హాట్ సుందరి ప్రియాంక చోప్రా.. డేటింగ్, ప్రేమ, పెళ్లి, కామసూత్ర పేరుతో వైరల్ ఎందుకవుతుందో తెలుసా?

Subscribe to Boldsky

వెండితెరపై వెలిగే సినీ తారలు మూడు పదుల వయసు దాటుతున్నా పెళ్లి ఊసెత్తరు. అదేమని అడిగితే కెరీర్‌లో బిజీగా ఉన్నామంటూ పోజులుకొడుతుంటారు. ఇదేవిధంగా ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా విషయంలో మాత్రం రోజుకొక వార్త వైరల్ అవతూనే ఉంది.

అయితే గతంలో ఒకసారి పెళ్లి గురించి ప్రియాంక చోప్రాను అడిగనప్పుడు తనకు నాలుగేళ్ళ వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టిందని చెప్పింది. అయితే పెరిగే కొద్ది ఆ కోరిక చచ్చిపోయింది అంది. నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని చాలా మంది పిల్లల్ని కనాలని అనిపించింది అంది. అయితే అప్పుడు నాకు పెళ్ళంటే ఏంటో కూడా తెలియదు.

పెళ్ళప్పుడు బాగా డెకరేట్ చేసుకుంటారు

పెళ్ళప్పుడు బాగా డెకరేట్ చేసుకుంటారు

ఆ వయస్సులో నాకు పెళ్లి ఆలోచన కలగడానికి ఒక్కటే కారణం. పెళ్ళప్పుడు బాగా డెకరేట్ చేసుకుంటారు. అందుకే పెళ్లి చేసుకోవాలని అనుకున్న. స్కూల్ లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీ పెట్టినా కూడా పెళ్లి కూతురు వేషమే వేసుకొని మురిసిపోయే దాన్ని. కానీ నిజజీవితంలో ఆ రోజు ఎప్పుడొస్తుందో చెప్పలేమంది. వచ్చిన రోజు మాత్రం నేను కోరుకున్న రీతిలోనే ఆడంబరంగా పెళ్లి చేసుకుంటాను కూడా అంది. ఇదంతా గతం.

నిక్ జోనాస్‌తో డేటింగ్

నిక్ జోనాస్‌తో డేటింగ్

మరి ఇప్పుడు ఈ బాలీవుడ్ భామ పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేస్తున్నట్టు లోగడ వార్తలు వచ్చాయి. ఇపుడు ఇవి నిజం చేస్తూ వీరిద్దరూ ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు న్యూస్ వైరల్ అయ్యాయి. ఇటీవల లాస్ ఏంజిల్స్ నగరంలో 'బ్యూటీ అండ్ ది బీస్ట్' లైవ్ కాన్సర్ట్‌లో ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ చెట్టాపట్టాలేసుకొని దర్శనమివ్వడమే ఇందుకు నిదర్శనం.

పలుమార్లు చక్కర్లు

పలుమార్లు చక్కర్లు

డాడ్జర్స్ స్టేడియం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు వారం రోజుల్లో ఈ జంట పలుమార్లు చక్కర్లు కొట్టిందట. ఒకరంటే మరొకరికి ప్రేమ పుట్టడంతో వారు పర్యాటక స్థలాల్లో తిరుగుతూ ప్రేమాయణం సాగిస్తున్నారని అనేక కథనాలు వచ్చాయి. హాలీవుడ్ బౌల్ లో దర్శనమిచ్చిన ఈ జంట వారంరోజుల్లోనే పలు ప్రాంతాల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.

ఇరువురి వీడియో హల్‌చల్‌

ఇరువురి వీడియో హల్‌చల్‌

ఈ మేరకు సోషల్‌మీడియాలో ఇరువురి వీడియో హల్‌చల్‌ చేస్తోంది. మ్యాచ్‌ అనంతరం బోటులో స్నేహితులతో కలసి ఇరువురూ షికారుకు వెళ్లారు కూడా. 2017లో రెడ్‌ కార్పెట్‌పై ఇరువురూ జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. జిమ్మి కిమ్మెల్‌ షోలో దీనిపై ఎదురైన ప్రశ్నకు ప్రియాంక.. ఇద్దరం రాల్ఫ్‌ లారెన్‌ డ్రెస్‌లను వేసుకున్నాం. అందుకే అలా ఫొటోలకు పోజిచ్చాం అని చెప్పింది.

