For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఇది కథ కాదు : కృత్రిమ ముక్కుతో జీవనం

  |

  కుక్కలను ప్రేమించే ఒక మహిళ జీవితం: ఒక సంతోషకరమైన సమయం ఆవిడ జీవితాన్నే మార్చేసింది. స్నేహపూర్వకంగా పెంపుడు కుక్క మీదకు దూకితే, అది ఆవిడ ముఖాన్ని , ముక్కును గాయం చేసింది. తద్వారా ముక్కును పూర్తిగా తొలగించి కృత్రిమ ప్రోస్థెటిక్ ముక్కును ఏర్పరచవలసిన పరిస్తితి నెలకొంది.

  ఇది జేన్ హార్డ్మన్ అనే మహిళ కథ, ఇప్పుడు ఆవిడ జీవితం కృత్రిమ ముక్కుతో కొనసాగుతూ ఉంది.

  Story Of The Woman Whose Nose Was Bitten By A Dog!

  ఈవిడ చెప్పిన కథనం ప్రకారం, 2 సంవత్సరాలు పూర్తిగా వాసన అనే పదానికే దూరమయ్యానని, ఇదొక్కటే కాదు ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపింది. ఆవిడ గురించి పూర్తిగా తెలుసుకోండి.

  సరదాగా ఆడిన ఆటే ఈ పరిస్థితికి కారణం:

  సరదాగా ఆడిన ఆటే ఈ పరిస్థితికి కారణం:

  తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ, సరదాగా దానిపైకి దూకిన సమయంలో, బెదురుతో ఆ కుక్క, జేన్ ముక్కును గాయపరచింది. కానీ ఈ పరిణామం గాయంతో ఆగలేదు, శరీరంలోని రోగ నిరోధక శక్తిని సైతం ప్రభావితం చేసే " వెజనర్స్ గ్రాన్యులోమాటోసిస్" అనే రోగానికి కూడా గురైంది.

  నిజానికి ఈ విషయం గురించిన ఆలోచనను కూడా పక్కన పెట్టింది:

  నిజానికి ఈ విషయం గురించిన ఆలోచనను కూడా పక్కన పెట్టింది:

  కుక్కలన్నాక గాయం చేస్తాయి, అది వాటి సహజ గుణం అన్న భావనతో తనకు తగిలిన గాయాన్ని కూడా పట్టించుకోలేదు జేన్. కానీ విచిత్రంగా 6 నెలల తర్వాత క్రమక్రమంగా ముక్కునుండి రక్తం కారడం, తద్వారా అనేక క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనడం జరిగింది. వెంటనే తన పరిస్తితి గురించి నిపుణుల దృష్టికి తీసుకెళ్లింది.

  డాక్టర్లు కూడా చేతులెత్తేశారు :

  డాక్టర్లు కూడా చేతులెత్తేశారు :

  జేన్ పరిస్తితి చూసిన డాక్టర్లు, పరిస్తితి తీవ్రతరాన్ని చూసి ముక్కును తీసెయ్యడమే చివరి మార్గంగా సూచించారు. కానీ దానికన్నా ముందే "Wegener's granulomatosis" రోగాన్ని తగ్గించవలసిన అవసరం నెలకొంది. దీనికి సరైన సమయంలో చికిత్స ప్రారంభించకుంటే మరణానికి కూడా దారి తీసే పరిస్థితులు ఉంటాయి.

  జీవితం ఇప్పుడిలా ...

  జీవితం ఇప్పుడిలా ...

  జేన్ ఇప్పుడు కృత్రిమ ప్రోస్థేటిక్ ముక్కును కలిగి ఉంటుంది. దీనిని ప్రతిరోజూ రాత్రి వేళల నిద్రకు ఉపక్రమించే ముందు తీసివేసి, ఒక ప్లాస్టర్ ద్వారా ముక్కు రంద్రాలను కప్పి ఉంచుతుంది. ప్రతిరోజూ ఈ ముక్కు రంద్రాలను శుభ్రం చేయవలసి ఉంటుంది. దీనికి కారణం ప్రతి మనిషిలాగే మ్యూకస్ ఏర్పడుతుంది కాబట్టి. కానీ తన వరకు కాస్త క్లిష్టమైన ప్రక్రియే.

  తన పరిస్థితి మీద తానే జోక్స్ వేస్తుంది:

  తన పరిస్థితి మీద తానే జోక్స్ వేస్తుంది:

  ఇంతటి పరిస్తితి ఎదురైనా తన హాస్య చతురతను మాత్రం వీడలేదు జేన్. ఎప్పటికప్పుడు తుమ్మినప్పుడు తన ముక్కు ఎక్కడ పడిపోయిందో అందరికీ చెప్తూ నవ్విస్తూ ఉంటుంది. అనేకమంది చిన్న చిన్న విషయాలకు సైతం ఏదో కోల్పోయిన భావనలో గడుపుతుంటారు మరి, ఇంత పరిస్థితిని ఎదుర్కొన్న జేన్ హాస్యంతో భాధలను పక్కన నెట్టే ప్రయత్నం చేస్తుంది.

  ఇప్పుడు జేన్ ఏం చేస్తుంది అంటే ... !

  ఇప్పుడు జేన్ ఏం చేస్తుంది అంటే ... !

  కీమోథెరపీ లాంటి ప్రక్రియలు అనేకం పూర్తి చేసుకున్నాక, అనేక కష్టాలను ఎదుర్కుని ఈ ప్రోస్థెటిక్ ముక్కును అమర్చుకున్న జేన్, ఈ ముక్కును నా నిజమైన ముక్కువలె ఎంతో ప్రేమిస్తున్నానని, కానీ ఇంతకు ముందు నా ముక్కు కాస్త పెద్దదిగా ఉండేదని, అందువలన తనను అందరూ concord అని పిలిచేవారని చెప్తుంటుంది.

  మీ జీవితం మీకు నిమ్మకాయలను ఇస్తే, మీరు నిమ్మరసం చేసుకోండి . అంటూ తన భావాలను హాస్య చతురతని జోడించి చెప్తూ, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారిలో మానసిక బలాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉంది జేన్.

  English summary

  Story Of The Woman Whose Nose Was Bitten By A Dog!

  Jayne Hardman is a 48-year-old woman who has her nose removed and replaced with a prosthetic one. She suffered from a rare condition known as "Wegener's granulomatosis", after she had a bite from her dog. It was revealed that if she did not get it treated, it would become deadly. Apparently, she removes the nose each night before bed.
  Story first published: Tuesday, April 10, 2018, 18:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more