రాశిచక్రంలో అత్యంత అత్యాశ కలిగిన రాశుల వారు వీరే

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

రాశిచక్రం దాదాపు ప్రతి ఒక్క విషయం గురించి ఊహించి చెబుతుంది. ఒక వ్యక్తిని అర్ధం చేసుకోవాలంటే, ఇంతకు మించి సులభమైన మార్గం మరొకటి లేదు.

ఈ రోజు మన వ్యాసం లో రాశిచక్రం లో అత్యంత అత్యాశ కలిగిన 9 రాశుల గురించి, వాటి వివరాల గురించి తెలుసుకోబోతున్నాం.

అత్యాశను ఆధారంగా చేసుకొని రాశులకు స్థానాలు ఇవ్వడం జరిగింది.

రాశిచక్రంలోని రాశులు వ్యక్తుల అత్యాశను ఆధారంగా చేసుకొని వాటి స్థానాలను క్రమపద్ధతిలో చెప్పడం జరిగింది. ఈ స్థానాల్లో మన రాశి ప్రకారం మన స్థానం ఎక్కడ ఉంది అనే విషయం తెలుసుకోవడం చాలా ఆసక్తిని కలిగిస్తుంది.

ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం :

మకరం డిసెంబర్ 23 నుండి జనవరి 20 వరకు :

మకరం డిసెంబర్ 23 నుండి జనవరి 20 వరకు :

సింహరాశి వారిలాగానే ఈ రాశివారు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఒక మంచి పెద్ద కారు ఉండాలని, అత్యాధునిక ఇల్లు ఉండాలని, ఈ ప్రపంచంలో ఉన్న భౌతిక ఆనందాన్ని ఇచ్చే విషయాలు తమకు కావాలి అనే ఆలోచనలను కలిగి ఉంటారు. ఇందుకోసం వారి కలలను నిజం చేసుకోవడానికి డబ్బుని సంపాదించాలి అనే కోరిక వారిలో బలంగా ఉంటుంది. వారి కుటుంబానికి డబ్బు అవసరం అయినప్పుడు ఎంతో ఉదారంగా వారికీ డబ్బు ఇస్తారు. కానీ, అదే సమయంలో వారి జీవితంలో చాలా భాగం అత్యాశతోనే గడుపుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

కన్య ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు :

కన్య ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు :

వ్యవహారాల్ని ఎలా నిర్వహించుకోవాలో ఈ రాశివారికి బాగా తెలుసు. అంతేకాకుండా తక్కువ ప్రయత్నంతో ఎక్కువ డబ్బుని ఎలా సంపాదించాలి అనే విషయం కూడా తెలుసు. అయితే, ఆర్ధిక సంబంధమైన విషయాల దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా పిసినారితనంతో వ్యవహరిస్తారు. వారి దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. కన్య రాశి స్త్రీలతో పోల్చి చూసినప్పుడు, కన్యారాశి పురుషులు చాలా అత్యాశతో వ్యవహరిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీరు చేసే కొనుగోళ్లకు కూడా వారి భాగస్వాములే డబ్బులు కట్టాలని సంకోచించకుండా అడుగుతారట.

కర్కాటకం జూన్ 29 నుండి జులై 22 వరకు :

కర్కాటకం జూన్ 29 నుండి జులై 22 వరకు :

వారి కుటుంబానికి డబ్బు ఇవ్వాల్సి వస్తే లేదా ఏవైనా బహుమతులు కొనాల్సి వచ్చినప్పుడు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తారు. విలాసవంతమైన జీవితం గడపడం కంటే కూడా డబ్బుని బ్యాంకు ఖాతాలో పొదుపు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. వీలైనంత ఎక్కువ డబ్బుని సంపాదించాలని కోరుకుంటారు. అలా అయితేనే వారికి భద్రత బాగుంటుందని భావిస్తారు. అయితే మరీ ఎక్కువగా అత్యాశ పడతారు.

వృషభం ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు :

వృషభం ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు :

సురక్షితంగా జీవితం సాగాలంటే, డబ్బు అవసరం అని ఈ రాశివారికి బాగా తెలుసు. ఎందుకంటే, డబ్బు ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అంతే కాకుండా ఊహించని ఆర్ధిక సమస్యలు ఎదురైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. డబ్బుని ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడతారు. దానర్ధం వారు ఉదారంగా వ్యవహరిస్తారని కాదు. ఒక వ్యక్తికి ఎప్పుడైతే సమస్య వస్తుందో అటువంటివారికి సహాయం చేయడానికి కూడా నిరాకరిస్తారు. మరో వైపు తెలివిగా, జ్ఞానంతో వ్యవహరిస్తారు. వీరు ప్రేమించే వ్యక్తుల నుండి డబ్బుని అప్పు తీసుకుంటారు.

