For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూలై 2018లో మీ ప్రేమ పరంగా రాశిచక్ర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

|

ఈ నెలలో అన్ని రాశిచక్ర సంకేతాలను కుజ గ్రహం ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కుజ గ్రహ ప్రభావం రాశి చక్రాలలోని ప్రేమకు సంబంధించిన అంశాల పట్ల ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

ఇక్కడ ఈ వ్యాసంలో, జూలై 2018 లో రాశి చక్రాల సంబందిత అంశాలతో పాటు, ప్రేమ సంబంధిత అంచనాలను గురించిన వివరాలను కూడా తెలుపబోతున్నాము.

Zodiac Love Predictions For July 2018

సూర్యమాన సిద్దాంతం ప్రకారం రాశి చక్రాల ఆధారితంగా ఉన్న ప్రేమ అంచనాల గురించిన వివరాలకై ఈ వ్యాసం చూడండి.

జూలై 2018లో మీ ప్రేమ పరంగా రాశిచక్ర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి:

మేష రాశి: మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి: మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశికి చెందిన వారి ప్రకారం, జూలై 2018లో కుజ గ్రహ ప్రభావం అధికంగా ఉందని చెప్పబడింది. కుజ గ్రహం కారణంగా ఆత్మవిశ్వాసం పెంపొండడం, క్రమంగా మీ నిర్ణయాల ద్వారా జీవితంలో గణనీయమైన మార్పులు జరిగే సూచనలు కన్పిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలు మీ జీవితం, గృహ సంబంధిత లేదా కుటుంబ బాధ్యతలతో నింపబడ్డాయి. కానీ ఈ జూలై 2018 లో సృజనాత్మకత జోడించబడి, పిల్లలు, శృంగారం మరియు సరదాగా ఉన్న సంబంధాల వంటి అంశాలతో నింపబడి ఈనెలలో శిఖరాగ్రంగా కనిపిస్తాయి. తమ గురించి తాము పూర్తిగా తెలుసుకోవడంలో మరియు సామర్ధ్యాలను పెంపొందించుకోవడంలో ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంటుంది. వృత్తి సంబంధిత అంశాలనందు వీరి కఠినమైన పని మరియు క్రమశిక్షణా పద్దతుల కారణంగా దీర్ఘకాలంలో బహుమానాలను పొందుతారు మరియు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మరోవైపు, ఈ నెల చివరి భాగంలో మీ భాగస్వామితో గడుపుటకు సరైన సమయంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమికులకు, పెళ్ళైన వారికి ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంది.

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి వ్యక్తులకు ప్రేమకు అనుకూలమైన గ్రహంగా శుక్ర గ్రహం ఉంది. జూలై 9 వ తేదీ నుండి వీరి శృంగార జీవితంలో అనూహ్యమైన సానుకూల మార్పులు రావడాన్ని గమనిస్తారు. ఈ ఫలితాలు ఆగస్ట్ 6 దాకా కొనసాగుతాయి కూడా. మీరు ఒంటరిగా ఉన్న వ్యక్తి అయితే, ఈ నెల మీకు అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పబడింది, ప్రేమ వ్యవహారాలనందు నిర్ణయాలు తీసుకునేందుకు సరైన సమయంగా ఉంది కూడా. మరోవైపు, మీరు ఒక సంబంధంలో ఉంటే, గురు గ్రహం జూలై 10న మీ భాగస్వామ్య రంగంలో ప్రత్యక్షంగా మారుతుంది. ఇది మీకు మీ ప్రియురాలితో నెలలో కొంత సమయం గడపడానికి అనుమతిస్తుంది.

