For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ : పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్ పై సమాజంలో మార్పును తేవాలని ప్రయత్నిస్తున్న మాతృమూర్తి

|

"ప్రతిసారి ఆరోగ్యకరమైన నేషన్ ని నిర్మించాలని మనం మాట్లాడుతూ ఉంటాము. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇందుకు ఫౌండేషన్ గా వ్యవహరిస్తుంది." అంటున్నారు రియల్ లైఫ్ హీరో అయిన మాతృమూర్తి. తన ఇన్స్టాగ్రామ్ లో ఈ థీమ్ కు సంబంధించి సెన్సేషనల్ ఫోటోస్ ను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ విషయంపై అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ రోజు నుంచి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే మొదలైంది. ఈ విషయం గురించి ఆర్టికల్స్ చదివీ చదివీ మీరు అలసిపోయి ఉండుంటారు. అయితే, ఈ పోస్ట్ మీకు ఆ అలసటను దూరం చేస్తుంది. ఇక్కడ మీకొక్క ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ను పరిచయం చేస్తున్నాము. బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో సాధారణంగా పాతుకుపోయిన దృష్టికోణాన్ని మార్చాలని ప్రభంజనం చేస్తున్న ఓ మహిళామణి ప్రొఫైల్ ను మీకు తెలియచేస్తున్నాము.

World Breastfeeding Week: A Mother Who Is Trying To Change The Way We Look At BREASTS

తన పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న సమయంలో తీసుకున్న ఫోటోస్ ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచాన్నే షాక్ కు గురిచేసింది. ఆవిడతో బోల్డ్ స్కై టచ్ లోకి వెళ్ళింది. బోల్డ్ స్కై ఆవిడతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకుంది. ఆవిడే కామనా గౌతమ్. ఆవిడతో సంభాషించిన విషయాలను ఇక్కడ మీకోసం అందిస్తున్నాము.

హైదరాబాద్ కి చెందిన హోమ్ మేకర్, సోషల్ వర్కర్, ఇద్దరి పిల్లల తల్లైన కామనా గౌతమ్ కి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. తల్లైన తరువాత ఆరోగ్యంపై శ్రద్ధ మరింత ఎక్కువైంది. ల్యాక్టేషన్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుంది.

ప్రశ్న: మీరు చేస్తున్న పని గురించి అలాగే ఈ పనికి సంబంధించిన ఐడియా మీకెలా వచ్చిందో తెలియచేయండి?

ప్రశ్న: మీరు చేస్తున్న పని గురించి అలాగే ఈ పనికి సంబంధించిన ఐడియా మీకెలా వచ్చిందో తెలియచేయండి?

జ: పబ్లిక్ హెల్త్ గురించి అందుకు సంబంధించిన అవెర్నెస్ ను స్ప్రెడ్ చేయడం కోసం కొన్నాళ్లుగా పనిచేస్తున్నాను. అయితే, మాతృత్వాన్ని 2014లో పొందిన తరువాత బ్రెస్ట్ ఫీడింగ్ కి సంబంధించిన ప్రాముఖ్యత అర్థమైంది. అయితే, బ్రెస్ట్ ఫీడింగ్ కి సంబంధించిన ఒక దృష్టికోణం నన్ను బాగా కలచివేసింది. బ్రెస్ట్ ఫీడింగ్ ని నార్మలైజ్ చేయాలని ప్రయత్నం ప్రారంభించాను. ఇంస్టాగ్రామ్ లో ఈ విషయంపై న నా జర్నీ ప్రారంభమైంది. పిల్లలకి పాలివ్వడం అంతగా దాచివుంచాల్సిన విషయం కాదు. ఈ విషయంపై అవెర్నెస్ ను క్రియేట్ చేయడం ప్రారంభించాను. ఈ విషయాన్ని రిలయలైజ్ అయిన వారు నాతో జాయిన్ అవుతున్నారు.

ప్రశ్న: మీ భర్త మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారా?

