For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేసే జంతు ఆచారాలు

|

తమ కుటుంబం లేదా యజమాని మరణం ఆధారితంగా ఒక పెంపుడు జంతువు కృంగిపోవడం లేదా మరణించడం అనేది అనేక సందర్భాలలో మనం వింటూనే ఉంటాం. మరియు అనేక అధ్యయనాలు మరియు పరిశీలనలలో కూడా తేలిన వాస్తవం. అందులో తమ భాగస్వామి మరణం గురించి విచారం లేదా కలత చెందిన జంతువులలో కోతులు మరియు ఏనుగులు ప్రధానంగా ఉన్నాయని ప్రాధమిక పరిశోధనలలో కూడా పేర్కొనడం జరిగింది.

అయితే ఇటువంటి ఘటనలు తరచుగా అనేక జంతు జాతులలో కూడా కనిపిస్తూ ఉన్నాయని కొన్ని సవివరమైన పరిశోధనలలో తేలింది. ఈ అధ్యయనాల సమయాలలో కనుగొన్న అపూర్వమైన విషయం ఏమిటంటే, కొన్నిరకాల జీవులు కేవలం దుఃఖించడం మాత్రమే కాకుండా, వాటి భాగస్వామి లేదా సన్నిహితుల మరణం తరువాతి ఆచారాలలో కొన్ని వైవిధ్యమైన పనులను చేస్తూ ఆశ్చర్యానికి లోనుచేస్తుంటాయి.

వివిధ జంతువులు తమ కుటుంబం లేదా భాగస్వామి మరణంపట్ల ఏవిధంగా వ్యవహరిస్తాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

చింపాంజీలు తమ భాగస్వామి మరణం నుండి కోలుకోడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. చింపాంజీలు, కొన్ని లక్షణాలను గొరిల్లాల నుండి పంచుకుంటాయి. తమ కుటుంబంలోని సభ్యుడు చనిపోయిన సందర్భంలో, చింపాంజీలు తమ మిగిలిన కుటుంబ సభ్యులందరితో కలిసి మృతదేహం చుట్టూ గుండ్రంగా చేరి, మృతదేహాన్ని తాకుతూ కనిపించడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాలలో, చనిపోయిన బిడ్డ శరీరాన్ని అంటిపెట్టుకుని కొన్ని నెలలపాటు ఆ కళేబరాలను మోసుకుంటూ తిరుగుతూ కనిపిస్తుంటాయి. మనుషులతో సమానంగా బాధను వ్యక్తపరచే జీవులలో చింపాంజీలు కూడా ఉన్నాయి.

కుక్కలు తమ కుటుంబ సభ్యులలో ఎవరైనా మరణిస్తే, ఏడుస్తూ దేహాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాయి :

కుక్కల సంతాప విధానాలు అత్యంత భావోద్వేగభరితంగా ఉంటాయి. ఇవి సంబంధాలను నిర్వహించే జీవులుగా ఉన్న కారణంగా, అత్యధిక ఒత్తిళ్లకు గురవుతుంటాయి. ఒక కుక్క తన కుటు౦బ సభ్యుని మరణ౦ కారణంగా, ఆ మృతదేహం మీద పడి ఏడుస్తూ తమ భావాలను వ్యక్తపరుస్తుంటాయి. ఇవి గంటల తరబడి శరీరం చుట్టూనే ఉంటూ, భావోద్వేగాలకు లోనవుతూ కనిపిస్తుంటాయి. ఒక్కోసారి అదే బాధను కొనసాగిస్తూ ప్రాణాలను కోల్పోవడం కూడా మనం తరచుగా వింటూనే ఉంటాం.

గుర్రాలు అతీతమేమీ కాదు :

గుర్రం ఏదైనా మరణించిన్నప్పుడు, ఆ మృతదేహం చుట్టూ నిశ్శబ్ద౦గా గంటల తరబడి నిలబడి ఉ౦డడ౦ద్వారా తమ బాధను వ్యక్తపరచడం జరుగుతుంది. అవి తమ తలలను క్రిందకు దించి, మృతదేహం మీద ఎక్కువసేపు దృష్టి కేంద్రీకరించడం కనిపిస్తుంది. అంతేకాకుండా తాము కోల్పోయిన సంబంధం గురించిన ఆందోళనతో, గందరగోళానికి గురై అటూ ఇటూ పరిగెడుతూ కనిపిస్తుంటాయి.

గుర్ర౦, తన జ౦ట లేదా సన్నిహితులు చనిపోవడాన్ని జీర్ణించుకోలేవు. క్రమంగా తమకు ఇక లేరన్న అవగాహనకు వస్తే అతి తక్కువ కాలంలోనే మానసికంగా కృంగిపోవడం కనిపిస్తుంది. క్రమంగా ఆ బాగస్వామి కర్మక్రతువుల సమయంలో కూడా వాటిని పక్కన ఉంచడం గమనిస్తుంటాం.

డాల్ఫిన్స్ తమ భాగస్వామి లేదా స్నేహితుడి మృతదేహాన్ని మేల్కొనే ప్రయత్నం చేస్తుంది:

ఒక డాల్ఫిన్ చనిపోయినప్పుడు, దాని సంబంధిత మిగిలిన డాల్ఫిన్స్ అన్నీ, అత్యంత భావోద్వేగానికి గురవడం కనిపిస్తుంటుంది. చనిపోయిన డాల్ఫిన్ ని నిమురుతూ, మేల్కొనే ప్రయత్నం చేయడం కూడా కనిపిస్తుంటుంది. డాల్ఫిన్స్ అతి తెలివైన క్షీరదాలుగా కూడా చెప్పబడుతాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Animal Rituals That Will Make You Emotional

There are some of the animal rituals that will make you feel emotional. Different animals have different ways of mourning their partner's death.
Story first published:Wednesday, June 12, 2019, 15:23 [IST]
Desktop Bottom Promotion