మిధున రాశి: మే 21 - జూన్ 20

మిధున రాశి: మే 21 - జూన్ 20

మిధున రాశికి చెందిన వ్యక్తులు వారి ప్రస్తుత సంబంధంలో సానుకూలమైన అంశాలతో ముందుకు నడిచే విషయాల గురించి బ్లాక్ చేయబడవచ్చు. వారు తమ ప్రియమైన వారి అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నప్పటికీ, గందరగోళం మరియు వివాదాల నడుమ ఎక్కువగా వేడి వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. తద్వారా వారిచుట్టూతా ఉన్న ప్రపంచం వారి ఆలోచనలు మరియు నమ్మకాలను పునఃపరిశీలించి, వేరొక మార్గాన్ని చూడాలని సూచిస్తుంటుంది కూడా. మరో వైపు, వారు సరి కొత్త సృజనాత్మక ఆలోచనలకు పనిచేప్పే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు ఈ నెలలో బలహీనతలను స్వీకరించడానికి ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి. వారు తమ భాగస్వామికి తమ సొంత అవసరాలకు అధికారమివ్వడం మానివేయాలి. తమ భాగస్వామి తమ అవసరాలను తీర్చేందుకు వారు అన్నివేళలా సుముఖతను వ్యక్తం చేయలేరు.స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నారన్న భావనకు లోనుకావొచ్చు. వారు ప్రేమ పేరుతో భద్రతకు తప్పుడు భావాన్ని కల్పించారని అర్థం చేసుకోవాలి మరియు వారి స్థిరత్వాన్ని తిరిగి పొందేందుకు ఇది సమయంగా ఉంది.

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 23

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 23

సింహ రాశి వ్యక్తులకు సంబంధించిన వారి ప్రకారం, వారి భాగస్వాములకు మధ్య ఉన్న సంబంధం పట్ల చురుకైన స్వభావాన్ని మరియు జాగ్రత్తను కలిగి ఉండని ఎడల, నెల చివరినాటికి వీరి సంబంధం మరింత కఠినంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 26 బుధవారం నుండి వీరికి ప్రధాన గ్రహంగా బుధ గ్రహం ఉంటుంది., క్రమంగా కొన్ని వాదోపవాదాలకు చిరునామాగా కొంతకాలం మీ సంబంధం కొనసాగుతుంది. గ్రహ ప్రభావం వలెనే ఈ సమస్యలు అని తెలుసుకోవలసిన అవసరం ఉంది. మరియు వారి భావోద్వేగాలను నెమ్మదిస్తూ నిర్ణయాలను తెలివిగా తీసుకోవలసి ఉంటుంది.

కన్యా రాశి: ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

కన్యా రాశి: ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

కన్యా రాశి వ్యక్తుల ప్రకారం, స్వీయ ప్రతిబింబం తోడై, మరియు శృంగారం పట్ల వారికున్న మానసిక సమస్యలు తొలగి, భవిష్యత్తులో బలమైన మరియు ఆరోగ్యకరమైన ప్రేమను భాగస్వామి అందించేవారిగా తయారవుతారు. లోలోపల ఎటువంటి విషయాలనైనా దాచిపెట్టే స్వభావం నుండి, ప్రతిదీ భాగస్వామితో పంచుకునే వారిలా వీరిలో మార్పులు రావడం కనుగొంటారు. . జూలై 9 నుండి ఆగష్టు 6 వరకు వీరి ప్రేమపై శుక్ర గ్రహ ప్రభావం ఉండడం మూలంగా, భావోద్వేగాల గందరగోళానికి గురవుతారు. కానీ, భాగస్వామితో సంతోషంగా గడిపే సమయాన్ని మాత్రం అధికంగా కలిగి ఉంటారు. కొన్ని సమస్యలు తాత్కాలికంగా ఉన్నా, సంబంధం విషయంలో అంతగా ప్రభావాలను చూపించక పోవచ్చు.

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులా రాశి వ్యక్తులకు చెందిన వారి ప్రకారం, వీరి ప్రేమ జీవితం, చాలా సంతోషంగా ఆనందదాయకంగా గడుస్తూ ఉంటుంది. ప్రతిక్షణం ఆస్వాదించేలా వీరి ఆలోచనలు ఉంటాయి. ఎంతటి తీవ్రమైన పని ఒత్తిడులు ఉన్నా కూడా, భాగస్వామి లేదా తమ ప్రియమైన వారికోసం తగు సమయం కేటాయించాలి అన్న భావన మెండుగా కలిగి ఉంటారు. వీరి ఆలోచనలను తమ భాగస్వామికి అర్ధమయ్యేలా చెప్పడంలో ఎన్నటికీ విఫలంకారు. వీరు శారీరిక సంబంధాల కన్నా మానసిక సంబందాలపట్ల ఎక్కువ మక్కువని ప్రదర్శిస్తుంటారు, తద్వారా వీరి సంబంధం కూడా నలుగురికి ఆదర్శప్రాయంగా కనిపిస్తూ ఉంటుంది.