ప్రశ్న: మీ భర్త మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారా?

జ: మావారి నుంచి నాకు బ్రహ్మాండమైన మద్దతు అందుతోంది. ఈ విషయంలో అయన మద్దతు ఉండబట్టే నేను ఈ విషయంపై అవేర్నెస్ ను అందించేందుకు మనఃస్ఫూర్తిగా ముందుకెళుతున్నాను. నిజానికి, అయన మద్దతు వలెనే నేను నా పనిని డేడికేటెడ్ గా చేసుకోగలుగుతున్నాను. పిక్చర్ ని పోస్ట్ చేసేటప్పుడు కూడా అయన అనుమతిని తీసుకోలేదు. ఎందుకంటే, ఆయన నా అభిప్రాయాన్ని గౌరవిస్తారన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని అయన నిలబెట్టారు.

ప్రశ్న: ఈ ఆలోచన గురించి మీరు మొదట ఏమని అనుకున్నారు?

ప్రశ్న: ఈ ఆలోచన గురించి మీరు మొదట ఏమని అనుకున్నారు?

నేను మహిళలపట్ల అలాగే అమ్మల పట్ల ఎంతో ఎంపెథెటిక్ గా ఉండేదాన్ని. నా మొదటి బిడ్డకు జన్మనిచ్చాక ఎంతో మంది మాతృమూర్తులు పడుతున్న స్ట్రగుల్ నాకు అర్థమవడం మొదలైంది. బ్రెస్ట్ ఫీడింగ్ ను ఒక అబ్నార్మల్ థింగ్ గా సమాజంలో భావన ఉండటం నన్ను కలచివేసింది. తల్లి పాలే శిశువు ఆరోగ్యానికి మంచిదన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. తల్లిపాలు శిశువుకు సవ్యంగా అందితే శిశువు ఆరోగ్యంగా ఎదుగుతుంది. శిశువులు తల్లిపాలనే ఇష్టపడతారు. తల్లిపాల ద్వారానే వారికి పోషణ లభిస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు. మరి అటువంటి నవసమాజ నిర్మాణం కోసం తల్లిపాలను శిశువుకు అందేలా చేసే బాధ్యత ఉంది. తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని తప్పు దృష్టితో చూడకూడదు. అనవసరపు కామెంట్స్ ను చేయకూడదు. ఈ విషయంపై అవేర్నెస్ పెరగాలి. శిశువులు తల్లిపాలను తప్పితే ఏదీ తీసుకోలేరు. మరి, శిశువుకు పాలిచ్చేటప్పుడు తల్లినీ బిడ్డను ఇబ్బందికి గురిచేస్తుంది ఈ సమాజం. తల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఒక గదికే వారిని పరిమితం చేస్తున్నారు. శిశువుకు సమయానికి పాలు అందకపోతే జరిగే ప్రమాదం గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు. శిశువు రోగనిరోధక శక్తిపై దుష్ప్రభావం పడుతుంది. ఒత్తిడివలన తల్లిలో మిల్క్ సప్లై తగ్గిపోతుంది. శిశువుకు పోషకాలు సవ్యంగా అందవు.

ప్రశ్న: మీరు పబ్లిక్ గా బ్రెస్ట్ ఫీడ్ చేశారా?

ప్రశ్న: మీరు పబ్లిక్ గా బ్రెస్ట్ ఫీడ్ చేశారా?

పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్ పై సమాజంలో ఉన్న అభిప్రాయం గురించి నన్నుబాధిస్తోంది. న్యూ బర్న్స్ కి గంట గంటకూ పాలివ్వాలి. ప్రతిసారి రూమ్ లో లాకై ఉండి పాలివ్వడం కుదరకపోవచ్చు. కాబట్టి, శిశువులకు పాలందవు. పబ్లిక్ లో తల్లి పాలిచ్చేటప్పుడు వ్రికృతమైనా చూపులకు మహిళలు భయపడతారు. బ్రెస్ట్స్ అనేవి శిశువుకు ఆహారాన్ని అందించేందుకు తోడ్పడేవని గుర్తించాలి. ఆడదాని శరీరాన్ని సెక్స్వుల్ ఆబ్జెక్ట్ గా చూసే తీరు మారాలి. అందువలన, ఈ విషయంలో సమాజంలో అవగాహన రావడానికి ఇంస్టాగ్రామ్ లో ఫోటోస్ ను పోస్ట్ చేస్తున్నాను. ఎక్కువమంది మారతారని ఆశిస్తున్నాను.

