For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్స్ డే రోజున కొడుకు కోసం ఫుడ్ రెడీ చేసి అకస్మాత్త్ గా మరణించింది

|

వృద్దాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులపట్ల మీరు చూపించాల్సిన శ్రద్ద మరియు సంరక్షణా బాధ్యతలను అనుభవపూర్వకంగా తెలియబరచే యదార్ధ సంఘటన ఇది.

ఒక తల్లి తన ముద్దుల కొడుకు కోసం, అతనికి ఇష్టమైన ఆహారాన్ని సిద్ధ౦ చేసుకొని, కొడుకు రాక కోస౦ ఓపికగా నిరీక్షిస్తూ ఉ౦ది. కానీ కొడుకు మాత్రం రాలేదు. దురదృష్టవశాత్తూ కొడుకును చూడకుండానే విగత జీవిగా మారింది. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ, సంవత్సరానికి ఒకసారి చుట్టపుచూపుగా కలవడం లేదా, అసలు వాళ్ళకు సమయాన్ని కేటాయించలేని స్థితిలో ఉండడం చేస్తున్నవారైతే, ఈ సంఘటన ఖచ్చితంగా మీకొక ఆలోచనను ఇస్తుంది.

తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత, ఒక పెద్దావిడ తన ఒక్కగానొక్క కొడుకును తన దగ్గరే ఉంచుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఆ కొడుకు పెరిగి పెద్దవాడైన తర్వాత, వేరే పట్టణానికి పని మీద వెళ్ళాడు.

She Cooked Food For Her Son On Mother’s Day, But Unfortunately Died

ఆ యువకుడు ఉద్యోగం వచ్చిన మొదట్లో, ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లిని చూసేందుకు వారానికి ఒకసారి వచ్చేవాడు. కానీ ఆ గడువు పెరుగుతూ పోయింది. క్రమంగా వారాలు, నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారడం ప్రారంభించాయి. క్రమంగా తల్లిని చూసేందుకు కూడా క్షణం తీరికలేని వానిగా మారిపోయాడు.

తన కొడుకును, తరచుగా తనను చూసేందుకు రావాలని కూడా ఆ తల్లి ఎన్నడూ కోరుకోలేదు. బదులుగా కొన్ని సందర్భాలలో నెలల వ్యవధి గడుస్తున్నా, తన కొడుకు కోసం వేచిచూడసాగింది.

క్రమంగా అంతర్జాతీయ తల్లుల దినోత్సవం నాడు, తనను చూసేందుకు ఇంటికి వస్తున్నానని, తనకిష్టమైన వంటలను చేసిపెట్టమని సెలవిచ్చాడు కొడుకు.

చాలాకాలం తర్వాత కొడుకుతో కలిసి భోజనం చేసే అవకాశం కలిగినందుకు ఉబ్బితబ్బిబ్బైన ఆ తల్లి, తన కొడుక్కి ఇష్టమైన వంటలన్నింటినీ చేసి, సంతోషంతో ఎదురుచూడసాగింది.

తన కుమారుడికి ఇష్టమైన భోజనాన్ని, డైనింగ్ టేబుల్ మీద సిద్దం చేసి, స్నానం చేసేందుకు షవర్ కోసం వెళ్లగా, అక్కడ తీవ్రమైన గుండెపోటుకు గురై కుప్పకూలిపోయింది. ఆమె ఒంటరిగా ఉన్న కారణాన, సకాలంలో వైద్యం అందని కారణాన, నిస్సహాయ స్థితిలో మరణించింది. కొన్ని రోజులకు, ఆమె ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు ఇరుగు పొరుగువారు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆమె ఇంటి తలుపును పగులగొట్టి చూడగా, విగతజీవిగా కనిపించింది.

పోలీసులు ఆమె శరీరాన్ని గుర్తించేసరికి, అప్పటికే ఆమె మరణించి 4 రోజులైందని కనుగొన్నారు.

ఆమె కొడుకును సంప్రదించి సమాచారమందించగా, తన తల్లికి "మదర్స్ డే" నాడు తప్పక వస్తానని ప్రామిస్ చేశానని, పని ఒత్తిడి మూలంగా రాలేకపోయానని చెప్తూ, భావోద్వేగానికి లోనయ్యాడు.

ఆమె చనిపోవడానికి ముందు, తనకు ఇష్టమైన ఆహారంతో సిద్దంగా ఉంచిన డైనింగ్ టేబుల్ చూడగానే, అతను మరింత చితికిపోయాడు.

వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, తమ బిడ్డల నుండి ఆస్తిపాస్తులను ఆశించరు, బదులుగా కూసింత ఆదరణ, కొంత సమయం వారితో వెచ్చించడం తప్ప. కనీసం వీటికి కూడా నోచుకోని తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. మన పనులు ఎన్ని ఉన్నా, తల్లిదండ్రుల కన్నా ముఖ్యమైనవి అయితే కాదు. అవునా ?., మనిషి లేనప్పుడు విలువలు మాట్లాడేకన్నా, ఉన్నప్పుడే ఆచరించడం మంచిది. లేకుంటే ఈ సంఘటనలో కొడుకు పడిన భాధకు, తదుపరి ఉదాహరణగా మిగిలే అవకాశం ఉంది.

తల్లిదండ్రులకు బిడ్డల పట్ల ఎంత భాద్యత ఉంటుందో, అంతే బాద్యత పిల్లలకు కూడా తల్లిదండ్రుల పట్ల ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రాధాన్యతలు ఎన్ని పెరిగినా, సంబంధ బాంధవ్యాల కంటే ముఖ్యం కాదని గుర్తుంచుకోవాలి.

ఈ సంఘటన గురించి మీ అభిప్రాయం ఏమిటి ? క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ భావాలను పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక అంశాలు, ఆసక్తికర విషయాలతో పాటు. ఆరోగ్య, జీవనశైలి, మాతృ, శిశు సంక్షేమ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

English summary

She Cooked Food For Her Son On Mother’s Day, But Unfortunately Died

An old woman had been dead for a few days and maggots were crawling throughout her body. When the cops examined her house, they found that she had prepared meal and was waiting for somebody. On further investigation, it was found that she was waiting for her son to come home to celebrate Mother's day with him.
Desktop Bottom Promotion