మీ చిటికెన వేలు మీరెంత దాపరికం మనిషో తెలియచేస్తుంది ఇలా!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ గురించి మీరు కొత్త విషయాలు తెలుసుకోగలిగే వివిధ వ్యక్తిత్వ పరీక్షలు ఉంటాయి,అవి ఎన్నైనా మీరు ప్రయత్నించవచ్చు.

వాటిల్లో కొన్ని శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించినవి అయితే,కొన్నేమో విషయపరమైనవి. దక్షిణ కొరియాలో కనుగొనబడ్డ ఈ పరీక్ష,ప్రాచీన హస్తసాముద్రికం నుంచి అభివృద్ధి చెందినది.

ఈ పరీక్షలో,కేవలం ఒక్క విషయంతో మీ వ్యక్తిత్వపు రకాన్ని,దాని లక్షణాలను చెప్పేయవచ్చు,అదే మీ చిటికెన వేలు !

Your Little Finger Reveals How Secretive You Are!

ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? ఒక వ్యక్తి తీరును స్వభావాన్ని చిటికెన వేలు పరిమాణంతో నిర్ణయిస్తారా? అవును, అది తెలుసుకోగలం,మరియు చిటికెన వేలు పరిమాణం ముఖ్యంగా ఒక వ్యక్తి స్వభావాన్ని,అతను ఎలా మరొకళ్ళతో ప్రవర్తిస్తాడు,చుట్టూ వారితో ఎలా మెలగుతాడు వంటి విషయాలు తెలియచేస్తుంది.

మీ చిటికెన వేలు పొట్టిది !

మీ చిటికెన వేలు పొట్టిది !

మీ చిటికెన వేలు చివర,మీ ఉంగరపు వేలు పై కణుపు కన్నా కింద ఉన్నట్లయితే, మీరు సిగ్గరి,ఇతరులతో కలవడానికి ఇబ్బందిపడే వ్యక్తి అని అర్థం.దాని అర్థం మీరు పెద్దకలలను కనే వ్యక్తి కానీ మీ మౌనస్వభావంతో వాటిని నెరవేర్చుకోడానికి కష్టపడుతుంటారు.

మీ చిటికెన వేలు పొడుగు !

మీ చిటికెన వేలు పొడుగు !

మీ చిటికెన వేలు ఉంగరపు వేలు పై కణుపుకన్నా దాటి పొడుగ్గా ఉంటే, దాని అర్థం మీరు ఆకర్షణీయులు మరియు స్నేహశీలి.కానీ అన్నిట్లో మీకు అదృష్టం కలిసిరాదు.అందుకని మిగతా రకాల వారికన్నా మీరు కష్టపడి పనిచేసి మిమ్మల్ని మీరు నమ్మకస్తులుగా నిరూపించుకోవాలి.

మీ చిటికెన వేలు మరింత పొట్టిగా ఉంది !

మీ చిటికెన వేలు మరింత పొట్టిగా ఉంది !

ఈ రకాన్ని విశ్లేషించటానికి,మీ అరచేయిని ఒకసారి చూడండి. అన్ని వేళ్ళూ కలిసి అర్ధవృత్తంగా కన్పిస్తూ,మీ చిటికెన వేలు మిగతా వేళ్ళకన్నా చిన్నగా కన్పిస్తుందా?దాని అర్థం మీరు అనేక ఆలోచనలతో,ఆశయాలతో కలల ప్రపంచంలో విహరిస్తుంటారు.కానీ నిజ ప్రపంచంలో వాటిని నిజం చేయటానికి కష్టపడుతుంటారు.

మీ చిటికెన వేలు ఒకే పొడవుతో ఉంది!

మీ చిటికెన వేలు ఒకే పొడవుతో ఉంది!

ఇది అరుదైన రకం.కొంతమందికి వారి చిటికెన వేలు,ఉంగరపు వేలుతో సమాన ఎత్తులో ఉంటుంది.దాని అర్థం ఆ వ్యక్తులు అన్నిట్లో ఆధిపత్యం కోరుకుంటారు.వారికి అన్నీ ఒకేసారి కదిలించివేసి నాశనం చేయగల శక్తి కూడా ఉంటుంది.

మీ చిటికెన వేలు చతురస్రంగా ఉంది !

మీ చిటికెన వేలు చతురస్రంగా ఉంది !

మీ చిటికెన వేలు చివర బల్లపరుపుగా ఉండి,అడ్డగీతలా కన్పిస్తుంటే,మీ చిటికెన వేలును చతురస్ర రకంగా చెప్పవచ్చు.దాని అర్థం మీవద్ద అనేక ప్రశంసించదగ్గ లక్షణాలున్నాయి.ఒక వ్యక్తిగా మీరు సూటిగా మాట్లాడే వ్యక్తి కావచ్చు.మీ నిజాయితీ,ముక్కుసూటి తత్వం మిమ్మల్ని నమ్మకస్తులుగా మారుస్తాయి.

మీ చిటికెన వేలు కొనదేలి ఉంది!

మీ చిటికెన వేలు కొనదేలి ఉంది!

మీ చిటికెన వేలు కొనదేలి ఉంటే దాని నలువైపులా ఏటవాలుగా కన్పిస్తుంది.ఇలా ఉన్న వ్యక్తులు అద్భుత వక్తలు మరియు రచయితలుగా రాణిస్తారు. ఎంతో వాక్పటిమ కలిగి ఉండి,సందర్భానుసారం వ్యవహరిస్తారు.

మీ చిటికెన వేలు వంపు తిరిగి ఉంది !

మీ చిటికెన వేలు వంపు తిరిగి ఉంది !

మీ చిటికెన వేలు మిగతా వేళ్ళ వైపు కానీ,దూరంగా కాని వంపు తిరిగి ఉన్నట్లయితే,దాన్ని వంకర చిటికెన వేలు అంటారు. దాని అర్థం భయం లేదా సంఘర్షణ.అంటే మీరు సాధారణంగా సంధి కుదిర్చేవారు, శాంతి పెంచేవారు, విడిపోయిన వారి మధ్య వారధిలా నిలబడేవారు.

మీ చేతిని అప్పుడే పరీక్షించుకోటం మొదలుపెట్టేసారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్'స్ సెక్షన్ లో మాతో పంచుకోండి.

English summary

Your Little Finger Reveals How Secretive You Are!

Wondering how this is even possible? How to judge a personality based on the size of the little finger? Well, it can be studied, and the size of the little finger can speak volumes about a person's personality as a whole, especially with regards to the way they communicate and interact with the people around them.