Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మీ దంతాల రూపురేఖలు మీ వ్యక్తిత్వాన్ని చెప్పగలవా?
మీ దంతాల రూపురేఖలు మీ వ్యక్తిత్వాన్ని చెప్పగలవా?
ఒకమనిషి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవడానికి అనేకపద్దతులు ఉన్నాయని మీకు కూడా తెలుసు, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన పరీక్షల ద్వారా కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేయవచ్చు.
మీ పళ్ల యొక్క రూపురేఖలు పరీక్షించడం ద్వారా కూడా మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని తెలుసా? ఈ వ్యాసంలో అది ఎలాగో మీకు తెలియజేస్తున్నాము.

మీ దంతాల ఆకారాన్ని లేదా రూపురేఖలను పర్యవేక్షించి మీలో దాగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి.

చతురస్రాకారపు దంతాలు కలిగిఉన్నట్లయితే:
చతురస్రాకారపు దంతాలను కలిగి ఉండడం అంటే మీరు సహృదయులై, సున్నితమైన మనస్సును కలిగిన వారుగా ఉంటారని చెప్పబడినది. మీరు మీ ప్రియమైన వారి నుండి ఎక్కువ ప్రేమని కోరుకుంటారు , మరియు మీరు కూడా వారి పట్ల అంతే ప్రేమని కలిగి ఉంటారు. మీరెప్పుడూ మీ ప్రేమని వ్యక్తపరచడానికి, మిమ్ములను అర్ధం చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు . మీ మరియు మీ ప్రియమైన వారి భావోద్వేగాలకు అత్యంత విలువను ఇచ్చేవారిగా ఉంటారు, మరియు మిమ్ములను భాధపెట్టిన వారిని కూడా ప్రేమించే మనస్థితి కలిగిన వారు. మీతో ఇతరులు సంభాషించుటకు కూడా సుముఖతను చూపుతూ ఉంటారు.

గుండ్రటి దంతాలు కలిగి ఉండడం:
ఇది కాస్త అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దంతాల రూపురేఖలు పూర్తిగా గుండ్రంగా కనపడకపోయినా ఇంచుమించుగా పోలి ఉంటాయి. ఇలాంటి దంతాలు కలిగి ఉన్నవారైతే మీరొక అద్భుతమైన వ్యక్తిగా చెప్పబడినది. ఎటువంటి కష్టతరమైన సమస్యలు ఎదురైనా కూడా, చిన్ని చిరునవ్వుతో పటాపంచలు చేయగలిగే వ్యక్తిత్వం మీ సొంతం. మీ క్రమశిక్షణ, దీక్ష, పట్టుదలల కారణంగా మీకు తెలీకుండానే అనేకమంది అభిమానులు ఉంటారు. మీరు సహృదయులై, భావోద్వేగాలకు విలువనిచ్చేవారిలా ఉంటారు. కానీ మీరు ఎక్కువగా ఇతరులు మీగురించి ఏమని ఆలోచిస్తున్నారో అన్న ఆలోచనను కలిగి ఉంటారు. ఇది మీ ఎదుగుదలకు అడ్డంగా ఉంటుంది. కావున ఈ ఆలోచన ఏమాత్రం కలిగి ఉన్నా కూడా, రూపు మాపే ప్రయత్నం చేయండి.
మీ మార్గంలో అనేకరకాల వ్యతిరేక మనస్కులు, ప్రతికూల ప్రభావాలను సృష్టించేవారు తారసపడుతూ ఉంటారు. కానీ వీరి వలన ఎటువంటి ఉపయోగం లేదన్న విషయాన్ని మీరు గ్రహించిన రోజున మీకు ఎటువంటి సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది.

త్రిభుజాకార దంతాలను కలిగి ఉంటే:
మీరు ఒకవేళ త్రిభుజాకార దంతాలను కలిగి ఉన్నఎడల, ఎల్లప్పుడూ ఇతరులను ఆకర్షించేలా మీ వ్యక్తిత్వం ఉంటుంది. ఏ పార్టీ లో అయినా అందరి చూపులు మీమీదే ఉండేలా కేంద్ర బిందువుగా ఉంటారు. మీలోని ఏకీకృత లక్షణాలు, ప్రత్యేకమైన వ్యక్తిత్వం చూపరులను దృష్టి మరల్చుకోనీయకుండా చేస్తుంది. మీరు ఏపనిని అయినా నవ్వుతో స్వీకరిస్తారు, సమయానుసారం పూర్తి చేస్తారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా నవ్వుతో దూరం చేయగల సామర్ధ్యం మీది. మరియు మీకు సామాజిక స్పృహ కూడా ఎక్కువగానే ఉంటుంది.

ధీర్ఘ చతురస్రాకార దంతాలను కలిగి ఉండడం:
మీరు దీర్ఘ చతురస్రాకారపు దంతాలను కలిగి ఉన్నట్లయితే, మీరు అధిక దయాగుణాన్ని కలిగిన వారుగా చెప్పబడుతున్నారు. మీకు స్వ, పర తేడా లేకుండా నలుగురికీ సహాయం చేసే గుణం ఉంటుంది. కొందరికి ఏవగింపుగా అనిపించినా కూడా, మీ మార్గంలో ఏమాత్రం అడ్డుపడలేరు. స్వచ్చమైన మనసుతో, తిరిగి ఏదీ ఆశించకుండా సహాయం చేసే మీ వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది. మీరు ఎంతో నీతి నిజాయితీలను కలిగి ఉన్నవారిగా ఉంటారు. ఎటువంటి సమస్యలనైనా మీ అంతరాత్మతో చర్చించుకున్న తర్వాతనే నిర్ణయానికి వస్తారు. సంతోషాన్ని నలుగురికీ పంచడంలోనే సంతోషాన్ని వెతుక్కునే స్వభావం కలిగినవారు. మిమ్ములను అర్ధం చేసుకోవడానికి ఇతరులకు ఎక్కువ సమయం కూడా పట్టదు.



Click it and Unblock the Notifications











