For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిందెలో ఇరుక్కున్న పిల్లాడి తల, ఆడుకుంటూ తలను దూర్చాడు, ఇంట్లో పిల్లలతో జాగ్రత్త

నాన్న అలా వెళ్లాడంటే చాలు ఇంట్లో అమ్మ మాట అస్సలు వినడు పీయూష్. ఇక ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంట్లో ఉన్న బిందెలో తల పెట్టాడు. బిందెలో నుంచి తలను తీసుకుందామని చాలా ట్రై చేశాడు. కానీ రాలేదు.

|

చిన్న పిల్లలు ఒక్క చోట ఉండరు. ఏవేవో చేస్తుంటారు. అందుకే వారిపై తల్లి నిఘా ఉంటుంది. తండ్రి ఏదో పని మీద బయటకు వెళ్తాడు కాబట్టి రోజంతా పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత తల్లికి మాత్రమే ఉంటుంది. ఇది ప్రతి ఇంటిలో రోజూ జరిగే తంతే.

కానీ పిల్లలు మాత్రం అస్సలు మాట వినరు. పూర్వం ఒక సామెత ఉండేది. పొయ్యిలో పెడితే పొంతలో తేలుతారు.. పొంతలో పెడితే పొయ్యిలో తేలుతారని అలా పిల్లలు తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తుంటారు. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఒక ఘటనే ఒకటి జరిగింది.

పిల్లాడి వయస్సు ఏడాదిన్నర

పిల్లాడి వయస్సు ఏడాదిన్నర

భరత్‌పూర్‌ కు చెందిన నగలా అనే పల్లెలో ఒక పిల్లాడు స్టీల్ బిందెలో తల దూర్చాడు. ఆ పిల్లాడి వయస్సు ఏడాదిన్నర. దీంతో పిల్లాడి తల బిందెలో ఇరుక్కుపోయింది. దాన్ని ఎన్ని రకాలుగా తియ్యడానికి ట్రై చేసినా కూడా రాలేదు.

నాలుగు గంటల పాటు బిందెలోనే

నాలుగు గంటల పాటు బిందెలోనే

ఆ పిల్లాడి తల దాదాపు నాలుగు గంటల పాటు బిందెలోనే ఉండిపోయింది. దీంతో తన అరుపులు, కేకలతో ఊరు మొత్తాన్ని ఏకం చేశాడు. ఊరంతా ఆ ఇంటికి వద్దకు వచ్చారు. ఆ పిల్లాడి పేరు పియూష్. తండ్రి పేరు లాల్ చంద్. లాల్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగానే లాల్ ఉదయం లేచి పొలానికి వెళ్లాడు.

బిందెలో నుంచి తలను తీయడానికి ప్రయత్నిస్తే

బిందెలో నుంచి తలను తీయడానికి ప్రయత్నిస్తే

నాన్న అలా వెళ్లాడంటే చాలు ఇంట్లో అమ్మ మాట అస్సలు వినడు పీయూష్. ఇక ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంట్లో ఉన్న బిందెలో తల పెట్టాడు. బిందెలో నుంచి తలను తీసుకుందామని చాలా ట్రై చేశాడు. కానీ రాలేదు. దీంతో గట్టిగా కేకలు పెట్టాడు. ఇంట్లో వాళ్లతో పాటు పక్కింటి వారు వచ్చారు. కానీ బిందెలో నుంచి తలను తీయడానికి ప్రయత్నిస్తే రాలేదు. గట్టిగా పట్టుకుని తీస్తే గాయం అవుతుందని తీయలేదు.

అలా కథ సుఖాంతం

అలా కథ సుఖాంతం

తర్వాత ఊరంతా ఈ విషయం తెలిసింది. అందరూ లాల్ ఇంటి దగ్గరకు వచ్చి బిందెలో నుంచి తలను తీయడానికి ట్రై చేశారు కానీ రాలేదు. తర్వాత హాస్పిటల్ కు తీసుకెళ్లిన ప్రయత్నం లేకపోయింది. చివరకు ఒక బిందెలు తయారు చేసే వ్యక్తి పట్టకార తీసుకుని బిందెను మెల్లిగా విరగొడుతూ బాబు తలను బయటకు తీశాడు. అలా కథ సుఖాంతం అయ్యింది. మీ ఇంట్లో కూడా పిల్లల్ని ఎలా అంటే అలా వదిలిపెట్టకండి. చిన్నపిల్లలు తెలియక ఏవేవో తిక్క తిక్క పనులు చేస్తుంటారు. జాగ్రత్త.

English summary

viral video roadside worker rescued boy that got head stuck in matka jar in bharatpur rajasthan

viral video roadside worker rescued boy that got head stuck in matka jar in bharatpur rajasthan
Story first published:Tuesday, July 31, 2018, 16:49 [IST]
Desktop Bottom Promotion