For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజేతలైన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా మీకు?: మహిళా దినోత్సవం'18

|

ఈరోజు 2018 మహిళా దినోత్సవం, ఈరోజు ఒక సగటు మహిళ ఎంత దూరం వచ్చిందో చర్చించుకోటానికి మంచి సమయం. సాధారణంగా మగవారికి వృత్తి ఉంటే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తారు.దీని అర్థం స్త్రీలు ఉద్యోగాలు కేవలం పని చేయటానికి, డబ్బు సంపాదించటానికి చేస్తారు. వారు దానికన్నా ఎదగాలని కూడా అనుకోరు, వివిధ లింగవివక్ష విషయాలతో అనుమతించబడరు కూడా. కానీ ఉన్నతస్థానంకి ఎదిగిన ఆడవాళ్ళు వారి లక్షణాలతో మీరు కూడా చుట్టూ ఏర్పరుచుకున్న గాజు పైకప్పును పగలకొట్టగలగటానికి సాయపడగలరు.

విజేతలైన ఆడవారు సగటువారి కన్నా వేరుగా ఆలోచిస్తారు, అందుకనే పనులు కూడా వేరేలా చేస్తారు. అందుకని విజయవంతమైన స్త్రీలు వారి ఆలోచనలనే ఎక్కువగా నమ్మి, మిగతావారికంటే వేరుగా ఉంటారు.

2018 మహిళా దినోత్సవం సందర్భంగా, మీరు విజేతలవ్వడానికి ఇంకో చిట్కా కావాలి. ఎప్పుడూ గుర్తుంచుకోండి మీరొక స్త్రీ, దాని గురించి ఎన్నటికీ సిగ్గుపడవద్దు. అది మీ అస్థిత్వం.

బోల్డ్ స్కై ఈరోజు మీకోసం కొన్ని విజయవంతమయ్యే స్త్రీ లక్షణాలను వివరిస్తుంది. ఈ లక్షణాలు మీకు తమ జీవితంలో ఉన్నతస్థానంలో ఉన్న స్త్రీలు ఎలా వేరేలా ఆలోచిస్తారో, వారి కెరీర్ లు ఎలా ప్లాన్ చేసుకుంటారో, ఎలా హుందాగా జీవిస్తారో తెలుపుతుంది. మీరు కూడా ఉన్నతంగా ఎదగాలంటే, దేనికీ అడ్డదారి ఉండదు. మీరు పాత ఫ్యాషన్ లా కన్పించినా కష్టపడి తీరాలి. కాకపోతే 2018 మహిళా దినోత్సవం సందర్భంగా మీరు తెలివిగా కూడా ఎలా కష్టపడవచ్చో నేర్చుకోవచ్చు!

మీరు నేర్చుకోవాల్సిన విజయాలు సాధించే స్త్రీలలో ఉండే లక్షణాలు ;

వారు శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు

వారు శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు

ఫిట్ నెస్, ఆరోగ్యం మీ జీవితంలో ముఖ్య కేంద్ర భాగాలు. మీరు మీ వృత్తిలో ఉన్నతస్థితికి విజయవంతంగా ఎదగాలంటే, మీరు శారీరకంగా ఆరోగ్యంగా అలాగే భావాల స్థిరత్వం కలిగిఉండాలి.

వారు అంచనా వేయగలిగే రిస్క్ తీసుకోడానికి వెనుకాడరు

వారు అంచనా వేయగలిగే రిస్క్ తీసుకోడానికి వెనుకాడరు

ప్రతి నిర్ణయంలో అంచనా వేయగలిగే రిస్క్ లు ఉంటాయి. అందరూ స్త్రీలెప్పుడూ సాహసించరు అనుకుంటారు. కానీ మీరు కొన్ని కెరీర్ నిర్ణయాలను తీసుకోటానికి కొన్ని రిస్క్ లు కూడా తీసుకోడానికి వెనుకాడకూడదు.

వారికి అభద్రతాభావం ఉండదు

వారికి అభద్రతాభావం ఉండదు

మీ భర్తకి అనైతిక సంబంధం ఉందనో లేదా మీ సహోద్యోగి మీ బాస్ తో ప్రమోషన్ కోసం ఎఫైర్ సాగిస్తోందనో అభద్రతతో బాధపడుతుంటే, మీరెన్నటికీ మీ పనిలో ముందుకి వెళ్ళలేరు. మీ భద్రత, భరోసా మీలోనే ఉంటాయి.

