For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంబంధాల కోసం వ్యక్తిత్వాన్ని సైతం మార్చుకొనని రాశిచక్రాలు ఇవే .. !

|

కొంత మంది వ్యక్తులు జీవితంలో ప్రతి అంశానికి కట్టుబడి ఉంటారు. మరియు తమ ప్రవర్తనను, పద్ధతిని కట్టుబాట్లను, అలవాట్లను నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండేలా ప్రవర్తిస్తుంటారు. మరియు మొండి పట్టుదలలకు బ్రాండ్ అంబాసిడర్ల వలె వ్యవహరిస్తుంటారు. వీరి ఆలోచనా ధోరణులు అంత తేలికగా మారవు సరికదా, భాగస్వాములు సైతం భయపడేలా భావోద్వేగాలను ఉద్రేకాలను ప్రదర్శిస్తుంటారు. వీరి మానసిక ప్రవర్తనకు మందు ఏదైనా ఉంటే, అది కేవలం ప్రేమ, అభిమానం. తాము ప్రేమించిన వ్యక్తుల పట్ల విశ్వాసాన్ని, నిజాయితీని ప్రదర్శిస్తూ, ఎటువంటి క్లిష్ట సమయాల్లో కూడా వెన్నంటి ఉండే ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతుంటారు.

కేవలం పైన చెప్పిన అంశాల నందే కాకుండా కుటుంబ సంబంధ బాంధవ్యాలలో కూడా అదే తరహా నిబద్ధతను కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో ఇటువంటి లక్షణాలు ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తున్నప్పటికీ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకొనుటకు మాత్రం ఎన్నటికీ సిద్ధంగా ఉండరు. ఏ పరిస్థితులలో అయినా, తమ ఆలోచనలే ఉత్తమమైనవిగా భావించే మొండి ఘటాలు ఈ నాలుగు ప్రధాన రాశి చక్రాల వారు.

ఇటువంటి లక్షణాలకు, నక్షత్రాలు రాశి చక్రాలు ప్రధాన కారణాలని కొందరు ఆరోపిస్తుంటారు కూడా, ఇది కొంతమేర నిజమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇప్పుడు ఈ వ్యాసములో సంబంధ బాంధవ్యాల పట్ల అధిక నిబద్ధతను ప్రదర్శిస్తూ, ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా‌ భాగస్వామి పట్ల వెన్నుదన్నుగా నిలబడే రాశిచక్రాల గురించిన వివరములను తెలియజేయడమైనది. వీరు సంబంధంలోని ప్రతికూల సమస్యలను తన తెలివితో సద్దుమణిగేలా ప్రయత్నం చేసే ఆలోచనలను కలిగి ఉంటారు.

సంబంధాల కోసం వ్యక్తిత్వాన్ని సైతం మార్చుకొనని రాశిచక్రాలు ఇవే.. !

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

భూమి వలె ఒక స్థిరమైన పద్ధతిని‌ అనుసరిస్తూ, మొండి పట్టుదలకు తార్కాణంగా కనిపించే ఈ వృషభ రాశి వ్యక్తులు., తమ సంబంధ బాంధవ్యాలలో కూడా అదే రకమైన స్థిరత్వాన్ని మరియు నిబద్ధతను కలిగి ఉండేలా ప్రవర్తిస్తుంటారు. మిగిలిన అన్ని రాశి చక్రాలతో పోల్చినప్పుడు వీరి ఆలోచన విధానం ఆశ్చర్యానికి గురిచేయక మానదు. వీరి ప్రతి ఆలోచన వెనక తమ కుటుంబం మరియు ప్రియమైనవారి సంక్షేమం ఖచ్చితంగా ఉంటుంది. తమ కుటుంబానికి సానుకూల ఫలితాలను అందించే క్రమంలో, లక్ష్య సాధనలో ఎన్ని ప్రతికూల ప్రభావిత పరిస్థితులు ఎదురైనా అదరక బెదరక ముందుకు సాగే తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ముఖ్యముగా పిన్న వయసులోనే ప్రేమలో పడిన, వృషభ రాశి వ్యక్తులు సంబంధం పట్ల అత్యధిక నిబద్ధతను ప్రదర్శిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

కానీ వీరి మొండిపట్టుదల మిమ్మలను భయపెట్టేదిలా ఉండకూడదని గుర్తుంచుకోండి, శుక్రగ్రహం వృషభరాశి వ్యక్తుల మీద అధిక ప్రభావాన్ని కలిగి ఉండడం చేత వీరు సహజంగానే శృంగారం పట్ల ఆసక్తిని కనబరుస్తుంటారు. మరియు వీరు ఒక్కసారి మీతో ప్రేమలో పడినట్లయితే, చావులో కూడా తోడు వీడని నిబద్ధతను కలిగి ఉంటారు.

