Latest Updates
-
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్!
ప్రమాదవశాత్తు టూత్ పిక్ మింగితే, అది ఏకంగా గుండెలోకే చేరింది
ఏదైనా ఆహార పదార్ధాలను స్వీకరించినప్పుడు, దంతాల మద్య అవశేషాలు చేరుకొని ఇబ్బంది కలిగిస్తుంటాయి. వాటిని పట్టించుకోని ఎడల, ఆ అవశేషాలు దంతాలను నాశనం చేయడం, నోటి దుర్వాసనకు కారణమవడం వంటి విపరీత పరిస్థితులకు
ఏదైనా ఆహార పదార్ధాలను స్వీకరించినప్పుడు, దంతాల మద్య అవశేషాలు చేరుకొని ఇబ్బంది కలిగిస్తుంటాయి. వాటిని పట్టించుకోని ఎడల, ఆ అవశేషాలు దంతాలను నాశనం చేయడం, నోటి దుర్వాసనకు కారణమవడం వంటి విపరీత పరిస్థితులకు దారితీస్తుంటాయి. కావున ఈ అవశేషాలను తొలగించే క్రమంలో భాగంగా టూత్ పిక్ వినియోగించడం జరుగుతుంటుంది. అవునా? కానీ, కొందరు అదే పనిగా నోటిలోనే ఉంచుకుంటూ అటూ ఇటూ కూడా తిప్పుతుంటారు. ఒక్కోసారి, ఆ అవశేషాలు బాక్టీరియాతో కలిసి తిరిగి కడుపులోకి చేరే అవకాశాలు కూడా లేకపోలేదు.
కొంత మంది పార్టీలలో ఈ టూత్ పిక్లను తమ గ్లాసులలో ఉంచుతుంటారు, గుర్తుకోసం. లేదా కళ్ళజోడు, కీ చైన్స్, వాలెట్స్ మొదలైన వాటితో ఈ టూత్ పిక్స్ జోడించి ఉంచుతుంటారు, తమ వస్తువులకు గుర్తుగా. క్రమంగా, ఒక్కోసారి గ్లాసులలో టూత్ పిక్ ఉందన్న విషయం మర్చిపోయి, తాగేసి అవి గొంతుకు అడ్డం పడే సందర్భాలు కూడా కోకొల్లలు.
అటువంటి చర్యలకు అనుగుణంగా, ఏకంగా గుండెలోనే టూత్ పిక్ ఇరుక్కున్న ఒక అసాధారణ సంఘటన గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు కొనసాగండి. పైన చెప్పినట్లు, గ్లాసులో టూత్ పిక్ వేసుకోవడం ఇతనికి ఉన్న అలవాటు …
ఇతని చివరి పేరు జౌ. ఇతనికి, తన మందు గ్లాసుని గుర్తుగా ఉంచుకోడానికి, అందులో టూత్ పిక్ వేసే అలవాటు ఉంది. ఆ అలవాటే అతని పట్ల శాపమైంది.

అనుకోకుండా మందుతో పాటు, టూత్ పిక్ ని కూడా మింగేశాడు మహానుభావుడు …
ఈ అలవాటు చాలా సంవత్సరాలుగా ఉన్న కారణాన, ఆరోజు కూడా యధాలాపంగా గ్లాస్లో టూత్ పిక్ ఉంచాడు. కానీ, అతనికే తెలీకుండా మందుతో పాటుగా టూత్ పిక్ ని కూడా మింగేశాడు. అది జరిగి కూడా కొన్ని సంవత్సరాలైంది. కానీ ఆ టూత్ పిక్ చివరికి అతని గుండెలో ఇరుక్కుపోయింది.

ఉన్నపళంగా నొప్పి రావడంతో, వైద్యులకి ఆపరేషన్ నిర్వహించక తప్పలేదు …
ఆరు సెంటీమీటర్ల పొడవున్న ఈ టూత్ పిక్, జౌ గుండెలోని కుడి కర్ణికలో ఉన్నట్లుగా వైద్యులు ధృవీకరించారు. అంతేకాకుండా ఆ టూత్ పిక్, వాయు మార్గం గుండా ప్రయాణించి, కుడి ఊపిరితిత్తిలోనికి చొచ్చుకునిపోయి, కొంతకాలానికి గుండెలోకి చేరిందని వైద్యులు నిర్ధారించారు.

టూత్ పిక్ మింగడం ఇతనికి కొత్తేం కాదు, కానీ ఇలా ఇరుక్కోవడం మాత్రం కొత్తే ...
ఇలా ఇంతకు ముందు కూడా తాను అనేక మార్లు తెలీక మింగాను, కానీ ఇలా ఇరుక్కుంటుందని ఊహించలేకపోయానని వాపోయాడు.

వైద్యుల ప్రకారం …
నిజానికి ఇతనికి అంతర్గతంగా చాలా డామేజ్ జరిగింది, కానీ అదృష్టవశాత్తు ప్రమాదపుటంచుల దాకా వెళ్లి తిరిగి కోలుకున్నాడు. ఇలాంటి పనులు ఇంకెవ్వరూ చేయకండి అని సలహా ఇస్తున్నారు.
ఒక్కోసారి, ఇటువంటి చర్యల కారణంగా మద్యం మత్తులో అనాలోచితంగా టూత్ పిక్స్ నోటిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. క్రమంగా శ్వాస నాళాలలో అడ్డుకుని తీవ్ర పరిస్థితులకు కూడా దారితీయవచ్చు. లేదా దురదృష్టం తలుపు పక్కనే కాచుకుని ఉంటే, పైన చెప్పిన సంఘటనలకు ఉదాహరణలుగా మారే అవకాశాలు లేకపోలేదు. కావున జాగ్రత్త తప్పనిసరి. ఒక్కోసారి మనం తేలికగా అనుకున్న అంశాలు కూడా తీవ్రంగా పరిణమించవచ్చునని గుర్తుంచుకోండి.

మీకు నచ్చినట్లయితే
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి



Click it and Unblock the Notifications