ప్రతి ఒక్కరికీ ఒక వీక్ నెస్ ఉంటుంది.. మీ రాశి ప్రకారం మీ బలహీతన ఏమిటో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

కొందరు అవతలి వ్యక్తులను చాలా సులభంగా నమ్మేస్తారు. అలాగే సులభంగా హర్ట్ అయిపోతుంటారు. అయితే ఇందుకు చాలా కారణాలున్నాయి. ఆయా రాశుల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో బలహీనతను కలిగి ఉంటారు. దానివల్ల వారు ఇబ్బందులుపడాల్సి వస్తుంది. ఆయా రాశుల ప్రకారం వారి బలహీనతలు ఏమిటో ఒక్కసారి చూడండి.

మేషం : మార్చి 21-ఏప్రిల్ 19

మేషం : మార్చి 21-ఏప్రిల్ 19

మేషరాశి వారు వారి చుట్టూ జరిగే చాలా విషయాలను నియంత్రించాలని కోరుకుంటారు. వీళ్లలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీరు వారి పక్కన ఏదైనా సంఘటన జరిగితే వెంటనే చలిస్తారు. దానిపై వీళ్లు కూడా స్పందిస్తారు. ఫలితంగా ఇబ్బందుల్లో పడతారు.

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభరాశి వారు చాలా నమ్మదగిన వ్యక్తులు. అలాగే వీరు చాలా స్థిరంగా ఉండే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే వీరు అపజయాలు వస్తాయని ఎక్కువగా భయపడుతుంటారు. గెలుపైనా, ఓటమైనా ఏదైనా సరే అని ముందుకు వెళ్తే వీరికి తిరుగులేదు.

మిథునం : మే 21- జూన్ 20

మిథునం : మే 21- జూన్ 20

మిథునరాశి వారు ఒక్కదానిపైనే స్థిరంగా ఉండరు. వీరికి నిమిషానికొక్క ఆలోచన వస్తూ ఉంటుంది. అలాగే వీరు ఉద్యోగం విషయంలోగానీ, వారికి ఉండే హాబీ విషయంలోగానీ, వారి అలవాట్ల విషయంలోగానీ ఒకే విషయంపైనే ఆధారపడి ఉండరు.

కర్కాటకరాశి : జూన్ 21- జూలై 22

కర్కాటకరాశి : జూన్ 21- జూలై 22

కర్కాటకరాశివారికి భావోద్వేగాలు ఎక్కువ. అయితే వీరు ఒక్కోసారి ఎమోషన్స్ మోత్తాన్ని అలాగే ఉంచుకుంటారు. వాటిని ఒక్కసారిగా బయటపెడతారు. అవతలి వ్యక్తులు చిన్న మాట అన్నా కూడా వీరి మనోభావాలు దెబ్బతింటాయి. దీంతో వీరు ఎక్కువగా ఆందోళనకు గురవుతారు. అలాగే నిరాశ చెందుతారు. వీరు ఎక్కువగా నిరాశాజనకంగా ఉంటారు. వీరు పక్కవారిని అస్సలు విశ్వసించరు. ఇవన్నీ వీరి వీక్ నెస్ పాయింట్లు.

సింహరాశి : జూలై 23-ఆగస్టు 23

సింహరాశి : జూలై 23-ఆగస్టు 23

సింహరాశి వారికి కాస్త గర్వం, అహంకారం ఎక్కువగా ఉంటుంది.

వీరు పక్కవారి పట్ల కూడా కాస్త గర్వం ప్రవర్తిస్తుంటారు. దీంతో వీరికి చాలామంది దూరం అవుతూ ఉంటారు. వీరు ఈగోను విడిచిపెడితే హ్యాపీగా ఉంటారు.

కన్యరాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యరాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యరాశివారి మంచి మేధస్సు ఉంటుంది. వీరు దేనిపైనైనా విశ్లేషణ చేయగలుగుతారు. ఇదే వీరి బలం.. ఇదే వీరి బలహీనత. ప్రతి సమస్యను తాము పరిష్కరించగలుగుతామనే ధీమాతో వీరు ఉంటారు. అయితే చివరకు వీరి సమస్యనే పరష్కరించుకోలేరు.

తుల : సెప్టెంబర్ 24 అక్టోబర్ 23

తుల : సెప్టెంబర్ 24 అక్టోబర్ 23

తులరాశి వారు సహజంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరు శాంతియుతంగా ఉంటారు. అయితే వీరికి షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్నట్లుండి కోపం వస్తుంది. దీంతో సహనాన్ని కోల్పోతారు. అందరినీ దూరం చేసుకుంటారు.

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చికరాశి వారు ఎక్కువగా రొమాంటిక్ గా ఉంటారు. వీరు శృంగార సంబంధాలు కూడా కలిగి ఉంటారు. దీని వల్ల వీరు చాలా సందర్భాల్లో ఇబ్బందులుపడుతుంటారు.

ధనస్సురాశి : నవంబర్ 23 -డిసెంబర్ 22

ధనస్సురాశి : నవంబర్ 23 -డిసెంబర్ 22

ధనస్సురాశి వారు ఎక్కువగా బోర్ గా ఫీలవుతుంటారు. వీరికి ఎక్కువగా ఓపిక, సహనం ఉండదు. వీరు ఎదుటివారు చెప్పేది అస్సలు వినరు. దీంతో వీరు చాలామందిని దూరం చేసుకుంటూ ఉంటారు. వీరికి ఉండే వీక్ నెస్ పాయింట్ ఇదే.

మకరం : డిసెంబర్ 23- జనవరి 20

మకరం : డిసెంబర్ 23- జనవరి 20

మకరరాశి వారు డబ్బుకు ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. దీంతో వీరు చిన్నచిన్న సరదాలను కూడా కోల్పొతుంటారు. అలాగే వీరు చిన్నపని చేసి దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. తమదే విజయం అని అనుకుంటారు.

కుంభం : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభం : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభరాశి వారు వారి మనస్సులోని విషయాలను బయపెట్టడానికి బాగా ఇబ్బందిపడుతుంటారు. వీరికి చాలా భావోద్వేగాలుంటాయి. కానీ వాటిని వ్యక్తపరచలేరు.

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనరాశి వారికి కూడా భావోద్వేగాలు ఎక్కువ. అయితే వాటిని వీరు వ్యక్తపరుస్తారు కూడా. వీరిలో సృజనాత్మక ఎక్కువగా ఉంటుంది కానీ దాన్ని వెలికితీయడంలో ఇబ్బందులుపడుతుంటారు.

English summary

weakest trait of your personality based on your zodiac sign

weakest trait of your personality based on your zodiac sign
Story first published: Saturday, February 3, 2018, 9:47 [IST]
Subscribe Newsletter