Latest Updates
-
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026 -
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఈ రాశుల వారు జీవితంలో డబ్బు విషయంలో హోదా విషయంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు.. నో డౌట్
జ్యోతిషశాస్త్రం చెప్పే అంశాలను పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే అందులోని అంశాలు మన జీవితంపై కచ్చితంగా ప్రభావం చూపుతూ ఉంటాయి.ఈ రాశుల వారు డబ్బు విషయంలో హోదా విషయంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు.
జ్యోతిషశాస్త్రం చెప్పే అంశాలను పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే అందులోని అంశాలు మన జీవితంపై కచ్చితంగా ప్రభావం చూపుతూ ఉంటాయి. ప్రతి మనిషి భవిష్యత్ అతని రాశిపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని రాశుల వారికి కష్టాలుంటాయి. కొన్ని రాశుల వారికి జీవితాంతం అదృష్టాలే ఉంటాయి. కొన్ని రాశుల వారికి కష్టపడే తత్వం ఉంటుంది...అందుకే వారు ఎప్పటికైనా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. అది డబ్బు విషయంలోనైనా కావొచ్చు లేదంటే హోదా విషయంలోనైనా కావొచ్చు. అలాంటి కొన్ని రాశుల గురించి మీరు తెలుసుకోండి.

కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)
కన్యరాశి భూమికి సంబంధించిన రాశి. ఈ రాశికి చెందిన వారు ఎప్పుడూ అదృష్టవంతులుగానే ఉంటారు. వీరికి బాగా కష్టపడేతత్వం కూడా ఉంటుంది. కన్యరాశికి చెందిన వారు లక్ష్యాలను అధిగమించడానికి నిరంతరం శ్రమిస్తుంటారు. అయితే వీరు ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉండాలి. కన్యరాశి వారు పొగడ్తలకు పొంగిపోరు. విజయం సాధించామని విర్రవీగరు.

కన్యరాశి
వీరు తాము చేయబోయే పనులపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. అందుకు వీరికి అన్నిపనుల్లో విజయాలు చేకూరుతాయి. కన్యరాశి వారు అన్ని విషయాల్లో నియమాలు కలిగి ఉంటారు. వీరు అన్ని విషయాల్లో బెస్ట్ అనిపించుకోవాలని పరితపిస్తుంటారు. ఈ లక్షణాలన్నీ కన్యరాశికి ఉండడం వల్ల వారు జీవితంలో సంపన్నులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కన్యరాశి వారు వారు చేసే పనులపైనే మనస్సు నిమగ్నం చేస్తే కచ్చితంగా ఏదో ఒక రోజు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఇందులో నో డౌట్.

వృశ్చికం (అక్టోబరు 23 - నవంబర్ 21)
వృశ్చిక రాశి నీటికి సంబంధించిన రాశి. వీరు ఎక్కువగా వారి శక్తినే నమ్ముకుని బతుకుతుంటారు. వీరు సహజంగానే మంచి శక్తి సామర్థ్యాలుంటాయి. వీరు వాస్తవంలోనే బతుకుంటారు. ఊహాల్లో విహరించే నైజం వీరిది కాదు. వీరు చెప్పే మాటలకు సమాజంలో మంచి విలువ ఉంటుంది. జనాలను తమ మాటలతో తమ వైపు తిప్పుకునే శక్తి వీరికి ఉంటుంది. వీరి మాటకుంటే పవర్ అలాంటిది మరి.

వృశ్చికరాశి
అయితే వీరు తాము చేయలేని పనుల్ని అంగీకరించగలగాలి. ఓటమికి తామే కారణం అని చెప్పుకునే ధైర్యం కూడా వీరికి ఉండాలి. ఇలా చేస్తేనే వృశ్చికరాశి వారు ఎక్కడైనా మనుగడ సాధించగలరు. అలాంటి గుణం కూడా చాలా గొప్పదే కదా మరి. అయితే జీవితంలో ఎప్పటికైనా వృశ్చికరాశి వారు గొప్ప స్థాయికి వెళ్తారు.

సింహరాశి (జులై 23- ఆగస్టు 22)
సింహరాశి అగ్నికి సంబంధించిన రాశి. సింహరాశి వారు స్వతహాగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి ధైర్యం కూడా ఎక్కువే ఉంటుంది. ఇదే వారికి ఎక్కువగా విజయాలు చేకూరడానికి తోడ్పడుతుంది.

సింహరాశి
వీరు తమ శక్తి సామర్థ్యాలనే ఎక్కువగా నమ్ముతారు. సింహరాశి వారు వారి సామర్ధ్యాలపై ఎక్కువగా విశ్వాసం కలిగి ఉంటారు. సింహరాశి వారు విలువలను పాటిస్తారు. నిజాయితీగా ఉంటారు. సింహరాశి వారు ఏ విషయంలో అంత త్వరగా రాజీపడరు. వీరు అందరి మదిలో గౌరవాన్ని సంపాదించుకుంటారు. అందుకే సింహరాశి వారు కూడా ఏదో ఒక రోజు మంచి స్థాయికి ఎదుగుతారు.

వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
వృషభ రాశి భూమికి సంబంధించిన రాశి. వృషభ రాశి వారు విశ్వసనీయతకు ప్రతీకగా ఉంటారు. వృషభ రాశి వారు మంచి హార్డ్ వర్కర్క్. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. అందుకే అందరూ వీరిని విశ్వసించి అన్ని విషయాలు చెబుతుంటారు. వీరితో సన్నిహితులంతా తమ సీక్రెట్స్ కూడా చెప్పుకుంటూ ఉంటారు.

వృషభరాశి
అలాగే వీరు డబ్బు సంపాదన విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తుంటారు. డబ్బును దాచి పెట్టడంలోనూ వీరు మంచి ఉపాయాలు పాటిస్తుంటారు. అయితే సంపాదించిన డబ్బును మొత్తం ఎక్కువగా విలాసంగా జీవించడానికే వెచ్చిస్తుంటారు. ఖరీదైన కార్లలో తిరగాలని విలాసవంతమైన భవనాల్లో ఉండాలని వీరు ఎక్కువగా భావిస్తుంటారు. వృషభ రాశి మాత్రం జీవితంలో కచ్చితంగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు.

కర్కాటక రాశి (జూన్ 21 - జూలై 22)
కర్కాటక రాశి నీటికి సంబంధించినది. వీరు చాలా తెలివైనవారు. వీరికి మంచి సృజనాత్మక ఆలోచనలుంటాయి. కళాత్మకంగా ఉంటారు. అయితే వాస్తవంలోనే బతుకుంటారు. ఊహాల్లో విహరించరు. వీరికి జాలి గుణం ఎక్కువ. వీరు ఎక్కువగా స్వశక్తినే నమ్ముకుంటారు. వీరికి ఇతరుల ఎదుగుదల చూస్తే కాస్త అసూయ ఉంటుంది. అలా అని వీరు చెడ్డవారు కాదు. ఇతరులతో పోటీ పడి వారికి దీటుగా ఎదగాలని అనునిత్యం పరితపిస్తుంటారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా తాము ఓడిపోకూడదని, వెనకబడకూడదని భావిస్తుంటారు. వీరు ప్రతి ఒక్కరితో ఈజీగా కలిసి పోతారు. వీరు పని చేసే ప్రాంతంలో కూడా అందరితో కలగోలుగలుపుగా ఉంటారు. అందుకే కర్కాటక రాశి కూడా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఇలా ఈ రాశుల వారంతా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు.



Click it and Unblock the Notifications