For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమె రెస్టారెంట్ లోనే ప్రసవించింది, అయితే పుట్టిన అమ్మాయికి బంఫర్ ఆఫర్స్ ఇచ్చారు

అది టెక్సాస్‌ నగరం. సమయం రాత్రి పది గంటలు. అక్కడి శాన్‌ ఆంటోనియోకి చెందిన ఇద్దరు భార్యాభర్తలు హాస్పిటల్ కు బయల్దేరారు. వారి పేర్లు రాబర్ట్‌ గ్రిఫిన్‌ , మాగీ( ఫలాన్ గ్రిఫిన్). మ్యాగీకి నెలలు నిండాయి.

|

ప్రసవం అనేది ప్రతి మహిళకు పునర్జన్మలాంటింది. ఆ వేదన ఆ తల్లులకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. సాధారణంగా రెస్టారెంట్ లలో ఫుడ్ డెలవరీ చేస్తారు కానీ ఆ రెస్టారెంట్ ప్రసవవేదనతో బాధపడుతున్ననిండు గర్భిణీకి డెలివరీ చేశారు. ఆమె సుఖ ప్రసవం అయ్యేలా చేసి అందరి అభినందనలు పొందుతున్నారు.

నొప్పులు రావడంతో

నొప్పులు రావడంతో

అది టెక్సాస్‌ నగరం. సమయం రాత్రి పది గంటలు.

అక్కడి శాన్‌ ఆంటోనియోకి చెందిన ఇద్దరు భార్యాభర్తలు హాస్పిటల్ కు బయల్దేరారు. వారి పేర్లు రాబర్ట్‌ గ్రిఫిన్‌ , మాగీ( ఫలాన్ గ్రిఫిన్). మ్యాగీకి నెలలు నిండాయి. ఇంట్లో కాస్త చిన్నగా నొప్పులు రావడంతో ఆమెను భర్త గ్రిఫిన్ ఆసుపత్రికి తీసుకుని వెళ్తున్నాడు.

మరింత ఎక్కువయ్యాయి

మార్గ మధ్యలో మాగీకి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. దాంతో పాటు ఆమెకు బాత్రూమ్ కు కూడా వెళ్లాలని అనిపించింది. రాబర్ట్ గ్రిఫిన్ కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రోడ్డు పక్కనే ఒక రెస్టారెంట్ ను చూశాడు రాబర్ట్ గ్రిఫిన్. అప్పుడే రెస్టారెంట్ డోర్స్ క్లోజ్ చేశారు. గ్రిఫిన్ రెస్టారెంట్ డోర్స్ కొట్టాడు. సిబ్బంది బయటకు రావడంతో వారికి అసలు విషయం చెప్పాడు గ్రిఫిన్.

డెలివరీ చేశారు

అక్కడున్న కొందరు సిబ్బంది మ్యాగీని రెస్టారెంట్ లోని వాష్ రూమ్ లోకి తీసుకెళ్లి డెలివరీ అయ్యేలా చేశారు. ఆ రెస్టారెంట్ పేరు చిక్‌ ఫిల్‌ ఏ రెస్టారెంట్‌. అలా ఆ సిబ్బంది సిబ్బంది మ్యాగీకి డెలివరీ చేశారు. మ్యాగీ ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది.

జీవితాంతం ఉచితంగా అందజేస్తాం

అంతేకాదు ఆ పాపకు రెస్టారెంట్ మేనేజర్ బంఫర్ ఆఫర్స్ ఇచ్చాడు. ఈ అమ్మాయి మా రెస్టారెంట్ లో జన్మించడం అదృష్టం అని అన్నాడు. ఆ అమ్మాయికి అవసరమైన టవల్స్ ఇతర సామాగ్రి క్షణాల్లో తెప్పించాడు మేనేజర్. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చిన్నారికి గ్రేస్ లైన్ అనే పేరు పెట్టారు. ఆ అమ్మాయికి తమ రెస్టారెంట్ లో నచ్చిన ఫుడ్ ను జీవితాంతం ఉచితంగా అందజేస్తామని రెస్టారెంట్ మేనేజర్ హామీ ఇచ్చాడు. అంతేకాదు ఆమె పెద్దగయ్యాక జాబ్ చేయాలనకుంటే తమ రెస్టారెంట్ లో జాబ్ కూడా ఇస్తామని చెప్పారు.

సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో

సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో

అలా డెలివరీ చేయడంతో పాటు ఆ అమ్మాయికి బంఫర్ ఆఫర్లు ఇచ్చి అందరి మన్సు దోచుకుంది రెస్టారెంట్. ఇక ఇప్పుడు ఈ టాఫిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది రెస్టారెంట్ సిబ్బంది చేసిన మేలును ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. రెస్టారెంట్ సిబ్బంది చేసిన మేలును ఎప్పటికీ మరిచిపొమ్మని రాబర్ట్ గ్రిఫిన్, మాగీ (ఫలాన్ గ్రిఫిన్) ఆనందం వ్యక్తం చేశారు.

English summary

woman gives birth in restaurant baby gets perks

woman gives birth in restaurant baby gets perks
Desktop Bottom Promotion