For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డోర్ లో చీర చిక్కుకోవడంతో ఈడ్చుకెళ్లిన ట్రైన్, సాహసం చేసి ప్రాణాలు కాపాడిన జవాన్

మహిళ ప్రాణాలు కాపాడిని జవాన్ పేరు రాజ్ కమల్ యాదవ్. అతన్ని కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌ అభినందించారు. మన కళ్ల ఎదుట జరిగే ప్రమాదాల విషయంలో కాస్త తెగువ చూపిస్తే ప్రాణాలను కాపాడొచ్చని జవాను చూపాడు

|

ఈ మధ్య రైలులో ప్రయాణిస్తూ ప్రాణాలు వదిలిన వారు చాలా మందే ఉన్నారు. చైన్నైలో ఇటీవల ఒక పిట్ట గోడ తగిలి కొందరు ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు ఇటీవల చాలా జరిగాయి. అయితే ముంబైలో కూడా తాజాగా ఒక సంఘటన జరిగింది. అక్కడున్న ఒక ఆర్ఫీఎఫ్ జవాన్ చొరవ చూపకుండా ఉంటే ఆ మహిళ చనిపోయేది.

ముంబై లోకల్ ట్రైన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై లోని కంజు మార్గ్ రైల్వే స్టేషన్ లో కదులుతోన్న ట్రైన్ లో నుంచి ఒక మహిళ దిగింది. అయితే ఆమె చీర కొంగు ట్రైన్ డోర్ లో ఉండిపోయింది. ట్రైన్ కదలడంతో ఆమె కిందపడిపోయింది.

ప్రయాణికులంతా కేకలు వేశారు

ప్రయాణికులంతా కేకలు వేశారు

దీంతో అక్కడున్న ప్రయాణికులంతా కేకలు వేశారు. ట్రైన్ కాస్త స్పీడ్ గా అందుకోవడంతో ఆమెను ముందుకు లాక్కెళ్లింది. అయితే అక్కడే ఉన్న ఒక రైల్వే ప్రొటక‌్షన్‌ ఫోర్స్‌ జవాను క్షణాల్లో తేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఆమెను ట్రైన్ కొద్ది దూరం ఈడ్చుకుంటూ పోయింది. వెంటనే ఆర్ఫీఎఫ్ పోలీస్ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ట్రైన్ కు దూరంగా లాగాడు.

జవాన్ కూడా కిందపడిపోయాడు

జవాన్ కూడా కిందపడిపోయాడు

అయితే కొద్ది దూరం వెళ్లాక ఆ జవాన్ కూడా కిందపడిపోయాడు. ఆర్ఫీఎఫ్ పోలీస్ క్షణాల్లో అలా సాహసం చేయడం వల్ల ఆమె ట్రైన్ కు ఫ్లాట్‌ ఫామ్‌ కు మధ్య పడలేదు. లేదంటే ఆమె ట్రైన్ చక్రాల కింద పడి నలిగిపోయేది.

నెటిజన్ల నుంచి ప్రశంసలు

ఆ మహిళను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆమె స్వల్ప గాయాలయ్యాయి. ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. ఇదంతా రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ జవాన్ కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

పీయూష్‌ గోయల్‌ అభినందించారు

మహిళ ప్రాణాలు కాపాడిని జవాన్ పేరు రాజ్ కమల్ యాదవ్. అతన్ని కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌ అభినందించారు. మన కళ్ల ఎదుట జరిగే ప్రమాదాల విషయంలో కాస్త తెగువ చూపిస్తే ప్రాణాలను కాపాడొచ్చని జవాను నిరూపించాడు.

English summary

video viral rpf constable saves woman from slipping under train

video viral rpf constable saves woman from slipping under train
Story first published:Thursday, July 26, 2018, 12:00 [IST]
Desktop Bottom Promotion