For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం అక్కడ నల్లదారం కట్టుకుంటే అదృష్టం, మంగళవారం ఈ పనులు చెయ్యాలి, కటింగ్ చేయకపోవడానికి కారణంఅదే

మంగళ వారం కొన్ని పనులు చేయాలి. మరికొన్ని చేయకూడదు. మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి ఆ రోజు చేసే పనులు కాస్త ఆలోచించి చేయాలి. మనుషులందరిపైనే కుజ ప్రభావం ఉంటుంది.

|

ఏదైనా శుభకార్యం తలపెట్టే సమయాల్లో మంచి రోజు చూసుకునే పద్ధతి ఆనవాయితీగా వస్తోంది. మనం ఎంచుకునే రోజులో ఏ సమయం బాగుంటుందని పురోహితుల సూచనమేరకు ఏ కార్యాన్నైనా ప్రారంభించడం అలవాటు. ఎందుకంటే? తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తి కావాలని అందరూ కోరుకుంటారు. అయితే మంగళవారం ఎలాంటి పనులను మొదలుపెట్టడం అంత మంచిది కాదని జ్యోతిష్కులు అంటున్నారు.

పెళ్లి, వ్యాపారం ప్రారంభించడం, గృహప్రవేశం చేయడం వంటి శుభకార్యాలను మంగళవారం చేయకూడదని వారు చెబుతున్నారు. అయితే మంగళవారం నాడు కూడా శుభ కార్యాలు ప్రారంభించేందుకు మంచి సమయాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.

నల్లదారం

నల్లదారం

ఇక మంగళవారం నల్లదారాన్ని అక్కడ కడితే మనం కోరిని ప్రతీది తీరతుందంట. దిష్టిని పోగేట్టేది, నరదిష్టిని ఆపే శక్తి నల్లదారానికి మాత్రమె ఉంది. ఎవరికైనా చెడు జరిగినా, ఏదైనా కీడు జరిగినా మనకు గుర్తొచ్చే రంగు నలుపు. అలాగే మనకెవరైనా చెడు చెయ్యాలని అనుకుంటే, ఆ ప్రభావం మనపై పడకుండా కూడా ఆపడానికి కూడా నల్లదారం ఉపయోగపడతుంది.

బీరువాకు కట్టాలి

బీరువాకు కట్టాలి

నల్లదారం మనకు నెగటివ్ ఎనర్జీ ని పోగొట్టి, పాజటీవ్ ఎనర్జీని కలిగిస్తుంది. ఒక్క నల్లదారం తీసుకొని ఆ దారానికి తొమ్మిది ముడులు వేయాలి. ఆ తరవాత ఆ దారానికి హనుమంతుని తిలకం రాయాలి. ఆ దారాన్ని ఇంటి మెయిన్ గుమ్మానికి కట్టి, దాని తరువాత దాన్ని డబ్బు దాచే, బీరువాకి అయినా కట్టాలి. ఇలా చేస్తే ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయి. అదృష్టం కలసి వస్తుంది. అయితే కొందరు ఆ దారాన్ని చేతికి కూడా కట్టుకుంటూ ఉంటారు.

మంగళవారం రోజున కటింగ్ ఎందుకు చేయించుకోకూడదు

మంగళవారం రోజున కటింగ్ ఎందుకు చేయించుకోకూడదు

కటింగ్ లకు రోజులు , వారాలు ,తిధులతో పనిలేదు కానీ..మంగళి వృత్తి చేసే వారికి సెలవు ఇవ్వడానికి పుట్టిందే ఆ ఆచారం. గతంలో ప్రతి సోమవారం సెలవు ఉండేదట. అందుకని చాలా మంది సోమవారం కటింగ్ చేయించుకునేవాళ్ళు. సోమవారం ఫుల్ పని చేసిన మంగళి వారికి కూడా వారంలో ఓ రోజు సెలవుండాలి కాబట్టి , అందులోనూ సోమవారం పని ఎక్కువగా చేసి బాగా అలసిపోతారు కాబట్టి.... అ మంగళవారం సెలవ్. అందుకే మంగళవారం కటింగ్ చేయించుకోవొద్దని ఓ నమ్మకం.

తలస్నానం

తలస్నానం

మాములుగా మగవారు వారం లో ఏ రోజైనా కాని తలస్నానం చేసేస్తారు.అయితే ఒదే విషయం లో మాత్రం ఆడవారికి మగవారికి చాలా తేడా నే ఉంటుంది.అవును ఆడవారు మాత్రం వారం పర్టిక్యులర్ గా కొన్ని రోజులు మాత్రమే తలస్నానం చేస్తారు.అయితే చాలా మంది దీనికి కారణం వారికి జుట్టు ఎక్కువగా ఉండడం వల్ల వారు వారం లో అలా 2,3 రోజులే చేస్తారు అనేది భావన.కాని హిందూ సంప్రదాయం లో మాత్రం దీనికి చాలా పట్టింపులే ఉంటాయి.

