అరచేతిలోని త్రిభుజాలు సూచించే విషయాలేంటి?

Subscribe to Boldsky

అరచేతుల్లోని రేఖలు ఎన్నో విషయాలను సూచిస్తాయి. ఒక్కోక్క రేఖ ఒక్కొక్క విషయాన్ని స్పష్టం చేస్తుంది. అటువంటి ఒక ఆసక్తికర విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరచేతుల్లో ఏర్పడే కొన్ని త్రిభుజాలు కొన్ని విషయాలను వెల్లడిస్తాయి.

అరచేతుల్లోని త్రిభుజాలనేవి కొన్ని స్పష్టంగా ఉంటాయి. ఇవి శుభపరిణామాలు సూచిస్తాయి.

అరచేతుల్లోని వివిధ ప్రాంతాలలో ఉండే ఈ త్రిభుజాలు వివిధ ప్రభావాలను చూపిస్తాయి. ఈ త్రిభుజాల గురించి అరచేతులతో అవి ఏర్పడిన ప్రాంతం గురించి గమనించడం ఆసక్తికరమైన విషయం.

అరచేతులను చూసి ఒక వ్యక్తి గురించి అంచనాకు రావడమెలా?

అరచేతులలోని వివిధ ప్రాంతాలలో ఏర్పడే త్రిభుజాలు ఏ విషయాలను సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మౌంట్ ఆఫ్ వీనస్ వద్ద పెద్ద త్రిభుజం:

మౌంట్ ఆఫ్ వీనస్ వద్ద పెద్ద త్రిభుజం:

పెద్ద త్రిభుజమనేది విశాల హృదయాన్ని సూచిస్తుంది. మౌంట్ ఆఫ్ వీనస్ వద్ద ఏర్పడే పెద్ద త్రిభుజమనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఆ వ్యక్తి సెంటిమెంటల్ నేచర్ కలిగిన వాడని సూచిస్తుంది. అత్యున్నత భావాలు కలిగిన వ్యక్తి అని ఈ త్రిభుజం సూచిస్తుంది. అలాగే, అరచేతులోని ఈ ప్రాంతం వద్ద త్రిభుజం విచ్చిన్నం అయినట్టుగా సరిగ్గా ఏర్పడకుండా ఉన్నట్టయితే ఆ వ్యక్తి ప్రవర్తన సరిగ్గా ఉండదని అర్థం.

మౌంట్ ఆఫ్ మార్స్ వద్ద త్రిభుజం:

మౌంట్ ఆఫ్ మార్స్ వద్ద త్రిభుజం:

మౌంట్ ఆఫ్ మార్స్ వద్ద త్రిభుజం ఉన్నట్టయితే ఆ వ్యక్తి గొప్ప యోధుడు అవుతాడు. తాను సాధించాలన్న అంశాలకు తగినట్టుగా ధైర్యాన్ని అలాగే సహనాన్ని ప్రదర్శిస్తాడు. మరోవైపు, ఈ త్రిభుజం సరిగ్గా లేనట్లయితే ఆ వ్యక్తి పిరికిపందగా మిగులుతాడు.

మౌంట్ ఆఫ్ జూపిటర్ వద్ద త్రిభుజం:

మౌంట్ ఆఫ్ జూపిటర్ వద్ద త్రిభుజం:

మౌంట్ ఆఫ్ జూపిటర్ వద్ద త్రిభుజం ఏర్పడితే ఆ వ్యక్తి డిప్లమాటిక్ గా ప్రవర్తిస్తాడు. తన ఎదుగుదల గురించే ఆలోచిస్తాడు. మరోవైపు ఈ త్రిభుజం సరిగ్గా లేనట్లయితే ఆ వ్యక్తి గర్విష్టిగా అలాగే స్వార్థపరుడుగా మిగులుతాడు.

మౌంట్ ఆఫ్ సాటర్న్ వద్ద త్రిభుజం:

మౌంట్ ఆఫ్ సాటర్న్ వద్ద త్రిభుజం:

మౌంట్ ఆఫ్ సాటర్న్ వద్ద త్రిభుజం ఏర్పడినట్లైతే ఆ వ్యక్తికి ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉంటాయి. మరోవైపు, ఈ ప్రాంతం వద్ద త్రిభుజం సరిగ్గా లేనట్లయితే ఆ వ్యక్తి గొప్ప మోసగాడు అవుతాడు. నమ్మదగనివాడిగా మారతాడు.