రిలేషన్ షిప్ గురించి

రిలేషన్ షిప్ గురించి

ఇక హీరోయిన్ ప్రియాంక చోప్రా రిలేషన్‌షిప్, లవ్ ఎఫైర్ల గురించి ప్రశ్నలు అడిగితే చాలా తెలివిగా సమాధానాలు చెబుతూ ఉంటుంది. గతంలో ఫిల్మ్‌ఫేర్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాజీ విశ్వసుందరి తొలిసారిగా తన రిలేషన్ షిప్ గురించి ఒప్పుకుంది. తాను ఒక వ్యక్తితో చాలా కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నానంది. అయితే తాము విడిపోయాం అని చెప్పింది.

మనసుకు నచ్చలేదట

మనసుకు నచ్చలేదట

అయితే చాలా రోజులుగా తాను సింగిల్‌గానే ఉంటున్నానని.. అప్పటి నుంచి చాలా మందిని కలిశాను అని కూడా అంది. అయితే వారిలో ఎవరూ ఇప్పటి వరకు తన మనసుకు నచ్చలేదట. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరిని పడగొట్టిన ఆ లక్కీ మ్యాన్ ఎవరని అప్పట్లో అందరూ చర్చించుకున్నారు.

ఇక తాను ఇద్దరు ముగ్గురితో రిలేషన్ మెయింటేన్ చేయకుండా.... ఒక వ్యక్తితోనే రిలేషన్ నడిపానని, అతడికే తన సర్వస్వం అర్పించానని చెప్పింది.

ప్రియాంక చేతికి ఒక నల్లని దారం

ప్రియాంక చేతికి ఒక నల్లని దారం

ప్రస్తుతం హాలీవుడ్‌లో బ్రహ్మండంగా రాణిస్తున్న ప్రియాంక చోప్రా గురించి గతంలో కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. ప్రియాంక చేతికి ఒక నల్లని దారం కనిపించే సరికి ప్రియాంక పెళ్లి జరిగిపోయిందనే వార్త విస్తృతంగా ప్రచారం అయ్యింది. బహుశా ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకొన్నదేమో అని అందరూ అనుకున్నారు. ప్రియాంక అసోం టూరింజానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అసోంకు విమానంలో వెళ్తూ దిగిన ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఆమె చేతికి ఉన్న నల్లటి దారం అనేక అనుమానాలకు తెరలేపింది.

నా పెళ్లిపై ఊహాగానాలు

మంగళసూత్రంలా వున్న బ్రేస్‌లైట్‌ను చూసి ప్రియాంక చోప్రా సీక్రెట్‌గా వివాహం చేసుకుందని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ‘‘హాహాహా.. నా పెళ్లిపై ఊహాగానాలు ఎక్కువైపోయాయి.. ఇది కేవలం దిష్టి తగలకుండా గాయ్స్‌..ఇక ఆపండి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చెబుతాను. రహస్యంగా ఏమి చేసుకోను'' అని బ్రాస్లెట్‌ ఫొటోను ట్వీట్‌ చేశారు.

భరత్‌ లో నటిస్తోంది

భరత్‌ లో నటిస్తోంది

ఇక క్వాంటికో' సిరిస్‌తో హలీవుడ్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిచండం చాలా వరకూ తగ్గించేసింది. ‘క్వాంటికో' మూడో సిరీస్‌లో నటిస్తున్న ప్రియాంక చాలాకాలం తర్వాత సల్మాన్‌ ఖాన్‌కు జోడిగా ‘భరత్‌'లో నటిస్తోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2019 ఈద్‌ సందర్భంగా విడుదల కానుంది.