వారు మగవారిలాగా ప్రవర్తించరు

వారు మగవారిలాగా ప్రవర్తించరు

మీరు మగవారు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో అదే పద్ధతిని అనుకరిస్తే, మీరు నిజానికి పురుషులు స్త్రీలకన్నా తెలివైనవారని ఒప్పేసుకుంటున్నట్టు లెక్క. మీరెప్పుడూ మీలో స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేసి వదిలేయవద్దు ఎందుకంటే అదే మీ ప్రత్యేకత.

వారు మంచి వివాహబంధంలో ఉంటారు లేదా అసలు పెళ్ళే చేసుకోరు

వారు మంచి వివాహబంధంలో ఉంటారు లేదా అసలు పెళ్ళే చేసుకోరు

తమ కెరీర్ లో ఉన్నతస్థితిలో ఉన్న స్త్రీలు సాధారణంగా చాలా అర్థం చేసుకుని అండగా నిలిచే భర్తలను కలిగి ఉంటారు. ఒకవేళ అలాంటి అబ్బాయిలు దొరకనప్పుడు, వారు పెళ్ళి చేసుకోకుండానే ఉండిపోతారు.

హాయిగా జీవించటానికి ఎప్పుడూ సిగ్గుపడరు

హాయిగా జీవించటానికి ఎప్పుడూ సిగ్గుపడరు

పనిచేస్తున్న తల్లి ఫీలయ్యే అపరాధభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీ వృత్తి జీవితం గురించి మీకు గిల్టీగా ఉంటే, మీరు తప్పక మంచి తల్లి కూడా కాలేరు, అలాగే మంచి ఉద్యోగిని కూడా కాలేరు.

వారు ఒకే సమయంలో చాలా పనులు చేయగలరు

వారు ఒకే సమయంలో చాలా పనులు చేయగలరు

ఆడవాళ్ళు ఎప్పుడూ కుటుంబపరంగా మగవారికంటే ఎక్కువ పనులు చేయాల్సి ఉంటుంది. అందుకని విజయవంతమైన కెరీర్ ఉన్న స్త్రీగా కూడా ఎదగాలంటే ఒకే సమయంలో ఎక్కువ పనులు సమర్థవంతంగా చేయగలగటం నేర్చుకుని తీరాలి. మీరు మీ మెయిల్ ను చెక్ చేస్తూ, అదే సమయంలో బంగాళాదుంపలను వండగలగాలి కూడా.

వారెప్పుడూ వారికోసం సమయం కేటాయించుకుంటారు

వారెప్పుడూ వారికోసం సమయం కేటాయించుకుంటారు

మీరెప్పుడైనా నెలలపాటు కార్పొరేట్ దిగ్గజాలు హెయిర్ కట్ లేదా వాక్సింగ్ చేయించుకోనట్టు కన్పించటం చూసారా? విజయవంతమైన ఆడవారు ఎప్పుడూ తమ గురించి తాము శ్రద్ధ తీసుకుంటారు ఇంకా వారికి వారు కొంత సమయం కూడా కేటాయించుకుంటారు.

వారెప్పుడూ తమ కెరీర్ తప్పనిసరి కాదని అనుకోరు

వారెప్పుడూ తమ కెరీర్ తప్పనిసరి కాదని అనుకోరు

మీరే ఇంటికి సంపాదనాపరంగా దిక్కు కాదు కాబట్టి, మీరెప్పుడైనా మీ కెరీర్ అంత ముఖ్యంకాదు అనుకుంటే, ఎప్పటికీ యావరేజ్ ను దాటి పైకి ఎదగరు. మీ ఉద్యోగం మీకు తప్పనిసరిదై ఉండాలి.

English summary

Women’s Day 2018 | Traits Of Successful Women | Successful Women Think Differently

Today is Women's Day 2014 and it is the perfect time to discuss how far the average working woman has come. Usually, men have careers and women have jobs. This simply means that women do jobs for the sake of working and earning some money. They either do not aspire to rise over drudgery or they are not allowed to do so for various gender biases. But the traits of successful women who have made to the top can help you break through the glass ceiling.
Story first published: Wednesday, March 7, 2018, 13:00 [IST]
Desktop Bottom Promotion