For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫాదర్స్ తమ పిల్లలకు పాలు పట్టించడానికి అనుకూలంగా బ్రెస్ట్ ఫీడింగ్ మెషిన్ కనిపెట్టిన జపనీయులు

|

నవజాతశిశువుకు పాలుపట్టడం అంటే అది కేవలం తల్లి చేయదగిన పనేనని ఇప్పటిదాకా మనకు తెలుసు. కానీ ఇప్పుడు అలా చెప్పడానికి లేదు. ఒక తండ్రి కూడా తల్లివలెనే పాలు పట్టించవచ్చునని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

Japanese Device

ఇక్కడ ఈ వ్యాసంలో, జపనీస్ వాళ్ళు కనిపెట్టిన ఒక పరికరం గురించిన వివరాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాము. ఈ పరికరం, మీ శిశువును తండ్రులతో అనుసంధానించడానికి మరియు వారి మద్య అనుబంధం పెంచడానికి ఎంతగానో సహాయం చేస్తుందని చెప్పబడింది. మరియు ఆ పరికరంతో తండ్రులు సైతం, శిశువుకు ఫీడ్ కూడా చేయవచ్చు. అంతేకాకుండా బ్రెస్ట్ కాన్సర్ బారిన పడి రొమ్ములు తొలగించబడిన మహిళలకు కూడా ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడగలదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

పసిపిల్లలకు పాలుపట్టే ఈ ఉత్పత్తి పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది.

పసిపిల్లలకు పాలుపట్టే ఈ ఉత్పత్తి పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ పరికరాన్ని డెంట్సూ ఉత్పత్తిదారులు ప్రారంభించారు. ఇది వక్షోజాలను పోలి ఉండి, ధరించడానికి అనువుగా ఉన్న పరికరంగా ఉంటుంది. మరియు ఇది పాలు లేదా మందులను నింపడానికి అనువుగా ఉంటుంది.

ఈ పరికరం పేరేమిటో తెలుసా ....

ఈ పరికరం పేరేమిటో తెలుసా ....

ఈ ప్రత్యేక పరికరాన్ని ' ఫాథర్స్ నర్సింగ్ అసిస్టెంట్ ' అని వ్యవహరించడం జరుగుతుంది. రిపోర్ట్స్ ప్రకారం, టెక్సాస్లోని ఆస్టిన్లో జైర్గిన SXSW ఫెస్టివల్లో ఈ పరికరాన్ని ప్రదర్శించడం జరిగింది.

ఈ పరికరం ఏవిదంగా పనిచేస్తుందంటే ..

ఈ పరికరం ఏవిదంగా పనిచేస్తుందంటే ..

ఈ పరికరం, తండ్రులకు తల్లుల వలె పాలిచ్చే స్వేచ్చను కలిగిస్తుంది. క్రమంగా ఈ పరికరాన్ని ఉపయోగించడంద్వారా, వారి మధ్య సంబంధబాంధవ్యాలు కూడా మెరుగుపడుతాయని చెప్పబడింది.

పరికరం పనితీరుగురించిన మరిన్ని వివరాలు …

పరికరం పనితీరుగురించిన మరిన్ని వివరాలు …

ఈ పరికరం, చూసేందుకు నకిలీ రొమ్ముల వలె ఉంటూ, అందులో ఒకటి పాలు లేదా మందులను కలిగి ఉంటుంది మరియు రెండవ రొమ్ము చనుమొనను కలిగి ఉంటుంది. ఈ పరికరం కేవలం బిడ్డకు ఫీడ్ చేయడమే కాకుండా, శిశువు నర్సింగ్ కార్యక్రమాలకు సంబంధించిన డేటాను సైతం ట్రాక్ చేయగలదని చెప్పబడింది. మరియు స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మొత్తం సమాచారాన్ని తనిఖీ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: life fact
English summary

Japanese Device Has Made Breastfeeding Possible For Dads

A Japanese company has invented a device that will allow men to breastfeed their newborn babies. The device is named as the 'Father's Nursing Assistant' which is a wearable device and it resembles breasts. The device allows dads to feed their babies while also promoting skin-to-skin contact as well.Now Dads Can Breastfeed Too!
Desktop Bottom Promotion