లోకల్ ట్రైన్‌లో దారుణం.. మహిళను నానా రకాలుగా వేధించిన దుర్మార్గుడు

Written By:
Subscribe to Boldsky

ఒక దుర్మార్గుడు.. లోకల్ ట్రైన్ లో వికలాంగుల బోగీలోకి ప్రవేశించి.. నానా రచ్చ చేశాడు. సొంత భార్యపై సిగ్గు లేకుండా వ్యవహరించాడు ఈ దుర్మార్గుడు. ఒకనొక సందర్భంలో ఆమెను ట్రైన్ లో నుంచి కిందకు తోయడానికి కూడా సిద్ధమయ్యాడు.

భార్యపై విచక్షణంగా దాడి

భార్యపై విచక్షణంగా దాడి

ముంబైలో థానే నుంచి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న లోకల్ ట్రైన్‌లో ఇటీవల ఒక దారుణం జరిగింది. రైలు వెళ్తుండగా దివ్యాంగుల బోగీలో ఓ పురుషుడు ప్రవేశించాడు. దివ్యాంగుల బోగీలో కూర్చొన్న తన భార్యపై విచక్షణంగా దాడి చేశాడు. ఆమె గొంతు నులిమాడు. రాక్షసంగా ప్రవర్తించాడు.

ప్రమాదానికి గురయ్యేదే

ప్రమాదానికి గురయ్యేదే

ఇక పక్కనే లేడిస్‌ కంపార్ట్‌మెంట్లో ఉన్న సెక్యురిటీ గార్డు ఏదో వదిలెయ్ అని సైలెంట్ గా చెబుతున్నాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. భర్తను తీవ్రంగా ప్రతిఘటించే క్రమంలో ఆమె ఒక సందర్భంలో ట్రెయిన్‌ డోర్‌ దగ్గరకు వెళ్లింది. కొద్దిగా అటు ఇటు అయితే ఆమె ప్రమాదానికి గురయ్యేదే.

ఎమర్జెన్సీ అలారం లాగమని చెప్పారు

ఎమర్జెన్సీ అలారం లాగమని చెప్పారు

మొదట ఆ మహిళపై భర్త దాడి చేయడంతో అందరూ షాక్ అయ్యారు. వారిద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణ ఆ బోగీలోని వారికి అర్థం కాలేదు. కానీ కొందరు దివ్యాంగులు మాత్రం అక్కడే లేడిస్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న గార్డుకి ఎమర్జెన్సీ అలారం లాగమని చెప్పారు. అతడు ఏమాత్రం పట్టించుకోలేదు.

సోషల్ మీడియాలో హాట్ టాఫిక్

సోషల్ మీడియాలో హాట్ టాఫిక్

దాదర్ కుర్లా మధ్య నడిచే ఈ లోకల్ ట్రైన్‌లో జరిగిన ఆ ఘటనను

పాక్షిక అంధుడైన సహ ప్రయాణికుడు వీడియో తీశాడు. అదిప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారింది.

నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు

నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు

దీనిని గమనించిన ఇతర ప్రయాణికులు దాదర్ పోలీసులకు సమాచారం అందజేశారు. రైలు దాదర్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళిన తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యాయత్నం, మహిళపై వేధింపుల కేసు నమోదు చేశారు.

లైంగికంగా వేధించారు

లైంగికంగా వేధించారు

దివ్యాంగుల కంపార్ట్‌మెంట్‌లో కూర్చున్న మహిళను నిందితుడు లైంగికంగా వేధించినట్లు వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి పాల్పడిన పురుషుడి పేరు రఫీక్ షేక్. వీరిద్దరి మధ్య ఘర్షణ జరగడానికి కారణాలపై పలు కథనాలు వినపడుతున్నాయి.

బాకీ చెల్లించమని అడగటంతో

బాకీ చెల్లించమని అడగటంతో

కాగా బాధిత మహిళ వద్ద రఫీక్ పెద్ద మొత్తంలో అప్పుతీసుకున్నాడని, తన బాకీ చెల్లించమని అడగటంతో ఆమెపై దాడిచేశాడని కొన్ని కథనాలు వెలువడ్డాయి.

భార్యాభర్తలు

భార్యాభర్తలు

కానీ వీరిద్దరూ స్వయంగా భార్యాభర్తలు. తన భర్త తరచూ వేధిస్తుంటాడని, తాగిన మైకంలో ట్రైన్ లో తన భర్త తనపై ఇష్టానుసారంగా వ్యవహరించాడని ఆమె చెప్పినట్లు సమాచారం.

English summary

video of man assaulting his wife while cop watched in mumbai train

video of man assaulting his wife while cop watched in mumbai train
Story first published: Saturday, April 7, 2018, 10:13 [IST]