ప్రశ్న: సోషల్ మీడియా ఆడియెన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది?

ప్రశ్న: సోషల్ మీడియా ఆడియెన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది?

జ: పిక్చర్స్ ని పోస్ట్ చేస్తున్న కొత్తలో అసభ్యకర మెసేజెస్ వచ్చేవి. ఒక మహిళ అర్థనగ్నంగా పోజులిస్తుందని భావించేవారు. తనతో అసభ్యకరంగా మాట్లాడవచ్చని భావించేవారు. తరువాత, జడ్జ్ చేయడం ప్రారంభించారు. ఫొటోస్ తో అటెన్షన్ ను గ్రాబ్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని అనేవారు.

ప్రశ్న: మీరెలా డీల్ చేసేవారు?

ప్రశ్న: మీరెలా డీల్ చేసేవారు?

హేటర్స్ ను ఇగ్నోర్ చేసేదాన్ని. హేటర్స్ మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. సాధారణ పిక్చర్ ని పోస్ట్ చేసిన వారిని జడ్జ్ చేయరు. ఒక మార్పును తీసుకురావాలని చేసే ప్రయత్నంలో పోస్ట్ చేసే పిక్చర్స్ వలన నన్ను జడ్జ్ చేయడం ప్రారంభించారు. పేర్లు పెట్టేవారు. వీటిని పట్టించుకునేదాన్ని కాదు.

ప్రశ్న: మీ ఇనీషియేటివ్ ఏ విధంగా ముందుకు సాగుతుందని భావిస్తున్నారు?

ప్రశ్న: మీ ఇనీషియేటివ్ ఏ విధంగా ముందుకు సాగుతుందని భావిస్తున్నారు?

జ: ప్రయాణించాల్సిన దూరం ఎంతో ఉంది. నేనొక ఇనీషియేటివ్ తీసుకున్నాను. సముద్రంలో ఒక నీటిబొట్టులాగా నా ప్రయత్నం సాగుతోంది. సమాజం అంతా మద్దతిస్తే సముద్రంలా మారుతుంది. గ్రామాలలో ఎడ్యుకేషనల్ సెషన్స్ నిర్వహిస్తున్నాను. సెమినర్స్ ను కండక్ట్ చేస్తున్నాను. ప్రజలలోంచి మద్దతు వస్తోంది. వారి పిక్చర్స్ తో పాటు నాకు మెసేజ్ చేస్తున్నారు. తొందరలో నేనొక బ్లాగ్ ను ప్రారంభించి నా అభిప్రాయాలను మీతో పంచుకుంటాను.

ప్రశ్న: మాతృమూర్తులకు మీరిచ్చే మెసేజ్?

ప్రశ్న: మాతృమూర్తులకు మీరిచ్చే మెసేజ్?

మిమ్మల్ని మీరు నమ్మండి. మీ జీవితాన్ని అందంగా మార్చుకునే సామర్థ్యం మీకుంది. మీ శరీరాన్ని గౌరవించండి!

English summary

World Breastfeeding Week: A Mother Who Is Trying To Change The Way We Look At BREASTS

We at Boldsky spoke to Hyderabad-based homemaker, social worker, Instagram influencer and a mother of two, Kamana Gautam. She says, she has always been a health enthusiast but that it's only after becoming a mother she understood the importance of lactation and breastfeeding for health. She also had strong opinions about public breastfeeding and how women should support each other.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more