For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ టాయిలెట్లో కనిపించే జంతువులు

|

టాయిలెట్లలో కనిపించే జంతువులు లేదా సరీసృపాలలో పాములు మాత్రమే భయానకమైన అంశంగా మీరు భావిస్తూ ఉంటే, అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం, మీ టాయిలెట్లో తరచుగా కొన్ని ఇతరత్రా జంతువులు కూడా దాగి ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని తేలింది. ఒక్కోసారి ఈ జీవులు మీ టాయిలెట్లలో ఎలా కనిపిస్తున్నాయో అర్ధంకాక మీరు ఆశ్చర్యానికి గురికావచ్చు కూడా.

కానీ అసలు వాస్తవం ఏమిటంటే, ఈ జంతువులు ఎక్కువగా మురుగు కాలువలలో ఎక్కువగా మనుగడ సాగిస్తున్న కారణాన, అవి తమ స్వేచ్ఛను వెతుక్కుంటూ ప్లంబింగ్ పైపులను ఆశ్రయిస్తున్నాయి. కావున మీరు మీ వాష్రూమ్ ఉపయోగించే ముందు, ఒకటికి రెండుమార్లు చుట్టుపక్కల, మరియు టాయిలెట్ బేసిన్స్ పరిశీలించి వినియోగించడం ఉత్తమంగా సూచించబడుతుంది. అలా తరచుగా టాయిలెట్లలో కనిపించే జంతువుల గురించిన మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

ఎలుక :

ఎలుక :

రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కు చెందిన స్థానికులు, ఒక ఎలుక ఒక వృద్ధుడిని కింది భాగంలో కరిచినట్లు నివేదించిన తర్వాత, వారి మరుగుదొడ్లను తనిఖీ చేయాలని అధికారులకు నోటీసులు పంపి హెచ్చరించడం జరిగింది. ఎలుకలు ఎక్కువగా ప్లంబింగ్ పైపులలో మనకు తరచూ కనిపిస్తుంటాయి కూడా. ఒక్కోసారి వీటి కాటు కొన్ని ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి.

సాలె పురుగు :

సాలె పురుగు :

కొన్ని రకాల సాలె పురుగులు ప్లంబింగ్ పైపులలోని నీటిలో కూడా ప్రయాణించగలవు. అంతేకాకుండా కొన్ని దేశాలలో విషం కలిగిన ప్రమాదకర సాలీళ్లు కూడా కనిపిస్తుంటాయి. ఇవి టాయిలెట్లలో చేరితే, మనిషి ప్రాణాలకే ప్రమాదం. కొన్ని వర్గాలకు చెందిన సాలె పురుగులు 30 గంటల వరకు నీటిలో సజీవంగా ఉండగలవని అనేక అధ్యయనాలు తేల్చాయి.

మొసళ్ళు :

మొసళ్ళు :

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, అనేక దేశాలలో ప్రధానంగా న్యూయార్క్లో 1930ల కాలం నుండే ఈ సంఘటనలకు సంబంధించిన నివేదికలు ఉన్నాయి. ఒక మొసలి U షేప్ ఆకారంలో టాయిలెట్లలో ఎలా ఉండగలుగుతుందో ఇప్పటికీ అంతుచిక్కని అంశంగానే ఉంది. పైగా అదేమీ పిల్లి కాదు, బల్లి అంతకన్నాకాదు., ఏకంగా మొసలి. వినడానికి ఆశ్చర్యంగానే కాదు, భయానకంగా కూడా ఉంది కదా.

