రోజుకి 10సార్లు స్నానం చేసే అక్కాచెల్లెళ్ళు. శుభ్రత – పరిశుభ్రత కాన్సెప్ట్

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

తమ OCD సర్జరీతో 2015లో ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకునేలా చేసిన కవలల గురించిన కథనం ఇది. మీరు తెలుగులో మహానుభావుడు సినిమా చూసే ఉంటారు, అందులో హీరో కూడా ఈ OCDతో అతి శుభ్రతను పాటిస్తూ ఉంటారు. ఎంతలా అంటే, శుభ్రత కోసం ఒక ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ ఎల్లప్పుడూ వెంట ఉండేలా ఉంటుంది వీళ్ళ పద్దతి. కానీ ఈ OCD సర్జరీ చేయించుకున్న ఈ కవలలు ఇద్దరూ ఇప్పుడు లేరు. ఈమద్యనే వాళ్ళు చనిపోయినట్లు తెలిసింది. ఈ ocdని ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే, అతి శుభ్రత.

నిజానికి ఈ సమస్య ప్రతి పదిమందిలో కనీసం ఒకరిలో తెలీకుండా ఉంటుంది. కానీ తెలిసేలోపు తీవ్రపరిణామాలకు సైతం చేరుకుంటుంది.

ఇక్కడ చెప్పబోయే కవల అక్కాచెల్లెళ్ళు అమండా, సారాఎల్డ్రిచ్ కూడా ఇలాంటి OCD భాధితులే, కానీ ఈ మద్యనే వీరి మృతదేహాలను తుపాకీ బుల్లెట్ దెబ్బలతో ఒక కార్లో కనుగొన్నారు.

Twins With The OCD Ended Their Lives In A Tragic Way

వీరు పసితనం నుండే OCDతో తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కున్నారు, తద్వారా వీరి జీవితకథ అనేకమందికి అనేక విషయాలను తెలిపింది అనడంలో ఆశ్చర్యం లేదు.

ఇప్పుడు మీరు చదువుతున్న ఈ వ్యాసం మీలో కొన్ని ఆలోచనలను రేకెత్తించవచ్చు కూడా.

వీరి తల్లి వీరి గురించి ఇలా..!

వీరి తల్లి వీరి గురించి ఇలా..!

ఈ కవలల తల్లి వీరిని ప్రత్యేకమైన తెలివితేటలు, దయాగుణం కలిగిన వారిగా, కళాత్మక హృదయంతో ప్రత్యేకమైన భావాలు కలిగిన వారిగా అభివర్ణిస్తుంది. మరియు వీరిరువురూ జంతు ప్రేమికులు, వీరికి 3కుక్కలు కూడా కలవని తెలిపింది.

వీరు రోజుకు 10 గంటలు స్నానం చేస్తారు:

వీరు రోజుకు 10 గంటలు స్నానం చేస్తారు:

అమాండా, సారాఎల్డ్రిచ్ ఎక్కువ శుభ్రతకు ప్రాధాన్యతను ఇస్తుంటారు. రోజుకు కనీసం 5 ఆల్కహాల్ బాటిల్స్ ను స్నానానికి వినియోగించేవారు. చనిపోయేవరకు లేదా శరీరం కట్టె పైకి ఎక్కేవరకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు దరిచేరకూడదు అని వీరి ఆలోచన. తద్వారా రోజులో 10గంటలు కేవలం స్నానానికే వెచ్చించేవారు అంటే ఆశ్చర్యం కలగకమానదు.

ఇంటి నుండి బయటకు వెళ్ళడమంటే అత్యంత కష్టమైన విషయాల్లో ఒకటి వీరికి.....

ఇంటి నుండి బయటకు వెళ్ళడమంటే అత్యంత కష్టమైన విషయాల్లో ఒకటి వీరికి.....

వీరు ఇంటి నుండి బయటకు వెళ్ళడం అత్యంత భాధాకరమైన విషయంగా భావిస్తుంటారు. ఒకవేళ వీరు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే, కొన్ని గంటల ముందు నుండే ఆహారపదార్ధాలు, పానీయాలు తీసుకోకుండా ఉపవాసంలా ఉంటారు. వీరి శరీరాన్ని డీహైడ్రేట్ చేయడానికి ఈప్రయత్నం చేస్తారు, తద్వారా ఇతరుల లేదా పబ్లిక్ మూత్రశాలలు వాడకుండా జాగ్రత్త పడుతుంటారు.

డాక్టర్ను సంప్రదించి OCD అని తెలుసుకున్నారు:

డాక్టర్ను సంప్రదించి OCD అని తెలుసుకున్నారు:

వీరు యుక్తవయసుకు వచ్చాక, డాక్టర్ ను సంప్రదించడం ద్వారా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గా దీనిని గుర్తించారు. వీరి చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం వీరి జీవన శైలికి అనుగుణంగా లేదన్న భావన కలగడం ఈ OCD ప్రధమలక్షణంగా ఉంటుంది. తద్వారా వీరికి సంబంధించిన ప్రతి వస్తువునూ, లేదా పరిసరాలను శుభ్రంగా ఉండడానికి ఇష్టపడుతారు.

ఈ పరిస్తితి చాలా చెడుప్రభావాలకు దారితీసింది కూడా...

ఈ పరిస్తితి చాలా చెడుప్రభావాలకు దారితీసింది కూడా...