బుధవారం,శుక్రవారం తలస్నానం చేస్తే

బుధవారం,శుక్రవారం తలస్నానం చేస్తే

పండితులు సైతం అందరికి అలానే చెబుతూ ఉంటారు.వారి చెప్పిన దాని ప్రకారం ఈ రోజుల్లో చేస్తే చాలా మంచిది వేరే రోజుల్లో చేస్తే అరిష్టం అని చెప్తారు.అయితే మరి ఏ రోజుల్లో చేస్తే శుభం,ఏ రోజుల్లో చేస్తే అశుభం అనేది కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆడవారు బుధవారం,శుక్రవారం తలస్నానం చేస్తే మంచి కలుగుతుందని చెబుతున్నారు.

శనివారం,ఆదివారం కూడా

శనివారం,ఆదివారం కూడా

ఈ రెండు రోజుల్లో చేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం తో పాటు,ఐదోతనం కూడా మెండుగా ఉంటాయట.అలాగే ఆడవారు ఈ రోజుల్లో చేస్తే సుఖమైన జీవనం కొనసాగిస్తారని చెబుతున్నారు పండితులు.అలాగే శనివారం,ఆదివారం కూడా తల స్నానం చేయవచ్చు కాని మిశ్రమ ఫలితాలే లభిస్తాయని పండితులు చెబుతున్నారు,ఈ రోజుల్లో తలస్నానం చేస్తే కొన్ని మంచి ఫలితాలు ,అలాగే కొన్ని అరిష్టాలు కూడా జరిగుతాయని అందుకే ఏదైనా తప్పనిసరి అయితే తప్ప వీలైనంత వరకు చేయకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు.

మంగళవారం మాత్రం

మంగళవారం మాత్రం

ఇక మగవారు మాత్రం బుధవారం,శనివారం మాత్రం తప్పనిసరిగా చేయాలని వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.అయితే మంగళవారం మాత్రం ఒక్క ఆడవారే కాదు మగవారు కూడా చేయరాదట.ఎందుకంటే దీనివల్ల చాలా అశుభాలు ఉన్నాయట.ఈ రోజు చేస్తే అసలు కలసిరాదట.

సోమవారం తలస్నానం చేస్తే

సోమవారం తలస్నానం చేస్తే

అంతేకాదు పొరపాటున చేసినా కాని ఏ పని తలపెట్టినా కాని కల్సిరాకపోవడం ,ఏదైనా ప్రారభించే ముఖ్యమైనా కార్యక్రమం కూడా మంచి ఫలితాలను ఇవ్వదట. సోమవారం తలస్నానం చేస్తే పాపం పెరుగుతుంది.పురుషులు శుక్రవారం మాత్రం అస్సలు తలస్నానం చేయరాదట. అయితే పండితులు చెపుతున్న దాని ప్రకారం ఆరోజుల్లో కూడా మినగయింపు ఉన్నదట.పుట్టిన రోజు,పండుగ రోజు,ఏవైనా శుభకార్యాలు అయితే చేయవ్చ్చట.కాబట్టి ఏరోజు తలస్నానం చేస్తే మంచిదో తెలుసుకుని ఆరోజు చేస్తే మంచిదని చెబుతున్నారు.

కొన్ని పనులు చేయాలి

కొన్ని పనులు చేయాలి

ఇక మంగళ వారం కొన్ని పనులు చేయాలి. మరికొన్ని చేయకూడదు. మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి ఆ రోజు చేసే పనులు కాస్త ఆలోచించి చేయాలి. మనుషులందరిపైనే కుజ ప్రభావం ఉంటుంది. కుజుడు కన్ను పడితే అన్నీ ప్రమాదాలు.. కలహాలే కలుగుతాయి.

గోళ్ళు కత్తిరించడం

గోళ్ళు కత్తిరించడం

మంగళవారం గోళ్ళు కత్తిరించడం, క్షవరం అలాంటివి చేయకూడదు..మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రావడం చాలా కష్టం..అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు, అనవసరమైన పనులకు ఖర్చు అయిపోయి, తీరకపోయే ప్రమాదం ఉంది.

కొత్త బట్టలు వేసుకోకూడదు

కొత్త బట్టలు వేసుకోకూడదు

మంగళవారం కొత్త బట్టలు వేసుకోకూడదు..మంగళవారం అత్యవసరం అయితే తప్ప మంగళవారం ప్రయాణాలు పెట్టుకోకూడదు..మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రి ఉప్పు వేసిన పదార్ధాలు తినకూడదు. మంగళవారం తలంటు స్నానం చేయకూడదు..దైవకార్యాలకు, విద్యా వైద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చు.

ఆంజనేయుడిని ధ్యానించి

ఆంజనేయుడిని ధ్యానించి

ఇక మంగళవారం కూడా కొన్ని పనులు చేయాలి. మంగళవారం ఆంజనేయుడిని ధ్యానించడం వలన ధైర్యం చేకూరి, అన్ని పనులు అవుతాయి. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు.

కాళికాదేవిని ధ్యానించడం

కాళికాదేవిని ధ్యానించడం

మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది. మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్ధించడం చేస్తే మంఛి ఫలితం ఉంటుంది.

కుజగ్రహం

కుజగ్రహం

జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు. .హనుమంతుడికి సింధూరంతో పూజించడం వలన, సుబ్రమణ్యస్వామికి పదకొండు ప్రదక్షణలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది.

English summary

why tuesday is considered as inauspicious day

why tuesday is considered as inauspicious day
Story first published:Saturday, June 9, 2018, 11:45 [IST]
Desktop Bottom Promotion