For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

32 కిలోమీటర్లు నడిచాడు, సీఈఓ మెచ్చాడు, ప్రపంచం ప్రశంసించింది, కారునే గిఫ్ట్ గా కొట్టాడు

మొదటి రోజు తన డ్యూటీకి ఎట్టి పరిస్థితుల్లో లేట్ గా వెళ్లకూడదనుకున్నాడు. అయితే కస్టమర్ జెన్నీ లేమి హౌస్ వాల్టర్ ఇంటికి 32 కీమీ దూరంలో ఉంది. ఆ మార్గంలో ఉదయం సమయంలో క్యాబ్స్ అంతగా అందుబాటులో లేవు.

|

మనం చేసే పనిపైన మనకు చిత్తశుద్ధి ఉంటే మనం దాన్ని ఎంతో గౌరవిస్తాం. ఆ పని చేసేందుకు ఎన్ని కష్టాలైనా వెనుకాడం. చావైనా బతుకైనా నేను నమ్ముకున్నా పనే నన్ను కాపాడుతుంది అని అనుకున్నప్పుడు నిన్ను ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఏం చెయ్యలేడు. మనం ఏ పని చేస్తున్నా సరే, అది మనకు అన్నం పెడుతుంది కాబట్టి దానిపై మనకు నిబద్దత ఉండాలి. అలా ఉంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వెనుతిరగం.

ఒక యూఎస్ యువకుడు ఇందుకు నిదర్శనంగా నిలిచాడు. అందరి మనసులను దోచాడు. కారు గిఫ్ట్ గా పొందాడు. అది అతని ఫస్ట్ జాబ్. అతను కరెక్ట్ టైమ్ కు ఆఫీస్ కు వెళ్లాలనుకున్నాడు. కానీ వెళ్లేందుకు ఎలాంటి వెహికిల్ లేదు. సరే దేవుడిచ్చిన కాళ్లు ఉన్నాయి కదా అని నడుచుకుంటూ బయల్దేరాడు. ఎలా అయినా సరే ఇన్ టైమ్ లో అక్కడ ఉండాలని భావించాడు. అలా నడిచిన అతను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సామాజికి మాధ్యమాల్లో వైరల్ గా నిలిచాడు.

నేవిలో చేరాలని ఉంది

నేవిలో చేరాలని ఉంది

అతని పేరు వాల్టర్‌ కార్. యూఎస్ లోని అలబామా స్టేట్

బిర్మింఘమ్‌ లో ఉంటాడు. వాల్టర్ కు నేవిలో చేరాలని బాగా కోరిక ఉంది. అందుకోసమే ఇప్పటికీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వాల్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఎందుకుండాలని ఒక కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాడు.

ఫస్ట్ టైమ్ జాబ్ కు వెళ్తున్నందున

బెల్ హాప్స్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది వాల్టర్ కి. ఒకవైపు నేవీలో జాబ్ కోసం ప్రిపేర్ అవుతూనే మరోవైపు ప్రైవేట్ జాబ్ కూడా చేయాలని భావించాడు వాల్టర్. తాను ఫస్ట్ టైమ్ జాబ్ కు వెళ్తున్నందున చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. అతను జాబ్ లో చేరాల్సిన రోజుకు ముందే అతని కారు రిపేరీకి వచ్చింది. దాన్ని బాగు చేయించాలంటే డబ్బులు కూడా బాగానే కావాలి. అయినా కూడా అంత త్వరగా దాన్ని బాగు చేయమని మెకానిక్స్ చెప్పారు. కాస్త టైమ్ కావాలి అన్నారు.

ప్రత్యామ్నాయంగా మరో కారు కోసం వెతికాడు. కానీ దొరకలేదు. అయితే వాల్టర్ జాయిన్ అయ్యింది ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ కంపెనీలో. దీంతో మొదటి రోజు అతనికి ఒక పని అప్పగించారు. డైరెక్ట్ గా నువ్వు కస్టమర్ ఇంటికి వెళ్లి అక్కడ అతని సామాగ్రిని మొత్తం ప్యాక్ చేసి వెహికిల్ ద్వారా షిప్ట్ చేయాలని వాల్టర్ కు పని అప్పగించారు.

లేట్ గా వెళ్లకూడదనుకున్నాడు

మొదటి రోజు తన డ్యూటీకి ఎట్టి పరిస్థితుల్లో లేట్ గా వెళ్లకూడదనుకున్నాడు. అయితే కస్టమర్ జెన్నీ లేమి హౌస్ వాల్టర్ ఇంటికి 32 కీమీ దూరంలో ఉంది.

ఆ మార్గంలో ఉదయం సమయంలో క్యాబ్స్ అంతగా అందుబాటులో లేవు. ఫ్రెండ్స్ ను కారు అడిగితే ఎవ్వరూ ఇవ్వలేదు. అందరూ తమకు పని ఉందని చెప్పారు.

సరే ఏదైతే అది అయ్యింది అనుకుని రాత్రి మెలకువ రాగానే రెడీ అయి కస్టమర్ ఇంటికి నడుచుకుంటూ బయల్దేరాడు. ఉదయం ఎనిమిది గంటలకల్లా అక్కడ ఉండాలని డిసైడ్ అయి బయల్దేరాడు. అలా నడుచుకంటూ వెళ్తుంటే చాలా అలసట వచ్చింది. అయినా ఎక్కడ కూడా వెనుదిరగలేదు.

పోలీస్ ఆశ్చర్యపోయాడు

అయితే కొద్ది సేపట్లో కస్టమర్ ఇంటికి చేరుకునే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ వాల్టర్ ని చూశాడు. నేను చాలా సేపటి నుంచి గమనిస్తున్నాను నిన్ను అని ఎంక్వైరీ చేశాడు. వాల్టర్ తన స్టోరీ మొత్తం చెప్పాడు. పోలీస్ ఆశ్చర్యపోయాడు. వాల్టర్ కు బ్రేక్ ఫాస్ట్ తెప్పించాడు పోలీస్. తర్వాత తన వాహనంలో వాల్టర్ ను కస్టమర్ ఇంటి దగ్గర దింపాడు.

అసలు విషయం తెలిసి కస్టమర్ జెన్నీ లేమి కూడా ఆశ్యర్యపోయింది. ఒక ఉద్యోగి ఇంత నిబద్దతతో పని చేశాడని జెన్నీ ఫేస్ బుక్ లో ఈ సంఘటనన గురించి మొత్తం పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో వాల్టర్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇప్పుడు అంతటా అతని గురించే చర్చ సాగుతోంది.

కారును గిఫ్ట్ గా ఇచ్చాడు

అంతేకాదు వాల్టర్‌ కోసం సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు 75 వేల డాలర్లను సేకరించి అతనికి ఇచ్చారు. ఇక బెల్ హాప్స్ సీఈఓకు ఈ విషయం తెలిసి వాల్టర్ ను మెచ్చుకున్నాడు. పని పట్ల అంత నిబద్దత ఉన్నందుకు వాల్టర్ ని ప్రశంసించి అతనికి ఒక కారును గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు. సీఈఓ అతని 2014 మోడల్ ఫోర్డ్ ఎస్కేప్ కారును బహుమతిగా ఇచ్చాడు.

English summary

this college student walter carr was walking 32km to work impressed boss gifts him car

this college student walter carr was walking 32km to work impressed boss gifts him car
Desktop Bottom Promotion