For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాడిదకు రంగులేసి జూలో పెట్టి వెర్రి పప్పలను చేస్తున్నారు, కుక్కను సింహలా మార్చారు మొరిగితే తెలిసింది

జూలో జీబ్రాని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. దాన్ని బాగా పరిశీలించాడు. అది గాడిద అని అతను అనుమానం పడ్డాడు. దాని ఒంటిపై చారలు మాత్రం జీబ్రా మాదిరిగానే ఉన్నా దాని చెవులు పెద్దగా ఉండడం చూసి అతను అనుమానం వ్యక్త

|

జూకు వెళ్తే మనం రకరకాల జంతువులను చూస్తూ ఉంటాం. వాటిని చూశాక ఆనందపడిపోతాం. వాటితో సెల్ఫీలు దిగుతాం. మేము జూకు వెళ్లి వచ్చాం అని గర్వంగా చెప్పుకుంటాం. అయితే కొన్ని జూ యాజమాన్యాలు పర్యాటకులను మోసం చేస్తున్నాయి. ఒక జూలో గాడిదను పెట్టి జీబ్రా అని మోసం చేస్తున్నారు.

ఈజిప్ట్ లోని కైరోలో ఈ సంఘటన జరిగింది. జూలో గాడిదను పెట్టి విజిటర్స్ ను మోసం చేస్తున్నారని కొందరు ఆరోపించారు. అయితే జూ యాజమాన్యం మాత్రమే తమ జూలో నిజంగా జీజ్రా ఉందని జనాలు పొరపడుతున్నారని అంటున్నారు.

కైరోలోని ఇంటర్నేషనల్ గార్డెన్ మునిసిపల్ పార్క్ లో ఒక జూ ప్రారంభించారు. అయితే అక్కడి జంతువులను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు వెళ్తున్నారు. ఈ క్రమంలోమహ్మద్ సరాన్ అనే పద్దెనిమిదేళ్ల యువకుడు కూడా జూకు వెళ్లాడు.

ఒంటిపై చారలు మాత్రం జీబ్రా మాదిరిగా

ఒంటిపై చారలు మాత్రం జీబ్రా మాదిరిగా

జూలో జీబ్రాని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. దాన్ని బాగా పరిశీలించాడు. అది గాడిద అని అతను అనుమానం పడ్డాడు. దాని ఒంటిపై చారలు మాత్రం జీబ్రా మాదిరిగానే ఉన్నా దాని చెవులు పెద్దగా ఉండడం చూసి అతను అనుమానం వ్యక్తం చేశాడు. అంతేకాదు జీబ్రా నిలబడిన తీరు, దానికి పూసిన రంగు కరిగిపోవడం వంటివి అన్నీ కూడా అతనికి అనుమానాన్ని కలిగించాయి.

గాడిదను జూలో పెట్టింది

వెంటనే జీబ్రా రూపంలో ఉన్న గాడిదతో ఫొటోలు దిగి ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ లలో పెట్టాడు. " జూ యాజమాన్యం ఒక గాడిదను జూలో పెట్టింది. దానికి రంగులేసి జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అయినా మరీ ఇంత దిగుజారుతారా? " అని అతను ప్రశ్నిస్తూ పోస్ట్ చేశాడు. అది క్షణాల్లో వైరల్ అయ్యింది. లక్షలాది మంది కామెంట్స్ పెట్టారు. షేర్ చేశారు.

గాడిదను జూలో పెట్టింది

గాడిదను జూలో పెట్టింది

దీనిపై పెటా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా గాడిదలపై కెమికల్స్ ఉపయోగిస్తే అవి చనిపోతాయని ఆవేదన చెందింది. పలు జూ యాజమాన్యాలు ఇలా గతంలో కూడా ప్రజలను వెర్రి పప్పలను చేశాయి. చైనాలోని ఒక జూలో బాగా బొచ్చు ఉండి భారీగా ఉన్న ఒక కుక్కను సింహం అంటూ నమ్మించారు.

సింహం అనుకున్నారు

సింహం అనుకున్నారు

దీంతో జనాలంతా కూడా దాన్ని సింహం అనుకున్నారు. చివరకు అది సింహం కాదు కుక్కని తెలియడంతో జనాలు ఆశ్ఛర్యపోయారు. ఒక రోజు అది అందరి ముందే మొరగడంతో జూ బండారం అంతా బట్టబయలు అయ్యింది.ఇక కైరోలోని జీబ్రా విషయంలో జనాలంతా స్పందిస్తున్నారు. జనాలను ఇలా మోసం చేయడం తగదని అంటున్నారు. అయితే జూ నిర్వాహకులు మాత్రం తాము అది నిజమైన జీబ్రా అని నిరూపిస్తామంటున్నారు.

English summary

zoo visitors noticed that donkey was painted to look like azebra

When A Donkey Was Painted Black And White To Fool The Zoo Visitors!
Story first published:Sunday, July 29, 2018, 11:46 [IST]
Desktop Bottom Promotion