For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటర్నెట్ లో మనకు రియల్ అనిపించే 10 ఫేక్ వైరల్ పిక్చర్స్

|

ఇంటర్నెట్లో నిరంతరం ఎన్నో లక్షల ఫోటోలు సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి. కానీ అవన్నీ వాస్తవాలు అనుకుంటే పొరపాటే. కొన్ని వాస్తవంగా కనిపిస్తున్నప్పటికీ, తీక్షణంగా గమనిస్తే అవి ఫేక్ అని తెలిసిపోతుంది. ఇటువంటి చిత్రాలను సరదా కోసం తయారు చేస్తారో ఏమో గానీ, తర్వాతి కాలంలో వైరల్ గా మారుతూ, జనాలను ఒక గందరగోళంలోకి తీసుకుని వెళుతుంటాయి.

ఈ చిత్రాలను సగానికి సగం మంది నిజమనే నమ్ముతారు, క్రమంగా అనేక వాదనలకు దారితీస్తుంటాయి కూడా. భారతదేశంలో ఈ రోజుకీ చలామణీలో ఉండే ఈ వైరల్ ఫోటోలు కూడా నకిలీవే. ఒకసారి పరిశీలించండి.

సి.టి స్కాన్ ద్వారా వెళుతున్న సింహం!

సి.టి స్కాన్ ద్వారా వెళుతున్న సింహం!

ఈ చిత్రం 1970 కు చెందినది. ఈ చిత్రాన్ని ఎం.జి.ఎం అనే ఒక చిత్ర నిర్మాణ సంస్థ కు సంబంధించింది. ఆ ఎంజిఎం లోగోలో సింహం అరుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ షూటింగ్లో భాగంగా వచ్చిన ఫోటోలోని సింహాన్ని, సిటి స్కాన్ లో ఉంచినట్లుగా మార్పు చేశారు.

ఇది కేవలం ఎడిటెడ్ (మార్పు చేసిన) ఫోటో మాత్రమే!

ఇది కేవలం ఎడిటెడ్ (మార్పు చేసిన) ఫోటో మాత్రమే!

నిజానికి ఇది కోపంతో ఉన్న పిల్లి ఏ మాత్రమూ కాదు. కేవలం ఫోటోషాప్ వంటి సాఫ్ట్వేర్లు వాడి, కనుబొమ్మలను జోడించడం వలన ఇలా తయారైంది. ఇప్పుడు మరలా ఆ ఫోటోను చూడండి. మీకే ఒక క్లారిటీ వస్తుంది.

9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల సంబంధించిన నకిలీ చిత్రం ఇది. మనలో అనేకులు దీనిని నిజమని నమ్మారు.

9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల సంబంధించిన నకిలీ చిత్రం ఇది. మనలో అనేకులు దీనిని నిజమని నమ్మారు.

ఈ చిత్రాన్ని నిజమని నమ్మిన అనేకులకు, ఇప్పుడు చెప్పబోయే అంశం ఒక ఊరట అని చెప్పవచ్చు. వాస్తవానికి ఇది 9/11 దాడికి ముందు 1997లో హంగేరియన్ టూరిస్టు పీటర్ గుజ్లి తీసిన చిత్రంగా తేలింది. దీనికి విమానాన్ని జోడించడం ద్వారా వైరల్ అయింది. కొంచం కోపం వస్తుంది కదా.

పేలుడు సమయంలో ఏ ఐన్ స్టీన్ కూడా సైకిల్ తొక్కలేదు!

పేలుడు సమయంలో ఏ ఐన్ స్టీన్ కూడా సైకిల్ తొక్కలేదు!

హైడ్రోజన్ బాంబు పేలుడు సమయంలో సైకిల్ తొక్కుతున్న ఐన్ స్టీన్ ఫోటో నిజానికి పూర్తిగా అబద్దం. రెండు విభిన్న చిత్రాల సంకలనానికి ఈ చిత్రం ఉదాహరణ. ఫోటోషాప్ జిమ్మిక్స్.

