ఇంట్లో అశాంతి ఉందా.. ప్రశాంతత లేదా? అయితే ఇలా చేయండి

Written By:
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతికూల సమస్యలతో, ఇంట్లో అశాంతితో ఇబ్బందులుపడుతుంటారు. ఇంట్లోకి అనుకూల శక్తి ప్రవేశించి మీ కష్టాలు మొత్తం తీరాలంటే మీరు కొన్ని రకాల సూచలనలు పాటించాలి. ఇవి పాటిస్తే కచ్చితంగా మీ ఇంట్లో దుష్టశక్తులు మొత్తం వెళ్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు అంతా మంచే జరుగుతుంది.

కష్టాల్లో కూరుకుపోతుంటారు

కష్టాల్లో కూరుకుపోతుంటారు

చాలామంది నిత్యం ఇబ్బందులతో ఆర్థికంగా, మాన‌సికంగా కుంగిపోతుంటారు. వాటి నుంచి ఎంత బ‌యట ప‌డ‌దామ‌న్నా వీల‌వుతూ ఉండదు. రోజురోజుకు కష్టాల్లో కూరుకుపోతుంటారు. దీనికి కారణం మీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ. అది మిమ్మల్ని నిత్యం ఇబ్బందుల పాలుజేస్తుంది. మీ ఇంట్లో ఉండే ఆ నెగెటివ్ ఎనర్జీని ఎలా పోగొట్టుకోవాలో ఒకసారి చూడండి.

వేప ఆకులు

వేప ఆకులు

వేప ఆకులు ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని మొత్తం పోగొడుతాయి. సైన్స్ ప్రకారం కూడా వేపలో యాంటీ బ‌యోటిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపడానికి బాగా తోడ్పడుతాయి. వేప ఆకుల‌ను ఇంట్లో పెట్టడం లేదా వేప ఆకులను ఇంట్లో మండించ‌డం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది.

అగ‌ర్‌బ‌త్తీలు

అగ‌ర్‌బ‌త్తీలు

హిందువులు ఎవ‌రైనా దేవుడికి పూజ చేసిన‌ప్పుడు మాత్ర‌మే అగ‌ర్ బ‌త్తీల‌ను వెలిగిస్తారు. అయితే అగ‌ర్ బ‌త్తీల‌ను మామూలు స‌మ‌యంలో కూడా వెలిగించ‌వ‌చ్చు. దాంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ మాయ‌మ‌వుతుంది. అయితే అగ‌ర్‌బ‌త్తీల‌ను ఎప్పుడు వెలిగించినా ఎక్కువ సంఖ్య‌లో వాటిని వెలిగించడం చాలా మంచిది.

ఫ‌ర్నిచ‌ర్

ఫ‌ర్నిచ‌ర్

కుర్చీలు, టేబుల్స్‌, సోఫాలు, మంచాలు... ఇలా ఇంట్లో ఉన్న ఫ‌ర్నిచ‌ర్‌ను అప్పుడప్పుడు తీసి వేరే దిశ‌లో పెట్టి మళ్లీ య‌థావిధిగా అమ‌ర్చుకోవాలి. దీంతో నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దీన్ని గురించి ఫెంగ్ షుయ్ వాస్తులో వివ‌రించారు.

ఉప్పు

ఉప్పు

రెండు చిన్న‌పాటి గిన్నెల‌ను తీసుకుని వాటిలో కొంత ఉప్పు వేయాలి. అనంత‌రం ఆ రెండు గిన్నెల‌ను ఇంట్లో ఈశాన్య‌, నైరుతి దిశ‌ల్లో ఉంచాలి. ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ మాయ‌మ‌వుతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.

కిటీకీలు తెరవాలి

కిటీకీలు తెరవాలి

కిటికీల‌ను ఎల్ల‌ప్పుడూ తెర‌చి ఉంచాలి. వాటి వ‌ద్ద కుండీల్లో ఏవైనా మొక్క‌ల‌ను ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ బ‌య‌టికి వెళ్లి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దాంతో ఇంట్లోని అంద‌రికీ మంచే జ‌రుగుతుంది.