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబరు 22

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబరు 22

వృశ్చిక రాశికి చెందిన వ్యక్తుల ప్రకారం, గురు గ్రహ ప్రతికూల ప్రభావం వలన వారి భావోద్వేగ స్థాయిలు రోజురోజుకీ పెరుగుతూ కనిపిస్తుంటాయి. ఏ విషయాన్ని కూడా అంతం లేని చర్చలకు దారి తీసేలా ప్రవర్తిస్తుంటారు. తద్వారా, కొన్ని గొడవలతో వాదనలతో ఈనెల సాగుతుంటుంది. మరొక వైపు, నెల చివరిలో సంబంధంలో కొన్ని ఆశాజనక ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరమైన అంశాలలో ఎక్కువ ఒత్తిడులకు లోనవుతూ ఉంటారు, కానీ వీరి క్రమశిక్షణ, అంకితభావం ప్రతికూల అంశాలన్నింటికీ ఒక చెక్ పెట్టినట్లు కనిపిస్తాయి.

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబరు 22

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబరు 22

ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు, వృత్తి మరియు ప్రేమ సంబంధిత జూలై నెలలో కొన్ని గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. క్రమంగా భావోద్వేగాలను అణచిపెట్టుకోలేని స్థాయిలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ పరిణామాలను ఒక పాఠంగా తీసుకుని, సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషించడం మూలంగా కొన్ని ప్రతికూల ప్రభావాల నుండి బయటపడే ఆస్కారాలున్నాయి.

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

ఈ నెల మకరరాశి వారికి, ప్రేమ, వృత్తి మరియు ఆర్ధిక వ్యవహారాలనందు అత్యంత అనుకూలంగా ఉండనుంది. ఈ నెలలో వీరు భాగస్వామితో తమ సంబంధాన్ని కొత్త దశకి తీసుకుని వెళ్ళగలరు. చిరాకులు పరాకులు సర్వసాధారణమైనప్పటికీ, సంబంధాలలో అన్యోన్యత మూలంగా అధిక ప్రభావాలను చూపించలేదు.

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 18

ఈ నెల సంబంధాలలో ఆశించిన ఫలితాలు కనపడకపోగా స్వీయ రక్షణా చర్యలకు పూనుకొనవలసి ఉంటుంది. జూలై 27న వచ్చే చంద్ర గ్రహణ ప్రభావం ఈ రాశి చక్రం మీద తీవ్ర ప్రభావాలను చూపే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా నీలాపనిందలు కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. సంబంధాల పరంగా ఒక అస్పష్టమైన వాతావరణం నెలకొంటుంది. ఈ ప్రభావం కొంతకాలమే అయినా, ప్రభావం భవిష్యత్తులో కొంతమేర కొనసాగుతుంది.

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరు ముఖ్యంగా ఇతరుల మాటలు తమ మీద పెను ప్రభావాన్ని చూపుతున్నాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏది ఏమైనా తమ అంతరాత్మ చెప్పినట్లు నడుచుకోవడమే మంచిది. కొన్ని మీకు అనుకూలంగా లేని పరిస్థితుల నడుమ సంబంధాలను కొనసాగించవలసి ఉంటుంది. క్రమంగా నిశ్శబ్ద వాతావరణాన్ని, ఒంటరితనాన్ని కోరుకునేలా మీ ఆలోచనలు ఉంటాయి. కానీ, ఇవేమీ శాశ్వతంగా ఉండవని మనసులో ఉంచుకుని పరిష్కారమార్గాల దృష్ట్యా ఆలోచనలు చేయడం మంచిది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి ఆద్యాత్మిక, రాశిచక్ర, హస్త సాముద్రిక తదితర సంబంధిత వివరాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Zodiac Love Predictions For July 2018

According to astrologers, relationships seem to distance themselves over in July, all thanks to Venus that is moving into the Virgo sign on July 9. It is said that until August 6, the planet of love and harmony will take on a tone of functionality that initially seems less than romantic. Each of the zodiac signs will undergo specific changes during July.
Story first published: Tuesday, July 3, 2018, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more