ముఖ్యంగా వీరి బహిష్టు సమయాల నందు వీరి పరిస్తితి అధ్వానంగా, అగమ్యగోచరంగా ఉంటుంది. వీరు తమ శరీరంపై పొర తొలిగే వరకు, ఒక సోప్ పూర్తిగా అయ్యే వరకు స్నానం చేసేవారంటే ఎంత తీవ్రమైన మానసిక సమస్యకి గురయ్యున్నారో ఇట్టే తెలిసిపోతుంది.

వీరు సర్జరీకి కూడా సిద్దపడ్డారు:

వీరు సర్జరీకి కూడా సిద్దపడ్డారు:

వీరికి 13సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చారు. దీనికి కారణం వీరికి స్నేహితులు, సన్నిహితులు అందరూ దూరంగా జరగడమే. వీరు తమ పరిస్థితుల నుండి బయటపడలేక, స్నేహితులకు దగ్గరకాలేక, కేవలం శుభ్రతకోసమే ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఉండడం వలన, స్నేహితులు సన్నిహితులూ అందరూ నెమ్మదిగా దూరమయ్యారు. తద్వారా దీనికై చికిత్సకు ఉపక్రమించి సర్జరీకి సిద్దపడ్డారు, తద్వారా ప్రపంచం దృష్టి వీరిమీద పడింది. వీరు కొలరెడో లోనే డీప్ బ్రైన్ స్టిమ్యులేషన్ కోసం సర్జరీ చేయించుకున్న మొదటి పేషoట్స్ గా గుర్తింపు పొందారు. ఈ థెరపీ ని మామూలుగా పార్కింసన్స్ సమస్యతో భాధపడే వారికి, OCD తగ్గించడానికి చేస్తుంటారు.

సర్జరీ గురించి:

సర్జరీ గురించి:

ఈ డీప్ – బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అనేది ఈ కవలల చివరి ప్రయత్నం. ఈ ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రోడ్ వైర్లను చర్మానికి కిందుగా తల, మెడ , భుజం భాగాలకు విస్తరించునట్లుగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ వైర్లను మెదడు నాడీ వ్యవస్థను విద్యుత్ ప్రసారం ద్వారా ఉద్దీపన చెందేలా చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే బాటరీ పాక్ లా పనిచేస్తుంది . నెమ్మదిగా వీరి ఛాతీ భాగంలో కూడా ఈ పద్దతిని కొనసాగించవలసి ఉంటుంది. డాక్టరుకు వీరి శరీర చర్యలను నిరోధించే అవకాశం కూడా న్యూరో ట్రాన్స్మిట్టర్ ద్వారా కలుగుతుంది.

ఈసర్జరీ సక్సెస్ అయింది కూడా ..

ఈసర్జరీ సక్సెస్ అయింది కూడా ..

ఈ సర్జరీ సమయంలోనే వీరిలో పురోగతిని సాధించగలిగారు వైద్యులు. సారా హాస్పిటల్ యాజమాన్యంతో చెప్పిన ప్రకారం “ నా భావోద్వేగాలను నేను గుర్తించగలిగాను, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులనైనా నేను ధైర్యo ఎదుర్కొనగలను” అని తెలుపగా, అమాండా “ నా జీవితంతో నేను యుద్దం చేస్తున్న అనుభూతి నుండి విముక్తిని పొందగలిగాను, ఇప్పుడు నా వృత్తిపరమైన నిర్ణయాల పట్ల దృష్టిని కేంద్రీకరించగలను, నేను చూడని ప్రపంచాన్ని ఇకపై చూడగలను “ అని తెలిపారు.

సర్జరీ తర్వాత కథ :

సర్జరీ తర్వాత కథ :

తమ జీవితంలో ఎన్నో రకాల పరిణామాలను చూశామని, ఇప్పుడు స్నానానికి ఎక్కువ సమయం వెచ్చించడంలేదని, ఆ సమయాన్ని స్నేహితులతో గడుపుతున్నామని కవలలు తెలిపారు. మరోవైపు, సారా తన శరీరం 30 సంవత్సరాలు తన స్వాధీనంలో లేకుండా హైజాక్ కు గురైందని, ఇన్ని రోజుల తర్వాత మరలా తన అధీనంలోనికి వచ్చిందని తెలిపారు.

ఎంత సాధించినా, జీవితాలు మాత్రం చివరికి ఇలా ...

సర్జరీ తర్వాత సామాన్య జీవితానికి నెమ్మదిగా అలవాటు పడుతున్న ఈ కవలలు, కొన్ని ప్రతికూల పరిస్థితులతో సైతం పోరాటం చేయవలసి వచ్చింది. తద్వారా ఇద్దరూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మనిషి మనసు ఎంత సున్నితమైనదో, సామాజిక పరిస్థితులకు సర్ధుబాటు కాని పక్షంలో, ఎదుర్కొనలేక ఎలాంటి ప్రతికూల ప్రభావాలకు లోనవుతారో అని వీరి జీవితాల ద్వారా అనేకమందికి అవగతమైంది. ఆలోచనలు సరైన మార్గంలో కాకుండా పక్కదారిపడితే, నెమ్మదిగా జీవితం , క్రమంగా ప్రాణం కూడా ఇబ్బందుల్లో పడుతుంది అని చెప్పకనే చెప్తుంది వీరి జీవితం.

English summary

Twins With The OCD Ended Their Lives In A Tragic Way

Twins With The OCD Ended Their Lives In A Tragic Way,These sisters loved taking a shower for over 10 hours and even spent five bottles of rubbing alcohol every day to disinfect their skin until it burned! Check out this bizarre story…
Story first published: Monday, April 9, 2018, 15:30 [IST]