Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆనందమయ జీవితానికి ఆచరణీయ నియమాలు?
ఆనందమయ జీవితానికి ఆచరణీయ నియమాలు?
సంతోషమయ జీవితానికి, చుట్టుపక్కల పరిసరాలు, మన అనుకుని మనతో నడిచే వ్యక్తులు, కుటుంబ సభ్యులు, ప్రేమ, స్నేహం, పిల్లలు, అభిరుచులు, ఆటపాటలు ఇటువంటివన్నీ ప్రధాన అంశాలుగా ఉన్నా కూడా, ప్రాపంచిక విషయాల పట్ల మోజుతో అవసరం లేని వస్తువులపై ప్రేమలను పెంచుకుంటూ , పాశ్చాత్య పోకడలకు ఆకర్షితులవుతూ, కృష్ణ బిలాలలో వెలుతురుని వెతుక్కుంటున్న చందాన, దొరకని సంతోషం కోసం అర్రులు చాస్తున్నాడు మనిషి. ఒక్కసారి అబద్దం నుండి తేరుకుని నిజంలోకి వస్తే, ఏం కోల్పోయారో, ఏం కోల్పోతున్నారో మనసుకు స్పురిస్తుంది.
ఇక్కడ, ఈ వ్యాసంలో, సంతోషకర జీవితానికి అనుసరించవలసిన కొన్ని నియమాలను పంచుకోబోతున్నాము.
ఈ చిట్కాలు మీకు ఎంతో ఉపయోకరంగా ఉండడంతో పాటు, మంచి సత్ఫలితాలను కూడా ఇవ్వగలవు.
ప్రశాంతమైన, విజయవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా?

ముందు మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి.
ఆరోగ్యంగా ఉండటం అనేది మీరు సంతోషంగా ఉండటానికి అనుసరించవలసిన ప్రాథమిక విషయాలలో మొదటిది. మీరు ఆరోగ్యంగా ఉంటే, మిగిలిన అన్ని సానుకూల విషయాల గురించి ఆలోచించగలుగుతారు. మీ మొత్తం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలిగే తప్పుడు ఆహార ప్రణాళికలకు స్వస్థి పలకండి.

అతిగా ఆలోచించకండి:
మీరు మీ మనస్సును కొంత విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది, క్రమంగా మీరు జీవితంలో ఉన్న అనుకూల విషయాలపై దృష్టిసారించగలుగుతారు. ఆలోచనలు అధిక ఒత్తిడిని కలిగి ఉండటం చేత, మానసిక ప్రశాంతత దరిదాపుల్లో కూడా ఉండదు. కావున ముందు ఒత్తిళ్లను ఆందోళనలను దూరం చేయండి.

ప్రతిరోజు మీ విజయాలను నోట్స్ రాసుకోండి/ లేదా మీకు నచ్చిన విధంగా రికార్డ్ చేయండి:
మానవులు తమకు సంతోషాన్ని కలిగించే చిన్న చిన్న విషయాలను మర్చిపోతూ, పెద్ద పెద్ద ప్రతికూల ప్రభావిత అంశాలపై దృష్టిని సారిస్తూ సంతోషం అనే మాటకే దూరంగా బ్రతుకుతూ కాలం వెళ్ళదీస్తుంటారు. భాధలు భాధలనే మిగులుస్తాయి, కావున మీ సంతోషాలను రికార్డ్ చేసుకుని అప్పుడప్పుడు చూస్తుండండి. ఫలితం మీకే తెలుస్తుంది.

కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి, వారిని మర్చిపోవద్దు ఎన్నటికీ:
జీవితంలో విజయం సాధించినందుకు మీకు సహాయం చేసిన వ్యక్తులకు మీరు కృతజ్ఞులై ఉండాలి. ఒక్కోసారి చిన్న సహాయం కూడా పెద్ద లాభాలను తీసుకుని రావొచ్చు. సహాయంలో తక్కువ, ఎక్కువ అని తేడాలు చూడడం ఎన్నటికీ మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీ వలన మీకు సహాయం చేసినవారు భాదపడకూడదని నిర్ధారించుకోండి.

ఒక ప్రణాళిక కలిగి ఉండాలి :
సంతోషకర జీవితానికి సరైన ప్రణాళిక కలిగి ఉండవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రియమైన వారితో సమయం కేటాయించేలా ప్రణాళికలు చేసుకోండి. ఎక్కడికైనా ట్రిప్స్ వేసుకోవడం, ఇంటి పనులు, తోట పనులు వంటి ఆహ్లాదాన్ని కలిగించే పనులను ఎన్నుకుని చేయడం. సరైన ఆహార ప్రణాళిక పాటించడం, మంచి ఆరోగ్యం మరియు వ్యాయామం పట్ల ప్రణాళికలు కలిగి ఉండడం మొదలైనవి మీకు ఎంతగానో సహాయం చేయగలవు.

“లాస్ట్ బట్ నాట్ లీస్ట్” చిరునవ్వు వీడకండి:
మీ పట్ల ఇతరులు సాన్నిహిత్యాన్ని కలిగి ఉండాలంటే, మీ పెదాలపై చిరునవ్వు ఉండాలని మరువకండి. చిన్న చిన్న విషయాలైనా స్పందించడం అలవాటు చేసుకోండి. ముభావంగా ఉండే అలవాట్లు సంతోషాన్ని ఇవ్వకపోగా, ప్రియమైన వారిని సైతం దూరం చేయగలవు. కొందరికి ఇతరులతో పోలికలు వేసుకునే అలవాట్లు ఉంటాయి. ఈ అలవాటు ఎన్నటికీ మంచి పద్దతి కాదు, మరియు దురాశలను పెంచుతుంది. ఉన్నదాంతో సంతృప్తి చెందే అలవాటు అన్నిటా మీకు మానసిక సంతోషాన్ని ఇవ్వగలదు.

సంతోషంగా ఉండే క్రమంలో మీ ఆలోచనలేమిటి? క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి , ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications