For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఇది కథ కాదు : ఆవిడ పైకి లేచిన ప్రతిసారీ కిడ్నీ పొత్తి కడుపులోకి వెళ్తుంది

  |

  నిజంగా వినడానికే భయానకంగా అనిపించే ఇటువంటి అరుదైన సమస్యను ఒక మహిళ ఎదుర్కొంటుంది అంటేనే చాలా భాదాకరమైన విషయం. కిడ్నీ జారడం, అనేది నిజంగానే ఎప్పుడూ వినని చిత్రమైన సమస్య. వివరాలలోకి వెళ్తే, పైకి లేచిన ప్రతిసారీ కిడ్నీ జారి ఆ మహిళ అంతర్గత భాగాలలోనికి చేరుతూ ఉంది.

  ఈ పేరు తెలీని 28 సంవత్సరాల వయసు కలిగిన మహిళ అనుభవిస్తున్న వింతైన పరిస్థితిని గురించిన వివరాలు మీకోసం. ఈ మహిళ పైకి లేచిన ప్రతి సారి కిడ్నీ పొత్తికడుపులోనికి జారుతూ ఉంది.

  కొన్ని సెక్యూరిటీ కారణాల వలన పేరు బయట పెట్టని ఈ మహిళ మిచిగాన్ లో నివస్తుంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న ఆ మహిళ, పైకి లేచిన ప్రతిసారి పొత్తికడుపులో నొప్పిని అనుభవిస్తూ వచ్చేది. తద్వారా వైద్యులని సంప్రదించి, పైకి లేచి నిలబడినప్పుడు లేదా పడుకున్నప్పుడు , ఒక బంతి వంటి పదార్ధం కడుపులో తిరుగుతున్న భావనకు లోనవుతున్నట్లుగా తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం ఆ “ బంతి” మరేదో కాదు, ఆ మహిళ కుడివైపు మూత్ర పిండం అని కనుగొన్నారు.

  Woman Whose Kidney Was Floating Every Time She Stood

  తద్వారా ఈ వింతైన సంఘటన గురించిన వివరాలను ఆ మహిళ ముందు ఉంచారు. మీ శరీరంలో కిడ్నీ పొత్తికడుపులోకి జారుతూ ఉంది అని.

  స్పష్టంగా ఈ మహిళ 6 సంవత్సరాల పాటు ఈ పరిస్థితిని ఎదుర్కొనింది కూడా. క్రమoగా కుడివైపున పొత్తికడుపులో నొప్పిని భరిస్తూ వచ్చింది. ఒక్కోసారి తీవ్రంగా నొప్పి వచ్చేదని, అటువంటి సందర్భాలలో పడుకోవడం ద్వారా కాస్త ఉపశమనం లభించేదని తెలిపింది. కానీ ఈ మహిళ కథనం ప్రకారం, తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఈ సమస్య నెమ్మదిగా తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది.

  మొదటగా వైద్యులు ఆ మహిళను పరీక్షించినప్పుడు , ఏ విధమైన ఆలోచనలను చేయలేకపోయారు. అనగా దీని చికిత్సా విధానం కూడా అర్ధం కాలేదు. మామూలుగా ఉన్న వేళల్లో తీసిన స్కాన్ ప్రకారం కిడ్నీలు అవి ఉండవలసిన ప్రాంతంలోనే కనిపించేవి, కానీ ఆవిడ పూర్తిగా లేచి నిలబడి ఉన్న సమయంలో కుడివైపు కిడ్నీ పొత్తికడుపులోకి వెళ్ళినట్లు స్కానింగ్ లో కనిపించింది. తద్వారా కిడ్నీ పొత్తికడుపులోకి జారుతూ మరలా తిరిగి యదాస్థానానికి వస్తున్నట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.

  ఈ పరిస్థితిని “ ఫ్లోటింగ్( జారడం)” లేదా “వాండరింగ్ (చంచలన తత్వం)” గా భావించి, వైద్య పరిభాషలో “నేఫ్రోప్టోసిస్” గా తేల్చారు. ఎవరైనా లేచినప్పుడు పొత్తికడుపులోనికి మూత్రపిండాలు జారడం వంటి సమస్యలను ఎదుర్కొంటే, వాటిని నెఫ్రోప్టోసిస్ గా పిలుస్తారు.

  వైద్యుల ప్రకారం ఈ పరిస్థితి ఎక్కువగా శరీరంలో క్రొవ్వు అసాధారణ పరిస్థితుల మూలంగా వస్తుందని తెలిపారు. మూత్రపిండాలు సాధారణంగా వాటి చుట్టూతా కొవ్వును కలిగి ఉంటాయి, కానీ మూత్రపిండాలు ఉంచడానికి తగినంత కొవ్వు లేకపోతే, గురుత్వాకర్షణ కారణంగా ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు, లేదా లేచినప్పుడు అది పొత్తికడుపులోకి వస్తుంది. ఇలాంటి పరిస్థితి అత్యంత సన్నగా ఉండేవారిలో కనపడే అవకాశాలు ఉన్నాయి. కాని ఇది అరుదైన ఘటనగా చెప్పబడింది.

  వైద్యుల ప్రకారం, కుడి వైపు కిడ్నీ కనీసం 2 ఇంచుల కిందకు జారడం జరిగింది. అనగా ఇంచుమించు 6 సెంటీమీటర్లు. తద్వారా ఆ మహిళ లేచినప్పుడు, పడుకున్నప్పుడు ఇతర అంతర్గత భాగాలకు తగలడం ద్వారా నొప్పి తీవ్రమయ్యేది. ముఖ్యంగా పడుకున్న తర్వాత పైకి లేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా ఉండేది.

  ఈ పరిస్థితిని చక్కబెట్టే క్రమంలో భాగంగా వైద్యులు సర్జరీ కు ఉపక్రమించవలసి వచ్చింది. దీనిని నెఫ్రోపెక్సీ గా పిలుస్తారు.

  వైద్యుల నివేదికల ప్రకారo, పొత్తికడుపుమీద కొన్ని కోతలు కోసి, మూత్రపిండాలకు కొన్ని కుట్లు వేయడం ద్వారా బాహ్య ఉపరితలాన్ని నింపగలిగారు. నెమ్మదిగా ఆవిడ శరీరం వెనుక భాగాన ముడిపడి స్థిరంగా ఉండగలిగింది. తద్వారా కిడ్నీ ఒకే చోట ఉండడం వలన, క్రిందకు జారే సమస్య నుండి బయట పడగలిగింది.

  ఈ ఆపరేషన్ పూర్తయ్యాక మళ్ళీ అటువంటి నొప్పిని ఎన్నడూ ఎదుర్కొనలేదు కూడా, తద్వారా ఆరోగ్యకర జీవనానికి పునాది పడినట్లైంది.

  నిజానికి మానవశరీరం అంటేనే ఒక యంత్రం వంటిది, ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా శరీరం మొత్తానికి మానసికంగా శారీరికంగా సమస్యలు సృష్టిస్తుంది. కానీ కొన్ని సమస్యలకు నివారణా చర్యలు ఉన్నా, కొన్ని మాత్రం ప్రయోగ దశలలోనే ఉన్నాయి. అత్యంత భాదాకరమైన విషయం ఏమిటంటే, మారుతున్న కాలానుగుణంగా మందులు పెరిగే కొలదీ జబ్బులు కూడా పెరుగుతున్నాయి. ఈ కాలంతో పోటీ పడలేక, ఆరోగ్యకర జీవన శైలికి దూరంగా, సరైన ఆహార ప్రణాళిక లేకపోవడం ద్వారా, మరియు కాలుష్య కోరలకు గురైన ప్రపంచీకరణ కారణంగా అనేక కొత్త కొత్త సమస్యలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.

  అవగాహన ఉన్న వారు నలుగురికి మంచి చెడుల గురించిన చెప్పాల్సింది పోయి, తమకేమీ పట్టనట్లుగా ఉండడం కూడా కొన్ని సమస్యలు పెరగడానికి కారణం. కొన్ని సమస్యలైతే డాక్టర్లు పరీక్షలు చేసి తేల్చే దాకా ఎటువంటి సంకేతాలను ఇవ్వకపోవడం కారణంగా, జబ్బు ముదిరి ప్రాణాంతకాలుగా కూడా పరిణమిస్తున్నాయి. ఒకప్పుడు వయసుతో పాటు జబ్బులు అనేవారు, కానీ వయసుతో సంబంధం లేకుండా జబ్బులతో కాలం వెళ్లదీసే స్థితికి మనం చేరుకున్నామంటే, ప్రపంచీకరణ మనకు మేలు చేసినట్లా లేక కీడు చేసినట్లా అన్న అనుమానం కలుగక మానదు. మనిషి ఆయుర్దాయం నానాటికీ తగ్గుతూ రావడం చూస్తుంటే ఏం సాధించాం చివరికి అని అనిపిస్తుంది.

  ఇలాంటి అనేక వింత కథలను గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే మా ఈ పేజీని క్రమంతప్పకుండా చూస్తుండండి. ఇలాంటి అనేక వింతలను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుటకు ప్రయత్నిస్తూనే ఉంటాము.

  English summary

  Woman Whose Kidney Was Floating Every Time She Stood

  A woman experienced weird pain and this was something that was unbearable. She could not understand about the weird feeling of a ball floating inside her was until the doctors discovered about the bizarre state of floating kidney. It is one of the most bizarre and rare conditions that occurs in humans.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more