం

మీరు చేపట్టబోయే పనులు మొత్తం సజావుగా సాగుతాయి. మీ ఇంట్లో ఉండే స్తబ్ధత తొలగిపోతుంది. మీరు పెళ్లి విషయంలో బాగా ప్రయత్నాలు చేపట్టే అవకాశం ఉంది. మీకు చాలా అవకాశాలు కలిసివస్తాయి. అయితే ఆదివారం, సోమవారం మీరు అనుకునే పనులు సాగవు. ఇక ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, ఒత్తిడి, పనిభారం ఉంటుంది. మీరు సహోద్యోగులతో కాస్త జాగ్రత్త ఉండండి. మీకు ధనయోగం ఉంది. కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.

మిథునం (మే 21- జూన్ 20)

మిథునం (మే 21- జూన్ 20)

మీరు చాలా విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. మీరు సలహాలు, సాయం ఆశించవద్దు. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. ఈ వారం మీకు బాగా కలిసొస్తుంది. మీ ఆలోచనల్ని ఆచరణలో పెడితే మంచి భవిష్యత్తు ఉంటుంది.

కర్కాటకం ( జూన్ 21 -జూలై 22)

కర్కాటకం ( జూన్ 21 -జూలై 22)

మీరు ఈ వారంలో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడుతారు. మీగృహం సందడిగా ఉంటుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు కాస్త పెరుగుతాయి. మీ ఆత్మీయులకు సాయం అందిస్తారు. మీరు మీ బాధ్యతలను గుర్తించి సకాలంలో నిర్ణయం తీసుకోండి. ఉత్సాహంగా కాలం ముందుకు సాగుతుంది.

సింహరాశి ( జూలై 23- ఆగస్టు23)

సింహరాశి ( జూలై 23- ఆగస్టు23)

మీరు ఈ వారంలో కొన్ని ఇబ్బందులను నుంచిబయటపడతారు. మీరు విమర్శలను పట్టించుకోవద్దు. మీరు పని చేసే ప్రాంతంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీరు వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి.

కన్యరాశి ( ఆగస్టు 24 సెప్టెంబర్ 23)

కన్యరాశి ( ఆగస్టు 24 సెప్టెంబర్ 23)

మీరు ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశం ఉంది.

మీరు ఏం పనిచేసినా మీ శక్తితోనే చేయండి. అయితే మీకు అవసరానికి ధనం అందుతుంది. మీరు కాస్త ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి.

తులరాశి ( సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

తులరాశి ( సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

మీరు ఆనందంగా ఉంటారు. కొన్ని విషయాల్లో ఒత్తిడి కలుగుతుంది. మీరు చేయబోయే పని గురించి ఎవరితోనూ చెప్పవద్దు.

మీరు మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఉద్యోగయత్నం నిరుత్సాహపరుస్తుంది. నష్టాలను అధిగమిస్తారు.

వృశ్చికం (అక్టోబర్ 24- నవంబర్ 22)

వృశ్చికం (అక్టోబర్ 24- నవంబర్ 22)

మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అంతా శుభమే జరుగుతుంది. అధికారుల సహకారం లభిస్తుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మీ చేతిలో ధనం నిలబడదు. రాబడిపై దృష్టి పెడతారు. మీకు కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం ఉంటుంది.

ధనస్సురాశి ( నవంబర్ 2- డిసెంబర్ 22)

ధనస్సురాశి ( నవంబర్ 2- డిసెంబర్ 22)

మీకు అదృష్టయోగం ఉంది. ఉద్యోగ వ్యవహారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. మీకు కాస్త అప్రమత్తంగా వ్యవహరించండి. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు.

మకరరాశి ( డిసెంబర్ 23- జనవరి 20)

మకరరాశి ( డిసెంబర్ 23- జనవరి 20)

ఈ వారం రోజులు మీరు పని చేసే చో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో మీకు కాస్త అప్రమత్తంగా ఉండండి. మీ అజాగ్రత్త వల్ల అపారమైన ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త వ్యతిరేక ఫలితాలున్నాయి. మీరు ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతాయి.అధికారుల తీరు బాధిస్తుంది. సహోద్యోగులతో జాగ్రత్త.

కుంభరాశి (జనవరి 21- ఫిబ్రవరి 18)

కుంభరాశి (జనవరి 21- ఫిబ్రవరి 18)

మీకు రావాలసిన ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీకు ఆర్థికంగా అద్భుతమైన కాలమిది. ఇప్పుడు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి20)

మీనం (ఫిబ్రవరి 19- మార్చి20)

అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తారు. అవసరానికి సహాయం లభిస్తుంది. సన్నిహితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు.

English summary

these are your weekly predictions for 11th june 17th june

these are your weekly predictions for 11th june 17th june
Story first published: Monday, June 11, 2018, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more