For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చేప కూరంటే వాళ్లకు భలే ఇష్టం, అది పాముల్ని, తేళ్లను తింటుంది, ఒళ్లంతా విషమే, మీరు తినేరు చనిపోతారు

పఫర్‌ ఫిష్ కు నిండా ముళ్లు ఉంటాయి. దీన్ని పట్టుకోవాలని చూస్తే అది ఆ ముళ్లను నిటారుగా మార్చేస్తుంది. దీంతో దాన్ని వేటాడే చేపలు గాయపడతాయి. అంతేకాదు ఆ ముళ్ల నుంచి ఆ చేపల శరీరంలోకి వెళ్లడంతో అవి చనిపోతాయి

|

చేపల కూర అంటే అందరికీ ఇష్టమే. కొన్ని రకాల చేపలంటే జనాలు పడి చచ్చిపోతారు. వాటిని తినడానికి బాగా ఇష్టపడతారు. అయితే అన్ని చేపల్లో కంటే ఒక చేప ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక దాని కూర జీవితంలో ఒక్కసారైనా తినాలని జపాన్ లో ఉండే వారు అనుకుంటారు. వారికి జీవితంలో ఒక్కసారైనా ఆ చేపను తినాలని ఉంటుంది.

పఫర్‌ ఫిష్‌

పఫర్‌ ఫిష్‌

ఆ చేప పేరే పఫర్‌ ఫిష్‌. దీని కూర తయారు చేయాలంటే కనీసం నాలుగు సంవత్సరాలు ప్రత్యేకంగా శిక్షణ పొందాలి. లేదంటే కూర మొత్తం విషంగా మారిపోతుంది. తిన్న వాళ్లు వెంటనే చనిపోతారు. అంత డేంజర్ ఈ చేప. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఒళ్లంతా విషమే ఉంటుంది. తెలియక దాన్ని అలాగే తింటే మాత్రం ఇక అంతే సంగతులు. ఈ చేపలు ముందుకు వెనక్కి ఈదగలవు. దీంతో తయారు చేసే కూరను ఫుగు అంటారు.

కొన్ని అవయవాలు చాలా డేంజర్

కొన్ని అవయవాలు చాలా డేంజర్

ఈ చేపలోని కొన్ని అవయవాలు చాలా డేంజర్. దీంతో వంటకాన్ని తయారు చేసేటప్పుడు వాటన్నింటినీ తీసేయాలి. ఈ చేపలో కొన్ని అవయవాల్లో సైనైడ్‌ కంటే ఎక్కువ విషం ఉంటుంది. అందుకే తెలియకుండా దాని అవయవాలు ముఖ్యంగా కాలేయం, కళ్లు వంటివి తీసివేయకుండా తింటే మాత్రం కచ్చితంగా చనిపోతారు. ఈ చేపను లైసెన్స్‌ ఉన్న చెఫ్స్ మాత్రమే వండాలి. ఈ చేప వంటకం ఖరీదు కూడా బాగా కాస్ట్లీ.

బలూన్‌ ఫిష్‌, గ్లోబ్‌ ఫిష్‌

బలూన్‌ ఫిష్‌, గ్లోబ్‌ ఫిష్‌

పఫర్‌ ఫిష్‌ ను బలూన్‌ ఫిష్‌, గ్లోబ్‌ ఫిష్‌ అని అంటారు. దీన్ని చూస్తే ఇంట్లో ఆక్వేరియంలో ఉండే బొద్దు బొద్దు అందమైన చేపలు గుర్తొస్తాయి. కానీ దీని నిర్వాకం చూస్తే మాత్రం భయం వేస్తుంది. ఈ చేప పాముల్ని, తేళ్లను, జర్రీలను చంపేసి తినేయగలదు. ఇక ఇది కరిస్తే కూడా చాలా ప్రమాదకరం.

జర్రీ, పాము, తేళ్లను తినింది

ఇక ఇటీవల దీనిపై ఒక ఛానెల్ పఫర్‌ ఫిష్‌ పై అధ్యాయనం చేపట్టింది. దీన్ని ఒక నీళ్లు ఉన్న గాజు తొట్టిలో ఉంచి అందులోకి ముందుగా ఒక జర్రీని వేశారు. చేప దాన్ని కర్ కర్ మంటూ తినేసింది. దాన్ని చీల్చి చెండాడింది. తర్వాత ఒక తేలును వేశారు. దాన్ని కూడా చంపి తినేసింది. చివరగా పామును వేశారు. దాన్ని కూడా నమిలిపడేసింది.

పఫర్‌ ఫిష్‌ జర్రీ, పాము, తేళ్లను తిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీన్ని పట్టుకోవాలని చూస్తే

దీన్ని పట్టుకోవాలని చూస్తే

పఫర్‌ ఫిష్ కు నిండా ముళ్లు ఉంటాయి. దీన్ని పట్టుకోవాలని చూస్తే అది ఆ ముళ్లను నిటారుగా మార్చేస్తుంది. దీంతో దాన్ని వేటాడే చేపలు గాయపడతాయి. అంతేకాదు ఆ ముళ్ల నుంచి ఆ చేపల శరీరంలోకి వెళ్లడంతో అవి చనిపోతాయి. అందుకే సముద్రంలోని తిమింగళాలు సైతం పఫర్ ఫిష్ జోలికి వెళ్లవు. అంతేకాదు ఈ చేప చనిపోయే ముందు మొత్తం తన శరీరాన్ని విషమయంగా చేసేసుకోగలదు. దీంతో దాన్ని తినే సముద్రంలోని ఏ జీవి అయినా చనిపోతుంది.

కప్ప చేప అంటారు

పఫర్ చేప మామాలు సమయంలో చేప మాదిరిగానే ఉంటుంది. దానికి ప్రమాదం సంభవించే సమయంలో అది గుండ్రంగా మారిపోతుంది. ఇక ఈ చేపలు మన సైడ్ కూడా లభిస్తాయి. మనవాళ్లు దీన్ని కప్ప చేప అంటారు. సముద్రంలో చేపలు వేటాడే వారికి వీటి గురించి బాగా తెలుసు కాబట్టి ఒకవేళ ఇవి వలలో పడ్డ కూడా వాటిని అక్కడే పడేస్తారు. పొరపాటును కూడా ఈ చేప జోలికి మీరు వెళ్లకండి. వెళితే మీ ప్రాణాలకే ప్రమాదం.

English summary

viral video puffer fish devours snake scorpon and centipede is scary

viral video puffer fish devours snake scorpon and centipede is scary
Story first published:Tuesday, August 21, 2018, 15:55 [IST]
Desktop Bottom Promotion