సింహ రాశి: జూలై 23 - ఆగస్ట్ 23

సింహ రాశి: జూలై 23 - ఆగస్ట్ 23

సూర్యుని ప్రభావం అధికంగా కలిగిన సింహ రాశి వారు అత్యంత ఆకర్షణీయంగా స్ఫురద్రూపిగా కనిపిస్తారు. ఎక్కడ ఉన్నా, తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు. వీరిలోని ఉల్లాసమైన తేజము మరియు శక్తి, ఇతరులు వీరి పట్ల ఆకర్షితులయ్యే విధంగా మార్చగలదు. ప్రేమాభిమానాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే సింహ రాశి వారు తమ భాగస్వామి నిర్ణయాల పట్ల అనుకూలతను మరియు నిబద్ధతను ప్రదర్శిస్తుంటారు.

సింహ రాశి వారి ఆలోచనా విధానం ప్రకారం, అత్యంత తెలివితేటలు కలిగిన వ్యక్తులుగా మరియు సమూహములో కేంద్రబిందువుగా కనిపిస్తుంటారు. మరియు పట్టుదలకు, నిర్ణయాలకు అత్యంత విలువనిచ్చే సింహ రాశి వారి ఆలోచనా సరళిని మార్చడం ఎవరితరమూ కాదు.‌ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే, చావులో కూడా నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. క్రమముగా వీరు సంబంధాల పట్ల చూపే నిబద్ధత ఆశ్చర్యం కలిగించక మానదు.

వృశ్చిక రాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చిక రాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చిక రాశి వారు నిశ్చలమైన నీటి వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంటారు. ఎటువంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా సంబంధం మార్చుకొనుటకు సిద్ధంగా ఉండరు. కుటుంబ, సామాజిక‌ అంశాల నందు వీరి యొక్క ఆలోచనా విధానం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ఏదైనా సంబంధంలో సమస్యలు ఎదురైన ఎడల సర్దుబాటు ధోరణిని ప్రదర్శిస్తుంటారు మరియు ఎటువంటి బాధలనైనా దిగమింగుకుంటూ భాగస్వామి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. ఒకవేళ సమస్య తానే అయితే, నిస్సంకోచంగా తమ తప్పును అంగీకరిస్తుంటారు. తాము విశ్వసించిన వ్యక్తుల‌ పట్ల అధిక నిబద్ధతను కలిగి ఉంటారు, కానీ ఇతర రాశి చక్రాల వలె తమ భావోద్వేగాలను బాహాటంగా ప్రదర్శించక, భాగస్వామి మీద ప్రభావాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభ రాశి వ్యక్తులు సంబంధాలపట్ల ఎంత నిబద్ధతను ప్రదర్శిస్తుంటారో, కోపం వస్తే అంత ద్వేషాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు. మరియు తాము ద్వేషించిన వ్యక్తులను తిరిగి తమ జీవితంలో చూసేందుకు కూడా అసౌకర్యాన్ని ప్రదర్శిస్తుంటారు.

భాగస్వామిలో తనకు అసౌకర్యాన్ని కలుగజేసే లక్షణాలను చూసినప్పుడు, సత్వర నిర్ణయాలు తీసుకోకుండా సరిచేసే అవకాశాల మీద దృష్టిసారిస్తుంటారు. తమ మనస్సుకు నచ్చిన వ్యక్తుల పట్ల అంకిత భావాన్ని ప్రదర్శించే కుంభ రాశి వారు ఎటువంటి పరిస్థితులలోనైనా తమ వారికంటూ తగిన సమయాన్ని కేటాయిస్తుంటారు. భాగస్వామికి కూడా బాధ్యతల పట్ల సమానత్వం ఉండాలని భావించే కుంభ రాశి వారు, వారి నిర్ణయాలకు ఆలోచనలకు విలువనిస్తూ ప్రోత్సహిస్తుంటారు. మరియు భాగస్వామి వ్యక్తిత్వానికి ఆత్మగౌరవానికి దెబ్బ కలుగకుండా వారిపట్ల జాగ్రత్తను కలిగి ఉంటారు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక, జ్యోతిష్య శాస్త్ర, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవన శైలి తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Zodiac Signs Who Will Never Change For Anybody

According to astrology, there are specific zodiac signs the individuals of which are known to never change themselves under any circumstances. These people are known to be very stern regarding making any changes in their life. The astrologers reveal about the four zodiac signs which are Scorpio, Aquarius, Taurus and Leo.
Story first published: Thursday, July 26, 2018, 16:00 [IST]