ప్రియాంక చోప్రా విజేతగా

ఇక వరల్డ్ సెక్సీయస్ట్ ఆసియన్ ఉమెన్‌గా కూడా ప్రియాంక చోప్రా ఎంపికైంది. ఆసియాకు చెందిన ప్రముఖ వారపత్రిక ఈస్ట్రన్‌ ఐ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో ప్రియాంకా చోప్రా విజేతగా నిలవడం గ్రేటే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హీరోయిన్లు పోటీ పడ్డ ఈ పోటీలో ప్రియాంక చోప్రా విజేతగా నిలిచింది.

సినిమాల ప్రభావం

సినిమాల ప్రభావం

ప్రియాంక చోప్రా పలు విషయాలపై కూడా చాలా ఘాటుగా స్పందిస్తుంటారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు జరగడం వెనుక సినిమాల ప్రభావముందంటే ఒప్పుకోనంది. ఇందుకు సినిమాలే కారణమైతే ముందుగా కామసూత్రను నిషేధించాలంటూ సంచలనాత్మకమైన కామెంట్ చేసింది.

వాటికంటే బోల్డ్‌గా సినిమాలేం ఉండవే

వాటికంటే బోల్డ్‌గా సినిమాలేం ఉండవే

కళలను కళలుగానే చూడాలే తప్ప.. వాటిని మరొక దానితో లింక్ పెట్టడం భావ్యం అనేది ఆమె ఓపీనియన్. కామసూత్రాలకు నెలవైన మనదేశంలో అన్నిరకాల కళలకు కొదవలేదని తేల్చేసింది. 'వాత్సాయన కామసూత్రాలు' మనకో గొప్పగ్రంథం. అర్ధనగ్నంగా కనిపించే అజంతా, ఎల్లోరా శిల్పాలు మన జాతి సంపదలు. వాటికంటే బోల్డ్‌గా సినిమాలేం ఉండవే. సినిమాలను నిషేధించాలంటే... ముందు వాత్సాయన కామసూత్ర, అజంతా-ఎల్లోరా లాంటి వాటిని నిషేధించాలి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

మతులు పోగొట్టింది

మతులు పోగొట్టింది

ఆ మధ్య క్వాంటికో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా న్యూయార్క్ లోని ఓ మీడియా హౌజ్‌ కి వచ్చిన ప్రియాంక ఆల్ట్రామోడ్రన్ స్టైల్లో అదరగొట్టేసింది. ఫార్మల్ లుక్ కి కాస్త ట్విస్ట్ ఇచ్చి యూత్ మతులు పోగొట్టింది. పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుని... వైట్ కలర్ హ్యాండ్ బ్యాగుతో యమా స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చింది.

ఛాతీ భాగంలో కట్

ఛాతీ భాగంలో కట్

అయితే ఆ డ్రెస్ ఛాతీ భాగంలో కట్ చేసి ఉండటంతో చాలా మంది ట్విటర్ యూజర్స్ ఆమెను అప్పట్లో ట్రోల్ చేశారు. హృదయభాగం స్పష్టంగా కనిపిస్తుండటంపై నెటిజన్లు కాస్త ఘాటుగా స్పందించారు. ఇక గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ఆమె ధరించిన దుస్తులు కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ట్విట్టర్ అకౌంట్‌లో చాలా మంది నెటిజన్లు ప్రియాంక డ్రెస్‌పై స్పందించారు.

యూనిసెఫ్‌ బంగ్లాదేశ్‌ పిల్లల హక్కుల ప్రచారకర్తగా

ప్రియాంక చోప్రా యూనిసెఫ్‌ బంగ్లాదేశ్‌ పిల్లల హక్కుల ప్రచారకర్తగా కూడా పని చేస్తుంది. అందుకే ఆమె ఇటీవల బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్‌తో పాటు కాక్స్‌ బజార్‌లో ఉన్న బలుఖలి శరాణార్ధుల శిబిరాన్ని సందర్శించారు. ఒకవైపు హాలీవుడ్ లో మరోవైపు బాలీవుడ్ లో ఇంకోవైపు సామాజికి కార్యక్రమాలు చేస్తున్న ప్రియాంక చోప్రా నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    why priyanka chopra gets trolled by twitter users

    why priyanka chopra gets trolled by twitter users
    Story first published: Thursday, May 31, 2018, 13:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more