ఈ జన్మరాశులవారు కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటారు!

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీకు కేవలం తన గురించే ఆలోచించే స్వార్థపరులైన స్నేహితులు ఉన్నారా? వారు మీకు ఏమన్నా చేయాలని మీరెంత ప్రయత్నించినా,వాళ్ళు ఆఖరికి మిమ్మల్ని ఎక్కడో అక్కడ మోసం చేసేపోతారు!

ఇది వారి నక్షత్రాల ప్రభావం వలన కావచ్చు, ఈ ఆర్టికల్ లో మేము మీకు కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించే జన్మరాశుల గురించి చెబుతాం.

మీరెంత ప్రయత్నించినా, ఈ ప్రత్యేక రాశులకి చెందిన వారు మిమ్మల్ని మోసం చేసో,కావాల్సిన సమయంలో వదిలేసో పోతారు. మీ జన్మరాశి ఈ లిస్టులో ఉందేమో చెక్ చేసుకోండి. వీరు తమ గురించే తాము ఆలోచిస్తారు,వారి రాశి ప్రభావం వలన వారిని అందరూ చెడ్డవాళ్లని అనుకుంటారు.

కుంభం

కుంభం

కుంభరాశివారు చాలా ఫ్రీగా ఆలోచిస్తారని పేరు, వీరు ఏం చేసినా,నమ్మినా ఎవరి మాటల్లో పడకుండా ఉంటారు. వీరికి ఏవైనా అవి కేవలం పాపులర్ కాబట్టి లేదా ఇంకొకరు చెప్పారని నచ్చవు. వారు వ్యక్తిగతంగా కన్విన్స్ అవుతేనే అప్పుడు వాటిని ఇష్టపడతారు. గుర్తుంచుకోండి,వారు కేవలం తమ అభిప్రాయాలపైనే వేటినైనా ఇష్టపడతారు. ఇదే కాక,వారు ఎప్పుడూ అందరితో అంతగా కలవలేరు, వారి సొంత అభిప్రాయాలపై స్వతంత్రంగా నిలబడతారు.

ధనుస్సు

ధనుస్సు

ధనుస్సు రాశివారికి వారి స్వేఛ్చ అంటే చాలా ఇష్టం.వారికేది చేయాలనుంటే అది చేయటానికి,ఎక్కడి వెళ్ళాలనుకుంటే అక్కడకి వెళ్లటానికి వారికి స్వేఛ్చ ఉండాలి.వారికి పరిస్థితుల వలన దేనికీ రాజీపడటం,ఎవరి అనుమతిని ఇష్టపడరు.మరోవైపు వారు ఏ పరిస్థితుల్లో అయినా ఇమిడిపోగలరు. ఇదేకాక,వారు టెన్షన్ పడకుండా రిస్కులు,ఛాలెంజిలు తీసుకోవడాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే వారికి తమ నైపుణ్యాలు,బలంపై నమ్మకం ఎక్కువ.

మేషం

మేషం

మేషరాశివారు తమపై తాము చాలా నమ్మకం కలిగి,స్వతంత్రంగా ఉంటారు. రిస్కులు తీసుకొనే మనస్తత్వం ఉంటుంది,అలా అప్పుడప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకుని వాటి నుంచి నేర్చుకుంటారు. మరోవైపు,వారి మనస్సు చెప్పే మాటలను కూడా వింటారు. ఏ పరిస్థితులొచ్చినా వెనక్కి తగ్గరు. ప్రతి సంఘటనలో పాజిటివ్ వైపునే చూసి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

మిథునం

మిథునం

మిథునరాశి వారు ఇతరులను చూసి అసూయపడరు. వారు కేవలం పొగడబడటానికే బ్రతకరు,విమర్శలను మనస్సులో పెట్టుకోరు. పైగా అలాంటి పరిస్థితుల్లో వారికి మంచిది అయ్యేది ఎంత చక్కగా చేయవచ్చా అనే ఆలోచిస్తారు. మరోవైపు, వీరు కేవలం తమని తాము మెప్పించుకోటానికే ఇష్టపడతారు. ఇదికాక, వారు చాలా తెలివితేటలు కలిగివుంటారు, తమకి కావలసినది ఎలా పొందాలో తెలిసి ఉంటారు.

మకర రాశి

మకర రాశి

మకరరాశి తమ కష్టపడి పనిచేసే తత్వానికి, శ్రద్ధకి ప్రసిద్ధులు. అన్నిరాశుల్లోకెల్లా వారు చాలా స్వతంత్రత కలిగినవారు కూడా. వారు కేవలం తమకి చాలా నచ్చితేనే ఆ పని ఎంచుకుంటారు. ఆర్థికంగా వచ్చే స్వతంత్రతను ఇష్టపడతారు,అందుకే నచ్చిన పనులే చేస్తారు. మరోవైపు సాధారణంగా వారు ఎవరికిందా పనిచేయకుండా ఒక్కరే పనిచేస్తూ కన్పిస్తారు.

కన్యా రాశి

కన్యా రాశి

కన్యారాశి వారు ఎవరి లేదా దేని నియంత్రణలోనైనా ఉండిపోతారని ప్రసిద్ధి. వారు అన్నిటిగురించి లోతైన పరిశోధన చేస్తారు, ఒక పని గురించి అన్ని విషయాలు సాధారణంగా తెలిసి వుంటాయి. వారికి పనులు ఎలా పరిష్కరించాలో ముందుగానే అర్థమవుతుంది. ఎవరి సాయం తీసుకోవడం ఇష్టపడరు. స్వతంత్రంగా ఉండటాన్ని ప్రేమిస్తారు. మరోవైపు, చాలా అద్భుతంగా ఎవరినుంచి ఏమీ ఆశించకుండా సొంత బలాన్నే నమ్ముకుంటారు, ఇతరులను నమ్మడం వారికి చాలా కష్టం. ఇవేకాక వారు గిరి గీసుకుని ఇతరులు తమని వాడుకోకుండా చూసుకోగలరు.

English summary

Zodiac Signs That Are Known To Think Only For Themselves

Independent people tend to stand by their actions, their thoughts and beliefs. They never tend to feel the need of adapting or changing something to please others. They believe that regrets only hold you back and down, and these individuals do not have time to dwell in the past.Zodiacs Who Do Not Think About Others
Story first published: Tuesday, May 15, 2018, 19:00 [IST]