ఈ స్పేస్ షటిల్ కూడా నకిలీనే !

ఈ స్పేస్ షటిల్ కూడా నకిలీనే !

ఈ స్పేస్ షటిల్ కూడా నకిలీ చిత్రాలకు నిలువెత్తు ఉదాహరణ. కానీ ఈ చిత్రం చేసిన వ్యక్తి పనితనానికి మాత్రం హాట్స్ఆఫ్ చెప్పక తప్పదు. దీనికి కారణం ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో చెప్పడం కష్టం కాబట్టి.

ప్రతి దీపావళికి ఈ చిత్రం వైరల్ అవుతూనే ఉంటుంది…

ప్రతి దీపావళికి ఈ చిత్రం వైరల్ అవుతూనే ఉంటుంది…

ఈ చిత్రం దీపావళి సందర్భంగా నాసా విడుదల చేసినదంటూ వైరల్ అవుతుంటుంది, అయితే అది పచ్చి అబద్దమని గుర్తుంచుకోండి.

మరుగుజ్జు జిరాఫి అంటూ ఏదీ లేదు…

మరుగుజ్జు జిరాఫి అంటూ ఏదీ లేదు…

ఈ మరుగుజ్జు జిరాఫీ చాలా అందంగా కనిపిస్తుంది కదూ. కానీ దురదృష్టవశాత్తు, అది కూడా వాస్తవం కాదు. కొన్ని ఫోటో షాప్ ట్రిక్స్ ఉపయోగించి, ఇలా తయారు చేయవచ్చునని గుర్తుంచుకోండి.

ఇది చూడండి, ఈ చిత్రం రెండు చిత్రాల సంకలనం!

ఇది చూడండి, ఈ చిత్రం రెండు చిత్రాల సంకలనం!

ఈ చిత్రం అవాస్తవం అంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ మీరేమనుకున్నా ఇది పూర్తిగా రెండు చిత్రాల సంకలనమే.

ఇక్కడ కలరింగ్ పోటీ జరగడం లేదు !

ఇక్కడ కలరింగ్ పోటీ జరగడం లేదు !

ఇందులో ఉండే నల్ల సింహం వాస్తవానికి ఉనికిలో లేదు. నిజానికి ఇది ఒక తెల్లని సింహం, ఫోటోషాప్ ట్రిక్స్ ద్వారా నలుపు రంగును జోడించడం ద్వారా ఇలా తయారుచేయబడింది. క్రమంగా వైరల్ అయింది.

ఇది ఖచ్చితంగా సృజనాత్మకత!

ఇది ఖచ్చితంగా సృజనాత్మకత!

రెండు చిత్రాలను కలిపి చేసిన చిత్రం ఇది. ఒక బండ పైన కోట ఉన్నట్లుగా ఉండే ఈ చిత్రం నిజానికి నకిలీ. కానీ ఆ చిత్రం వాస్తవికత ఉట్టిపడేలా కనిపిస్తుంది చూడండి. పైగా మన కథలలో మాంత్రికుల కోటలు ఇలా ఉంటాయన్న భ్రమలను సృష్టించడం ద్వారా, ఇటువంటివి నిజమని నమ్మడం జరుగుతుంటుంది

కావున ఎటువంటి చిత్రం మీ దృష్టికి వచ్చినా పలుమార్లు ఆలోచించి, నిజానిజాలు తెలుసుకుని నలుగురితో పంచుకోండి. లేనిచో, అవి అబద్దమని తేలిన రోజు అభాసుపాలుకాక తప్పదని గుర్తుంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలతో పాటు, ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి..

Read more about: fact ఫోటోలు
English summary

Fake Viral Pictures On The Internet That Look Real!

There are several images that are being circulated on the internet, and they look so real that most of the times, people get confused with the facts. Some of the iconic images that are even circulated to this day are also fake.These are some of the iconic images that have gone viral. But the fact is that none of these images are real. Check them out.
Story first published: Wednesday, March 27, 2019, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more