హెడ్ లైన్ వద్ద త్రిభుజం:

హెడ్ లైన్ వద్ద త్రిభుజం:

హెడ్ లైన్ వద్ద త్రిభుజం ఏర్పడితే ఆ వ్యక్తి ఎంతో మేధస్సు కలిగిన వాడు. చదువులో బాగా రాణిస్తాడు. మరోవైపు, ఆ త్రిభుజం పైనుంచి ఫేట్ లైన్ వెళితే కొన్ని అనుకోని సంఘటనలను ఆ వ్యక్తి ఎదుర్కోవలసి రావచ్చు. జీవితంలో ఆ వ్యక్తిని దురదృష్టం వెంటాడే సూచనలు ఉన్నాయి.

మౌంట్ ఆఫ్ సన్ వద్ద త్రిభుజం:

మౌంట్ ఆఫ్ సన్ వద్ద త్రిభుజం:

అరచేతుల్లోని మౌంట్ ఆఫ్ సన్ వద్ద త్రిభుజం ఏర్పడితే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటాడు. ఇతరుల మంచి గురించి ఆలోచిస్తాడు. ఒకవేళ ఈ త్రిభుజం అనేది సరిగ్గా ఏర్పడక పోతే ఆ వ్యక్తి తరచూ సమాజం నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇటువంటి వారు జీవితంలో విజయాన్ని అందుకోవడానికి ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది.

రీజన్ ఆఫ్ మార్స్ వద్ద త్రిభుజం:

రీజన్ ఆఫ్ మార్స్ వద్ద త్రిభుజం:

రీజన్ ఆఫ్ మార్స్ వద్ద త్రిభుజం ఏర్పడితే ఆ వ్యక్తి విజయవంతమైన శాస్త్రవేత్తగా పేరుపొందుతాడు. వీరు, జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. లైఫ్ లైన్ వద్ద త్రిభుజం ఉన్నట్టయితే, ఆ వ్యక్తికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది.

మ్యారేజ్ లైన్ వద్ద త్రిభుజం:

మ్యారేజ్ లైన్ వద్ద త్రిభుజం:

మ్యారేజ్ లైన్ వద్ద త్రిభుజం ఉన్నట్టయితే ఆ వ్యక్తికి వివాహం జరగడానికి అనేక అవాంతరాలు ఎదురవుతాయి. అలాగే, వివాహ జీవితంలో కూడా అనేక ఆటుపోట్లు ఎదురవుతాయి. వారు అపజయాన్ని పొందుతారు. మరోవైపు, మూన్ పైన త్రిభుజం ఉన్నట్లయితే వీరు విదేశాలకు వెళ్లి విజయం సాధించే అవకాశాలున్నాయి.

ఒకవేళ త్రిభుజం అనేది లైఫ్ లైన్ మరియు హెడ్ లైన్ పై ఏర్పడితే:

ఒకవేళ త్రిభుజం అనేది లైఫ్ లైన్ మరియు హెడ్ లైన్ పై ఏర్పడితే:

లైఫ్ లైన్ మరియు హెడ్ లైన్ వద్ద త్రిభుజం ఏర్పడితే శుభసూచకమని భావిస్తారు. ఆ వ్యక్తికి లాభదాయకం. మరోవైపు, హెల్త్ లైన్ మరియు హెడ్ లైన్ వద్ద త్రిభుజం ఏర్పడితే ఆ వ్యక్తి ఎంతో తెలివైనవాడుగా పేరొందుతాడు.

హెల్త్ మరియు లైఫ్ లైఫ్ వద్ద త్రిభుజం ఏర్పడితే:

హెల్త్ మరియు లైఫ్ లైఫ్ వద్ద త్రిభుజం ఏర్పడితే:

హెల్త్ లైన్ మరియు లైఫ్ లైన్ వద్ద త్రిభుజం ఏర్పడితే ఆ వ్యక్తి ఈ ప్రపంచానికి ఎంతో సేవ చేసే సూచనలు కలవు. మరోవైపు, ఈ త్రిభుజాలు విచ్చిన్నమయినట్టు కనిపిస్తే ఆ వ్యక్తి స్వార్థపరుడుగా మిగులుతాడు. మెటీరియలిస్ట్ ఆలోచనలు కలిగి ఉంటాడు.

ఇప్పుడు అరచేతులలోని త్రిభుజాలు వేటిని సూచిస్తాయో అర్థమైంది కదా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    This Is What The Triangle On Your Palm Means

    There are certain points on your palm, which reveal a lot about your personality. One such line is the triangle on your palm. The clear and regular triangles seem to have their auspicious implications. For example: A big triangle on your palm indicates large-hardheartedness and your well-being.It is very interesting to understand the lines on our palm
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more