కప్ప :

కప్ప :

మీ టాయిలెట్లలో కప్పను కనుగొనడం అనేది సర్వసాధారణమైన అంశంగా ఉంటుంది. మన దేశంలో ఈ సంఘటనలు కోకొల్లలు. దాని స్వేచ్ఛ కోసం టాయిలెట్ బౌల్ నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఒక్కసారి ఊహించుకోండి! దానికన్నా రెట్టింపు వేగంతో బాత్రూమ్ నుండి బయటకు పరిగెడుతాం అవునా ?, ఆస్ట్రేలియా, ప్యూర్టో రికో, క్యూబా, భారతదేశం వంటి ఉష్ణమండల ప్రాంతాలలో బాత్రూములలో కప్పలు కనపడడం అత్యంత సాధారణ సన్నివేశంగా ఉంటుంది.

పాములు :

పాములు :

పాములు నివాస గృహాలను ఏర్పాటు చేసుకోడానికి, ప్లంబింగ్ పైపులను తమ ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయని చెప్పబడుతుంది. ఈ సరీసృపాలు నివాసితుల మరుగుదొడ్లలోకి పైపుల ద్వారా ప్రయాణిస్తుంటాయి కూడా. అమెరికా వంటి దేశాలలో టాయిలెట్లలో రాటిల్డ్ స్నేక్స్ తరచుగా కనిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయన్న సంగతి అందరికీ విదితమే. వీటి కారణంగా అనేకమంది మృత్యువాతకు గురవడం కూడా జరిగింది.

పీతలు :

పీతలు :

దక్షిణ పసిఫిక్ ప్రాంతాలలో టాయిలెట్లలో పీతలను కనుగొనడం పెద్ద విషయమేమీ కాదు. వాస్తవానికి ఆయా ప్రాంతాలలో అడుగడుగునా ఇవి దర్శనమిస్తూనే ఉంటాయి. క్రమంగా అనేకమంది వీటి కారణంగా గాయాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.

బొద్దింకలు :

బొద్దింకలు :

వీటి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇవి ఇంత ఎగిరితే, మనం అంత ఎగిరి ఆగమాగం చేస్తాం. అవునా?, ఫ్లష్ పైపులతో పాటు, సింకులు, గోడల రంధ్రాలు లేదా పగుళ్లలో కూడా బొద్దింకలు తరచుగా కనిపిస్తుంటాయి. మీ ఇంట్లో బొద్దింకలు తరచుగా కనిపిస్తూ ఉంటే, అవి టాయిలెట్లలో కనిపించడంలో ఆశ్చర్యమేలేదు. కావున తరచుగా క్రిమిసంహారక మందులను అనుసరిస్తూ వీటిని తొలగించే ప్రయత్నం చేసుకోవడం ఉత్తమం. బొద్దింకలు ఎక్కువగా ఉన్న పక్షంలో హెపటైటిస్ వంటి వ్యాధులుకూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

జెర్రులు :

జెర్రులు :

మీ ప్లంబింగ్ పైపులలో బొద్దింకలతో పాటు, మీ బాత్రూం నేస్తాలుగా జెర్రులు కూడా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా గోడలు మరియు నేలమీద ఉండే పగుళ్ల ద్వారా మీ బాత్రూమ్లోనికి ప్రవేశిస్తాయి. అనేకసార్లు అవి తడి ప్రదేశం కోసం వెతుకుతున్న సమయంలోనే మీ టాయిలెట్లలోనికి చేరడం జరుగుతుంటుంది.

అంతేకాకుండా బల్లులు, కొన్ని రకాల కీటకాలు కూడా టాయిలెట్లలో చేరే అవకాశాలు ఉన్నాయి. కావున ఇటువంటి జంతువులలో ఏవైనా మీ ఇళ్ళల్లో కనిపిస్తూ ఉంటే, మీ టాయిలెట్లను తరచుగా పరీక్షించి వినియోగించడం ఉత్తమంగా సూచించబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Animals that might show up in your toilet

If you have been thinking that snakes in toilets are the only scary things in your bathroom, then you are wrong my friend.Studies have found out that there could be many more animals that could be hiding in your toilet right now!Though this may make you wonder on how all these creatures land up in your bathroom.
Story first published: Thursday, June 6, 2019, 12:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more