For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధనస్సులో మారుతున్న గురుగ్రహం, గురుడి అనుగ్రహం ఉంటే అన్నీ ఆనందాలే, మీ రాశిపై ఉందో లేదో చూసుకోండి

గురుడు ఐదో స్థానంలో ఉంటాడు. సింహరాశివారు ఆర్థికంగా బలపడతారు. అలాగే వారు ఉండే రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. దీని వల్ల సమాజంలో కూడా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు లేని సింహరాశి వారికి ఈ ఏడ

|

గురుడు లేదా గురు గ్రహం బృహస్పతి ఒక పవిత్ర గ్రహం. చాలా రాశులపై గురుడి ప్రభావం ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకరాం ఒక వ్యక్తి జీవితంలో ప్రశాంతంగా ఉండాలన్నా, విజయాలు సాధించాలన్నా, ఆర్థికంగా బలపడాలన్నా గురువు అనుగ్రహం చాలా అవసరం.

ఇక గురు గ్రహం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. మార్చి 2019 ఉదయం 3:11 గంటలకు గురుడు ధనుస్సులోకి ప్రవేశిస్తున్నాడు.

గురువు ధనస్సుతో పాటు

గురువు ధనస్సుతో పాటు

గురువు ధనస్సుతో పాటు మీన రాశికి ఆధిపత్యం వహిస్తాడు. ఇక ఏప్రిల్ 14, 2019 న 5:55 గంటలకు గురుడు వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. దీనివల్ల అన్ని రాశులపై గురుడి ప్రభావం పడుతుంది. ఏయే రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఒక్కసారి చూడండి మరి.

2019లో మేషం పై గురుడి ప్రభావం

2019లో మేషం పై గురుడి ప్రభావం

మేషరాశిపై గురుడి అనుకూల ప్రభావం ఉంటుంది. గురుడు 9 వ స్థానంలో ఉండడం వల్ల మేషరాశిపై గురుడి ప్రభావం అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారు వృత్తిగతంగా మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే సమాజంలో కూడా వీరికి మంచి గుర్తింపు వస్తుంది.

ఆధ్యాత్మికత క్షేత్రాలకు

ఆధ్యాత్మికత క్షేత్రాలకు

మీరు కొన్ని ఆధ్యాత్మికత క్షేత్రాలకు వెళ్లే అవకాశం ఉంది. వెళ్తే మంచిది. అలాగే మీకు కొత్తగా పెళ్లి అయి ఉంటే త్వరలోనే మీరు శుభవార్త వింటారు. మీకు త్వరలో పిల్లలు పుడతారు. ఇక మీరు శివుడికి రుద్రబిషేకం చేస్తే అన్నీ సానుకూలంగా కొనసాగుతాయి.

వృషభం

వృషభం

వృషభరాశిలో గురుడు 8 వ స్థానంలో ఉంటారు. వీరు వృత్తిగతంగా ఎదుగుతారు. మీరు చాలా ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. మీరు ప్రయత్నాలు చేసినా కూడా నిరాశచెందే అవకాశం ఉంది. మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అజీర్తి, మలబద్ధకంలాంటి సమస్యలను ఎదుర్కొంటారు.

Most Read :మీ వివాహ అదృష్ట సంఖ్య తేదీలో పెళ్లి చేసుకుంటే జీవితం ప్రశాంతం,లైఫ్ పాత్, డెస్టీనీనంబర్ తెలుసుకోండిలాMost Read :మీ వివాహ అదృష్ట సంఖ్య తేదీలో పెళ్లి చేసుకుంటే జీవితం ప్రశాంతం,లైఫ్ పాత్, డెస్టీనీనంబర్ తెలుసుకోండిలా

మిథునరాశిపై ప్రభావం

మిథునరాశిపై ప్రభావం

మిథునరాశిపై గురు గ్రహం అనుకూలప్రభావం ఉంటుంది.

ఈరాశిలో గురువు ఏడో స్థానంలో ఉంటారు. వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. ఇక వ్యాపారంలో లేదా లేదంటే షేర్ మార్కెట్లో మీరు పెట్టే పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి

కర్కాటక రాశిపై గురు గ్రహం వ్యతిరేఖ ప్రభావం ఉంటుంది. గురువు ఆరో స్థానంలో ఉంటారు. కర్కాటక రాశి వారు కొన్ని రకాలా వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే మానసికంగా, శారీరకంగా ఈ రాశి వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటరు. కొందరు శత్రువులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. వారిని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించండి. మీరు అరటి చెట్టుకు పూజ చేస్తే మంచిది.

సింహరాశిపై ప్రభావం

సింహరాశిపై ప్రభావం

సింహరాశిలో గురుడు ఐదో స్థానంలో ఉంటాడు. సింహరాశివారు ఆర్థికంగా బలపడతారు. అలాగే వారు ఉండే రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. దీని వల్ల సమాజంలో కూడా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది.

పిల్లలు లేని సింహరాశి వారికి ఈ ఏడాది పండండి బిడ్డ జన్మిస్తారు. అలాగే మీరు వాహనాలను కొనుగోలు చేసే అవకావం ఉంది. స్థలాలు, ఇతర ఆస్తులు కూడా కొంటారు.

