For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ దేశంలో, మీకు అంతగా తెలియని చట్టవిరుద్దమైన అంశాలు

|

ఈ దేశంలో, మీకు అంతగా తెలియని చట్టవిరుద్దమైన అంశాలు, వాటి చట్టాలకు సంబంధించిన వివరాలు

ఈ దేశంలో అనేక చట్ట విరుద్దమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు వాటిని కన్ని ప్రత్యేకమైన చట్టాలతో అరికట్టాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా, కొన్ని చాపకింద నీరులా విస్తరిస్తూ వ్యక్తి స్వేచ్చకు భంగం కలిగించేలా తయారవుతున్నాయి. వాటిలో కొన్ని చట్టాలు అనేకమందికి తెలియవు. వీటిలో కొన్ని ఆశ్చర్యం కలిగించేలా కూడా ఉంటాయి. గాలిపటాలు ఎగరేయడం దగ్గర నుండి, ఓరల్ సెక్స్ వరకు కొన్ని చట్టవిరుద్దమైన అంశాలు ఆ తెలియని జాబితాలో ఉన్నాయి. అవి చట్టవిరుద్దమైన అంశాలని కూడా అనేకమందికి తెలీదు. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.

ఓరల్ సెక్స్ :

ఓరల్ సెక్స్ :

మీకు తెలుసా, ఐపిసి సెక్షన్ 37 7 చట్టం ప్రకారం అసహజ లైంగిక పద్దతులను అనుసరించడం నేరంగా పరిగణించబడుతుంది. క్రమంగా ఓరల్ సెక్స్ కూడా దీని క్రిందకు వస్తుంది. STD (సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్)-సుఖ వ్యాధులు సంక్రమణలు పెరుగకుండా ఈ చట్టాన్ని తీసుకునిరావడం జరిగింది.

మహిళలు నైట్ షిఫ్టు వర్క్ అనుసరించడం నేరం …

మహిళలు నైట్ షిఫ్టు వర్క్ అనుసరించడం నేరం …

మీకు తెలుసా, ఫాక్టరీ యాక్ట్ 1948 ప్రకారం, రాత్రి వేళల్లో మహిళలచేత పనిచేయించుకోవడం చట్టరీత్యా నేరమని ?., ఇప్పుడు BPO ఉద్యోగులు సగానికి సగం ఆ నైట్ షిఫ్టులనే అనుసరించవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ చట్టం మహిళల భద్రతల పరంగా ఉద్దేశించబడింది. కానీ ఇప్పుడు మారుతున్న గ్లోబలైజేషన్ పరంగా ఈ చట్టాన్ని అంతగా పరిగణనలోనికి తీసుకోవడం లేదు.

వ్యభిచారం చట్టవిరుద్ధం కాకపోయినా, బలవంతంగా వ్యభిచారంలో దించడం చట్టవిరుద్ధం …

వ్యభిచారం చట్టవిరుద్ధం కాకపోయినా, బలవంతంగా వ్యభిచారంలో దించడం చట్టవిరుద్ధం …

రెడ్ లైట్ ఏరియాలు అనేవి ఈ దేశంలో కొన్ని టౌన్స్ మరియు సిటీలలో సర్వసాధారణంగా ఉన్నాయి. ఇంతటి అమానుషం కళ్ళ ముందు జరుగుతున్నా, వీటిపట్ల ఎందుకింకా జాప్యం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టని విషయం. సగానికి సగం చూసీచూడనట్లు వ్యవహరించడం కారణంగా ఇంకా వీళ్ళ ఆటలు సాగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. కానీ వీటిలో బలవంతంగా రొంపిలోకి దించడమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లైంగిక సంబంధాల పరంగా డబ్బులు వెచ్చించడం అనేది వ్యభిచారం క్రిందికి వస్తుంది. అటువంటి ముఠాలతో సంప్రదింపులు జరపడం, లేదా అటువంటి వ్యభిచార ముఠాలను నిర్వహించి వ్యక్తి స్వేచ్చకు భంగం వాటిల్లేలా చేయడం చట్టం ప్రకారం క్షమించరాని నేరం.

ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం నేరం :

ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం నేరం :

ఐపిసి సెక్షన్ 309 ప్రకారం, ఈ దేశంలో వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించడం మహానేరం.

అంతేకాకుండా, ఆత్మహత్యాయత్నం శిక్షార్హం. తెలుగులో వచ్చిన గణేష్ సినిమా ఇందుకు ఉదాహరణ.

రోడ్డుసైడ్ ENT ట్రీట్మెంట్(డెంటిస్ట్రీ) నిషేధం :

రోడ్డుసైడ్ ENT ట్రీట్మెంట్(డెంటిస్ట్రీ) నిషేధం :

చాప్టర్ 5, సెక్షన్ 49 డెంటిస్ట్ యాక్ట్ 1948 ప్రకారం రోడ్డు సైడ్ డెంటిస్ట్రీ ( పంటికి సంబంధించిన చికిత్స) నిషేధం. క్రమంగా రోడ్డు సైడ్ చెవిని శుభ్రపరచే విధానాలు కూడా నిషేధం. నిజానికి అప్పట్లో నాటు వైద్యాలు అధికంగా ఉండేవి, అవి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా ఎటువంటి ప్రామాణికాలు లేనివిగా ఉండేవి. ఇప్పటికీ కొందరు, పంటికి పొగ పెట్టడం, చెవిలో అసాధారణ ద్రావణాలు పోయడం వంటివి చూస్తుంటాము. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా, కొన్ని స్వచ్చంద సంస్థలు వీటి వెనుకనున్న నిజాలను బయట పెడుతున్నా ఇటువంటి నాటు వైద్యాలు ఇంకనూ కొనసాగుతున్నాయన్నది వాస్తవం. ఈ కారణంగానే సగం ఇటువంటి నిషేధాజ్ఞలు చేయవలసి వచ్చిందేమో మరి. కానీ ఈ ప్రపంచంలో అధికంగా ఉండే వైద్యుల జాబితాలో ENT వైద్యులు కూడా ఉన్నారు. దీనికి కారణం, ప్రజలకు అత్యంత తరచుగా వచ్చే సమస్యల జాబితాలో కన్ను, ముక్కు, చెవి ఎక్కువగా ఉండడమే. కావున ఎటువంటి సమస్యలు ఉన్నా, ధ్రువీకరించబడిన ENT వైద్యుని సంప్రదించడమే అన్నిరకాలా శ్రేయస్కరం. దయచేసి ప్రామాణికాలు లేని నాటు వైద్యాల జోలికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. బోల్డ్స్కై పరంగా మేము చేస్తున్న విజ్ఞప్తి.

గాలిపటం ఎగరేయడం … !

గాలిపటం ఎగరేయడం … !

ఏంటి ఇది కూడానా ..! అనిపిస్తుంది కదా. నిజమండీ బాబు. 1934 ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం, ఒక విమానాన్ని మాత్రమే కాదు గాలిపటం ఎగరేయడానికి కూడా పర్మిషన్ కావాలి. అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ యాక్ట్ తీసుకొచ్చి ఉండవచ్చు. గాలిపటాలతో ఇన్ఫర్మేషన్ షేరింగ్, విమాన రాకపోకలకు పక్షులు, గాలిపటాల కారణంగా ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలు కారణాలు అయ్యుండొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలీకపోవచ్చు కూడా, పూర్తిస్థాయిలో అమలులో లేనందువలన.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఫాషన్, జీవనశైలి, ఆరోగ్య, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

Read more about: fact life
English summary

List Of Illegal Things That People Do In India

Did you know that flying a kite is believed to be illegal in India? There are so many such things that are illegal in India. Find out about them…
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more