For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగ చింపాంజీల పోరాట పటిమ కళ్లకుకట్టే సంఘటన!

|

మగ చింపాంజీలు తమ ఆధిపత్య ప్రవర్తనకు అత్యంత ప్రసిద్ధి చెందినవి. మీకు ఈ క్రూరమైన, బాగా తెలివైన వన్యప్రాణి యొక్క గుణగణాలు మరియు ఆధిపత్య ధోరణి గురించి అవగాహన లేకపోయినట్లైతే, ఒక నిమిషం పాటు సాగే ఈ వీడియో వీక్షించండి. తమ శక్తిని రుజువు చేసుకువడానికి అన్నట్లు, నిర్భయంగా ఒకదానితో ఒకటి తలపడుతున్న ఈ మగ చింపాంజీలు, తమ పోరాటపటిమతో మిమ్నల్ని కాసేపు కట్టిపడేస్తాయి ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే!

ఇంగ్లండ్ లోని ఆథర్ స్టోన్ లో ఉన్న ట్విక్రాస్ జూలో ఉండే జంబో మరియు మోంగో అనే తండ్రి మరియు బిడ్డ చింపాంజీల జంట, వంశపారంపర్యంగా సంక్రమించిన అలోపేసియా వ్యాధి వలన బట్టతలతో బాధపడుతున్నాయి. అలోపేసియా అనేది మగవారిలో వచ్చే బట్టతలను తెలపడం కొరకు ఉపయోగించే సాధారణ పదం.

ఈ వీడియోలో జూ సందర్శకుల ముందు, చింపాంజీలు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. పోరాటానికి సిద్ధమని తెలపడానికి, ఒక చింపాంజీ తన ఛాతీ మీద బాదుకుంటున్నపుడు, ఆ దృశ్యం చూడటానికి చాలా భయానకంగా ఉంది. అంతేకాక, ఈ పోరాటం కూడా చూడటానికి ఒక భయంకరమైన అనుభూతిగా మిగిలిపోతుంది!

ఇక్కడ, ఈ వీడియోలో, జంతుప్రదర్శనశాలలో చుట్టూ కంచె కలిగి ఉన్న ప్రదేశంలో, ఈ భారీకాయాలు కలిగిన చింపాంజీలు ఆటవికంగా పోరాడటాన్ని మీరు గమనించవచ్చు. ఇది వాటి సాధారణ ప్రవర్తన.

చింపాజీలు సాధారణంగా ఇలానే ప్రవర్తిస్తాయి. అవి తమ బలాన్ని ప్రదర్శించడానికి, అల్లకల్లోలం సృష్టించి వాటిపై మనం చర్చించుకునే విధంగా చేస్తాయి.

గుండెలను బాదుకుంటూ, కోపంతో ఊగిపోతూ ఉన్న చింపాంజీలు చూస్తే, మన గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రస్తుతం, అదే జూలో ఇలాంటి పన్నెండు క్షీరద జీవుల బాగోగులను నిర్వహించడం అంటే, ఎంత భారమో ఊహించండి. ఆలోచించడానికే ఆందోళనకరంగా ఉంది కదా?

ఈ రికార్డింగ్ లో పన్నెండు చింపాంజీలు పాల్గొనడం మీరు గమనించవచ్చు. వీరందరిలో పైచేయి ఎవరిదో అని సందర్శకులకు నిరూపించడానికి అన్నట్లు, ఒక మగ బట్టతల కలిగిన చింపాంజీ మిగిలిన వారందరినీ రక్తమోడేట్టు చేయడం చూడవచ్చు. ఈ మొత్తం భాగోతంలో ఆధిక్యత అతనిదే!

అతను నిర్విరామంగా తన సహచర చింపాంజీలపై అపారమైన శక్తినంతటిని కూడదీసుకుని కలబడుతుంటే, ఏదో క్షణంలో పట్టు కోల్పోవచ్చనే నమ్మకం మనకు కలుగుతుంది. ఈ జూ వద్ద ఇంత గందరగోళం జరగడానికి ఖచ్చితంగా అతనే కారణమని మనం నిర్ధారణకు వస్తాం .

ఇంగ్లాండ్ లోని ఆథర్ స్టోన్లోని ట్వైక్రాస్ జంతుప్రదర్శనశాలలో చింపాంజీలు ఇలా ప్రవర్తించడం, ఇదేమి మొట్టమొదటిసారి కాదు.

అందమైన రంగురంగుల జీవులను చూస్తూ, ప్రకృతి అందాలలో మమేకమవ్వాలనే తలంపుతో జంతుప్రదర్శనశాలను సందర్శించిన పర్యాటకుల దృష్టికి, ఇటువంటి భయంకరమైన దృశ్యం ఎదురైతే, వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి!

చింపాంజీలు అవి నివసించే ప్రదేశంలో ఆధిపత్యానికై, భయంకరమైన పోరాటాన్ని సాగిస్తాయి.ఎటువంటి వారైనా నిస్సందేహంగా, ఇటువంటి తగవును పరిష్కరించడానికి పూనుకోరు. ఇటువంటి వ్యవహారాలలో తలదూర్చాలనే కోరిక మానవమాత్రులకు ఎట్%

English summary

Check How Furious Hairless Chimpanzees Are Seen Fighting

Chimpanzees from the Twycross Zoo in Atherstone, England, seem to cause a tense scene. The audience is seen to be fazed by what these huge hairless chimpanzees are seen trying to fight with the rest of the chimps in the cage. It is a typical behaviour of the chimpanzees. In the video, it is seen that the hairless chimps are pounding on chests and the angry charging the rest!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more