కన్యరాశిపై గురు ప్రభావం

కన్యరాశిపై గురు ప్రభావం

కన్యరాశి వారిపై గురుడి ప్రభావం ఉంటుంది. కన్యరాశిలో గురువు నాలుగో స్థానంలో ఉంటారు. మీరు నమ్మే వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు. మీ భావోద్వేగాలను దెబ్బతీస్తారు. మీరు ఈ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా, శాంతియుతంగా జీవితం గడపాలని భావిస్తారు. మీ వైవాహిత జీవితంపై కూడా ప్రభావం పడుతుంది. మీరు బ్రాహ్మణుడికి చక్కెర దానం చెయ్యడం మంచిది. అలాగే ఆవును పూజించి దానికి తినడానికి ఏదైనా పెడితే మంచిది.

Most Read :ఈ ఐదు అదృష్ట రాశిచక్రాల వారు 2019 లో ప్రేమలో మునిగితేలుతారు, వాళ్లే జీవిత భాగస్వాములు అయ్యే అవకాశంMost Read :ఈ ఐదు అదృష్ట రాశిచక్రాల వారు 2019 లో ప్రేమలో మునిగితేలుతారు, వాళ్లే జీవిత భాగస్వాములు అయ్యే అవకాశం

తులరాశిపై ప్రభావం

తులరాశిపై ప్రభావం

తులరాశిపై కూడా బృహస్పతి ప్రభావం ఉంటుంది. తులరాశిలో గురుడు మూడో స్థానంలో ఉంటారు. మీరు పనులు రీత్యా మీరు నివసించే ప్రాంతం మారాల్సి వస్తుంది. మీరు పసుపు లేదంటే చనా దాల్ లేదంటే చపాతీలు ఏదైనా సరే ఆవుకు ఆహారంగా పెట్టడం మంచిది.

వృశ్చికంపై గురుగ్రహం ప్రభావం

వృశ్చికంపై గురుగ్రహం ప్రభావం

వృశ్చిక రాశిపై గురుగ్రహం ప్రభావం ఉంటుంది. వృశ్చికంలో గురుడు రెండో స్థానంలో ఉంటారు. వృశ్చిక రాశి వారికి అంతా అదృష్టమే. మీకు అన్ని విషయాల్లో మీ కుటుంబం అండగా నిలుస్తూ ఉంటుంది.

ధనస్సు రాశిపై ప్రభావం

ధనస్సు రాశిపై ప్రభావం

గురుడు ధనస్సులో మొదటి స్థానంలో ఉంటారు. దీంతో ఈ రాశిపై అనుకూల ప్రభావం ఉంటుంది. వైవాహిక జీవితంలో, మీ ప్రేమ విషయంలో మీరు హ్యాపీగా ఉంటారు. అయితే మీరు ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ఆదాయం తగ్గే అవకాశం ఉంది.

మీరు ఉంగరపు వేలికి పసుపు వర్ణం ఉండే రాయితో కూడిన బంగారపు ఉంగరం తొడుక్కుంటే అంతే మంచే జరుగుతుంది.

మకరరాశిపై ప్రభావం

మకరరాశిపై ప్రభావం

మకరరాశి వారిపై కూడా గురుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. మీరు ఆధ్యాత్మికత క్షేత్రాలకు వెళ్తే మంచిది. మీరు మీ నుదుటిపై కేసర్ తిలకం పెట్టుకుంటే మంచిది. అలాగే మీ ప్యాకెట్ లో పచ్చరంగు కర్చీప్ ఉంచుకుంటే మంచిది.

Most Read :ఈ ఐదు రాశుల వారికి పోటీతత్వం ఎక్కువ, ప్రతి విషయంలోనూ పోటీపడుతుంటారు, విజయమే లక్ష్యంMost Read :ఈ ఐదు రాశుల వారికి పోటీతత్వం ఎక్కువ, ప్రతి విషయంలోనూ పోటీపడుతుంటారు, విజయమే లక్ష్యం

కుంభరాశిపై ప్రభావం

కుంభరాశిపై ప్రభావం

కుంభరాశిపై గురుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గురుడు పదకొండో స్థానంలో ఉంటాడు. మీరు వ్యాపారపరంగా ఎదుగుతారు. అలాగే మంచి వైవాహిక జీవితం మీకు ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటారు. మీరు రావి చెట్టును తాకకుండా దానికి రోజూ ఉదయం నీళ్లు పోస్తే మంచిది.

మీనరాశిపై ప్రభావం

మీనరాశిపై ప్రభావం

మీనరాశిపై కూడా గురుడి ప్రభావం ఉంటుంది. మీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. మీ తల్లిగారు దీర్ఘాకాలిక రోగాల నుంచి పూర్తిగా కోలుకుంటారు. అయితే మీ ఆరోగ్యం కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా కూడా కాస్త ఇబ్బందులుపడే అవకాశం ఉంది.

English summary

2019 Jupiter transit effects on each zodiac signs

2019 Jupiter transit effects on each zodiac signs
Desktop Bottom Promotion