క‌ర్పూరం, ల‌వంగాలు

క‌ర్పూరం, ల‌వంగాలు

ఉద‌యం, సాయంత్రం వేళ్ల‌లో కొద్దిగా క‌ర్పూరం తీసుకుని వెలిగించి దాంట్లో కొన్ని ల‌వంగాల‌ను కూడా వేయాలి. ఇలా రెండింటినీ మండించ‌డం వ‌ల్ల ఇంట్లో ఉన్న వాస్తుదోషం పోతుంది. అంద‌రికీ అదృష్టం క‌ల‌సివ‌స్తుంది. ఆర్థిక సమ‌స్య‌లు ఉంటే పోతాయి.

ప‌సుపు ఆవాలు, గుగ్గుళ్లు

ప‌సుపు ఆవాలు, గుగ్గుళ్లు

న‌లుపు రంగువి కాక‌, పసుపు రంగులో ఉండే ఆవాలు, గుగ్గుళ్ల‌ను క‌లిపి ఇంట్లో రోజూ మండిస్తున్న‌ట్ట‌యితే నెగెటివ్ ఎన‌ర్జీ మాయ‌మ‌వుతుంది.

గుగ్గుల్ ఇన్‌సెన్స్ స్టిక్స్

గుగ్గుల్ ఇన్‌సెన్స్ స్టిక్స్

వారానికి ఓ సారి ఇంట్లో గుగ్గుల్ ఇన్‌సెన్స్ స్టిక్స్‌ను మండించాలి. దీని వ‌ల్ల ఇంట్లోని వారి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. శారీర‌క ఆరోగ్యం, మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతాయి. నెగెటివ్ ఎన‌ర్జీ తొల‌గిపోతుంది.

ఇవి దానం చేయండి

ఇవి దానం చేయండి

మీ ఇంట్లో ఎవరైనా మాట్లాడే సమయంలో నత్తినత్తిగా మాట్లాడుతున్నా, ఇంట్లో భయపడుతూ, బయట ధైర్యంగా ఉన్నా, పడుకున్న సమయంలో ఎక్కువగా మాట్లాడుతున్నా మీరు కారం అటుకులను తాంబూలంలో ఉంచి దానం చేస్తే చాలా మంచిది. అలాగే అటుకులను ఊరగాయరసంలో కలిపి మీరు పూజను చేసిన తర్వాత దానం చేస్తే మీకు ఉన్న రక్తపోటు, కోపం త్వరగా తగ్గిపోతాయి.

గ్లాస్ లో ఉప్పు వెనిగర్

గ్లాస్ లో ఉప్పు వెనిగర్

పారదర్శకంగా ఉన్న గాజు గ్లాసును తీసుకుని అందులో 1/3 వంతు గడ్డ ఉప్పు వేయాలి. మరో 2/3 భాగంలో వెనిగర్ వేసి, మిగతా ఖాళీలో స్వచ్ఛమైన నీరు పోయాలి. ఏ ప్రదేశంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఉందని భావిస్తున్నారో ఆ మూలలోనే ఈ గ్లాసును పెట్టి 24 గంటలు పాటు కదపకుండా ఉంచాలి.

ఇవి ఉండకూడదు

ఇవి ఉండకూడదు

పగిలిపోయిన దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఇంట్లో ఉండకూడదట. అలా ఉంటే మనకు మంచి జరగదు. కనుక వాటిని వెంటనే తీసేయడం మంచిది. విరిగిన ఇంటి తలుపులు, పెయింట్ ఊడిపోయిన తలుపులు, గోడలు వంటివి ఉండడం మంచిది కాదు.

వాటిని తీసేయండి

వాటిని తీసేయండి

మీ ఇంట్లో పనిచేయని పాత గడియాలు ..గోడకు పెట్టేవి, చేతికి పెట్టుకునేవి ఏవైనా సరే ఉన్నాయా..? పగిలిపోయిన వాచ్లు కూడా ఉన్నాయా..? అయితే వెంటనే వాటిని తీసేయండి ఎందుకంటే అవి ఇంట్లో ఉంటే అంతా నెగెటివ్ ఎనర్జీయే నిండిపోతుంది. కనుక వెంటనే వాటిని తీసేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

English summary

things that create negative energy at home

things that create negative energy at home
Story first published: Wednesday, January 17, 2018, 12:17 [IST]
Subscribe Newsletter