సింహరాశి జులై 23 నుండి ఆగష్టు 23 వరకు :

సింహరాశి జులై 23 నుండి ఆగష్టు 23 వరకు :

ఈ రాశివారు తమను తాము రాజులుగా భావిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. డబ్బు ఎక్కువగా కావాలని భావిస్తారు. దుస్తుల్లో గాని, ఆభరణాలలో గని, వాహనాల్లో గాని, ఇలా వేటిల్లో అయినా ఉత్తమమైన వస్తువులను వారి వద్ద ఉంచుకోవాలనుకుంటారు. తమను అందరూ అతి గారాభం చేయాలనుకుంటారు. చాలా ఖరీదుతో కూడుకున్న విహార యాత్రలకు వెళ్లడానికి కూడా అస్సలు సంకోచించారు. మంచి వ్యాపార దృక్పధం కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. ఉన్నతమైన జీవన విధానాన్ని అనుభవించడానికి అవసరమైన ఎక్కువ డబ్బుని ఎలా సంపాదించాలో వీరికి బాగా తెలుసు. మరోవైపు ఆర్ధిక సంబంధమైన విషయాల్లో ఇతరులకు సహాయం చేయాల్సి వస్తే పిసినారులుగా వ్యవహరిస్తారు.

మిథున రాశి మే 21 నుండి జూన్ 20 వరకు :

మిథున రాశి మే 21 నుండి జూన్ 20 వరకు :

అత్యంత అత్యాశ కలిగిన రాశులలో దీనికి పెద్దగా స్థానం లేదు. ఈ వ్యక్తులు చాలా గమ్మత్తు అయిన వ్యవహారాన్ని కలిగి ఉంటారు. వీరికి వస్తువులను అమ్మే నైపుణ్యాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. నాణ్యతలేని పనికిమాలిన వస్తువులను కూడా అత్యంత ఖరీదు ధరకు అమ్మగలరు. మరోవైపు డబ్బుని ఎలా ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలో వీరికి పెద్దగా తెలీదు. భవిష్యత్తులో జరగపోయే పరిణామాల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు.

వృశ్చికం అక్టోబర్ 24 నుండి నవంబర్ 22 వరకు :

వృశ్చికం అక్టోబర్ 24 నుండి నవంబర్ 22 వరకు :

తాము కష్టబడి సంపాదించిన డబ్బుని వ్యర్థం చేయడానికి వీరు అస్సలు ఒప్పుకోరు. వీరికి విభిన్నమైన అభిరుచులు ఉంటాయి. డబ్బుని పొదుపు చేయడానికి సంబంధించి వీరికి ఉన్న లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతో పట్టుదలతో వ్యవహరిస్తారు. ఈ రాశి గురించి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వీరు గనుక ఎప్పుడైనా ఎవరినైనా డబ్బులు అప్పుగా అడిగితె, వారు గనుక ఉన్నా నిరాకరిస్తే ఈ విషయాన్ని వారు ఎప్పటికి మరచిపోరు. ఎప్పుడైనా ఏ వ్యక్తులు అయితే డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారో, ఆ వ్యక్తులు గనుక డబ్బులు అవసరమై వీరి వద్దకు వస్తే గతంలో తాము కష్ట సమయంలో ఉన్నప్పుడు వీరు వ్యవహరించిన తీరుని నిస్సంకోచంగా ఎండగడతారు.

తుల సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 వరకు :

తుల సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 వరకు :

ఈ రాశివారు సౌకర్యవంతంగా జీవించడానికి ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది. అదే సమయంలో డబ్బు వల్ల సమకూరే విలాసవంతమైన జీవితాన్ని సౌకర్యాలను అభినందిస్తారు. ఈ ఆలోచన ధోరణి వల్లనే జీవితాన్నే సులభతరం చేసుకోవడానికి, ఆనందంగా మలుచుకోవడానికి ఖర్చుపెట్టే డబ్బు గురించి అస్సలు ఆలోచించారు. డబ్బు విషయంలో మరీ అంత ఎక్కువ అత్యాశతో వ్యవహరించనప్పటికీ, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు.

మేషం మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు :

మేషం మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు :

ప్రతి ఒక్క విషయంలో ఉత్తమంగా వ్యవహరించాలని భావిస్తారు. వీరు గనుక జీవితంలో భౌతికవాద వైఖరిని అవలంబిస్తున్నట్లైతే, తమ బ్యాంకు ఖాతాలలో ఎక్కువ డబ్బుని పొదుపుచేయరు. వీరికి ఇష్టమైన వస్తువులను ఆ డబ్బుతో కొనుక్కోవడానికి మొగ్గుచూపుతారు. మరోవైపు ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకోవడాన్ని కానీ, సహాయం కోరడాన్ని కానీ, చాలా గర్వంగా భావిస్తారు. ఇవే కాకుండా బహుమతులు కొనే లాంటి విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు.

English summary

Zodiac Signs Which Are The Greediest Of The Lot

Zodiac Signs Which Are The Greediest Of The Lot,These zodiac signs are listed as being the most greediest zodiac signs. Check them out and find out where your zodiac sign stands!